ETV Bharat / state

ఏపీలో ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయోచ్​ - ఇక ట్రాఫిక్​ సమస్యకు చెక్‌

త్వరలో అందుబాటులోకి రానున్న ఎయిర్‌ ట్యాక్సీలు - ఫ్రేమ్‌ టెస్టు విజయవంతంగా పూర్తి చేసిన మాగ్నమ్‌ వింగ్స్ సంస్థ - అనుమతులు వస్తే రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం

Magnum Wings Company Introducing Air Taxis will Soon
Magnum Wings Company Introducing Air Taxis will Soon (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 8:09 AM IST

2 Min Read
Choose ETV Bharat

Magnum Wings Company Introducing Air Taxis will Soon : రోడ్డు రవాణాలో ట్రాఫిక్ ఇబ్బంది, రైలులో ప్రయాణిద్దామంటే సీట్లు దొరకవు, విమాన ప్రయాణం అంటే ఛార్జీలు భరించలేని పరిస్థితి. వీటికి ఎయిర్ ట్యాక్సీల రూపంలో అతిత్వరలో పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఫ్రేమ్‌ టెస్టును విజయవంతంగా పూర్తి చేశారు. మరో 6 నెలల్లో అనుమతులు, రెండేళ్లలో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు గుంటూరు 'మాగ్నమ్ వింగ్స్‌' సంస్థ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.

ఏపీలో ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయోచ్​ - ఇక ట్రాఫిక్​ సమస్యకు చెక్‌ (ETV)

పైలట్ లేకుండానే ప్రయాణం : గుంటూరుకు చెందిన చావా అభిరాం అమెరికాలో రోబోటిక్స్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసి ఎయిర్ ట్యాక్సీల తయారీ వైపు ముందడుగు వేశారు. 2019లో గుంటూరు శివారులోని నల్లచెరువులో 'మ్యాగ్నమ్ వింగ్స్' సంస్థ నెలకొల్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు వాతావరణ పరిస్థితులకు సరిపోయే వాహనాలపై పరిశోధనలు చేసి చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారుచేశారు. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు. భారీ సైజు డ్రోన్ తరహాలో కనిపించే ఈ వాహనంలో ఒకరు ప్రయాణించవచ్చు. రన్‌వే అవసరం లేని కొత్తరకం ఎయిర్ క్రాఫ్ట్స్​గా దీనిని అభివర్ణించారు.

4గంటల నుంచి 20 నిమిషాలకు : దేశంలో రోజుకు 2 నుంచి 4గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణించాల్సి వస్తోందని ఈ సమయాన్ని 20 నిమిషాలకు తీసుకురావాలనేది తమ లక్ష్యమని అభిరాం తెలిపారు. ఈ వాహనానికి సంబంధించిన ఫ్రేమ్‌ టెస్ట్‌ను ఇటీవల విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులు విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో పనిచేసేలా ఎయిర్‌ ట్యాక్సీలను తీర్చిదిద్దామన్నారు. రెండేళ్లలో ఎయిర్ ట్యాక్సీ సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు అభిరాం తెలిపారు.

"ఇది సింగిల్ ప్యాసింజర్. ఇది 100 km వేగంతో దాదాపు 20 కి.మీ పైగా ప్రయాణిస్తుంది. ఇంకో ఆరు నెలలు దాక పరీక్షలు నిర్వహిస్తాం. తరువాత ఎయిరో ట్యాక్సీ పర్మిషన్స్​కి వెళ్తాం. దీనికి మొత్తం 8 మోటర్లు ఉంటాయి. అందులో 2 మోటర్లు పనిచేయకపోయినా వెళ్లగలదు. దీనికి ప్యారచూట్ సైతం ఉంటుంది. ఇప్పటికే అన్నిటెస్టుల్లో మేము అనుకున్నదానికన్న మంచి ఫలితం వచ్చింది." - చావా అభిరాం, మాగ్నమ్ వింగ్స్ ఎండీ

కొనసాగుతున్న పరీక్షలు : వైద్య సేవల రంగంలో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలను విస్తృతంగా ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ మమత వెల్లడించారు. ఇదే సంస్థ ఆధ్వర్యంలో పైలట్ కూడా ఉండేలా రెండు సీట్లు, మూడు సీట్లతో ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు. వీటికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి.

ట్యాక్సీ కావాలా బాబూ?- హ్యుందాయ్ నుంచి రెండు మోడల్స్ వచ్చాయ్

2026 నాటికి భారత్​లో ఎయిర్​ట్యాక్సీలు - ట్రాఫిక్ కష్టాలకు చెక్​ - ఇకపై గాల్లోనే జర్నీ!