ETV Bharat / state

నెలలుగా రేషన్​ తీసుకోవట్లేదా? - మీ కార్డు కట్​ అవుతుంది! - లెక్కలు తీస్తున్న అధికారులు

ఉచితంగా పంపిణీ చేసే బియ్యాన్ని తీసుకోని కొందరు లబ్ధిదారులు - ఈ తరహా ఘటనలపై ఆరా తీస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు - అనర్హులుగా తేలితే కార్డులు రద్దు చేస్తామని వెల్లడి

FINE RICE SCHEME IN TELANGANA
FINE RICE SCHEME IN TELANGANA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 2:44 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fine Rice Scheme In Telangana : ప్రతి నెలా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే సన్న బియ్యాన్ని కొందరు లబ్ధిదారులు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఆయా కార్డుల వివరాలపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టారు. అసలు ఎందుకిలా జరుగుతుందనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఒకవేళ అనర్హులను గుర్తిస్తే వారి రేషన్​ కార్డు రద్దు చేయనున్నారు. ఒకవేళ అర్హులకే సమస్యలుంటే నేరుగా పరిష్కరిస్తారు.

రేషన్‌ లబ్ధిదారుల్లో వరుసగా గత ఆరు నెలలుగా ఎవరెవరు బియ్యం తీసుకోవడం లేదో, ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్‌ ఆఫీస్​ లాగిన్‌కు సిబ్బంది పంపించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయనున్నారు. కార్డుదారులు స్థానికంగా ఉన్నారా? లేదా ఇతర ప్రాంతానికి వలస వెళ్లారా? ఒకవేళ అనర్హులుగా ఉన్నారా అనేటువంటి వివరాలు సేకరించనున్నట్లు సమాచారం.

ఎందుకు తీసుకోవడం లేదని ఆరా : ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి రేషన్‌ కార్డును అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షల కొత్త కార్డులను మంజూరు చేసింది. పాత రేషన్​ కార్డుల్లోనూ పేర్ల నమోదుకు అవకాశం కల్పించారు. దీంతో లక్షల సంఖ్యలో రేషన్​ కార్డులను కొత్తగా పొందారు. అయితే వీరిలో చాలామంది సన్న బియ్యం తీసుకునేందుకు రావట్లేదు. దీనికి అసలు కారణాలేమిటో గుర్తించాలని అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వరుసగా ఆరు నెలలుగా రేషన్ బియ్యం తీసుకోకుంటే, ఎందుకో ఆరా తీయాలని అధికారులకు సూచించింది. అర్హులకు సమస్యలున్నా పరిష్కరించాలని తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

విచారణ చేయకుండానే మంజూరు చేశారు : గతంలో పలు దరఖాస్తులపై ఆర్‌ఐలతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించలేదనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కొన్ని మండలాల్లో ఒక్కో కార్డుకు రూ.2 వేల వరకు అధికారులు వసూలు చేశారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. దీంతో పలువురు అనర్హులు రేషన్‌ కార్డులను పొందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ చేస్తే అనర్హుల లెక్క మొత్తం తేలనుంది. పూర్తిస్థాయి మార్గదర్శకాలు రావాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం తెచ్చుకోవడం. వాటిని 10 రూపాయలకో, 20 రూపాయలకో అమ్ముకోవడం, ఆ తర్వాత దుకాణానికి వెళ్లి సన్నబియ్యం కొనుగోలు చేయడం. చాలా మంది లబ్ధిదారులు చేస్తున్న పని సాధారణంగా ఇదే జరుగుతుంది. అయితే, ఈ చర్యలవల్ల జనం ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని, ఈ విషయం తెలియక వాటిని ఇలా దుకాణాల్లో అమ్ముతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోషకాలు నిండిన ఫోర్టిఫైడ్ రైస్ వదులుకొని, మార్కెట్లో దొరికే సాధారణ బియ్యం తెచ్చుకొని తింటున్నారని చెబుతున్నారు. ఇంతకీ ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అంటే ఏంటి? వీటిని పండిస్తారా? తయారు చేస్తారా? ఇందులో ఏమేం పోషకాలు ఉంటాయి? సాధారణ బియ్యానికి, వీటికి తేడా ఏంటి? వంటి వివరాలు తెలుసా.

మీ ఇంట్లో పోషకాహార లోపం : దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు దీనిబారిన పడుతున్నారు. వయసుకు తగిన బరువు లేకపోవడం కొందరి సమస్యకాగా తగినంత ఎత్తులేకపోవడం ఇంకా కొందరి సమస్య. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 32 శాతం మంది వయసుకు తగ్గ బరువు ఉండటం లేదు. 35 శాతం మంది వయసుకు తగిన ఎత్తులేరు.

రేషన్​కార్డుదారులకు షాకింగ్ న్యూస్! - బోగస్​ కార్డుల ఏరివేత ప్రక్రియ షురూ

రేషన్ బియ్యం అమ్ముతున్నారా? - మీరు చాలా కోల్పోతున్నారు!