ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులు 10 శాతం పెంపు - ప్రకటించిన ప్రభుత్వం
వైద్య విద్య కోర్సులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలో వసూలు చేయాల్సిన ఫీజులను ప్రకటించిన ప్రభుత్వం - సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 15 శాతం ఫీజు పెంపుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 29, 2026 at 8:19 PM IST
Medical Colleges Fee Structure Announced : రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలో వసూలు చేయాల్సిన ఫీజులను ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహణకు దీనితో మార్గం సుగమమైంది. గతేడాదితో పోలిస్తే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు 10 శాతం, పీజీ మెడికల్ కోర్సులకు 15 శాతం, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ ఆదేశాలిచ్చారు.
గతేడాది కంటె 10 శాతం : రాష్ట్రంలో వైద్య విద్య కోర్సులకు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజులను నిర్ణయించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు గతేడాది కంటే 10 శాతం, పీజీ కోర్సులకు, సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 15 శాతం ఫీజు పెంపుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువరించారు. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ఏ-కేటగిరికి రూ. 18,150, బీ-కేటగిరికి (మేనేజ్మెంట్ కోటా) రూ.14.52లక్షలు, సీ-కేటగిరి(ఎన్నారై కోటా) రూ.43.56 లక్షల ఫీజులను నిర్ణయించారు. బీడీఎస్ కన్వీనర్ కోటా ఏ-కేటగిరికి రూ.15,730, బీ-కేటగిరికి రూ.4.84లక్షలు, సీ-కేటగిరికి రూ. 14.52 లక్షలుగా నిర్ణయించారు.
మెడికల్ పీజీ కోర్సులకు : మెడికల్ పీజీ కోర్సులకు క్లినికల్ డిగ్రీ ఏ-కేటగిరికి రూ.5,71,320, బీ-కేటగిరికి రూ.11,42,640, సీ-కేటగిరికి రూ.66,12,500 పారాక్లినికల్ డిగ్రీ, డిప్లమా ఏ-కేటగిరికి రూ.1,78,538, బీ-కేటగిరికి రూ.3,57,075, సీ-కేటగిరికి రూ.19,83,750 ప్రీ క్లినికల్ డిగ్రీ ఏ-కేటగిరికి రూ.80,937, బీ-కేటగిరికి రూ. 1,61,874, సీ-కేటగిరికి రూ.10,58,000గా నిర్ణయించారు. డెంటల్ క్లినికల్ పీజీ డిగ్రీ ఏ-కేటగిరికి రూ. 3,92,783, బీ-కేటగిరికి రూ.7,85,565, సీ-కేటగిరికి రూ.15,87,000 కాగా, పారా క్లినికల్ డెంటల్ పీజీ ఎ-కేటగిరికి రూ.3,53,504, బీ-కేటగిరికి రూ.5,74,759, సీ-కేటగిరికి రూ.9,25,750 నిర్ణయించారు. సూపర్ స్పెషాలిటీ కోర్సులకు జీఎస్ఎల్, కస్తూరి, నారాయణ, ఎన్నారై, డాక్టర్ సిద్దార్థ మెడికల్ కళాశాలల్లో రూ. 19,83,750 ఫీజు ఉంటుందని ఉత్తర్వులలో తెలిపారు. ఈమేరకు మూడు వేర్వేరు జీవోలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్ విడుదల చేశారు.
కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇవాళ ప్రకటించిన తుది మెరిట్ జాబితాలో పేరున్న అభ్యర్థులందరూ వెబ్ఆప్షన్లు ఇవ్వడానికి అర్హులని వెల్లడించింది.
పిల్లల చదువుతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
తెలుగు నేర్చుకునేందుకు 'కూల్ఫాబెట్స్' యాప్ - రంజిత్ బృందానికి సీఎం శుభాకాంక్షలు

