రామోజీ ఫిల్మ్ సిటీలో మరో ఆవిష్కరణ - హాలీవుడ్ సినిమాల్లోని అనుభూతి కలిగేలా సరికొత్త గేమ్ రూపకల్పన
రామోజీ ఫిల్మ్ సిటీలో సరికొత్త ఆవిష్కరణ - ఫిల్మ్ సిటీలో లాక్ ఎన్ ఎస్కేప్ అనే సరికొత్త గేమ్ ప్రారంభం - హాలీవుడ్ సినిమాలను మళ్లీ గుర్తుచేసేలా గేమ్‌కి రూపకల్పన

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 10:29 PM IST
Lock N Escape - Mystery Escape Game has been Launched at Ramoji Film City : పర్యాటకులకు స్వర్గధామంగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీలో మరో గేమ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే సాహస్ పేరిట పర్యాటకులకు అడ్వెంచర్స్ చేసే అవకాశం కల్పించిన రామోజీ ఫిల్మ్‌సీటీ ఇప్పుడు సరికొత్తగా 'లాక్ ఎన్ ఎస్కేప్ - మిస్టరీ ఎస్కేప్ గేమ్'ని ప్రారంభించింది. పర్యాటకులకి హాలీవుడ్ సినిమాల్లోని అనుభూతి కలిగించే విధంగా ఆ గేమ్‌కు రూపకల్పన చేశారు. అన్నివర్గాల వారిని ఆకట్టుకునేలా లాక్ ఎన్ ఎస్కేప్ - మిస్టరీ ఎస్కేప్ గేమ్ ఉండనుందని నిర్వాహకులు తెలిపారు.
15 నిమిషాల్లో గేమ్‌ను ముగించి ఇంకోగదికి : ప్రపంచవింతలకు వేదికైన రామోజీఫిల్మ్‌సిటీలో మరో గేమ్ వచ్చి చేరింది. పర్యాటకులని మంత్రముగ్ధులను చేసేందుకు లాక్‌ఎన్ ఎస్కేప్- మిస్టరీ ఎస్కేప్ గేమ్‌ను ఫిల్మ్‌సిటీ అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులను సాహసవంతులుగా చేసే లక్ష్యంతో ఆ గేమ్‌ను డిజైన్ చేశారు. పర్యాటకులు ఉల్లాసంగా గడిపేలా హాలీవుడ్ సినిమాలోని సన్నివేశాలను ఏర్పాటు చేశారు. అందులో 10 గదులు ఉండగా ప్రతి గదిలో 15 నిమిషాల్లో గేమ్‌ను ముగించి ఇంకోగదికి వెళ్లాల్సి ఉంటుందని గేమ్ డైరెక్టర్ జై అన్నారు. ఆ గదిలో తాళం చెవిని వెదకడం ద సీక్రేట్ థ్రోన్ వంటి ఎన్నో మిస్టీరియస్ గేమ్‌లు ఉంటాయి. ఆ గేమ్ చూసేందుకు పెద్దటాస్క్‌లా ఉన్నా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారని గేమ్ డైరెక్టర్ తెలిపారు.
జూరాసిక్ వరల్డ్, హ్యారీపోర్టర్ అడ్వెంచర్స్ : లాక్ ఎన్ ఎస్కేప్ - మిస్టరీ ఎస్కేప్ గేమ్ పర్యాటకులకు మంచి సాహసానుభూతిని కలిగించనుంది. హాలీవుడ్ చిత్రాల్లోని జూరాసిక్ వరల్డ్, హ్యారీపోర్టర్ అడ్వెంచర్స్, మిర్రర్ ఇమేజెస్, పజిల్స్ వంటివి ఉండేలా ఒక్కో రూమ్‌లో ఒక్కో విధంగా గేమ్‌కి రూపకల్పన చేశారు. అందరినీ ఆకట్టుకునేలా లాక్‌ఎన్ ఎస్కేప్ - మిస్టరీ ఎస్కేప్ గేమ్‌కి రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫిల్మ్‌సిటీ సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ గేమ్‌ను తప్పకుండా ఆస్వాదిస్తారని గేమ్ రూపకర్త జై చెప్పారు.
"పర్యాటకులు ఉల్లాసంగా గడిపేలా హాలీవుడ్ సినిమాలోని సన్నివేశాలను ఏర్పాటు చేశాం. 10 గదులు ఉండగా ప్రతి గదిలో 15 నిమిషాల్లో గేమ్‌ను ముగించి ఇంకోగదికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ గదిలో తాళం చెవిని వెదకడం ద సీక్రేట్ థ్రోన్ వంటి ఎన్నో మిస్టీరియస్ గేమ్‌లు ఉంటాయి. ఆ గేమ్ చూసేందుకు పెద్దటాస్క్‌లా ఉన్నా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పర్యాటకులకు మంచి సాహసానుభూతి కలిగిస్తుంది. హాలీవుడ్ చిత్రాల్లోని జూరాసిక్ వరల్డ్, హ్యారీపోర్టర్ అడ్వెంచర్స్, మిర్రర్ ఇమేజెస్, పజిల్స్ వంటివి ఉండేలా ఒక్కో రూమ్‌లో ఒక్కో విధంగా గేమ్‌కి రూపకల్పన చేశాం. అందరినీ ఆకట్టుకునేలా గేమ్‌ని రూపకల్పన చేశాం. ఫిల్మ్‌సిటీ సందర్శనకు వచ్చే పర్యాటకులు గేమ్‌ను తప్పకుండా ఆస్వాదిస్తారు."- జై, లాక్ ఎన్ ఎస్కేప్ - మిస్టరీ ఎస్కేప్ గేమ్ డైరెక్టర్
"ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి స్టూడియో లేదు" - రామోజీ ఫిల్మ్‌సిటీపై జపాన్ బృందం ప్రశంసలు

