ETV Bharat / state

ప్రియురాలిని హత్య చేసి - మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి : పెళ్లి చేసుకోవాలన్నందుకు ప్రియుడి ఘాతుకం

బాలాపూర్ పరిధి బిస్మిల్లా కాలనీలో దారుణం - రెహానా అనే యువతిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు మహ్మద్‌ సలామ్‌ - పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే ఘాతుకం

Mohammed Salam Murdered his GirlFriend Rehana
Mohammed Salam Murdered his GirlFriend Rehana (Getty Image)
author img

By ETV Bharat Telangana Team

Published : August 17, 2026 at 7:53 AM IST

|

Updated : August 17, 2026 at 10:16 AM IST

2 Min Read
Choose ETV Bharat

Lover Murdered his Girlfriend : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. బిస్మిల్లా కాలనీలో రెహానా అనే యువతి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ప్రేమించిన మహ్మద్ సలామ్ హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు స్పష్టం చేశారు.

పోలీసులు అదుపులో ముగ్గురు : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రెహానా పర్వీన్‌(20), మహ్మద్ సలామ్(21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని రెహానా, సలామ్​పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి పరారయ్యేందుకు సలామ్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలో సలామ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా పాల్గొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరో ఇద్దరి పాత్రపై పోలీసులు విచారణ : మృతురాలు, నిందితుడు ఇద్దరూ బిహార్ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. రెహానా ఓ ఫంక్షన్ హాల్‌లో పని చేస్తున్నట్లు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్యపై కేసు నమోదు చేసిన బాలాపూర్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, మరో ఇద్దరి పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

ప్రియురాలిని హత్య చేసి - మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి : పెళ్లి చేసుకోవాలన్నందుకు ప్రియుడి ఘాతుకం (ETV Bharat)

"ఉదయం 5 గంటలకు డయల్​ 100కు సమాచారం అందింది. సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోనె సంచిలో యువతి మృతదేహాన్ని కుక్కి బెడ్‌రూమ్‌లో పెట్టి నిందితుడు పారిపోయాడు. సలామ్ (21), రెహానా పర్వీన్‌(20) పని కోసం బిహార్ నుంచి ఇక్కడకు వచ్చారు. ఇద్దరు ఫంక్షన్‌హాల్‌లో పని చేస్తున్నారు. సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని రెహానా ఒత్తిడి చేసింది. దీంతో సలామ్‌ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ హత్యలో తల్లిదండ్రుల పాత్ర ఉందో లేదో విచారణ చేసి చెప్తాం" - ప్రదీప్ రెడ్డి, ఏసీపీ

కూరలో గడ్డి మందు కలిపి భర్తను చంపేందుకు యత్నించిన భార్య - ఎందుకంటే?

Last Updated : August 17, 2026 at 10:16 AM IST