ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాల్లో 99.3 శాతం మంది ఉత్తీర్ణత - అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి లోకేశ్ అభినందనలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 26, 2026 at 12:25 PM IST
AP EDCET 2026 Results: ఏపీలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. 19,880 మంది పరీక్షకు హాజరుకాగా 19,741 మంది (99.3 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 99.30శాతం మంది అద్భుతమైన ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారని మంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయ వృత్తి వైపు తదుపరి అడుగు వేస్తూ అర్హత సాధించిన వారికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డ్‌ల కోసం cets.apsche.ap.gov.in/EDCET లో, వాట్సాప్‌లో 9552300009 పొందవచ్చని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
పాఠాలు చెప్పాలనుకుంటే ఇదే బెస్ట్: పాఠశాల స్థాయిలో పిల్లలకు పాఠాలు చెప్పాలనుకునే వారికి బీఎడ్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. బీఎడ్ తర్వాత టెట్, డీఎస్సీ రాసి ప్రభుత్వ ఉపాధ్యాయ (గవర్నమెంట్ టీచర్) ఉద్యోగం సాధించవచ్చు. టీచర్ ఉద్యోగానికి జాబ్ సెక్యూరిటీ, స్థిరమైన ఆదాయం, సమాజంలో మంచి గౌరవం ఉంటాయి. అందుకే చాలామంది అటు వైపు మొగ్గు చూపుతారు. ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ స్కూళ్లలో సైన్స్ టీచర్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.
Pleased to announce the official release of the APEDCET-2026 results. This year, an exceptional 19,741 students have successfully qualified out of the 19,880 who appeared, securing an outstanding overall pass percentage of 99.30%. Hearty congratulations to all the qualified…
— Lokesh Nara (@naralokesh) May 26, 2026
బీఎస్సీ తర్వాత ఏ కోర్సు బెస్ట్? - ఎమ్మెస్సీ చేయాలా, బీఈడీ వైపు వెళ్లాలా?
"ఫొటోగ్రఫీ" ఇష్టమా? - ఏ కోర్సులు చదవాలి? ఏయే విషయాలు నేర్చుకోవాలి?

