అవకాశాలను అందిపుచ్చుకునే సమర్థత ఏపీలో పుష్కలంగా ఉంది: మంత్రి లోకేశ్
శ్రీసిటీలో గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమకు లోకేశ్ శంకుస్థాపన- వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్న క్యారియర్ గ్లోబల్ సంస్థ- ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేలమందికి ఉద్యోగ, ఉపాధి కల్పన

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2026 at 1:00 PM IST
Lays Foundaiton Stone For Carrier AC Manufacturing Plants at Sri City: అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక స్మార్ట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. శ్రీ సిటీలో 39 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ దిగ్గజం క్యారియర్ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందదాయకమని అన్నారు.
అనేక దేశాల నుంచి పెట్టుబడులు: తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమలకు లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఏపీకి అనేక దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు త్వరగా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. అవకాశాలను అందిపుచ్చుకునే సమర్థత ఏపీలో పుష్కలంగా ఉందన్నారు. సమర్థ నాయకత్వంలో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయని మంత్రి లోకేశ్ అన్నారు.
'గురుగ్రామ్‌లో తయారీ యూనిట్, హైదరాబాద్ గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ మూడు దశల్లో 2028 నాటికి పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. ఏసీ తయారీ సంస్థ క్యారియర్ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టింది. దాదాపు 3 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది.' -నారా లోకేశ్, మంత్రి
డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్: విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు సాగుతోంని ఆయన అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్ల ప్రయోజనాలేంటో చూపిస్తున్నామని, నమో అంటే నరేంద్రమోదీ అంటారు. ఏపీలో నమో అంటే నాయుడు, మోదీ అని లోకేశ్ అన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు.
మరోవైపు చంద్రబాబు విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారన్నారు. పెట్టుబడులకు వచ్చేవారికి త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. సత్యవేడులోని శ్రీసిటీ పారిశ్రామికవాడకు చేరుకున్న లోకేశ్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మంత్రి నారా లోకేశ్ ప్రతిఒక్కరినీ పలకరించి ఫొటోలు దిగారు.
సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలి - యువతకు నారా లోకేశ్ పిలుపు
విశాఖకు గూగుల్ రావడంలో చంద్రబాబు, లోకేశ్ కృషి మరవలేనిది: గూగుల్ క్లౌడ్ సీఈవో కురియన్

