ETV Bharat / state

మీకు మార్కులు రాకపోతే నా మార్కులు పోతాయి : లోకేశ్​

దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి లోకేశ్​ -పాఠశాలలో మౌలిక సదుపాయాల పరిశీలన - విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా

Lokesh On Government School Facilities And Student Study
Lokesh On Government School Facilities And Student Study (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 16, 2026 at 8:55 AM IST

3 Min Read
Choose ETV Bharat

Minister Lokesh inspected the ZP High School at Dorasanipalli : "మీకు మంచి మార్కులు రాకపోతే నేను మార్కులు కోల్పోతాను. నా భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంది" అని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి లోకేశ్​ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రజా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు.

సౌకర్యాల గురించి లోకేశ్ ఆరా: కడప జిల్లా, ప్రొద్టుటూరు మండలం, దొరసానిపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంత్రి లోకేశ్​ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని ప్రాథమిక సౌకర్యాలను తనిఖీ చేసి, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరు గురించి ఆరా తీశారు. ముందుగా, మంత్రి పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ, వాటి నాణ్యత గురించి ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇరాన్-అమెరికా యుద్ధాన్ని ఎంతమంది చూస్తున్నారని ఆయన అడిగారు. చదువుతో పాటు శారీరక వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన విద్యార్థులకు వివరించారు.

విద్యార్థుల కోసం అవసరమైన పుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు, తల్లికి వందనం పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని లోకేశ్​ వివరించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులను ప్రశ్నించారు. తల్లిదండ్రులు ఐవీఆర్ఎస్ ద్వారా ఎందుకు అభిప్రాయం తెలియజేయడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి లోకేశ్​తో మధ్యాహ్న భోజనం బాగుందని చెప్పారు.

"ఈ రోజుల్లో ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు బాగా చదువుకుంటున్నారా? ఈసారి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నారా? బాగా చదవండి. మీకు మంచి మార్కులు రాకపోతే నేను మార్కులు కోల్పోతాను. నా భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంది. మీకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. దానికోసం మీరు శ్రద్ధగా చదువుకోవాలి. ప్రభుత్వం తరఫున మేము ఎప్పటికప్పుడు మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ గురించి సమాచారం తెలుసుకుంటాము"- మంత్రి లోకేశ్​

పాఠశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించిన లోకేశ్​: లెర్నింగ్ అవుట్‌కమ్స్‌లో పాఠశాల 1.3 స్టార్ రేటింగ్ పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.ధనలక్ష్మిని మంత్రి ప్రశ్నించారు. ఫార్మాటివ్, సమ్మెటివ్ అసెస్‌మెంట్‌పై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నారు. లెర్నింగ్ అవుట్‌కమ్స్‌పై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. పనితీరులో వెనుకబడిన పాఠశాలల పట్ల ఎంఈవోలు దృష్టిపెట్టాలని, 15 రోజులకోసారి సమీక్ష చేయాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉండటంపైనా మంత్రి ఆరా తీశారు. హాజరుపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా ఉపాధ్యాయులు గైర్హాజరయ్యే పరిస్థితిని నివారించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ గతేడాది కంటే తక్కువగా ఉండటంపై ఆరా తీశారు. 10 మంది విద్యార్థులు వసతిగృహాలకు, కేజీబీవీలకు తరలివెళ్లడం వల్ల ఎన్‌రోల్‌మెంట్ తగ్గిందని ప్రిన్సిపాల్ వివరించారు. గతేడాది కంటే అడకమిక్ ఫెర్ఫార్మెన్స్ మెరుగుపడటం పట్ల మంత్రి ప్రశంసించారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సర్కారు పనిచేస్తోందని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కావాలని లోకేశ్​ పేర్కొన్నారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యమని, అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యమని చెప్పారు. విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పై దృష్టిపెట్టాలని, బాలికలు డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. లెర్నింగ్ అవుట్‌కమ్స్‌లో వచ్చే ఏడాదికి 4 స్టార్ రేటింగ్ సాధిస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. స్కూల్‌ బయట జనం నుంచి వినతులు స్వీకరించారు.

బూడిద రంగులో ఉండే సిమెంట్ 'గ్రీన్' కాగలదా? - మంత్రి లోకేశ్​ ఆసక్తికర పోస్ట్​

పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలు తీసుకొస్తున్నాం: మంత్రి లోకేశ్​