సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు - లైకుల కోసం జంతు బలులు
సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా, అసభ్యకరంగా పోస్టులు పెడితే కేసులు తప్పడం లేదు - ప్రజలకు ఉపయోగపడే ఏ విషయాన్నైనా అది నిజమైతే తెలియజేయవచ్చు - మార్ఫింగ్ చేస్తే ఊచలు లెక్కెట్టాల్సిందేనని హెచ్చరిస్తున్న సైబర్‌క్రైం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 7, 2026 at 2:05 PM IST
Obscene Posts on Social Media : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా ప్రతీ ఒక్కరి జీవితంపై ప్రభావం చూపుతోంది. పిల్లలు నుంచి పెద్దల దాకా అందులో లీనమైపోతున్నారు. ఈ క్రమంలో కొందరు రీల్స్‌కు అలవాటు పడుతున్నారు. మరికొందరూ సొంతంగా క్రియేట్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. తమ వీడియోలతో ఎక్కువమంది ఆకర్షించాలిని వారి పెట్టే పోస్టుల కారణంగా జైలు పాలవుతున్నారు. ఇతరులకు ఇబ్బంది పెట్టేలా అభ్యంతకరంగా, అసభ్యకరంగా ఉంటే వాటిపై కేసులు తప్పడం లేదు. ఏ కంటెంట్ చేయొచ్చు, ఏమి చేయకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం.
సాధారణంగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియాని విషయాలు గురించి తెలుసుకునేందుకు ఎంతో సులభంగా ఉపయోగపడుతోంది. కానీ కొందరూ లాభాపేక్ష అవసరాల కోసం దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. యువత, పెద్దలు చేసే వీడియోల ప్రభావం చిన్నారుల మీద పడుతోంది. లైక్‌ల మోజులో పడి ఇష్టం వచ్చినట్లు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా లెక్క చేయడం లేదు.
'ఆటో సేవ్' చేస్తున్నారా?
గత 3 ఏళ్లలో నమోదైన కేసుల్లో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఓ కంట పిల్లలను కనిపెడుతూ ఉండాలి. సోషల్ మీడియా ఖాతాలకు పేరెంట్స్ కంట్రోల్ ఆప్షన్ పెట్టుకోవాలి. లేదంటే మున్ముందు చిక్కులు తప్పవు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత, బ్యాంకుల వివరాలను 'ఆటో సేవ్' చేయకూడదు. అలా చేస్తే సైబర్ కేటుగాళ్లకు చిక్కినట్లే. కొన్ని ఏళ్ల క్రితం రాజాం పట్టణానికి చెందిన ఓ బాలుడు ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటన చూసి క్లిక్ చేయగా క్షణాల వ్యవధిలోనే రూ.వేలు మాయం అయ్యాయి.
ఉదాహరణలు:
- పార్వతీపురం గ్రామీణ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉడుమును చంపి, కూర వండుకున్నారు. సంబంధిత వీడియోను సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వారిపై అటవీశాఖ జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదైంది.
- మరోవైపు విజయనగరానికి చెందిన ఓ పార్టీ కార్యకర్త మరో పార్టీ నేతపై దుర్భాషలాడుతూ వీడియో చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైరల్ కావాలని అలా చేసినట్లు విచారణలో పేర్కొన్నాడు.
ఇవి పోస్టు చేయొచ్చు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గురించి తెలియజేయవచ్చు. ఆరోగ్యం, విద్య, పర్యాటకం, ఆధ్యాత్మికత వంటి విషయాలు చెప్పవచ్చు. విజయ గాథలు, మహనీయుల పుస్తకాలు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, రక్తదానం తదితర వాటిపై పోస్టులు పెట్టుకోవచ్చు. ప్రజలకు ఉపయోగపడే ఏ విషయాన్ని అయినా అది నిజమైతే తెలియ జేయవచ్చు.
ఇవి చేయవద్దు:
- మహిళలను కించపరచరాదు
- అసభ్యకర పదజాలం, వ్యక్తిగత దూషణ నిషేధం
- మహనీయుల మాటలను మార్చరాదు
- అడల్ట్ కంటెంట్ పెట్టరాదు, వాటిని ఇతరులకు షేర్ చేయరాదు
- మతం, కులం, ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడరాదు
- ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదు
- ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయకూడదు
- జంతు బలులు
ఇలా సంప్రదించండి:
- ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెడితే 1930ను సంప్రదించవచ్చు.
- ఐటీ చట్టం కింద నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తారు
- తీవ్రమైన నేరమైతే జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండు కూడా ఉంటాయి.
- అసత్య ప్రచారం చేస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
- మార్ఫింగ్ చేస్తే 7 ఏళ్లు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నా సైబర్ క్రైం
పార్వతీపురం మన్యం జిల్లాలో గత 3 ఏళ్లలో పలు కేసులు నమోదు చేశారు. 2023, 2024 సంవత్సరాల్లో 12 కేసులు, 2025లో 6 కేసులు, రాజకీయ అంశాలకు సంబంధించినవి 19 కేసులు నమోదు అయ్యాయి. మన్యంలో గత ఏడాది 28 కేసులు నమోదు అవ్వడం గమనార్హం.

