ETV Bharat / state

పెళ్లికి పిలవకున్నా వచ్చేస్తారు - విందు భోజనాలను ఎకో ఫ్రెండ్లీగా మార్చేస్తారు : సాఫ్ట్​​వేర్​ల స్వచ్ఛంద సేవ అదుర్స్

పెళ్లి వేడుకల్లో పర్యావరణ హితంగా విందు భోజనాలు - అరటాకుల్లోనే ఆరగించేలా కృషి - అహింస పరమో ధర్మ ట్రస్ట్​ ద్వారా సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల​ వినూత్న కార్యాచరణ - వ్యర్థాలనూ కంపోస్ట్​గా మార్చేలా చర్యలు

IT Employees Eco Friendly Dining Arrangements
భోజనాలకు అరటాకులు ఏర్పాట్లు చేస్తున్న ఐటీ ఉద్యోగులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 30, 2026 at 9:38 AM IST

3 Min Read
Choose ETV Bharat

IT Employees Eco Friendly Dining Arrangements : పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరూ అంటారు. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఎవరూ పాటించరు! ఆచరించి చూస్తేనే కదా ఫలితాలొస్తాయో, లేదో తెలిసేది. ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సరిగ్గా ఇలాగే ఆలోచించారు. వారాంతపు సెలవుల్లో, తమకు వీలు దొరికిన సమయాల్లో పెళ్లి వేడుకల్లోని విందు భోజనాల్ని పర్యావరణ హితంగా నిర్వహించాలని సంకల్పించారు. స్వచ్ఛందంగా ముందుకు కదిలి ఇప్పటి వరకు సుమారు 30కి పైగా ఎకో ఫ్రెండ్లీ వేడుకలను నిర్వహించారు.

అహింస పరమో ధర్మ సంస్థ ద్వారా : పది మందిని పిలిచి భోజనాలు పెట్టే ఏ ఫంక్షన్​ను చూసినా ప్లాస్టిక్ ప్లేట్లు, డిస్పోజబుల్ గ్లాసులు, మట్టిలో కరగని పాలిథిన్ కవర్లు ఇలా అంతా ప్లాస్టిక్ మయంగా దర్శనమిస్తుంటుంది. ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా హానికరమని తెలిసినా అంతా అదే బాటలో నడుస్తున్నారు. ఇతర దేశాల్లో ఎన్నో పర్యావరణహిత విధానాలు అనుసరిస్తుండగా, మనదేశంలో ఎందుకు సాధ్యం కాదని ఆలోచించారు ఓ సాఫ్ట్​వేర్ కంపెనీ సీఈవో సంతోశ్​. 'అహింస పరమో ధర్మ' అనే స్వచ్ఛంధ సంస్థను నిర్వహిస్తున్న ఆయన, పెళ్లి వేడుకల్లో భోజనాల తంతును పర్యావరణ హితంగా ఎందుకు నిర్వహించకూడదని ఆలోచన చేశాడు.

సాఫ్ట్​వేర్ ఉద్యోగుల పర్యారవరణహిత విందు ఏర్పాట్లు (ETV Bharat)

"మొక్కల ఆధారిత జీవుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నాం. మనకూ మొక్కల నుంచే కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా కూడా ఉంటాం. నాలా ఆలోచించేవారు సేవ చేసేందుకు నాతో కలిసి వస్తున్నారు" - సంతోశ్​, అహింస పరమో ధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

వ్యర్థాలను గొయ్యిలో పూడ్చిపెడతారు : సంతోశ్​​తో పాటు మరికొందరు సాఫ్ట్​వేర్ ఉద్యోగులు కలిసి వచ్చి వారాంతాల్లో పెళ్లి వేడుకలకు హాజరవుతూ అరిటాకుల్లోనే అందరూ భోజనం చేసేలా కృషి చేస్తున్నారు. భోజనం తర్వాత అరిటాకులు, ప్లేట్లు, స్పూన్లు, కప్పులు, ఆహార వ్యర్థాలను వేటికవి వేరు చేసి ఆయా వ్యర్థాలను అక్కడే గొయ్యి తవ్వి పూడ్చిపెడతారు. ఈ తరహా ఏర్పాట్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిర్వాహకులతో పాటు వేడుకలకు హాజరైన వారు కూడా చెబుతున్నారు.

"ఇలా స్వచ్ఛంద సేవ చేయడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మేము అరటి చెట్టు బెరడుతో చేసిన ఆర్కా ప్లేట్లను వినియోగిస్తున్నాం. భోజనాలు ముగిసిన తర్వాత వ్యర్థాలను ఒక గొయ్యి తవ్వి అందులో వేసి కప్పేస్తున్నాం. దీని ద్వారా అవి కంపోస్ట్​గా మారి సమీపంలో ఉన్న చెట్లకు ఎరువుగా మారుతాయి." - అశోక్​, సాఫ్ట్​వేర్ ఉద్యోగి

జీలో ల్యాండ్ ఫిల్​కు శ్రీకారం : ఈ తరహా పెళ్లి భోజనాలను చూస్తుంటే పాతకాలం గుర్తుకొస్తుందని పెళ్లికి హాజరైన అతిథులు నెమరు వేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచిస్తే ప్లాస్టిక్ లేని వేడుకల్ని చూడొచ్చని అంటున్నారు. అహింస పరమో ధర్మ ఫౌండేషన్‌కు, విశ్వ ఫౌండేషన్ సైతం జత కలిసింది. వ్యర్థాల నిర్వాహణపై ఏడాది కాలంగా వీటి నిర్వాహకులు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త నుంచి కొంత వరకైనా ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో జీలో ల్యాండ్ ఫిల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

"అరటాకుల్లో తినడంతో మన ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఇవి పూర్తిగా భూమిలో కరిగిపోతాయి. సాఫ్ట్​వేర్​ ఉద్యోగం చేస్తూ, వీరు ఇలా ఎలాంటి రుసుము తీసుకోకుండానే సేవ చేస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరింతగా ముందుకు రావాలని కోరుతున్నాం. వీరి ఏర్పాట్లు చూస్తుంటే 50 ఏళ్ల కిందటి భోజన ఏర్పాట్లు గుర్తుకొస్తున్నాయి" - వేడుకలకు హాజరైన అతిథులు

YUVA : అన్నదానం నుంచి ఆఖరి మజిలీ వరకు - అభాగ్యులకు 'ఇందూరు యువత' అండ

ఎంబీఏ చదువుకుంటూ, జాబ్‌ చేస్తూనే నాటు కోళ్ల వ్యాపారం - 25 ఏళ్లకే పారిశ్రామిక వేత్తగా యువకుడు