ప్లంబర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్ సేవలు - ఒక్క క్లిక్‌తో సొల్యూషన్
ఈ యాప్‌లో ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ తదితర సేవలు ఒకే వేదికపై - వినియోగదారులు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 4, 2026 at 1:53 PM IST
|Updated : July 4, 2026 at 5:06 PM IST
Book My Service Ongole : కాలు కదపకుండానే చకచకా అవసరమైన సేవలు పొందే సౌకర్యాలు ఇప్పుడు విస్తృతస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇంట్లో వినియోగించే వస్తువులు రిపేర్‌కు వస్తే వెంటనే మరమ్మతులు చేసే వ్యక్తి కోసం వెతుకుతాం. ఫోన్ చేస్తే ఆ వ్యక్తి సమయానికి వస్తాడో, రాడో తెలియని పరిస్థితి. అప్పుడెలా? ఇలా వెతకాల్సిన పనిలేకుండా సేవలు అందించే నిపుణులను ఒకేచోటకి చేర్చి ఇంటి వద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు 'బుక్ మై సర్వీస్' యాప్ రూపకర్తలు. ఒంగోలులో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ వినియోగదారులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు అంటున్నారు.
తక్కువ ధరల్లోనే సేవలు: ఇంటి అవసరాలకు వేర్వేరు వ్యక్తుల కోసం ఫోన్‌లు చేయడం, పరిచయస్తులను అడగడం, సమయం వృథా చేసుకోవడం వంటి ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తోంది బుక్ మై సర్వీస్ యాప్. ఒంగోలులో కొంతమంది కలిసి ప్రారంభించిన ఈ యాప్ ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఏసీ టెక్నీషియన్, గృహ మరమ్మతుల నిపుణులు తదితర సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. బయట వ్యక్తిగతంగా పనివారిని పిలిపించుకునే ఖర్చుతో పోలిస్తే తక్కువ ధరల్లోనే సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రతీ ఇంట్లో ప్లంబింగ్, కార్పెంటర్, ఎలక్ట్రికల్, ఏసీ ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తాయో తెలియదు. బయట వర్కర్‌ను పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. గత 6 నెలల నుంచి సర్వీసెస్ కోసం ఒంగోలు నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. సర్వీస్ ఇవ్వాలంటే సర్టిఫైడ్ వర్కర్స్ ఉండాలి. మేము సర్వీస్ ప్రొవైడర్లను రిక్రూట్ చేసుకునేటప్పుడు వారిని ఇంటర్వ్యూ చేసి, స్కిల్ టెస్ట్ పెట్టి, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ వైరిఫై చేసుకున్న తరువాత సర్వీస్ ప్రొవైడర్ పార్టనర్‌గా తీసుకుంటాం. - బెల్లకొండ శ్రీనివాస్, బుక్ మై సర్వీస్ స్టార్టప్ వ్యవస్థాపకులు
నాణ్యతకు ప్రాధాన్యం : పనులను అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులతోనే చేయించడం ద్వారా నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరిస్తున్నారు. అలాగే 30 రోజుల సేవా హామీ కూడా ఇస్తున్నారు. వినియోగదారులకు సేవలతో పాటు స్థానికంగా ఉన్న ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఇతర నైపుణ్య కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలూ కల్పిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇంటి అవసరాలకు తక్షణమే పనివారిని సంప్రదించడం చాలామందికి సవాలుగా మారుతున్న తరుణంలో, ఈ యాప్ ఆ సమస్యకు సాంకేతిక పరిష్కారంగా నిలుస్తోంది. ఒక క్లిక్‌తో సేవను బుక్ చేసుకుంటే నిర్ణయించిన సమయానికి నిపుణుడు ఇంటికే చేరుకోవడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు వినియోగదారులకు సేవలూ అందుతున్నాయి.
బుక్ మై సర్వీస్ అనే యాప్‌ను ఒంగోలుకి కొత్తగా లాంఛ్ చేశాం. ఇందులో ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఏసీ టెక్నీషియన్, గృహ మరమ్మతులు తదితర సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చాం. వినియోగదారులు తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాం. బయటి పనివారిని పిలిపించుకునే ఖర్చుతో పోలిస్తే తక్కువ ధరలోనే సేవలు అందిస్తున్నాం. - బుక్ మై సర్వీస్ నిర్వాహకురాలు
బుక్ మై సర్వీస్ యాప్‌లో నేను వర్కర్‌గా జాయిన్ అయ్యాను. బయట నాకు రోజుకి 1, 2 పనులు మాత్రమే దొరికేవి కానీ ఇందులో ఎన్రోల్ అయ్యాక రోజుకు 5 పనుల దాకా దొరుకుతున్నాయి. ఈ యాప్‌లో నమోదు చేసుకున్నాక 365 రోజులూ పని దొరుకుతుంది. బుక్ మై సర్వీస్ యాప్ ఒంగోలు ప్రజలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరందరూ బుక్ మై సర్వీస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నా. - బుక్ మై సర్వీస్ వర్కర్
పాలకులు మారినా పాలసీలు మారకూడదు - ప్రపంచస్థాయి కోచ్‌లను తీసుకొస్తాం: మంత్రి లోకేశ్
మహా పుష్కరాల నాటికి 'హ్యావ్‌లాక్' వంతెన - రూ.94 కోట్లతో చారిత్రక సంపదకు నవ వైభవం

