ETV Bharat / state

గోదావరి మోడల్ పుష్కర పంచాయతీ ప్రణాళికపై ఉపముఖ్యమంత్రి సమీక్ష

గోదావరి జిల్లాల అధికారులతో వర్చువల్‌గా పవన్‌ సమావేశం - ఘాట్లలో జరుగుతున్న ప్రగతి పనులపై పవన్ ఆరా - ఈనెల 18తర్వాత మునికూడలికి వస్తానని తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Review Meet Over Godavari Pushkaralu Model Panchayat Plan
Pawan Kalyan Review Meet Over Godavari Pushkaralu Model Panchayat Plan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 6, 2026 at 5:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

Pawan Kalyan Review Meet Over Godavari Pushkaralu Model Panchayat Plan: గోదావరి పుష్కరాల సందర్భంగా మోడల్ పుష్కర పంచాయతీ ప్రణాళికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన సమీక్షలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఇతర అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. మునికూడలిని గోదావరి మోడల్ పుష్కర పంచాయతీగా అభివృద్ధి చేయాలని ఇటీవల పవన్ ఆదేశించారు. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న ప్రగతి పనులపై ఆరా తీశారు. ఘాట్లకు వెళ్లేందుకు రహదారులు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు వివరించారు. ఈనెల 18 తర్వాత తాను స్వయంగా మునికూడలికి వస్తానని పవన్​ అన్నారు. మునికూడలిని నమూనాగా తీసుకోవాలని మిగతా చోట్ల పుష్కరఘాట్ల అభివృద్ధి చేయాలని సూచించారు. పది, పదహోను రోజుల్లో ఎలాంటి అభివృద్ది జరుగుతుందో చెప్పాలని అధికారులను అడిగారు. కారు పార్కింగ్​ తదితర అంశాల గురించి చర్చించారు.

గోదావరి మోడల్ పుష్కర పంచాయతీ ప్రణాళికపై ఉపముఖ్యమంత్రి సమీక్ష (ETV Bharat)

మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులు: పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులపై కూడా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో వందకు పైగా పైలేరియా కేసులు నమోదవటం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల భారిన పడుతుండటంతో పవన్ అక్కడి సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవటమే అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. గ్రామంలో మురుగునీరు వెళ్లే మార్గాలు సరిగా లేకపోవటంతోపాటు, కొన్నిచోట్ల కాలువలు అక్రమణలకు గురయ్యాయి. అక్కడి ప్రజలతో మాట్లాడి అక్రమణలు తొలగించి గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు పవన్‌కు వివరించారు.

గ్రామస్థుల నుంచి మొదట్లో ప్రతిఘటన ఎదురైనా వారిని ఎలాగోలా ఒప్పించి అక్రమణలు తొలగించి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సామాజిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పనులు ముందుకు తీసుకెళ్లిన జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. ఈ నెల 24న పెదపెంకి గ్రామానికి వచ్చి మ్యాజిక్‌ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని తెలిపారు.

'మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలి' - సీడ్‌ బాల్స్‌ తయారు చేసిన పవన్​

అభివృద్ధి గురించి ఆలోచించకుండా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: పవన్‌