ETV Bharat / state

లోక్‌భవన్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు - కేక్‌ కట్‌ చేసిన గవర్నర్‌ దంపతులు

లోక్‌భవన్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు - కేక్‌ కట్‌ చేసిన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌, సమీరా నజీర్‌ దంపతులు - పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎస్

New_Year_celebrations
New_Year_celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 1, 2026 at 10:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

New Year Celebrations at Lok Bhawan: లోక్‌భవన్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్బార్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌, సమీరా నజీర్‌ దంపతులు కేక్‌ కట్‌ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌ దంపతులు గవర్నర్‌ దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో లోక్‌ భవన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

New_Year_celebrations
కేక్‌ కట్‌ చేస్తున్న నజీర్‌ దంపతులు (ETV Bharat)

రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు: రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి పయ్యావుల కేశవ్‌ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారాయణ నెల్లూరులోని నివాసంలో కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు నారాయణను గజమాలతో సత్కరించారు.

అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేశారు. 2026లో రాష్ట్రం స్వర్ణయుగంలా మారాలాని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, మంత్రి అచ్చెన్నాయడు ఆకాక్షించారు. నూతన సంవత్సర సందర్భంగా మంత్రులిద్దరూ వారి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడకు వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

పూల దండలకు బదులుగా నోటు పుస్తకాలు: నెల్లూరులో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2025లో కూటమి పాలనలో రాష్ట్రానికి సుపరిపాలన అందిందని తెలిపారు. అలాంటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధి నినాదంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని మంత్రి ఎన్​ఎండీ ఫరూక్‌ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు, అధికారులు, కార్యకర్తలను కలిసిన మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలవడానికి వచ్చిన కార్యకర్తలు పూల దండలకు బదులుగా నోటు పుస్తకాలు ఇచ్చారు. 2026లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్‌ వెల్లడించారు.

నూతన సంవత్సరం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో ఆయన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి కార్యకర్తలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈగల్‌ విభాగం చీఫ్‌ ఆకే రవికృష్ణ మంగళగిరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రిలోని డీ అడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న మైనర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. మైనర్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. బాలుడికి నూతన వస్త్రాలు అందించారు. 2026 నుంచి యువత మత్త పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు - మిన్నంటిన సంబరాలు

న్యూ ఇయర్​ వేడుకల్లో కట్​ చేసే కేక్​ ఆరోగ్యకరమేనా?- ఇలా ట్రై చేశారంటే సూపర్​ టేస్టీ, హెల్దీ​