అన్నగారి స్మరణలో - రాష్ట్రవ్యాప్తంగా పండగలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పలుచోట్ల భారీ ర్యాలీలు - పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 28, 2026 at 10:53 PM IST
NTR Birth Anniversary Celebrations : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అన్నగారి జన్మస్థలం నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు గ్రామస్థులతో కలిసి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి టీజీ భరత్ పూలమాలలు వేశారు. నంద్యాల షాదీఖానాలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో మంత్రి ఫరూక్ కేక్ కట్ చేశారు.
విజయవాడ గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావు కేక్ కట్ చేశారు. గొల్లపూడి సెంటర్‌లో నిర్వహించిన టీడీపీ వ్యవస్థాపకుడి జయంతి వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వంసత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం తామరకొల్లులో తెలుగుదేశం శ్రేణులు ఏర్పాటు చేసిన నటసార్వభౌముడి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.
నెల్లూరు టీడీపీ కార్యాలయంలో యుగపురుషుడి విగ్రహానికి ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్ రావు నివాళులర్పించారు. విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించిన అన్నగారి జయంతి వేడుకల్లో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు మహానాడులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం మహిళలు పసుపు కండువాలు చేతబట్టి డీజే పాటలకు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు.
పేదలకు దుస్తులు పంపిణీ : శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పూలమాల వేసి కేక్ కట్ చేశారు. హిందూపురంలో పార్టీ వ్యవస్థాపకుడి జయంతిని టీడీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచా కాలుస్తూ సందడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామలలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఆవిష్కరించారు. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని నటసార్వభౌముడి విగ్రహానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తెలుగుదేశం కార్యకర్తలు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉన్న నటసార్వభౌముడి విగ్రహానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పుష్పాంజలి ఘటించారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యకర్తలు శకపురుషుడి విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా కోడూరులో బైక్ ర్యాలీ చేపట్టారు. పార్టీ జెండాలు చేతబట్టి జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం అంటూ నినదించారు. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయ సిబ్బంది ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. శాసనసభ ఆవరణలో సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఇతర అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్ అన్నగారికి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చిత్రకారుడు పణిదెపు వెంకటకృష్ణ ఎన్టీఆర్ తల్లిదండ్రులు లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ పేర్లతో ఆయన చిత్రాన్ని గీశారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి - రెండో రోజు మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ - ఎన్డీయే ఎగైన్ అండ్ ఎగైన్: చంద్రబాబు

