'లెదర్ పప్పెటరీ'లో రాణిస్తున్న హరినాథ్ - కృష్ణార్జున విశ్యరూపం చిత్రానికి జాతీయ అవార్డు
తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాలలో కలంకారీ కోర్సులో హరినాథ్ శిక్షణ - ఈ వృత్తిలోనే అవార్డులు సంపాదించడమే లక్ష్యం - తోలు బొమ్మలు గీయడమే వృత్తి

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 26, 2025 at 5:27 PM IST
Nation Award In Leather Puppetry : చేతివృత్తుల బొమ్మలు, చిత్రాలు చూస్తే ఔరా ఎలా చేశారు ఇవి అనిపిస్తాయ్ కదా! అలాగే వాటిని గీసిన వారిని, తయారు చేసిన వారిని ప్రశంసించకుండా కూడా ఉండలేం కదా! ఈ కళలో చిన్న గీత తప్పితే దాని రూపమే మారిపోతుంది. అలాంటి కళను వారసత్వంగా అందిపుచ్చుకొని జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు ఆ యువకుడు. లెదర్ పప్పెటరీ కళపై ఆసక్తి, విష్ణుమూర్తి మీద ఇష్టంతో ఓ యువకుడు కురుక్షేత్ర సన్నివేశాన్ని గీసి ఏకంగా జాతీయ పురస్కారాన్నే అందుకున్నాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరి ఎవరు ఆ కళాకారుడు? తోలు బొమ్మలు గీయడం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసుకుందాం.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన యువకుడు హరినాథ్. తిరుపతిలోని ఎస్వీ శిల్ప కళాశాలలో కలంకారీ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. లెదర్ పప్పెటరీ కళపై ఆసక్తితో కురుక్షేత్ర యుద్ధంలోని పలు అంశాలను అత్యంత స్పష్టంగా తోలుపైకి తీసుకొచ్చి జాతీయ హ్యాండీ క్రాఫ్ట్ అవార్డుతో పాటు శ్రీకృష్ణుడి గీతోపదేశంపై తయారు చేసిన చిత్రానికి దిల్లీలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా మరో అవార్డును కూడా అందుకున్నాడు . తన కళను భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యమంటున్నాడు హరినాథ్.
తోలు బొమ్మలు గీయడం మా వృత్తి : తోలు బొమ్మలు గీయడం మా వృత్తి కాబట్టి చిన్నప్పటి నుంచి దీనిలో ప్రావీణ్యం పొందానని హరినాథ్ తెలిపాడు. తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలోనే ఇప్పటి వరకూ ప్రతి చిత్రాన్ని గీసాను అని కళాకారుడు పేర్కొన్నాడు. మొదటి నేషనల్ అవార్డు కురుక్షేత్రానికి సంబంధంచిన చిత్రానికి వచ్చిందన్నారు.
"నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను. మా నాన్న, తాత ఏ బొమ్మ గీయమని అడిగితే అది గీసే వాడిని. మా తాత, నాన్న కూడా తోలు బొమ్మల పెయింటిగ్స్ వేసేవారు. మా వృత్తి తోలు బొమ్మలు గీయడం ఇందులోనే స్థిరపడాలని చదువుని కూడా మధ్యలోనే ఆపేసా. ఈ వృత్తిలోనే అవార్డులు సంపాదించడమే నా లక్ష్యం. ఇప్పటి వరకు నాన్న, తాత మార్గదర్శకత్వంలోనే ప్రతిదీ గీసాను. నేను గీసిన కురుక్షేత్రంలో కృష్ణా అర్జున విశ్యరూపం చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నాను. విష్ణుమూర్తి మీద ఇష్టంతో ఆ చిత్రాన్ని గీసాను. ఖాళీ సమయాల్లో ఈ కలలో సాధన చేస్తాను." - హరినాథ్, కళాకారుడు
యువతకు భిన్నంగా ఉంటూ : కళాశాలలో ఉన్న అందరికంటే హరినాథ్ చాలా ఓపికగా ఇష్టంతో ప్రతి చిత్రాన్ని నేర్చుకుంటాడని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. ప్రస్తుత యువతకు భిన్నంగా ఉంటూ ప్రతి దానిని ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటాడని ఆయన వెల్లడించారు.
"శిల్ప కళాశాలలో మిగతా విద్యార్థులతో పోలిస్తే అందరికంటే హరినాథ్ భిన్నంగా ఉంటాడు. ఫోన్లలో కాలక్షేపం చేయకుండా చిత్రాలను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. నాలుగు నెలలుగా మా దగ్గర కలంకారీ కూడా నేర్చుకుంటున్నాడు. సీనియర్లుతో పోటీగా ప్రతీదీ చాలా మంచిగా నేర్చుకుంటున్నాడు. నేర్చుకున్నవి అక్కడితో వదిలేయకుండా ప్రతీదీ ప్రాక్టీస్ చేస్తాడు. అందువలనే హరినాథ్ ఆ స్థాయిలోకి వెళ్లగలిగాడు."- శిల్ప కళాశాల ప్రిన్సిపల్
కార్పెట్లకు ప్రత్యేక స్థానం : దేశవిదేశాల్లో కలంకారీ హస్తకళల్లో కార్పెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంటీరియర్ డెకరేటర్‌గా వినియోగించే వీటికి అంతర్జాతీయంగా ఆదరణ లభిస్తోంది. కృష్ణా జిల్లా పెడనలో రూపుదిద్దుకునే ఈ కార్పెట్లను దేశ విదేశాల్లో విక్రయిస్తుంటారు. ఇంటికి అదనపు అందాన్ని తీసుకొస్తూ ఈ కార్పెట్లు భారతీయ సంస్కృతికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొబ్బరి చిప్పలతో అందమైన డిజైన్లు - విదేశాలకు సైతం ఎగుమతి
కొండపల్లి బొమ్మల ఉనికి ఈ తెల్లపొనికి - కళాకృతులకు తీవ్రంగా కలప కొరత

