ETV Bharat / state

వర్సిటీల్లో 3,371 పోస్టులు ఖాళీ - 3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ: మంత్రి లోకేశ్

పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్లపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్ - 2019-24 మధ్య విద్యాశాఖలో తీవ్ర విధ్వంసం జరిగిందని, 10 లక్షల మంది విద్యార్థులు బడులకు దూరమయ్యారని వెల్లడి

Lokesh_on_Education_Department
Lokesh_on_Education_Department (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 6:20 PM IST

2 Min Read
Choose ETV Bharat

Minister Lokesh Speech About Education Department: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అలానే ఆంధ్రా మోడల్ ఆప్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి చూపిస్తామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ రూ.32,308 కోట్లు, ఉన్నత విద్యాశాఖ రూ.2,566 కోట్ల బడ్జెట్ డిమాండ్లపై మంత్రి అసెంబ్లీలో మాట్లాడారు. 2019-24 మధ్య విద్యాశాఖలో తీవ్ర విధ్వంసం జరిగిందని, 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని మండిపడ్డారు. అన్ని సబ్జెక్టుల్లోనూ విద్యార్థుల్లో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని, అక్షరాస్యత విషయంలో ఏపీని అట్టడుగు స్థానానికి చేర్చారని దుయ్యబట్టారు.

ఐబీ, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్ పేరుతో ప్రకటనలు, ప్రచారం తప్ప ఒక్క పనీ సరిగా చేయలేదని మంత్రి లోకేశ్ అన్నారు. నాడు-నేడు పేరుతో ప్రచార అర్భాటం తప్ప పనులు జరగలేదని విమర్శించారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1200 కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఏపీలో 100 శాతం అక్షరాస్యత సాధించేలా ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. విద్యార్థులను యాక్టివ్ లెర్నర్లుగా మార్చేందుకు క్లిక్కర్ టెక్నాలజీ తెచ్చామని 300కు పైగా పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టును త్వరలో రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు. లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ కిట్లు, చిక్కీలు, గుడ్ల సరఫరాలో అవినీతి నివారించి రూ.1000 కోట్లు ఆదా చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ చెప్పారు.

వర్సిటీల్లో 3,371 పోస్టులు ఖాళీ - 3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ: మంత్రి లోకేశ్ (ETV Bharat)

జీతభత్యాలు, సౌకర్యాలు ఏమీ లేకుండా నైతిక విలువలు పెంచటం బాధ్యతగా తీసుకున్న చాగంటి కోటేశ్వరరావుని సభాముఖంగా అభినందించారు. మా సొంత పిల్లలకు ఏం చేస్తామో అందరు పిల్లలకు అలాంటి సౌకర్యాలు ఉండాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో యూనివర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చటం, తమ బంధువుల్ని వీసీలుగా రిజిస్ట్రార్లుగా నియమించటం ద్వారా ఉన్నత విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. తన కుమారుడు దేవాన్ష్​ను బ్రాహ్మణి ఫోన్​కు దూరంగా ఉంచి పుస్తకాలు చదవటం అలవాటు చేసిందని అన్నారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు కోసం శోభా రియాల్టీ వారు రూ.100 కోట్లు సీఎస్సార్ నిధులు సెంట్రల్ లైబ్రరికి ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, సుందరపు విజయ్ కుమార్ విద్యారంగంపై మాట్లాడారు.

3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఉన్నత న్యాయస్థానంలో పెండింగ్​లో ఉన్న కేసులను పరిష్కరించి 3 నెలల్లో అవసరమున్న ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల సంఖ్య, ఆయా ఖాళీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని మండలిలో సభ్యుడు బొర్రా గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఖాళీల భర్తీకి 2018, 2023లో నోటిఫికేషన్ ఇచ్చారని వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పాటించకపోవడంతో 2023 నోటిఫికేషన్​ను కోర్టు తప్పుబట్టినందున సదరు ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. ఇప్పటికే మేం ఏఏజీతో 3 సార్లు సమావేశమై పూర్తిస్థాయిలో చర్చించామని నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని మేం నిర్ణయం తీసుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.

ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి లోకేశ్

అలా అయితే ఫైనల్స్​కు​ వెళ్తా - వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేను తీసుకెళ్తా: మంత్రి లోకేశ్