ETV Bharat / state

తమిళనాడులోని యోగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న లోకేశ్‌

తమిళనాడులోని ప్రసిద్ధ యోగ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కేశ్‌ - కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, కే.మురళీ మోహన్ తదితరులు

Lokesh_visit_temples_in_Tamil_Nadu
Lokesh_visit_temples_in_Tamil_Nadu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2026 at 5:43 PM IST

1 Min Read
Choose ETV Bharat

Minister Lokesh visit Prominent Temples in Tamil Nadu: మంత్రి నారా లోకేశ్ తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ ఉదయం షోలింగర్‌కు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం కొండపై ఉన్న యోగ నరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి మంత్రి లోకేశ్ రోప్‌వే మార్గాన్ని ఎంచుకున్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు మంత్రి లోకేశ్‌కు వేదాశీర్వచనం చేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తమిళనాడులోని యోగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న లోకేశ్‌ (ETV Bharat)

కాలి నడకన 420 మెట్లు ఎక్కి దర్శనం: యోగ నరసింహస్వామి ఆలయ దర్శనం ముగిసిన తర్వాత, దానికి సమీపంలోనే మరో కొండపై కొలువై ఉన్న శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా మంత్రి సందర్శించారు. ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి ఆయన కాలి నడకన 420 మెట్లు ఎక్కి కొండపైకి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు సమర్పించారు.

దర్శనాలు ముగించుకుని తిరిగి వస్తున్న మార్గమధ్యలో మంత్రి లోకేశ్ అక్కడకు వచ్చిన భక్తులను ఆప్యాయంగా పలకరించారు. వారితో కాసేపు ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, డాక్టర్ కె. మురళీ మోహన్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులు, స్థానిక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళలకు 33 శాతం సీట్లు - లోకేశ్ ప్రతిపాదనపై మహిళా నేతల హర్షం

దేశానికే ఆదర్శంగా 'ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్‌' - సరికొత్త యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేసిన మంత్రి లోకేశ్