హైదరాబాద్‌లో నైట్ షిప్ట్ బస్ సర్వీసులు - సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో అందుబాటులోకి
హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ - సెప్టెంబర్ 1 నుంచి రాత్రిపూట ప్రజా రవాణా సేవలు ప్రారంభం - రాత్రి సమయాల్లో 6 మార్గాల్లో అందుబాటులోకి బస్సు సర్వీసులు

Published : August 29, 2026 at 12:55 PM IST
Night Shift Buses in Hyderabad : హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సెప్టెంబర్ 1 నుంచి రాత్రిపూట ప్రజా రవాణా సేవలు ప్రారంభం కానున్నాయని గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సేవలు 6 మార్గాల్లో నడుస్తాయని, ఏవైనా సందేహాలు ఉంటే ప్రజలు 99592 26160 నంబర్‌ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
1. రూట్ నంబర్ 222A (కోఠి నుంచి పటాన్‌చెరు వరకు) :
- ఈ మార్గంలో మొత్తం 4 బస్సులు ముషీరాబాద్, మియాపూర్-2 డిపోల నుంచి రెండేసి చొప్పున నడుస్తాయి. అబిడ్స్, లక్డీకాపూల్, కేర్ హాస్పిటల్, అన్నపూర్ణ, ఉషా కిరణ్, గుట్టల బేగంపేట, కొండాపూర్ క్రాస్‌రోడ్స్, హఫీజ్‌పేట్, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరంగూడ, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
- కోఠి నుంచి మొదటి బస్సు రాత్రి 11:40 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 4:30 గంటలకు బయలుదేరుతాయి. (ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు)
- పటాన్‌చెరు నుంచి మొదటి బస్సు రాత్రి 11:00 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 4:55 గంటలకు బయలుదేరుతాయి. (ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు)
2. రూట్ నంబర్ 218 (అఫ్జల్‌గంజ్ నుంచి పటాన్‌చెరు) :
- సీబీఎస్, కోఠి, లక్డీకాపూల్, ఎస్సార్‌నగర్, వై.జంక్షన్, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా
- బస్సులు: 2 (కాచిగూడ డిపో: 1, మియాపూర్-2 డిపో: 1)
- అఫ్జల్‌గంజ్ నుంచి : మొదటి బస్సు రాత్రి 11:25 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3:05 గంటలకు (ప్రతి 1 గంట 10 నిమిషాలకు ఒకటి)
- పటాన్‌చెరు నుంచి : మొదటి బస్సు రాత్రి 11:20 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3:15 గంటలకు (ప్రతి 1 గంట 15 నిమిషాలకు ఒకటి)
3. రూట్ నంబర్ 219 (సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు) :
- ప్యారడైజ్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, బాలానగర్ క్రాస్‌రోడ్స్, ఐడీపీఎల్, ప్రశాంత్ నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, గంగారం, లింగంపల్లి రామచంద్రాపురం మీదుగా
- బస్సులు : 2 (కంటోన్మెంట్ డిపో: 1, మియాపూర్-2 డిపో నుంచి 1)
- సికింద్రాబాద్ నుంచి : మొదటి బస్సు రాత్రి 11:20 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3 గంటలకు (ప్రతి 1 గంట 10 నిమిషాలకు ఒకటి)
- పటాన్‌చెరు నుంచి : మొదటి బస్సు రాత్రి 11:25 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3 గంటలకు (ప్రతి 1 గంట 15 నిమిషాలకు ఒకటి)
4. రూట్ నంబర్ 290U (హయత్ నగర్ నుంచి సికింద్రాబాద్) :
- భాగ్యలత, పనామా, ఎల్బీనగర్, అల్కాపురి, నాగోల్, నాగోల్ మెట్రో స్టేషన్, సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, తార్నాక, ఆలుగడ్డ బావి, రేతి ఫైల్, సికింద్రాబాద్ ఆల్ఫా, జేబీఎస్ మీదుగా
- బస్సులు : 3 (హయత్ నగర్ డిపో నుంచి 2, కంటోన్మెంట్ నుంచి 1).
- హయత్ నగర్ నుంచి : మొదటి బస్సు రాత్రి 11:20 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3:00 గంటలకు (ఫ్రీక్వెన్సీ : ప్రతి 1 గంట 15 నిమిషాలకు ఒకటి).
- సికింద్రాబాద్ నుంచి : మొదటి బస్సు రాత్రి 11:25 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3:00 గంటలకు (ప్రతి 1 గంట 15 నిమిషాలకు ఒక బస్సు).
5. రూట్ నంబర్ 195W (బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ వరకు) :
- నిజాంపేట్, నిజాంపేట్ క్రాస్‌రోడ్స్, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, ఈఎస్ఐసీ, ఇందిరా నగర్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్ మీదుగా.
- బస్సులు: 3 (మియాపూర్-2 డిపో నుంచి).
- బాచుపల్లి నుంచి : మొదటి బస్సు రాత్రి 9:15 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3:10 గంటలకు (ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు).
- వేవ్‌రాక్ నుంచి : మొదటి బస్సు రాత్రి 10:25 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 4:25 గంటలకు (ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు).
6. రూట్ నంబర్ 10H (కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు) :
- ప్లాజా, పోలీస్ లైన్స్, ఆర్.జె.కాలేజ్, స్టేట్ హోమ్, ఉషా కిరణ్, సైబర్ టవర్స్ మీదుగా.
- బస్సులు : 2 (1 HCU డిపో నుంచి, 1 రాణిగంజ్ డిపో నుంచి)
- కొండాపూర్ నుంచి : మొదటి బస్సు రాత్రి 10:55 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3:40 గంటలకు (ప్రతి 50 నిమిషాలకు ఒక బస్సు)
- సికింద్రాబాద్ నుంచి : మొదటి బస్సు రాత్రి 10:50 గంటలకు, చివరి బస్సు తెల్లవారుజామున 3:40 గంటలకు (ప్రతి 50 నిమిషాలకు ఒక బస్సు)
ఎక్స్‌ప్రెస్‌లుగా ఆర్డినరీ బస్సులు - ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
దురుసుతనం వద్దు, మర్యాదగా మాట్లాడండి : సిబ్బందికి ఆర్టీసీ సూచన

