ETV Bharat / state

ఒంగోలుకు 24 గంటలపాటు తాగునీటి సరఫరా దిశగా కీలక అడుగులు: మంత్రి లోకేశ్​

రంగరాయుడుచెరువు వద్ద తాగునీటి ప్రాజెక్టు పనులు ప్రారంభించిన లోకేశ్‌ - 51,340 హౌస్ సర్వీస్ కనెక్షన్లతో ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చేలా ప్రణాళిక - ఒంగోలు రాజసం ఉట్టిపడేలా ఒంగోలు గిత్త విగ్రహావిష్కరణ

ఒంగోలు మున్సిపాలిటీ  150 ఏళ్ల వేడుకల్లో మంత్రి లోకేశ్​
ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల్లో మంత్రి లోకేశ్​ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 7:27 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ongole Municipality 150 Years : ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంతో ప్రత్యేక అనుబంధం ఉన్న 20 మంది ప్రముఖుల విగ్రహాలను మంత్రి లోకేశ్‌ ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని రంగరాయుడు చెరువులో అమృత్ 2.0 పథకం కింద తాగునీటి ప్రాజెక్టును మంత్రి నారా లోకేశ్​ ప్రారంభించారు.

ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకల్లో మంత్రి లోకేశ్​ (ETV Bharat)

24 గంటలు తాగునీటి సరఫరా: ఒంగోలు నగర ప్రజలకు 24 గంటలు తాగునీటిని అందించే దిశగా 424.42 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా ఒంగోలు నగరంలోని మొత్తం 35 డిస్ట్రిబ్యూషన్ జోన్లను రీ-జోనింగ్ చేసి, 605.30 కిలోమీటర్ల పొడవున తాగునీటి పంపిణీ నెట్‌వర్క్‌ అభివృద్ధి చేశారు. దీని ద్వారా 51,340 హౌస్ సర్వీస్ కనెక్షన్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఇంటికీ మెరుగైన తాగునీటి సరఫరా అందనుంది. నగరంలో నీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించి, ప్రజలకు నిర్ణీత సమయాల్లో మాత్రమే కాకుండా 24 గంటలూ తాగునీరు అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. పెరుగుతున్న ఒంగోలు నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన, స్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

రాడిసన్​ హోటల్​కు భూమిపూజ: ప్రకాశం జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో 100 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ హోటల్‌కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్​ భూమిపూజ చేశారు. రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ హోటల్ ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తొలి 5-స్టార్ హోటల్‌గా నిలవనుంది. 151 లగ్జరీ గదులు, రెస్టారెంట్, బార్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్‌నెస్ సెంటర్‌తో పాటు కార్పొరేట్ సమావేశాలు, వివాహాలు, సదస్సుల కోసం భారీ బ్యాంకెట్ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్‌హెచ్-16కు సమీపంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా బిజినెస్, టూరిజం రంగాలకు ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కార్యక్రమం అనంతరం మంత్రి లోకేశ్​ కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయంగా పలకరించి అర్జీలు స్వీకరించారు

ఈవీ రంగంపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ - ఇప్పటికే 21 మంది విద్యార్థులకు ఉద్యోగాలు

ఫొన్​లో వైద్యుడి సూచనలు - ఆస్పత్రిలో నర్సు, కాంపౌండర్​ కలిసి వైద్యం - వికటించి గర్భిణి మృతి