ETV Bharat / state

ఆటో చార్జీ విషయంలో వివాదం - డ్రైవర్ చెవి ఊడిపడేలా కొరికిన ప్యాసింజర్

పల్నాడు జిల్లాలో ఛార్జీ చెల్లించాలని అడిగిన ఆటో డ్రైవర్‌పై ప్రయాణికుడి దాడి - డ్రైవర్‌ చెవి ఊడిపోయేలా కొరికిన ప్రయాణికుడు - ప్రయాణికుడి తల పగలకొట్టిన ఆటో డ్రైవర్‌

Passenger_Attacks_Auto_Driver
Passenger_Attacks_Auto_Driver (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 13, 2026 at 10:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

Passenger Attack Auto Driver over Fare in Palnadu District: ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడటం సర్వ సాధాణయిపోయింది. ఆటో ఛార్జీ చెల్లించాలని అడిగిన డ్రైవర్‌ చెవి ఊడిపోయేలా ప్యాసింజర్‌ కొరికాడు. దీంతో డ్రైవర్ ప్రయాణికుడి తల పగల కొట్టాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో ఆటో ఛార్జీ చెల్లింపు విషయంలో డ్రైవర్‌, ప్యాసింజర్‌ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెచ్చిపోయిన ప్యాసింజర్‌ ఆటో డ్రైవర్‌ రాజు చెవి ఊడిపోయేలా కొరికాడు. దీంతో డ్రైవర్‌ ప్యాసింజర్‌ తల పగలకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.