ప్రొద్దుటూరులో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి - పోలీసుల లాఠీఛార్జ్
ప్రొద్దుటూరులో ఎస్. ఎస్. మాల్ వివాదం - షాపింగ్ మాల్‌ను పరిశీలించిన టీడీపీ నేత ప్రవీణ్ - ఎమ్మెల్యే వరదరాజులు, ప్రవీణ్ మధ్య నెలకొన్న విభేదాలు - ప్రవీణ్‌ను ఇంటికి తరలించిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2026 at 7:40 PM IST
|Updated : May 26, 2026 at 8:15 PM IST
Police Lathi Charge At SS Mall At Proddatur YSR Kadapa District: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్తుడుగా ఉన్న ఎస్ఎస్ షాపింగ్ మాల్ వద్ద రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది.
ఇరువర్గాల మధ్య ఘర్షణ: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రొద్దుటూరులోని ఎస్.ఎస్.షాపింగ్ మాల్‌పై ఇటీవల టీడీపీ నేత ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. షాపింగ్ మాల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని తెలిపారు. షాపింగ్ మాల్‌లో ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నారు. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు నేడు ఫైర్ సేఫ్టీ అధికారులు తనిఖీకి వచ్చారు. తనిఖీ విషయమై ప్రవీణ్ అనుచరులు పలువురికి ఫోన్లు చేశారు.
ఈ క్రమంలో విషయం తెలుసుకుని ఎమ్మెల్యే వర్గీయులు షాపింగ్‌మాల్ వద్దకు వచ్చారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులపై ప్రవీణ్ అనుచరులు రాళ్లదాడికి దిగారు. దాంతో ఎమ్మెల్యే వర్గీయులు, ప్రవీణ్ అనుచరులు మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. ఉద్రిక్తత దృష్ట్యా రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం పోలీసులు టీడీపీ నేత ప్రవీణ్‌ను ఇంటికి పంపించారు.
పొదిలి రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - చట్టపరమైన చర్యలకు ఆదేశం
తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య రాళ్లదాడి

