ETV Bharat / state

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ స్కూల్​ బస్సు - విద్యార్థికి గాయాలు

రేగిడి మండలం తునివాడ వద్ద తప్పిన పెను ప్రమాదం - పాఠశాల బస్సు బోల్తాపడి బాలికకు గాయాలు- ఆరుగురు విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న బస్సు

Private School Bus Overturns
ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 25, 2026 at 1:32 PM IST

1 Min Read
Choose ETV Bharat

Private School Bus Overturns Girl Sustains Severe Injuries : విజయనగరం జిల్లా రేగిడి మండలం తునివాడ గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్​ స్కూల్​ బస్సు బోల్తా పడింది. విద్యార్థులతో వెళుతుండగా బస్సు స్టీరింగ్ వీల్ జామ్ అయ్యింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్, మరో ఐదుగురు పిల్లలు సురక్షితంగా బయటపడగా, ఒక విద్యార్థినికి గాయాలయ్యాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం రాజంలోని ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రికి విద్యార్థి: స్టీరింగ్ వీల్ జామ్ కావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 9వ తరగతి విద్యార్థిని మిథున గాయపడటంతో ఆమెను అంబులెన్స్‌లో రాజంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఆమెను చేర్చుకుని చికిత్స అందించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మిగతా పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్టీరింగ్ వీల్ జామ్ కావడం వల్ల బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిందని విద్యార్థులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.