ETV Bharat / state

హైదరాబాద్​లో చెవులు గిల్లుమంటున్నాయి - వేళాపాళా లేకుండా మోత మోగిస్తున్నారు!

భాగ్యనగర పరిసర ప్రాంతాల్లో నిర్మాణాల కోసం నిరంతరం తిరుగుతున్న వాహనాలు - జూపార్క్​, హెచ్​సీయూలో పరిమితికి మించి శబ్ద కాలుష్యం - రాత్రి వేళల్లోనూ తగ్గని హారన్ల మోత - జూపార్క్​లోని​ వన్యప్రాణులపైనా ప్రభావం

హైదరాబాద్​లో శబ్ద కాలుష్య ప్రాంతాలు
Most Sound Pollution Places In Hyderabad (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : June 17, 2026 at 4:27 PM IST

3 Min Read
Choose ETV Bharat

Most Sound Pollution Places in Hyderabad : హైదరాబాద్​ మహా నగరంలో ఒకవైపు వాయు కాలుష్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుండగా, వాహనాల ఇంజిన్లు, హారన్లతో శబ్ద కాలుష్యం కూడా తారాస్థాయికి చేరుతోంది. ప్రధానంగా వన్యప్రాణులను సంరక్షిస్తూ వాటికి నిలయమైన జూపార్క్, ఉన్నత విద్యను అందించే హైదరాబాద్​ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్​సీయూ) లాంటి సున్నితమైన ప్రదేశాల్లో పరిమితికి మించిన శబ్ద కాలుష్యంతో చెవుల్లో మోత మోగుతోంది. ఇక్కడ రాత్రి, పగటి వేళల్లో నిర్ణీత ప్రమాణాలను దాటి కాలుష్యం నమోదవుతోంది.

జూపార్క్, హెచ్​సీయూలతో పాటు చాలా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఈ సంవత్సరం జనవరి నుంచి మే వరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) రియల్​టైమ్​ నాయిస్​ మానిటరింగ్ స్టేషన్లకు సంబంధించిన గణాంకాల ద్వారా ధ్వని కాలుష్య ప్రభావిత ప్రాంతాల గురించి తెలుసుకోవచ్చు. ఈ సమస్య హైదరాబాద్​, సంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల్లో తీవ్రమవుతోందని రాష్ట్ర పొల్యూషన్​ బోర్డు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

ఈ ప్రాంతాల్లో పరిమితికి మించి : వాయు కాలుష్యంతో పాటు అధికమవుతున్న ధ్వని కాలుష్యం హైదరాబాద్​ నగరం సహా పరిసర జిల్లాల్లోని ప్రజారోగ్యానికి, పర్యావరణానికి సవాల్​గా మారుతోంది. చుట్టుపక్కల నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న తొమ్మిది మానిటరింగ్ సెంటర్లలో నమోదైన గణాంకాలను గమనించగా ఇండస్ట్రియల్​ ఏరియాలైన గడ్డపోతారం, జీడిమెట్ల, సనత్​నగర్​లలో మాత్రమే శబ్ద కాలుష్యం పరిమితి కంటే కాస్త తక్కువగా ఉంటోంది. ఇక తార్నాక, జూబ్లీహిల్స్, హెచ్​సీయూ, జేఎన్​టీయూ, జూపార్క్​ తదితర ప్రదేశాల్లో నిర్ణీత ప్రమాణాల పరిమితులను దాటి సగటున 15 నుంచి 25 డెసిబెల్స్​ దాకా అధిక శబ్దాలు నమోదవుతున్నాయి.

వన్యప్రాణులపై ప్రభావం : అధిక వృక్ష సంపదతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండాల్సిన జూపార్క్​, హెచ్​సీయూతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ప్రదేశాల్లో ధ్వని కాలుష్య పరిమితి పగటి పూట 50, రాత్రి వేళలో 40 డెసిబెల్స్​ నమోదవుతోంది. అత్యధికంగా హెచ్​సీయూలో పగటి వేళ 67 నుంచి 71, రాత్రి సమయాల్లో 66 నుంచి 69 డెసిబెల్స్​ దాకా నమోదవుతున్నాయి. ఈ శబ్ద కాలుష్యం జూపార్క్​ పరిసరాల్లో ఉన్న వన్యప్రాణులపైనా ప్రభావం చూపుతోంది.

భారీ భవన నిర్మాణాల వల్ల : హైదరాబాద్ వేగంగా నగరీకరణ జరుగుతున్న ప్రాంతం.​ కొత్త నివాస ప్రాంతాలకు విస్తరిస్తున్న నగరంలో నిరంతరం నిర్మాణ పనులు సాగడానికి రవాణా అవసరమవుతోంది. దీంతో ట్రాఫిక్​ ఏర్పడటం వల్ల శబ్ద కాలుష్య సమస్య నాలుగు జిల్లాల్లో అధికమవుతోంది. ప్రధానంగా కొన్ని చోట్ల పది అంతస్తుల వరకు చేపడుతున్న నిర్మాణాల ద్వారా ఆయా ప్రాంతాల్లో రవాణా విపరీతమవుతోంది. వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్​ ఏర్పడి, హారన్ల మోత మోగిస్తున్నాయి. వాణిజ్య కార్యకలాపాలను కూడా చీకటి పడేవరకు కొనసాగిస్తుండటంతో సమస్య ఎక్కువవుతోంది.

ఈ జాగ్రత్తలు పాటించాలి : కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం ఒక వ్యక్తి 8 గంటలపాటు 85 డెసిబుల్స్​కి మించి శబ్దాలు వినకుండా జాగ్రత్త పడాలి. విపరీతమైన ధ్వనులు వచ్చే ప్రాంతాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. అధిక శబ్దాల నుంచి కాపాడుకోవడానికి ఇయర్​ ప్లగ్​లు వినియోగించడం లేదా చెవుల్లో మెత్తని దూది పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధిక ధ్వనితో చెవులు హోరెత్తించేలా మాడిఫై చేయించిన వాహనాలను ఉద్దేశపూర్వకంగా తోలినా పోలీసులకు సమాచారం అందించాలని చెబుతున్నారు.

నగరంలోని పలు ప్రాంతాలలో 2026 జనవరి నుంచి మే వరకు ధ్వని కాలుష్యం ఇన్ని డెసిబెల్స్​లో నమోదైంది.

ప్రాంతం

అనుమతించిన

పరిమితి

జనవరిఫిబ్రవరిమార్చిఏప్రిల్మే
జూబ్లీహిల్స్పగలు 5558.3459.2458.0456.6056.79
రాత్రి 4556.6454.9454.0351.1853.93
తార్నాకపగలు 5560.7559.5460.4658.3558.23
రాత్రి 4559.5459.0858.8457.1969.06
జేఎన్​టీయూపగలు 6571.2671.0270.8369.5269.06
రాత్రి 5569.7069.7069.3667.7567.94
జూపార్క్పగలు 5056.6253.7756.5355.6358.95
రాత్రి 4056.4054.1856.4755.2257.31
హెచ్​సీయూపగలు 5070.6371.3971.0367.7369.54
రాత్రి 4069.1769.4469.1666.2867.24

"తెలంగాణకు ఊపిరితిత్తులు ఈ రెండు జిల్లాలే" - ఈ జిల్లాలో ఒక శాతమూ అడవుల్లేవ్​!

భాగ్యనగరంలో సిగ్నేచర్​ టవర్లు - రాయదుర్గం, కోకాపేటలో బిల్డర్ల ప్లానింగ్