బిల్‌గేట్స్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు - ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాలపై ప్రధానంగా చర్చ
బిల్ గేట్స్‌తో భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎంలు - గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై సాగిన చర్చలు, ప్రత్యేకంగా సంజీవని ప్రాజెక్టు ఫలితాలను వివరించిన చంద్రబాబు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 9:49 AM IST
CM Chandrababu Meet Bill Gates: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో ఘన స్వాగతం పలికారు. ఇరువురూ తమకున్న సాన్నిహిత్యాన్ని ఒకసారి నెమరువేసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు సైతం స్వాగతం పలికారు.
బిల్‌గేట్స్‌తో భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎంలు : అమరావతి సచివాలయానికి గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌తో భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై ప్రధానంగా చర్చ సాగింది. అనంతరం బిల్ గేట్స్ ఆర్టీజీఎస్‌కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలించారు. ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించారు.
చర్చలు కొనసాగుతున్నాయన్న మంత్రి లోకేశ్: గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌తో సచివాలయంలో చర్చలు సాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వెల్లడించారు. ప్రధానంగా ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల బలోపేతం చేసే అంశాలపై చర్చ సాగుతున్నట్లు మంత్రి అన్నారు. సాంకేతిక ఆధారిత పరిపాలన రంగంలో భాగస్వామ్యాల బలోపేతంపై చర్చ సాగుతున్నట్లుగా పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలకు స్థిరమైన, విస్తృత ప్రభావం కలిగించే పరిష్కారాలను అందించేందుకు సహకారంపై సైతం లోతైన చర్చలు జరుగుతున్నట్లు లోకేశ్ తెలియజేశారు. గేట్స్ ఫౌండేషన్‌తో సన్నిహితంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోందని కొనియాడారు. బిల్ గేట్స్‌కు అమరావతి స్వాగతం పలుకుతోందని మంత్రి నారా లోకేశ్ ఆనందం వ్యక్తం చేశారు.
Welcome to #Amaravati, Mr. Bill Gates.
— Lokesh Nara (@naralokesh) February 16, 2026
It was a pleasure to receive the Chair of the Gates Foundation at Gannavaram Airport today, along with my colleagues Home Minister Smt. Anitha Garu, Agriculture Minister Sri Atchannaidu Garu & Health Minister Sri Satya Kumar Garu. We have… pic.twitter.com/JzAWdCjhtF
బిల్ గేట్స్‌కు విజయవాడలోని విమానాశ్రయం వద్ద నారా లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అంతకంటే ముందు బిల్ గేట్స్‌కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయం వద్ద మంత్రి లోకేశ్ విమానాశ్రయం లాంజ్‌లో కొద్దిసేపు వేచివున్నారు. పొగ మంచు వల్ల బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. బిల్ గేట్స్‌తో కలిసి మంత్రి లోకేశ్ సచివాలయం బయలుదేరారు.
బిల్ గేట్స్ అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. లోకేశ్‌తో పాటు మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ తదితరులు విమానాశ్రయం వద్ద బిల్ గేట్స్‌కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అమరావతిలో ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రానికి బిల్ గేట్స్ వెళ్లనున్నారు.
సచివాలయానికి చేరుకున్న సీఎం: సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు బిల్ గేట్స్‌కు స్వాగతం పలికారు. అప్పటికే సచివాలయానికి మంత్రులు చేరుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అదే విధంగా ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య సహా తదితర రంగాల్లో సంస్కరణలపై ప్రజెంటేషన్ ఉంటుంది. అంతేకాకుండా మెడ్‌టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సంజీవని ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు సవివరంగా వివరించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టును ప్రభుత్వం బిల్‌గేట్స్‌కు వివరించనుంది. వ్యవసాయంలో డ్రోన్లు, ఏఐతో చేపట్టే సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు.
సీఎం, డిప్యూటీ సీఎంలతో భేటీ: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌తో బిల్‌గేట్స్ భేటీ కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీజీఎస్‌కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని బిల్‌గేట్స్ పరిశీలించనున్నారు. అంతేకాకుండా ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు.
Welcome back, Mr @BillGates!#APWelcomeBillGates pic.twitter.com/jt7sln8ue4
— N Chandrababu Naidu (@ncbn) February 16, 2026
బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికిన సీఎం: బిల్ గేట్స్‌కు మంత్రి నారా లోకేశ్ మంగళగిరి శాలువా కప్పి అమరావతికి సాదర స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా పెడన కళంకారీ వస్తువులను కలెక్టర్ బాలాజీ బహుమతిగా ఇచ్చారు. చేతి వృత్తితో ప్రత్యేకంగా తయారు చేసిన గోధుమ గడ్డి బాక్స్‌లో కలంకారీ వస్తువులను బహుకరించారు. సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు స్వాగతం పలికారు. మంత్రులు ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్‌లతో గేట్స్ సమావేశం కానున్నారు.
16న బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారు - 3సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: సీఎం చంద్రబాబు
ఈనెల 16న రాష్ట్రానికి బిల్ గేట్స్ - సీఎం చంద్రబాబుతో కీలక భేటీ!

