గాజువాకలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి
గాజువాక వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - ప్రమాదంలో ఇద్దరు మహిళలు, డ్రైవర్ మృతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2026 at 1:58 PM IST
Road Accident in Gajuwaka : విశాఖలోని గాజువాక పోలీస్‌స్టేషన్ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 9 మందికి గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు డ్రైవర్ రాంబాబు (50), గంగులు (70), లెంక ఈశ్వరమ్మగా గుర్తించారు. క్షతగాత్రులను కేజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గాజువాకలో బస్సు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. కేజీహెచ్‌లో చికిత్సపొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాద కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు మండిపల్లి ఆదేశాలిచ్చారు.
Visakha Road Accident : గాజువాక బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఛైర్మన్ నారాయణరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడం బాధాకరమని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని నారాయణరావు వెల్లడించారు.

