హిందూపురంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ 132వ శాఖ - ప్రారంభించిన ఎండీ శైలజాకిరణ్
హిందూపురంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ 132వ శాఖను ప్రారంభించిన ఎండీ శైలజాకిరణ్ - హిందూపురంతో తమకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందన్న శైలజాకిరణ్ - చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉంటామని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 24, 2026 at 3:10 PM IST
Margadarsi Chit Funds 132nd Branch in Hindupur Of Sathya Sai District : ప్రజల ఆశీస్సులతో మార్గదర్శి మరో బ్రాంచ్‌ను ప్రారంభించింది. ఇప్పటికే 131 శాఖలు ప్రారంభించగా తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురంలో 132వ శాఖను (ఆంధ్రప్రదేశ్‌లో 41వ శాఖ) మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ ప్రారంభించారు. అనంతరం మొదటి చందాదారులకు రశీదులు అందించారు. సంస్థ ఉద్యోగులతోపాటు చందాదారులతో ఆమె ముచ్చటించారు.
ఈ సందర్భంగా శైలజా కిరణ్ మాట్లాడుతూ, హిందూపురంతో తమకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉందని తెలిపారు. హిందూపురంలో ఎన్నో పరిశ్రమలతో పాటు చింతపండు, మిరప చాలా ప్రసిద్ధి చెందాయని ఆమె గుర్తు చేశారు. ధర్మవరం పట్టుచీరలు, లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందాయన్నారు. హిందూపురంలో చిరు వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు మార్గదర్శి బ్రాంచ్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య హిందూపురం కీలక లాజిస్టిక్ హబ్‌గా మారిందని శైలజా కిరణ్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం హిందూపురాన్ని ఎలక్ట్రానిక్ సిటీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళుతోందన్నారు. ఇక్కడ చాలా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మార్గదర్శి చిట్‌ఫండ్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి కుటుంబం మార్గదర్శిలో పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
"ఇక్కడ 1.50 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఇక్కడి కాటన్, సిల్క్ వ్యాపారుల ద్వారా కళాంజలితో హిందూపురం, ధర్మవరం పట్టణాలతో అనుబంధం ఉంది. హిందూపురం లాజిస్టిక్స్ హబ్‌గా ఉంటుంది. ఇక్కడ ఎన్నో పరిశ్రమలతో పాటు చింతపండు, మిరప చాలా ప్రసిద్ధి చెందాయి. అలాగే ఈ పట్టణం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హిందూపురంను ఎలక్ట్రానిక్ సిటీగా చేయాలని నిర్ణయించింది. మార్గదర్శి కూడా మధ్యతరగతి కుటుంబాలతో 64 ఏళ్లుగా అనుబంధం ఉంది. అన్ని విషయాల్లో మార్గదర్శి తోడుగా ఉంటుంది. చదువు, పెళ్లిళ్లు, వ్యాపారాలు ఇలా దేనికోసమైనా మార్గదర్శిలో పొదుపు చేస్తూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. మార్గదర్శి, మా సిబ్బంది తరపున ఎల్లవేళలా సదా మీ సేవలో ఉంటాం." - సీహెచ్ శైలజా కిరణ్, ఎండీ
మార్గదర్శి ఒక ఆర్థిక వేదికగా నిలుస్తుంది : మార్గదర్శితో అనుబంధాన్ని ఈ సందర్భంగా ఖాతాదారులు గుర్తు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మార్గదర్శిలో చిట్స్ వేస్తున్నామని, ఇవి తమకు ఎంతో తోడ్పడ్డాయని, ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని ఖాతాదారులు తెలిపారు. పర్యాటక ప్రాంతం లేపాక్షితోపాటు పారిశ్రామిక వాడలు, టెక్స్‌టైల్స్ కంపెనీలు, ప్యాకింగ్ పరిశ్రమలు, వ్యవసాయ మార్కెట్లతో హిందూపురం వ్యాపార కేంద్రంగా మారిన విషయాన్ని స్థానిక చందాదారులు మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌కు వివరించారు. వ్యాపారాన్ని విస్తరించుకోవడం, అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం మార్గదర్శి సంస్థ ఒక ఆర్థిక వేదికగా నిలుస్తుందనడంలో సందేహం లేదని అశాభావం వ్యక్తం చేశారు. విశ్వసనీయతతో మార్గదర్శి హిందూపురంతోపాటు శ్రీసత్యసాయి జిల్లావాసుల ఆర్థిక పురోగతికి వెన్నుదన్నుగా నిలవనుందని స్థానికులు, చందాదారులు హర్షం వ్యక్తం చేశారు.
మేము మార్గదర్శిలో 15 ఏళ్లుగా పొదుపు చేస్తున్నాం. హిందూపురంలో నూతన శాఖను ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్లు అనంతపురానికి వెళ్లేవాళ్లం, ఇప్పుడు సొంత ఊరిలోనే ఏర్పాటు అయ్యింది. మార్గదర్శిలో అన్ని రకాల చిట్టీలు ఉన్నాయి. ఇప్పటిదాక దాదాపు 25 చిట్టీలు వేశాం. ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టింది లేదు. మాకు మా కుటుంబాలకు మార్గదర్శి ఎంతో సహకరించింది. ఇండస్ట్రియల్ హబ్‌గా హిందూపురం మారటం, తాజాగా మార్గదర్శి రావటం ద్వారా ఇక్కడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. విశ్వసనీయతకు మారు పేరుగా మార్గదర్శి చిట్‌ఫండ్ నిలిచింది. గత ఆరు దశాబ్దాలుగా ఎన్నో కుటుంబాల్లో మార్గదర్శి వెలుగులు నింపింది. ఇలాగే ఈ సంస్థ విజయపథంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. - చందాదారులు, హిందూపురం
కడిగిన ముత్యంలా మార్గదర్శి - హర్షం వ్యక్తం చేస్తున్న చందాదారులు
కుట్రలు, కేసులు - అంతిమంగా గెలిచిన న్యాయం - మార్గదర్శి విజయ ప్రస్థానమిలా

