ETV Bharat / state

మీ పాత బండి అమ్మేస్తున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందులు తప్పవు!

మనిషి జీవితంలో నిత్యం ప్రయాణాలు - కీలక పాత్ర పోషిస్తున్న వాహనాలు - సర్వసాధారణంగా మారిన వాహన క్రయవిక్రయాలు - పాత వాహనాలను విక్రయించే సందర్భంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు

vehicle ownership transfer
vehicle ownership transfer (getty images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 28, 2026 at 12:21 PM IST

|

Updated : February 28, 2026 at 12:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

Transfer Vehicle Ownership Telugu : మనిషి నిత్యజీవితంలో ప్రయాణం ఒక భాగమైపోయింది. దీంతో ప్రతి చిన్న అవసరాలకు సైతం వాహనాలను వినియోగిస్తున్నాం. దీంతో వాహనాలను కొనడం, అమ్మడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పాత వాహనాన్ని విక్రయించిన సందర్భాల్లో చిన్న నిర్లక్ష్యం వహిస్తే అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

అదనంగా రుసుము చెల్లించాలని : నిజామాబాద్​ నగరంలోని వినాయక్​నగర్​కు చెందిన ఓ వ్యక్తికి చెందిన బైక్ కాల పరిమితి ముగిసింది. దీంతో ఆ వాహనాన్ని అమ్మిపెట్టమని ఆ వాహనదారుడు ఓ బైక్ మెకానిక్​ను సంప్రదించారు. ఆ ద్విచక్ర వాహనానికి కాలపరిమితి ముగియడంతో పాటు సరైన పత్రాలు లేకపోవడంతో ఎవరూ దీనిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ వాహనాన్ని అలాగే ఉంచేశారు.​

తన వద్ద వాహనం లేకపోవడంతో తన అవసరాలకు వినియోగించుకునేందుకు సదరు వ్యక్తి కొత్త బైక్​ను కొనేందుకు ఆసక్తి చూపారు. అయితే అతని పేరుమీద పాత వాహనం ఉండటంతో కొత్త దాన్ని కొనేందుకు అదనంగా రుసుము చెల్లించాల్సి వస్తుందని తెలిసింది. దీంతో ఆయన వెనకడుగు వేశారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : అయితే పాత బండ్లను అమ్మేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోకపోతే వాహనం విక్రయించిన తర్వాత కూడా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిబంధనలు పాటిస్తూ వాటిని ఎలా విక్రయించాలి? ఈ సమస్యల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విధంగా చేయాలి : వాహనం విక్రయించిన వెంటనే సంబంధిత 29, 30 ఫారాలు పూర్తి చేయాలి. వీటిని యాజమాన్య మార్పిడికి రవాణా శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. యాజమాన్య మార్పిడి పూర్తయ్యాకే పాత వాహనాన్ని కొనుగోలుదారులకు అప్పగించాలి. దీనితో పాటు కొనుగోలుదారు సైతం పత్రాలతో పాటు బీమాను తన పేరిత మార్చుకుంటేనే ప్రమాదాల బీమా ఆయనకు వర్తిస్తుంది. వాహనంపై లోన్లు, ఫైనాన్స్ ఉంటే కొనుగోలుదారు ఫైనాన్స్ క్లియర్​ ఇచ్చాకనే వాహనాన్ని కొనుగోలు చేయాలి. లేదంటే అతడు రుణం చెల్లించకపోతే యజమానే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది.

యజమాని పేరు మార్చకపోతే : వాహనం అమ్మిన తర్వాత యజమాని పేరు మార్చకపోతే అనేక సమస్యలు వస్తాయి. వాహనం ఎవరి పేరు మీద ఉందో వారికే జరిమానాలు, చలాన్లు వస్తుంటాయి. మరో వాహనం కొనుగోలు చేసే సందర్భంలో రెండో వాహనం పేరిట అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనేవారూ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే?

సెకండ్​ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • మీరు సెంకడ్​ హ్యాండ్​ వాహనాన్ని కొనుగోలు చేసే సందర్భంలో దానికి అన్ని పత్రాలు ఉన్నాయో లేదో అనే విషయాలు చెక్​ చేసుకోవాలి.
  • ఛాసిస్​ నంబరును తప్పనిసరిగా చెక్​ చేయాలి. వాహన ఆర్సీలో ఉన్నది, ఛాసిస్​ నంబరు ఒకటేనా లేదా మరొకటా అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. ప్రధానంగా వాహన రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​, వాహన ఇన్సూరెన్స్, పొల్యూషన్​ వంటివి చెక్ చేసుకోవాలి.
  • కొనుగోలు చేసే వాహనం ఆర్టీవో ఆఫీస్​ పరిధి మారిపోతే నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​ను తప్పనిసరిగా తీసుకోవాలి.
  • దీనితో పాటు సంబంధిత వాహనంపై చలాన్లు ఉన్నాయో లేదో చెక్​ చేసుకుంటే మంచిది. లేదంటే ఆ తర్వాత మీరు చెల్లించాల్సి వస్తుంది.
  • నకిలీ పత్రాలతో మరి కొంతమంది వాహనాలను విక్రయిస్తూ ఉంటారు. ఇలాంటి తప్పుదోవ పట్టించే వారి మాటలను నమ్మవద్దు. సంబంధిత పత్రాలు వాహనదారుని పేరు మీద ఉన్నాయా అనే విషయాలను సరిచూసుకోవాలి.
  • ఇంకొంత మంది కేసుల్లో చిక్కుకున్న వాహనాలను అంటగట్టే ప్రమాదమూ ఉంది. ఇలా ప్రయత్నించే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి.

సెకండ్ హ్యాండ్ వెహికిల్ కొంటున్నారా? - దిల్లీ పేలుడు లాంటి చిక్కులొస్తాయ్! - ఇవి చెక్ చేసుకోండి!

Last Updated : February 28, 2026 at 12:57 PM IST