ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - కొత్తగా ల్యాండ్‌పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు రుణమాఫీ
కొత్తగా పూలింగ్ జరిగే గ్రామాల రైతుల కుటుంబాలకు రుణమాఫీకి నిర్ణయం - 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి కౌలు రూ.40 వేలు ఇచ్చేందుకు ఆమోదం -సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 7, 2026 at 8:20 PM IST
CRDA 63rd Authority Meeting Decisions : సీఆర్డీఏ 63వ అధారిటీ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతి కోసం 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్‌కి భూములిచ్చే రైతులకు కౌలు రూ.40 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూములిచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు ఇది అమలో ఉంటుంది. ప్రతి ఏటా జరీబు భూమికి ఎకరాకు రూ.5000, మెట్ట భూమికి ఎకరాకు రూ.3000 పెంచేందుకు ప్రభుత్వం ఆమోదించింది.
అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, గ్రామ కంఠాల్లో భూములు కోల్పోతున్న వారికి ఏడాదికి రూ.10,000 ఇచ్చేందుకు ఆమోదించమని తెలిపారు. కొత్తగా పూలింగ్ జరుగుతున్న గ్రామాల్లో భూములిచ్చే రైతుల కుటుంబాలకి రుణ మాఫీ చేసేందుకు అథారిటీ నిర్ణయించిన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సంవత్సరం జనవరి 6వ తేదీ లోపు లోన్ తీసుకున్న వారికి అమలు చేసేలా నిర్ణయించామని వెల్లడించారు.
అమరావతిలోని 25 టౌన్ షిప్‌లలో : అదేవిధంగా ఇనామ్ భూములకొరకు దేవాదాయ శాఖకు రూ.159 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపిన్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. అమరావతిలోని 25 టౌన్ షిప్‌లలో ఒక్కో టౌన్ షిప్లో తప్పనిసరిగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండేలా చూడాలని సీఎం చెప్పారని నారాయణ వెల్లడించారు. ఈ రాత్రిలోగా ల్యాండ్ పూలింగ్‌కు భూములివ్వని వారికి రేపు(బుధవారం) భూసేకరణ అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 2.5 ఎకరాలకు అమలు చేస్తామని వివరించారు.
" 2024 జూన్ నుంచి భూములిచ్చే వారికి కౌలు రూ.40 వేలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపాం. భూములు ఇచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. జరీబు భూమికి రూ.5 వేలు, మెట్ట భూమికి రూ.3 వేలు పెంచేందుకు ఆమోదం. ఎక్కడైతే ట్రంక్ రోడ్లు, గ్రామాలపై పోతుందో అక్కడ లే అవుట్ వేసి ఎంత భూమి పోతుందో దానికి సమాంతరంగా ఇచ్చే విధంగా నిర్ణయించాం. అలాగే భూములిచ్చే రైతుల కుటుంబాలకి రుణ మాఫీ చేయాలని నిర్ణయించాం. ఈ సంవత్సరం జనవరి 6వ తేదీ లోపు లోన్ తీసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. రాత్రిలోగా భూములివ్వని వారికి రేపు భూసేకరణ అమలు చేస్తాం. ఇప్పటికే ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ 2.5 ఎకరాలకు అమలు చేశాం." - నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన 63వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండో దశ పూలింగ్‌లో భూములిచ్చిన రైతుల గురించి చర్చించారు. రైతులకు యాన్యుటీ, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు, మంత్రుల కమిటీ సిఫారసు మేరకు వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించారు.
భూసమీకరణ రైతులకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ - పారదర్శకంగా కౌలు చెల్లింపు ప్రక్రియ
రాజధాని గ్రామాలకు పైపులైన్ల ద్వారా గ్యాస్ - గుత్తేదారులపై సీఆర్డీఏ కమిషనర్ సీరియస్

