ETV Bharat / state

డిసెంబర్ చివరి నాటికి క్వాంటం బిల్డింగ్‌ పనులు పూర్తి: మంత్రి నారాయణ

డిసెంబర్‌ నాటికి క్వాంటం కంప్యూటింగ్‌ భవన నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్న మంత్రి నారాయణ - క్వాటం భవనాల పక్కనే 37 లక్షల చదరపు అడుగుల స్థలంలో మరో 2 బిల్డింగ్స్​కి టెండర్లు

48 అంతస్తులతో అమరావతిలో మరో 2 భవనాలు
48 అంతస్తులతో అమరావతిలో మరో 2 భవనాలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 25, 2026 at 1:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

Minister Narayana Visit Amaravati: మంత్రి నారాయణ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన రాజధాని అమరావతిలో జరుగుతున్న క్వాంటం కంప్యూటింగ్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరిలో రాజధానిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి నాలెడ్జ్ హబ్‌గా తయారు అవుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ చివరి నాటికి క్వాంటం బిల్డింగ్‌ సిద్ధమవుతుందన్నారు. హైదరాబాద్‌లో టీ హబ్‌లా అమరావతిలో క్వాంటం ఉండబోతుందని వెల్లడించారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో దూసుకువెళ్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు.

జనవరిలో రాజధానిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు: మంత్రి నారాయణ (ETV Bharat)

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి క్వాంటం కంప్యూటింగ్‌ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్దేశించిన సమయానికే లక్ష్యాన్ని చేరుకుంటాం. అలాగే హైదరాబాద్‌ సైబర్‌ టవర్స్‌ తరహాలో క్వాంటం కంప్యూటింగ్‌ భవనం పక్కనే నిర్మిస్తున్న మరో రెండు భవనాల నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.' -నారాయణ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

మరో రెండు టవర్లు: కొన్ని ప్రత్యేకతలతో క్వాంటం వ్యాలీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబర్​ చివరి నాటికి ఈ భవన నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వివరించారు. ఈ క్రమంలో పనులన్నీ వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. చాలా వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్లంబర్​ వర్స్క్​ ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.

దేశంలోనే నంబర్​ వన్​గా ఏపీ: క్వాటం భవనాల పక్కనే 37 లక్షల చదరపు అడుగుల స్థలంలో మరో 2 బిల్డింగ్స్​కి టెండర్లు కూడా పిలిచినట్లు తెలిపారు. ఇవి ఒక్కొక్కటి 48 అంతస్తులతో, 202 మీ పొడవుతో నిర్మించనున్నట్లు తెలిపారు. మరో 2, 3 నెలల్లో ఈ పనులు కూడా పూర్తవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. హైదరాబాద్​లోని నిర్మాణాల వలే ఇవి ఉండనున్నాయన్నారు. ఈ ప్రత్యేకమైన నిర్మాణాలతో దేశంలోనే నంబర్​ వన్​గా ఆంధ్రప్రదేశ్​ నిలవనుందని మంత్రి నారాయణ అన్నారు.

ఇదిలా ఉండగా మరోవైపు రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'ఫెర్రిస్ వీల్'ను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు దీనికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) తాజాగా మళ్లీ టెండర్లను ఆహ్వానించింది.

అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్ వీల్ - 'అమరావతి ఐ' కోసం మళ్లీ టెండర్లు

శరవేగంగా రాజధాని అమరావతి పనులు - ప్రతి నెలా ఒక్కో టవర్ నిర్మాణం పూర్తి: మంత్రి నారాయణ