ETV Bharat / state

తిరుమలలో సెలబ్రిటీల సందడి - స్వామిని దర్శించుకున్న పలువురు నటీనటులు

ఐఐటీ తిరుపతిలో డెకాయిట్ రూబరు సాంగ్ రిలీజ్ - అనంతరం స్వామిని దర్శించుకున్న మృణాల్, అడవి శేష్​ - శ్రీవారి సేవలో పాల్గొన్న సినీనటులు అనన్య, అర్చన అయ్యర్

Celebrities In Tirupati Temple
Celebrities In Tirupati Temple (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 28, 2026 at 7:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

Celebrities In Tirupati Tirumala Temple : తిరుమల శ్రీవారిని డెకాయిట్‌ చిత్ర బృందం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్ మిగతా సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్​లు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు.

శ్రీవారి ప్రసాదాల నాణ్యత, రుచిపై అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్​లు హర్షం వ్యక్తం చేశారు. మొదటిసారిగా స్వామివారి దర్శనానికి వచ్చానని సినీనటి మృణాల్ ఠాకూర్ అన్నారు. డెకాయిట్‌ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందాలని ప్రార్థించానని మృణాల్ తెలిపారు. తిరుపతిలోని ఐఐటీ కళాశాలలో రుబారూ పాట విడుదలకు వచ్చానన్న నటుడు అడివి శేష్ ఇంత దూరం వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకోకుండా వెళ్లబుద్ధి కాలేదన్నారు. ప్రసాదాలు రుచి చాలా బాగున్నాయని, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా అడివి శేష్‌, మృణాల్‌ జంటగా నటించిన 'డెకాయిట్‌' ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తిరుమలలో సెలబ్రిటీల సందడి (ETV)

"దర్శనం చాలా బాగా జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. కన్నీళ్లు వచ్చాయి. ఐఐటి తిరుపతిలో డెకాయిట్ సినిమాలోని రూబరూ సాంగ్ లాంచ్​ చేయడం కోసం వచ్చాం. ఇక్కడికి వచ్చాక స్వామి దర్శనం అవ్వాలి కదా. అది కాకుండా వెళ్లబుద్దికాలేదు. ఇపుడు సంతృప్తిగా ఉంది. ప్రసాదం కూడా చాలా బాగుంది. రుచికరంగా ఉంది. టీటీడీకి, అందరికి చాలా థ్యాంక్స్." - అడవి శేష్, నటుడు

అనన్య నాగళ్ల, అర్చన అయ్యర్​లు కూడా స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన అనన్య నాగళ్ల, అర్చన అయ్యర్​లు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు.

భారిగా తరలివచ్చిన భక్తులు : తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండుకున్నాయి. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి, కృష్ణతేజ క్యూలైన్ వరకు భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనం కోసం తరలివచ్చారు. తిరుమల శ్రీవారిని 67,952 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు. శ్రీవారికి తలనీలాలు 27,414 మంది భక్తులు సమర్పించారు.

తిరుపతిలో 'అనగనగా ఒక రాజు' సినిమా బృందం సందడి

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం - ఏకసభ్య కమిటీని నియమించిన ప్రభుత్వం