డెయిరీ రంగంలో విశేష సేవలు - నారా భువనేశ్వరికి 'ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు'
భువనేశ్వరికి ఔట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు -2025 - సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్ -2026 ప్రారంభ సభలో ప్రదానం- భువనేశ్వరి తరఫున స్వీకరించిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఈవో కేశవన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 11:05 AM IST
Nara Bhuvaneshwari Receives Outstanding Dairy Professional Award 2025: డెయిరీ రంగ అభివద్ధిలో దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ఔట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు -2025 లభించింది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్‌కు చెందిన సౌత్ జోన్ విభాగం ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని కేరళ కోజికోడ్‌లోని కలికట్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్ -2026 ప్రారంభ సభలో ప్రదానం చేశారు. భువనేశ్వరి తరఫున హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఈవో కేశవన్ ఈ అవార్డు స్వీకరించారు. కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి జె. చించు రాణి అవార్డును అందజేశారు.
హెరిటేజ్ ఫుడ్స్ స్థిరమైన డెయిరీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి రైతు వ్యవస్థలను బలోపేతం చేస్తూ నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ పరిశ్రమలో విశిష్ఠ స్థానాన్ని సంపాదించిందని జ్యూరీ ప్రశంసించింది. ఔట్ స్డాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు అందుకోవడం అపారమైన గౌరవంగా భావిస్తున్నట్లు భవనేశ్వరి తెలిపారు. హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన నిరంతర కృషికి రైతులు, ఇతర భాగస్వాములతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన గుర్తింపుగా అభివర్ణించారు. వివిధ సేవలు అందిస్తున్నందుకు ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025తో సత్కరించింది.
Proud doesn’t even begin to cover it. ❤️
— Lokesh Nara (@naralokesh) January 10, 2026
Congratulations Amma on being conferred the Outstanding Dairy Professional Award by the Indian Dairy Association, South Zone. Your lifelong dedication to empowering dairy farmers and strengthening India’s dairy ecosystem continues to… https://t.co/XmO0Fauckd
భువనేశ్వరి చూస్తే గర్వంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ గౌరవం ఏపీలోని వేలాది పాల రైతుల కృషికి దక్కిన గుర్తింపు అని కొనియాడారు. అమ్మ భువనేశ్వరి విజయం చూస్తే గర్వం అనే మాట కూడా ఆనందాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేకపోతున్నానని మంత్రి లోకేశ్ తెలిపారు. గౌరవం, దూరదృష్టి, అంకిత భావం ఈ మూడు లక్షణాలు భువనేశ్వరిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని బ్రహ్మణి తెలిపారు.
సంకల్పానికి మరింత ప్రోత్సాహం: ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025 అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన కృషికి, రైతులు, ఇతర భాగస్వాములతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన గుర్తింపు అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలనే మా సంకల్పానికి ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని అని తెలిపారు. సమావేశంలో తమిళనాడు పాల, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి మనోతంగరాజ్, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
- నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక ‘ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025’ రావడం పై ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ గౌరవం వెనుక ఏపీలోని వేల మంది పాడి రైతుల కృషి ఉందని అన్నారు.
- ‘‘అమ్మ విజయం చూస్తే గర్వం అనే మాట కూడా నా ఆనందాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేకపోతోంది. పాడి రైతుల సాధికారతకు, డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఆమె చేస్తున్న కృషి ప్రేరణాత్మకం. అది రోజూ నాలో స్ఫూర్తి నింపుతుంది’’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
- అత్తయ్యకు అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని చూడటం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించిందంటూ నారా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలిపారు.
విజన్ ఉంటేనే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు
అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా సరసన నారా భువనేశ్వరి - ప్రజాసేవ రంగంలో కృషికి గుర్తింపు

