ETV Bharat / state

రామోజీ ఫిలిం సిటీలో "సారేగా హాహాహా" - మ్యూజికల్, కామెడీ నైట్ షో!

జూన్ 13న ఉర్రూతలూగించే వేడుక - రామోజీ ఫిలిం సిటీలో పచ్చని ప్రకృతి ఒడిలో మ్యూజికల్ కామెడీ నైట్ షో - ప్రారంభమైన బుకింగ్స్

Musical Comedy Night Show
Musical Comedy Night Show (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2026 at 5:03 PM IST

2 Min Read
Choose ETV Bharat

Musical Comedy Night Show : మలి సంధ్య వేళ, శరీరాన్ని తాకే చల్లని పిల్లగాలులు, పచ్చని ప్రకృతి ఒడిలో మ్యూజికల్ కామెడీ నైట్ షో నిర్వహణకు 'రామోజీ ఫిలిం సిటీ' సన్నద్ధమైంది. వినసొంపైన గాత్రం, ఉర్రూతలూగించే సంగీతానికి తోడు నవ్వులు పూయించే 'కామెడీ షో' మీకు మరచిపోలేని, మధురస్మృతులు అందించనుంది. ప్రముఖ సినీ, నేపథ్య గాయకులు గీతా మాధురి, హేమచంద్ర స్టెప్పులు వేయించనున్నారు. ప్రఖ్యాత స్టాండప్ కమెడియన్స్ డాక్టర్ సంకేత్ భోంస్లే, హృదయ్ రంజన్ మీ మోములో నవ్వులు పూయించడానికి సిద్ధంగా ఉన్నారు.

మరపురాని అనుభూతి : 'రామోజీ నైట్ సిరీస్'​లో భాగంగా ఈ రెండో ఎపిసోడ్ 'సారేగా హాహాహా లైవ్' జూన్ 13న జరగనుంది. సినీ గాయకులు హేమచంద్ర, గీతా మాధురి తమ స్వరాలతో అలరించనున్నారు. మరోవైపు ప్రముఖ హాస్యనటులు డాక్టర్ సంకేత్ భోసలే, హృదయ రంజన్ నవ్వులతో ముంచెత్తనున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం మధురమైన సంగీతం, హాస్యాన్ని ఆస్వాదించే వారికి ఉత్తమమైన అనుభూతిని అందిస్తుందని, చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి "ఈటీవీ భారత్" డిజిటల్ న్యూస్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

ఇవి గుర్తుంచుకోండి!

  • తేదీ : జూన్ 13
  • సమయం : రాత్రి 7 గంటల నుంచి
  • వ్యవధి : 3.30 గంటలు
  • వేదిక : లైమ్​లైట్ గార్డెన్, రామోజీ ఫిలిం సిటీ
  • టిక్కెట్ ధరలు : రూ.1,999 నుంచి 6,999 వరకు
  • గమనిక : జూన్ 5లోగా బుక్ చేసుకున్న వారికి "ఎర్లీ హాహాహా ఆఫర్" ద్వారా టిక్కెట్​ ధరల్లో 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఎలా వెళ్లాలి! : మ్యూజికల్ కామెడీ నైట్ షో 'సారేగా హాహాహా లైవ్'లో పాల్గొనాలనుకునే వారు ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా సీట్లు ఎంచుకోవచ్చు. ఈ మేరకు టిక్కెట్లు వివిధ ధరల్లో అందుబాటులో ఉంటాయి. చేరుకోవాల్సిన సమయం, మార్గం, వేదిక సహా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు రామోజీ ఫిల్మ్ సిటీ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి. ఈవెంట్ వివరాలు, బుకింగ్​ కోసం 76598 76598 నంబర్​లో సంప్రదించవచ్చు. లేదా https://events.ramojifilmcity.com/events/sarega-hahaha-live లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

రామోజీ ఫిల్మ్ సిటీ హాలీవుడ్‌ సినిమాలను గుర్తుచేసేలా గేమ్‌- సరికొత్త హంగులతో రూపకల్పన

"ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి స్టూడియో లేదు" - రామోజీ ఫిల్మ్‌సిటీపై జపాన్ బృందం ప్రశంసలు