హెరిటేజ్-వీఎస్ఆర్ ఏవియేషన్‌కు సంబంధం లేదు: లోకేశ్
అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియా ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ చిట్‌చాట్ - బాబాయ్‌ను చంపి కత్తి మా చేతిలో పెట్టారని ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్‌పై వైఎస్సార్సీపీ ఆరోపణలు కూడా అలాంటివేనని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 3:52 PM IST
Minister Lokesh Chit Chat with media in Assembly Chamber: బాబాయిని చంపేసి తమ చేతిలో కత్తి పెట్టినట్లే వీఎస్ఆర్ ఏవియేషన్ విషయంలో వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివేనని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి లోకేశ్ వైఎస్సార్సీపీ ఆరోపణలపై మాట్లాడారు. హెరిటేజ్‌కు వీఎస్ఆర్ ఏవియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫిన్ లీస్ అనేది 1996లో స్థాపించిన సంస్థ అని గుర్తుచేశారు. అనేక ఇతర సంస్థల మాదిరిగానే 2022లో వీఎస్ఆర్ ఏవియేషన్, హెరిటేజ్ ఫిన్ లీస్ వద్ద ఫైనాన్స్ తీసుకుందని లోకేశ్ వెల్లడించారు.
ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని, తమ ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, అజిత్ పవార్ వీఎస్ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది యాక్సిడెంట్ కు గురి అవుతుందని కలగన్నామా అని లోకేశ్ ప్రశ్నించారు. తాము ఏమన్నా జ్యోతిష్యులమా అని నిలదీశారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకి తాను ఎందుకు సమాధానం చెప్పాలని అన్నారు. క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం చెబుతామని లోకేశ్ తేల్చిచెప్పారు. వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు తమకు అందిస్తానని మీడియాతో అన్నారు. చిల్లర దొంగలను పట్టుకొని గజ దొంగలను వదిలేస్తున్నారా అని బొత్స చేసిన వ్యాఖ్యలపై జగన్ గజ దొంగ అని బొత్స చెబుతున్నారా అని, జగన్‌ను పట్టుకోమని బొత్స చెబుతున్నారంటూ లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.
మాపై 6కు పైగా కేసులు పెట్టారు: సిట్ విచారణలో తేలింది అంతా అదే కదా అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. తమ మీద 6కు పైగా ఫైబర్‌నెట్, స్కిల్, ఇన్నర్ రింగ్ రోడ్, లిక్కర్, ఇసుక, అసైన్మెంట్ భూములపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. చార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలని, మంత్రులకు అయితే గవర్నర్, ఎమ్మెల్యేలు అయితే స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని లోకేశ్ తెలిపారు. గవర్నర్‌కు ఆధారాలు ఎందుకు చూపలేదని నిలదీశారు. ఒక్క ఆధారమైన చూపారా వాళ్లు పెట్టినవన్నీ తప్పుడు కేసులని మంత్రి మండిపడ్డారు.
ఎమ్మెల్యేలకు ఒక యూనివర్సిటీ పెట్టామని, రెసిడెన్షియల్ క్లాసులు పెడతామని మంత్రి లోకేశ్ చెప్పారు. 2 రోజులు పాటు వారు అంతా పార్టీ కార్యాలయంలోనే ఓరియెంటేషన్ క్లాస్‌లో ఉండాలన్న లోకేశ్ ఈ ఒరియేంటేషన్కి ప్రిన్సిపాల్ సీఎం చంద్రబాబు అని తాము అంతా విద్యార్థులమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగే మీటింగ్‌లు రాజకీయాలకు అతీతమని తెలిపారు. ఫ్యామిలీ కాన్సెప్ట్‌లోనే జరుగుతుందని, రాజకీయ ప్రస్తావన లేదని మంత్రి లోకేశ్ చెప్పారు.
ఏటా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి లోకేశ్
అలా అయితే ఫైనల్స్‌కు వెళ్తా - వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేను తీసుకెళ్తా: మంత్రి లోకేశ్

