ETV Bharat / state

అధిక వడ్డీకి అప్పులు, వెంటనే తీర్చాలని మానసికంగా వేధింపులు - వీరి ఆగడాలకు బలైన కుటుంబం

అంబర్​పేటలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య - కేసును ఛేదించిన పోలీసులు - నలుగురు నిందితుల అరెస్ట్, రిమాండ్​కి తరలింపు - ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే?

Amberpet Family Members Died Case
Amberpet Family Members Died Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2026 at 8:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

Amberpet Family Members Died Case : గత నెల 24న అంబర్​పేట్ పరిధిలో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న కేసును పోలీసులు ఛేదించారు. హోటల్ వ్యాపారం కోసం అప్పు తీసుకోగా వాటిని తిగిరి తీర్చే క్రమంలో వేధింపుల కారణంగా కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వేధింపులకు గురిచేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు.

హోటల్లో వ్యాపారం అంతంత మాత్రం : అంబర్​పేట బాపునగర్ కాకతీయ వీధిలో నివాసం ఉంటున్న రామ్​రాజ్ (55), మాధవి (50), దంపతులకు కుమారుడు శశాంక్ (24), ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవల వివాహం జరిపించారు. దీంతో ఆమె కొంపల్లిలో ఉంటున్నారు. గతంలో రామ్​రాజ్​ మరో ఇద్దరితో కలిసి అంబర్ పేటలో ల్యాండ్​మార్క్ హోటల్​ను ప్రారంభించారు. అనుకోని పరిస్థుల కారణంగా వారి నుంచి విడపోయి దానినుంచి బయటకు వచ్చారు. తర్వాత కొన్నాళ్లకు మల్లాపూర్​లో బిర్యానీ హోటల్​ పెట్టారు. కుమారుడి సాయంతో ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఈ హోటల్లో వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతోంది. దీని వల్ల వారి కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.

అధిక వడ్డీకి అప్పులు, వెంటనే తీర్చాలని మానసికంగా వేధింపులు - వీరి ఆగడాలకు బలైన కుటుంబం (ETV Bharat)

నిర్వహణకు మహ్మద్ వాసి ఉజ్‌ జమాన్‌, రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ నవాజ్‌, సయ్యద్ మాజిద్​ల నుంచి సుమారు రూ.57 లక్షలు రుణం తీసుకున్నాడు. అధిక వడ్డీతో రుణం ఇవ్వడంతో పాటుగా బ్లాంక్ చెక్కులు, ప్రామిసరి నోటులు, స్తిరాస్తి పత్రాలు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని వేధింపులకు గురిచేశారు. కుటుంబ సభ్యులతో దుర్భాషలాడారు. దీంతో మనస్థాపంలో గత నెల 24 కుటుంబం ఆత్మహత్య కు పాల్పడింది.

మిత్రుడికి వాట్సప్​లో మెసేజ్​ : ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీ మంగళవారం తెల్లవారు జామున రామ్ రాజ్, తన భార్య మాధవి, కుమారుడు శశాంక్​తో కలిసి ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో రామ్​ రాజ్​ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన మిత్రుడు రవికి వాట్సప్​లో మెసేజ్​ పంపించారు. దీనిని చూసిన అనంతరం ఆయన ఇంటికి వచ్చి చూశారు. ఆ సమయానికి తండ్రీ కుమారులు ఉరికి వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. మాధవి అప్పటికే ప్రాణాలు విడిచింది.

కేసుపై దర్యాప్తు చర్యలు : వెంటనే రవి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సికింద్రాబాద్​ జోన్​ డీసీపీ రక్షితమూర్తి, అదనపు డీసీపీ నర్సయ్యలతో పాటు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్​ టీం ఆధారాలను సేకరించింది. దీనిలో మృతుడు శశాంక్​ మణికట్టుపై గాయం చేసుకున్న గుర్తులు కనిపించాయని పోలీసులు తెలిపారు. అతడి వద్ద సూసైడ్​ నోట్​ను కనుగొన్నారు. కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించారు.

"గత నెల 24న ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఉజ్‌ జమాన్‌, రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ నవాజ్‌, సయ్యద్ మాజిద్​ల రామ్​రాజ్ నుంచి హోటల్ నిర్వహణకు సుమారు రూ.57 లక్షల రుణం తీసుకున్నారు. అధిక వడ్డీతో రుణం ఇవ్వడంతో పాటుగా బ్లాంక్ చెక్కులు, ప్రామిసరి నోటులు, స్తిరాస్తి పత్రాలు ఈ ముగ్గురు తీసుకున్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని వేధింపులకు గురి చేశారు. దీంతో సూసైడ్​ నోట్ రాసి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నోట్​లో నలుగురి పేర్లు రాశారు. ఈ కేసులో నలుగురి అరెస్టు చేసి రిమాండ్​కు పంపాం." డీసీపీ రక్షితమూర్తి, సికింద్రాబాద్​ జోన్​

ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడేందుకు హెల్ప్‌లైన్ : మీకు, మీ మిత్రులు, సన్నిహితులకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వచ్చినా, తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, మీ సమస్యను ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటున్నా మీకు సహకరించేందుకు హెల్ప్​లైన్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. అందుకోసం స్నేహ ఫౌండేషన్ - 04424640050 (24 x 7 అందుబాటులో ఉంటుంది) లేదా టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్‌లైన్ - 9152987821కి సంప్రదించవచ్చు. వీరు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వారిని సంప్రదించి మీ సమస్యలను వివరించవచ్చు. తద్వారా తగిన పరిష్కారమార్గాలను పొందవచ్చు.

టీనేజర్ల భద్రతకు ఇన్​స్టాగ్రామ్​ కొత్త చర్యలు- ఆత్మహత్యపై సెర్చ్ చేస్తే తల్లిదండ్రులకు నోటిఫికేషన్లు!

బిడ్డలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య కేసు - చనిపోవడానికి అసలు కారణం ఇదే