ఫోన్ ట్యాపింగ్ కేసు - సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం - ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు కొండల్‌రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తింపు

Published : January 7, 2026 at 3:16 PM IST
|Updated : January 7, 2026 at 4:11 PM IST
CM Revanth Reddy Brother Kondal Reddy in Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ట్యాపింగ్‌కు గురైన 618 లిస్ట్‌లోని ఒక్కొకరిని విచారిస్తూ వస్తోంది. ప్రధానంగా సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు అయినప్పటి నుంచి దర్యాప్తు వేగం పెరిగింది. ఇందులో భాగంగానే గతంలో ట్యాపింగ్ బాధితులుగా ఉన్న 618 స్టేట్మెంట్లను పరిశీలిస్తుంది. కొందరిని మరో సారి పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తోంది. తాజాగా నవీన్ రావు తండ్రి కొండల్ రావు, మరో ఇద్దరు బీఆర్ ఎస్ నేతలతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి రేవంత్ బంధువులను వారి స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ కోరింది.
రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేయగా ప్రభాకర్ రావును సైతం పలు మార్లు విచారించింది. ఈ కేసులో చిన్న చిన్న గ్యాప్స్‌ని కూడా ఫిల్ చేస్తూ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముందుకు వెళ్తోంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ కస్టోడియల్ విచారణ ఆధారంగా కీలక సమాచారం సేకరించిన సిట్ కేసులో మరో సారి చార్జిషీట్ దాఖలు చేసేందు సిద్దమవుతోంది. ఇప్పటికే ట్యాపింగ్ బాధితులుగా ఉన్న మొత్తం 618 మందిని దాదాపు అందరి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ తర్వత మరికొంతమందిని పిలిచి విచారిస్తోంది.
ఇటీవల ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు ఎదర్కొంటున్న ఎమ్మెల్సీ నవీన్ రావును సుమారు 9 గంటల పాటు విచారించింది. కాగా నేడు అతని తండ్రి కొండల రావును విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా సిట్ కార్యాలయానికి రాలేనని తన ఇంటి వద్ద అయితే విచారణకు సిద్దంగా ఉంటానని చెప్పడంతో పోలీసులు పునరాలోచిస్తున్నారు. మరోవైపు కూకట్పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణరావకు సైతం సిట్ విచారణకు హాజరుకవాలని కోరింది. విదేశాల్లో ఉండటం వల్లా రాలేకపోతున్నానని వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పినట్లు సమాచారం.
మరికొంత మంది కీలక రాజకీయ నేతలకు నోటీసులు : ఇదిలా ఉంటే ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సైతం సిట్ నోటీసులిచ్చింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలను రేపు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయం హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా గతంలోనూ చిరుమర్తి లింగయ్యను సిట్ అధికారులు విచారించారు. మరో వైపు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతని బంధువులు, సోదరుల ఫోన్లు కూడా 2023 ఎన్నికల సమయంలో ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించగా వారి స్టేట్మెంట్లు మరోసారి తీసుకోవాలని సిట్ భావిస్తోంది. స్టేట్మెంట్ ఇవ్వాలని రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి ఫోన్ చేయగా తాను అందుబాటులో లేనని చెప్పినట్లు సమాచారం. త్వరలో వచ్చి తన స్టేట్మెంట్ ఇస్తానని పోలీసులకు వివరించినట్లు తెలిసింది. కాగా సంక్రాంతి పండుగ తర్వాత మరికొంత మందిని విచారించి మార్చి చివరిలోపు అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. త్వరలో మరికొంత మంది కీలక రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇచ్చి సిట్ విచారించనుంది.
సిట్ కాస్తా కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లాగా అయిపోయింది : ఫోన్ ట్యాపింగ్ కేసును ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారని ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఎంతమందిని పిలిచి విచారణ చేసినా వేళ్లన్ని ఒకవైపే చూపిస్తున్నాయని, వేళ్లన్ని ఒకరివైపే చూపినా ఆయన జోలికి వెళ్లటం లేదని అన్నారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా అని స్వయంగా కుమార్తె ప్రశ్నించిందని తెలిపారు. సిట్ కాస్తా కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లాగా అయిపోయిందని విమర్శించారు. 650 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని సర్వీస్ ప్రొవైడర్లే చెప్పారని అన్నారు.
కుటుంబంలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటామని, బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు భారమైందిఆ పార్టీతో ఉపయోగం లేదని రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులకే నచ్చటం లేదని, కాంగ్రెస్ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే అని ధీమా వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ఏర్పాటు

