ETV Bharat / state

రంగురంగుల చిలుకల లోకం - నెహ్రూ జూ పార్క్​లో ఉన్న వాటి జీవితం కాలం ఎంతో తెలుసా!

పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న చిలుకలు - అడవుల వృద్ధికి, ఇతర జీవుల మనుగడుకు సహాయం - మనుషుల మాటలను అనుకరిస్తున్న బ్లూ అండ్​ గోల్డ్​ మెకావ్

Parrots at Nehru Zoo Park in Hyderabad
Parrots at Nehru Zoo Park in Hyderabad (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : June 3, 2026 at 2:39 PM IST

|

Updated : June 3, 2026 at 2:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Parrots at Nehru Zoo Park in Hyderabad : చిలుకలు కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాకుండా అవీ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అడవుల వృద్ధికి, ఇతర జీవుల మనుగడకు ఎంతో సహాయపడతాయి. హైదరాబాద్​లో నెహ్రూ జూ పార్కులో ఉంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

(అలెగ్జాండర్​ ది గ్రేట్) పెద్ద పచ్చ చిలుక :

అలెగ్జాండర్​ ది గ్రేట్
Alexander the Great (Getty Images)
  • అలెగ్జాండర్​ ది గ్రేట్​ ఈ పక్షులను పంజాబ్​ నుంచి యూరప్​ దేశాలకు తీసుకెళ్లడం వల్ల ఈ పేరు వచ్చింది.
  • సాధారణ పచ్చచిలుకల కంటే ఇవి పెద్దవిగా ఉంటాయి. వీటి రెక్కల భుజ భాగంలో ఎర్రటి మచ్చ ఉంటుంది. మగ పక్షుల మెడ చుట్టూ నలుపు, గులాబీ రంగు రింగ్​ ఉంటుంది. ఇవి స్పష్టంగా మాట్లాడగలవు.
  • ఈ చిలుకలు ఎక్కువ ఇండియా, పాకిస్థాన్​, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఉంటాయి.
  • దీని బరువు సుమారు 200-300 గ్రాములు ఉంటుంది.
  • అలాగే జీవితకాలం దాదాపు 25-40 ఏళ్లు.

లుటినో కాకటీల్​ చిలుక :

Lutino Cockatiel
లుటినో కాకటీల్​ (Getty Images)
  • లుటినో అనేది ఒక రకమైన జన్యు మార్పు దీనివల్ల ఈ పక్షులు తెల్లటి లేదా లేత పసుపు రంగులో ఉంటాయి. వీటి తలపై పసుపు రంగు జుట్టు, ప్రకాశవంతమైన ఆరెంజ్​ రంగు మచ్చలుంటాయి.
  • ఇవీ ఎక్కువగా ఆస్ట్రేలియాలోని పొడి మైదానాల్లో ఉంటాయి.
  • దీని బరువు సుమారు 80-100 గ్రాములు ఉంటుంది. జీవితకాలం సుమారు 15-20 ఏళ్లు వరకు ఉంటుంది.

ప్లమ్​ హెడెడ్​ పారకీట్​ :

Plum-headed Parakeet
ప్లమ్​ హెడెడ్​ పారకీట్ (Getty Images)
  • తల చూడటానికి 'ప్లమ్' (నేరేడు) పండు రంగులో ఉంటుంది.
  • మగ పక్షి తల ముదురు ఎరుపు-గులాబీ రంగులో ఉండి మెడ చుట్టూ నల్ల రంగులో ఉంటుంది. ఆడ పక్షి తల బూడిద రంగులో ఉంటుంది.
  • ఈ పక్షులు ఎక్కువగా ఇండియా, నేపాల్​, పాకిస్థాన్​, శ్రీలంక, భూటాన్​ అడవుల్లో ఉంటాయి.
  • దీని బరువు సుమారు 65-85 గ్రాములు ఉంటుంది. జీవితకాలం దాదాపు 15-25 ఏళ్లు.

బ్లూ అండ్​ గోల్డ్​ మెకావ్​ :

Blue and Gold Macaw
బ్లూ అండ్​ గోల్డ్​ మెకావ్ (Getty Images)
  • ఈ పక్షి ప్రపంచంలోనే అత్యంత రంగులమయమైన వాటిలో పెద్ద చిలుకల్లో ఒకటి.
  • శరీరం పైభాగం ముదురు నీలం రంగులో, కింది భాగం గోల్డ్​ ఎల్లో రంగులో ఉంటుంది. ముక్కు బలంగా ఉంటుంది. మనుషుల మాటలను అనుకరిస్తాయి.
  • దక్షిణ అమెరికాలోని అమోజాన్​ అడవులు బ్రెజిల్​, వెనెజువెలా, పెరూ వంటి ప్రాంతాల్లో ఉంటాయి.
  • దీని బరువు సుమారు 900-1300 గ్రాములు, జీవితకాలం దాదాపు 50-70 ఏళ్లు ఉంటుంది.

ముస్టాచ్​ పారకీట్​ (మీసాల చిలుక) :

Moustached Parakeet
ముస్టాచ్​ పారకీట్​ (మీసాల చిలుక) (Getty Images)
  • ముక్కు కింద ఉండే నల్లటి గీతలు చూడటానికి మీసాలలాగా అనిపిస్తాయి.
  • తల బూడిత రంగు, రొమ్ము భాగం గులాబీ రంగులో ఉంటుంది.
  • ఎక్కువగా ఇండోనేషియా, థాయ్​లాండ్​, వియత్నాం, చైనాలోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి.
  • దీని బరువు సుమారు 100-140 గ్రాములు, జీవితకాలం సాధారణంగా 20-25 ఏళ్లు ఉంటుంది.

స్కార్లెట్​ మెకావ్​ :

Scarlet Macaw
స్కార్లెట్​ మెకావ్ (Getty Images)
  • ఈ పక్షికి ఎక్కువ రంగులు ఉండటంలో చాలా అందంగా ఉంటుంది.
  • శరీరం ముదురు ఎరుపు రంగులో ఉండి, రెక్కలపై పసుపు, ముదురు నీలం రంగు ఈకలు ఉంటాయి. కళ్ల చుట్టూ తెల్లటి చర్మం ఉంటుంది. ఇవి చాలా తెలివైనవి, పెద్దగా అరుస్తారు. రకరకాల ట్రిక్స్​ నేర్చుకోగలవు.
  • మధ్య, దక్షిణ అమెరికా ఉష్ణమండల అరణ్యాల్లో ఉంటాయి.
  • దీని బరువు సుమారు 1000 గ్రాములు, జీవితకాలం సుమారుగా 50-70 ఏళ్లు ఉంటుంది.

ఎక్లెక్టస్​ ప్యారట్​ :

Eclectus Parrot
ఎక్లెక్టస్​ ప్యారట్​ (Getty Images)
  • మగ పక్షి ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో, కాండీ లాండీ ఆరెంజ్​ ముక్కుతో ఉంటుంది. ఆడ పక్షి ముదురు ఎరుపు, నీలం రంగుల కలయికలో నల్లటి ముక్కుతో ఉంటుంది.
  • ఎక్కువగా సోలమన్​ దీవులు, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో ఉంటాయి.
  • దీని బరువు సుమారు 350-450 గ్రాములు, జీవితకాలం సుమారు 30-50 ఏళ్లు ఉంటుంది.

ఆఫ్రికన్​ గ్రే ప్యారట్​ :

African Grey Parrot
ఆఫ్రికన్​ గ్రే ప్యారట్ (Getty Images)
  • ఈ పక్షి ప్రపంచంలోనే బాగా మాట్లాడే బర్డ్​ ఇది.
  • శరీరం బూడిద రంగులో ఉండి, తోక ఎరుపు రంగులో ఉంటుంది.
  • మనుషులు మాట్లాడే మాటల వెనుక అర్థం గ్రహించగల పక్షి జాతి ఇది.
  • మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్యాల ప్రాంతాల్లో ఉంటాయి.
  • జీవిత కాలం సుమారు 40-60 ఏళ్లు ఉంటుంది.
  • దీని బరువు సుమారు 400-500 గ్రాములు ఉంటుంది.

చిట్టీ చిలకమ్మా... నీ గోలేంటమ్మా?

పగలు ఎండినమోడు.. రాత్రి పచ్చని చెట్టు!!

Last Updated : June 3, 2026 at 2:46 PM IST