ETV Bharat / state

ప్రయాణికులకు ఉత్తమ సేవలు - ఏపీఎస్​ఆర్టీసీకి జాతీయ అవార్డు

ఏపీఎస్​ ఆర్టీసీకి జాతీయ అవార్డు - ప్రయాణికులకు ఉత్తమ సేవలు, డిజిటల్‌ సేవల్లో ముందంజ వేస్తున్న ఘనత ఆర్టీసీ సొంతం - అవార్డుపై హర్షం వ్యక్తం చేసిన ఆర్టీసీ వీసీఎండీ బాలసుబ్రమణ్యం

National Award To APSRTC For Excel Digital services
National Award To APSRTC For Excel Digital services (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 25, 2026 at 5:35 PM IST

1 Min Read
Choose ETV Bharat

National Award To APSRTC For Excel Digital Services: ఏపీఎస్​ఆర్టీసీ మరో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ప్రయాణికులకు ఉత్తమ సేవలతోపాటు మారుతున్న సాంకేతికతను సమర్ధంగా అందిపుచ్చుకొని డిజిటల్‌ సేవల్లో ముందంజలో కొనసాగుతున్నందుకు ఏపీఎస్​ఆర్టీసీ ఈ అత్యున్నతమైన జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. అయితే గతంలో 2025 సంవవత్సరానికి పీఎస్​ఈ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ అవార్డుకు ఏపీఎస్​ ఆర్టీసీ ఎంపికైంది. ప్రదానంగా సంస్థలోని యూనిఫైడ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో డిజిటల్‌ సేవల సామర్ధ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం సమర్ధంగా వినియోగించనందుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా పీఎస్​ఈ సమ్మిట్‌లో ఆర్టీసీ వీసీఎండీ బాలసుబ్రమణ్యం తరఫున ఐటీ విభాగం చీఫ్‌ ఇంజనీరు వై. శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుపై ఆర్టీసీ వీసీఎండీ బాలసుబ్రమణ్యం హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు కృషి చేసిన అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందిని అభినందించారు. గతంలో సైతం ఏపీఎస్ ఆర్టీసీకి ఎన్నో పురస్కారాలు వరించగా ఈ అవార్డుతో మరో కలికితురాయి ఆర్టీసీ ఖాతాలో చేరినట్లైంది.