ETV Bharat / state

కామారెడ్డిలో మార్గదర్శి చిట్​ఫండ్స్ 131వ బ్రాంచ్ - వినియోగదారుల హర్షం

కామారెడ్డిలో మార్గదర్శి చిట్​ఫండ్స్ 131వ శాఖ ప్రారంభం - చిట్ ఫండ్స్‌తో పేద కుటుంబాలకు ఆర్థిక క్రమశిక్షణతో పాటు భరోసా ఉంటుందన్న ఎండీ శైలజా కిరణ్ - హర్షం వ్యక్తం చేసిన వినియోగదారులు

Margadarsi Chit Fund's 131st Branch Inaugurated in Kamareddy of Telangana
Margadarsi Chit Fund's 131st Branch Inaugurated in Kamareddy of Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 29, 2026 at 3:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

Margadarsi Chit Fund's 131st Branch Inaugurated in Kamareddy of Telangana: తెలంగాణలోని కామారెడ్డిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 131వ శాఖను మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్​ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలో ఉద్యోగులు, సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. చిట్​ఫండ్స్‌తో పేద కుటుంబాలకు ఆర్థిక క్రమశిక్షణతో పాటు భరోసా ఉంటుందని శైలజా కిరణ్ తెలిపారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సేవలు మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నాయని ఆమె అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న కామారెడ్డిలో నూతన శాఖను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని తెలిపారు.

నిర్వహణపై సూచనలు: కామారెడ్డి బ్రాంచిలో తొలి చిట్ వేసిన చిట్ ఖాతాదారుడు రాజమౌళి నుంచి డీడీ తీసుకున్న శైలజా కిరణ్​ రసీదు అందించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై చిట్స్ నిర్వహణపై పలు సూచనలు చేశారు.

"కామారెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు. వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న కామారెడ్డిలో నూతన శాఖను ఏర్పాటు చేయటం సంతోషంగా ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సేవలు మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు మార్గదర్శి చేదోడుగా, అండగా ఉంటుంది. పేద కుటుంబాలకు ఆర్థిక క్రమశిక్షణ, ప్రణాళిక ముఖ్యం. చిట్‌ఫండ్‌తో ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. చిట్ ఫండ్స్‌తో పేద కుటుంబాలకు ఆర్థిక క్రమశిక్షణతో పాటు భరోసా ఉంటుంది. కామారెడ్డిలాంటి ప్రాంతాల్లో రూ.2.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ గ్రూప్స్ నడుపుతుంటాం. మీ సేవింగ్స్​తో మీకు అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం మార్గదర్శి చిట్ ఫండ్స్ కల్పిస్తుంది. ధృవపత్రాలు సమర్పిస్తే 3 రోజుల్లో పేమెంట్ అయ్యే బాధ్యత మేము తీసుకుంటాం." - శైలజా కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ

మా అవసరాలను తీర్చుకుంటున్నాం: ఎన్నో సంవత్సరాలుగా మార్గదర్శి చిట్స్‌లో పొదుపు చేస్తున్నామని, తద్వారా తమ అవసరాలను తీర్చుకుంటున్నామని వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి సీఈవో సత్యనారాయణ రావు, డైరెక్టర్ వెంకటస్వామి, వైస్ ప్రెసిడెంట్లు రాజాజీ, బలరామకృష్ణ, జనరల్ మేనేజర్ చంద్రయ్య, కామారెడ్డి, నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్లు సహా ఉద్యోగులు, కస్టమర్లు పాల్గొన్నారు.

"మార్గదర్శి మంచి, నమ్మకమైన సంస్థ. కామారెడ్డిలో నూతన శాఖను ఏర్పాటు చేయడం మాకు సంతోషంగా ఉంది. గతంలో మేము చిన్న చిన్న చిట్టీలు వేశాం. పెద్దమొత్తంలో చిట్టీలు వేయడానికి మాకు మార్గదర్శి ఉపయోగపడుతుంది." - మార్గదర్శి చిట్ ఫండ్స్ ఖాతాదారులు

మార్గదర్శి చిట్​ఫండ్ 130వ శాఖ ప్రారంభం- వర్చువల్​గా ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్

"మార్గదర్శి" ఆదాయపు పన్ను నోటీసుల కొట్టివేత - రామోజీరావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు