ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఘోరం - లారీని ఢీకొట్టిన కారు - ఐదుగురు బెంగళూరు వాసులు మృతి

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి - సిమెంట్‌ లారీని వెనుకవైపు నుంచి ఢీకొన్న కారు - గంగవరం మండలం వైఎస్సార్‌ జంక్షన్ వద్ద ఘటన

MAJOR ROAD ACCIDENT IN CHITTOOR
MAJOR ROAD ACCIDENT IN CHITTOOR (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 10:22 AM IST

|

Updated : March 4, 2026 at 10:30 AM IST

1 Min Read
Choose ETV Bharat

Major Road Accident in Chittoor District : చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ఘటనలో కారులోని ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను బెంగళూరుకు చెందిన మోహన్ దాస్ (71), నాగరాజరావు (61), కుసుమ (61), జయంతి (59), పూజ (33)గా గుర్తించారు.

లారీని వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. వేగంగా లారీ కిందికి దూసుకెళ్లిన కారు అక్కడే చిక్కుకుపోయింది. చాలాసేపు శ్రమించి కారుని బయటికి లాగారు. బెంగళూరు రాజాజీ నగర్‌కు చెందిన కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. చాలాసేపు శ్రమించి కారుని బయటికి లాగారు. ప్రమాదంపై బెంగళూరులోని బంధువులకు సమాచారం అందించారు.

చిత్తూరు జిల్లాలో ఘోరం - లారీని ఢీకొట్టిన కారు - ఐదుగురు బెంగళూరు వాసులు మృతి (ETV Bharat)

ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి మండిపల్లి : చిత్తూరు జిల్లా, గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద వార్తపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాద కారణాలపై వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఆటోలు ఢీకొని ఏడుగురికి తీవ్ర గాయాలు : మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు బలంగా ఢీకొనడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్న దోర్నాల నుంచి బొమ్మలాపురం వైపు వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోని బొమ్మలాపురం నుంచి దోర్నాలకు వస్తున్న మరో ఆటో ఢీకొంది. క్షతగాత్రులను దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం- స్లీపర్​ బస్సు, ట్రక్కు ఢీ- ఆరుగురు మృతి

రోడ్డు ప్రమాదాల్లో రక్తమోడుతున్న రాష్ట్రంలోని 6 జిల్లాలు ఇవే - కేంద్ర అధ్యయనంలో వెల్లడి

Last Updated : March 4, 2026 at 10:30 AM IST