ETV Bharat / state

చేపలకూ వడదెబ్బ తగిలే ఛాన్స్! - అక్వేరియంకు ఇలా చేస్తే సేఫ్​

వేసవి ఉష్ణోగ్రత కారణంగా అక్వేరియంలో నీళ్లు వేడెక్కే ప్రమాదం - ఐస్ వాటర్ ఒక్కసారిగా వేస్తే చేపల ఆరోగ్యంపై ప్రభావం - వేసవిలో చేపల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సలహాలివే

Aquarium Tips by Experts for Summer
Aquarium Tips by Experts for Summer (Getty images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2026 at 10:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Aquarium Tips by Experts for Summer : రూ.వేలు ఖర్చుచేసి ఆక్వేరియంలను కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే వాటిలో నీరు ఏమాత్రం వేడెక్కినా అందులోని చేపలు చనిపోతాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేసవిలో చేపల రక్షణకు ప్రత్యేక చర్యలు అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

32 డిగ్రీలు దాటితే ప్రమాదమే : అక్వేరియాన్ని గాజుతో చేస్తారు. వేసవిలో ఎండ పెరుగుతుంటే దానికి అనుగుణంగానే నీరు చాలా వేగంగా వేడెక్కుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు నీటిని మారుస్తూ ఉండాలి. దీనితోపాటు అక్వేరియంలో మరీ చల్లని నీటిని పోయకూడదు. నీటి ఉష్ణోగ్రత 28 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే చేపల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. అదే 32 డిగ్రీలు దాటితే ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతుంది. అయితే ఈ సమస్యను ఏరియేటర్లు అమర్చి అవి సక్రమంగా పనిచేసేలా చూస్తే అనుకూలస్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో నీటిపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని నియంత్రించొచ్చు.

ఆక్సిజన్ స్థాయి తగ్గొద్దు : వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అక్వేరియంలో నీరు వేడెక్కితే దీనిలోని ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోతుంది. దీంతో చేపలు చనిపోవచ్చు. ఈ ప్రమాదం రాకుండా చేయాలంటే అక్వేరియంకు ఉన్న మూతను వెంటనే తీసివేయాలి. చేపలు నీటి పైకి వచ్చి నోరు తెరుస్తూ గాలి కోసం ప్రయత్నించే సందర్భాలను అనేకసార్లు చూశాం. చేపలు ఇలా చేస్తున్నాయంటే అందులో ఆక్సిజన్‌ తగ్గిందని గ్రహించాలి. దీనిని ఆక్సీజన్​ స్థాయిని పెంచేందుకు లిక్విడ్​ ఆక్సిజన్ చుక్కలు ఇందులో వేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

పదిరోజులకోసారైనా నీటిని మార్చాలి : అక్వేరియంలో చేపల పెంపకానికి 70 నుంచి 100 పీపీఎం మధ్య స్తాయిలో ఉన్న కఠిన నీటినే వినియోగించాలి. వేసవి ఉష్ణోగ్రత కారణంగా నీళ్లు త్వరగా వేడెక్కుతాయి కాబట్టి కనీసం10 రోజులకు ఒకసారైనా మార్చాలి. అయితే నీటిని చల్లబరిచేందుకు అందులో ఐస్‌ ముక్కలు వేయడం లేదా నేరుగా ఐస్‌ వాటర్‌ పోయడం చేస్తుంటారు. ఇలా చేస్తే ఒక్కసారిగా ఉష్ణోగ్రత తగ్గిపోయి చేపల జీవక్రియ దెబ్బతింటుంది.

అక్వేరియం చేపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు :

  • మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడేవారికి అక్వేరియం ఓ అద్భుత థెరపీలా పనిచేస్తుంది. చేపలు నెమ్మదిగా ఈదటాన్ని చూస్తే చాలు మెదడులో ఒత్తిడి హార్మోన్​ (కార్టిసాల్​) స్థాయి క్రమంగా తగ్గుతుంది. అక్వేరియం నుంచి వెలువడే శబ్ధాలతో మన నాడీ వ్యవస్థ శాంతిస్తుంది. దీంతో గుండె వేగం తగ్గి, బీపీ అదుపులో ఉంటుంది.
  • పిల్లల్లో ఏకాగ్రత పెంచడానికి ఫిష్‌ ట్యాంక్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అక్వేరియం వైపు ఏకాగ్రతగా చూడటంతో మన మెదడుకు ప్రశాంతత, విశ్రాంతి లభిస్తుంది. నిద్రపోయే ముందు కాసేపు దీనిని చూస్తే మనసులు హాయి లభించి మెదడుకు ప్రశాంత, గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది.
  • ఇంట్లో వృద్ధులకు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య ఒంటరితనం. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారు చేపలనే చూస్తూ గడిపితే వారికి మంచి కాలక్షేపం అవుతుంది. వాటిని చూస్తూ సమయం గడపడం వల్ల వారికి మానసిక ఆనందం లభిస్తుంది.

నీటిలో పీహెచ్‌ ఎంతంటే : అక్వేరియంలో చేపల పెంపకానికి దీనిలో నీటి పీహెచ్​ విలువ 6.5 నుంచి 8 మధ్యలో ఉండాలి. సాధారణ బోరు నీటిని వినియోగించరాదు. వీటిలో ఆల్కలినిటీ ఉంటుంది. దీంతో చేపలు ఒత్తిడిగి గురవుతాయి. అక్వేరియంను నేరుగా కొత్తనీటితో కాకుండా రెండు రోజులు నిల్వ ఉన్న నీటిని ఉపయోగించడం ఉత్తమం.

"వేసవిలో చేపలకు అందించే ఆహారం, మందుల విషయంలో అనేక జాగ్రత్తలు వహించాలి. వాటిని వేసే ఆహారం ఎక్కువైతే అని నీటిలో కరిగిపోయి రసాయనాలు ఎక్కవైపోయి చేపలు చనిపోయే ప్రమాదముంది. కార్బన్ ఫిల్డర్లు తీసి మందులు వేయడం ఉత్తమం. చికిత్స పూర్తయిన తర్వాత మళ్లీ కార్బన్ ఫిల్డర్​ను పెట్టాలి. ఇలా చేకపోతే చేపలకు వేసే మందును కార్బన్​ పీల్చుకుంటుంది. దీని వల్ల చేపలకు వైద్యం అందదు" - ఆంజనేయులు, బ్లూ సీ ఫిష్​ అక్వేరియం షాపు నిర్వాహకుడు

మీ ఇంట్లో "అక్వేరియం" ఉందా? - సమ్మర్​లో ఇలా చేయకపోతే చేపలకు ముప్పు!