4 March 2026 Andhra Pradesh News Today Live Updates: రఘురామను కస్టడీలో వేధించిన కేసులో సునీల్ నాయక్ విచారణ
today live news updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 6:53 AM IST
|Updated : March 4, 2026 at 10:22 PM IST
4 March 2026 Andhra Pradesh News Today Live Updates: తిరుమల లడ్డూ కల్తీపై మండలిలో ప్రకటనను సభ్యులకు పంపిణీ చేసిన ప్రభుత్వం - లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో 20పేజీల ప్రకటన పంపిణీ చేసిన ప్రభుత్వం - లడ్డూ చారిత్రక నేపథ్యం, ప్రామాణిక పదార్థాలు, పోటు-మిరాసీ వ్యవస్థ అంశాలను ప్రకటనలో వివరించిన ప్రభుత్వం
LIVE FEED
సునీల్ నాయక్ విచారణ
- గుంటూరు: రఘురామను కస్టడీలో వేధించిన కేసులో సునీల్ నాయక్ విచారణ
- దర్యాప్తు అధికారి దామోదర్ ఆధ్వర్యంలో సీసీఎస్ స్టేషన్‌లో విచారణ
- రేపట్నుంచి 4 రోజులపాటు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ
- హైకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ
వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
- నెల్లూరు: బోగోలు మండలం వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
- తెప్పోత్సవం నిర్వహిస్తుండగా నీటమునిగిన పడవ
- సామర్థ్యానికి మించి ఎక్కడంతో నీటమునిగిన పడవ
- ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు, అధికారులు
- స్వామి, అమ్మవారిని చేతులతోనే మోస్తూ ఊరేగించిన భక్తులు
విద్యార్థిని ఆత్మహత్య
- శ్రీకాకుళం: టెక్కలి మండలం తలగాంలో విద్యార్థిని ఆత్మహత్య
- రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న బీటెక్ రెండో ఏడాది విద్యార్థిని
- విద్యార్థినికి ఈ నెల 21న పెళ్లి చేసేందుకు నిశ్చయించిన కుటుంబసభ్యులు
- శ్రీకాకుళం: మృతురాలి స్వస్థలం నందిగాం మండలం వేణుగోపాలపురం
సచివాలయంలో చేనేత స్టాళ్లు
- సచివాలయంలో చేనేత స్టాళ్లు ప్రారంభించిన మంత్రి సవిత
- స్టాళ్లలో 50 శాతం రాయితీతో చేనేత ఉత్పత్తుల అమ్మకం
- స్టాళ్లలో వెంకటగిరి, గద్వాల, ఉప్పాడ, ధర్మవరం చీరల విక్రయం: సవిత
మరొకరు మృతి
- కాకినాడ: సామర్లకోట మం. వేట్లపాలెం ఘటనలో మరొకరు మృతి
- కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చిటికెల లక్ష్మి (45) మృతి
- బాణసంచా పేలుడు ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య
సీఎం ప్రకటన
- వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై శాసనసభలో సీఎం ప్రకటన
- వేట్లపాలెం పేలుడు ఘటనలో 26 మంది మరణించారు: సీఎం చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం: సీఎం చంద్రబాబు
- కేంద్రం కూడా రూ.2 లక్షల పరిహారం ప్రకటించింది: సీఎం చంద్రబాబు
- వేట్లపాలెం ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపిన సీఎం, సభ్యులు
- సంతాపం అనంతరం సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్
ఆర్టీసీ కీలక ప్రకటన
- దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ కీలక ప్రకటన
- 'ఇంద్రధనుస్సు'లో భాగంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ఈ నెల 18న సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రకటించిన ఆర్టీసీ ఎండీ
- 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ
- సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ
- అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం: ఎండీ
- దివ్యాంగుల సహాయకుడికి టికెట్ ఛార్జీలో 50 శాతం రాయితీ: ఆర్టీసీ ఎండీ
సీఎం ప్రసంగం
- పెట్టుబడులు, మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై సీఎం ప్రసంగం
- పేరెంట్స్, టీచర్ మీటింగ్ తర్వాత విద్యాశాఖలో మార్పులు వచ్చాయి: సీఎం
- రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తెస్తున్నాం: సీఎం చంద్రబాబు
- ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల బీమా ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు
- పేదలకు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా రూ.25 లక్షల బీమా ఇస్తున్నాం: సీఎం
- సంజీవని ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తెస్తున్నాం: సీఎం చంద్రబాబు
- మాతృభాష తెలుగును కాపాడుకునే బాధ్యత తీసుకుంటాం: సీఎం చంద్రబాబు
- తెలుగు నేర్చుకోకుంటే మన ఉనికిని కోల్పోతాం: సీఎం చంద్రబాబు
- వైసీపీ హయాంలో అనేక కంపెనీలను తరిమేశారు: సీఎం చంద్రబాబు
- జాకీ, లులు, అమర్‌రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ కంపెనీలను తరిమేశారు: సీఎం
అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి లోకేష్
- ఐటీ, ఎలక్ట్రానిక్స్ బడ్జెట్ డిమాండ్లపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి లోకేష్
- వైసీపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలపై యుద్ధం చేసి వెళ్లగొట్టింది: మంత్రి లోకేష్
- వైసీపీ ప్రభుత్వం వల్ల 2014-19 మధ్య వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లాయి: లోకేష్
- విశాఖకు ఫార్చూన్-500 కంపెనీ వస్తే దాన్నీ వెళ్లగొట్టారు: మంత్రి లోకేష్
- వైసీపీ హయాంలో తీవ్రవాదుల్లా ప్రవర్తించి కంపెనీలను వెనక్కి పంపారు: లోకేష్
- మేం వచ్చాక కంపెనీలతో మాట్లాడితే గత అనుభవాలు చెప్పి బాధపడ్డారు: లోకేష్
- ఆయా కంపెనీలను ఒప్పించి తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నాం: మంత్రి లోకేష్
- 8 రకాల పాలసీలు తెచ్చి కంపెనీలకు మార్గం సుగమం చేశాం: మంత్రి లోకేష్
- కంపెనీలకు భూములు ఇవ్వడంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు: లోకేష్
విజయవాడకు ప్రణయ్ ప్రకాశ్
- ప్రణయ్ ప్రకాశ్‌ను విజయవాడకు తీసుకువచ్చిన సిట్ అధికారులు
- ఉత్తర్‌ప్రదేశ్‌లో అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు
- మద్యం ముడుపుల కేసులో ఏ-52గా ఉన్న నిందితుడు ప్రణయ్ ప్రకాశ్
- ప్రణయ్ ప్రకాశ్‌ను రేపు విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం
ఐటీ, ఎలక్ట్రానిక్స్ బడ్జెట్ డిమాండ్లపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి లోకేశ్
- ఐటీ, ఎలక్ట్రానిక్స్ బడ్జెట్ డిమాండ్లపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి లోకేశ్
- వైసీపీ ప్రభుత్వం ఐటీ కంపెనీలపై యుద్ధం చేసి వెళ్లగొట్టింది: మంత్రి లోకేశ్
- వైసీపీ ప్రభుత్వం వల్ల 2014-19 మధ్య వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లాయి: లోకేశ్
- విశాఖకు ఫార్చూన్-500 కంపెనీ వస్తే దాన్నీ వెళ్లగొట్టారు: మంత్రి లోకేశ్
- వైసీపీ హయాంలో తీవ్రవాదుల్లా ప్రవర్తించి కంపెనీలను వెనక్కి పంపారు: లోకేశ్
- మేం వచ్చాక కంపెనీలతో మాట్లాడితే గత అనుభవాలు చెప్పి బాధపడ్డారు: లోకేశ్
- ఆయా కంపెనీలను ఒప్పించి తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నాం: మంత్రి లోకేశ్
- 8 రకాల పాలసీలు తెచ్చి కంపెనీలకు మార్గం సుగమం చేశాం: మంత్రి లోకేశ్
- కంపెనీలకు భూములు ఇవ్వడంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు: లోకేశ్
ప్రణయ్ ప్రకాశ్ అరెస్టు
- ప్రణయ్ ప్రకాశ్‌ను విజయవాడకు తీసుకువచ్చిన సిట్ అధికారులు
- ఉత్తర్‌ప్రదేశ్‌లో అరెస్టు చేసి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు
- మద్యం ముడుపుల కేసులో ఏ-52గా ఉన్న నిందితుడు ప్రణయ్ ప్రకాశ్
- ప్రణయ్ ప్రకాశ్‌ను రేపు విజయవాడ కోర్టులో హాజరుపరిచే అవకాశం
తుపాకీతో కాల్పులు
- చిత్తూరు: తుమ్మిందపాళ్యంలో నాటు తుపాకీతో కాల్పులు, యువకుడు మృతి
- పేకాట ఆడుతుండగా ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ
- సాయికుమార్ (24) అనే యువకుడిని నాటుతుపాకితో కాల్చి చంపిన డిల్లీ (26)
- ఇద్దరు తుమ్మిండపాళ్యం గ్రామానికి చెందిన స్నేహితులు
అచ్చెన్న క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యుల నినాదాలు
- శాసన మండలి రేపటికి వాయిదా
- వైసీపీ సభ్యుల నినాదాలతో మండలి రేపటికి వాయిదా
- మంత్రి అచ్చెన్న క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ సభ్యుల నినాదాలు
- తాను క్రైస్తవుడిని కాదని ప్రెస్‌మీట్ చెప్పి జగన్ చెప్పాలి: అచ్చెన్న
- అచ్చెన్న క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యుల నినాదాలు
- మేం చెప్పిన మాటలు వారు కూడా వినాలన్న బీజేపీ సభ్యులు
- హిందువులకు, వెంకటేశ్వరస్వామికి అపచారం చేస్తున్నారన్న బీజేపీ సభ్యులు
- ఆవు నెయ్యి కిలో రూ.320కి ఎక్కడైనా దొరుకుతుందా చెప్పాలన్న బీజేపీ సభ్యులు
- కల్తీ నెయ్యి కుంభకోణంలో రూ.250 కోట్లు తినేశారన్న బీజేపీ సభ్యులు
- వైసీపీ పాలనలో 320 దేవాలయాలు కూలగొట్టారన్న బీజేపీ సభ్యులు
- దేవాలయాలు కూలగొట్టిన ఘటనల్లో ఒక్కరిపైనా కేసు పెట్టలేదన్న సోము వీర్రాజు
క్షమాపణకు డిమాండ్
- వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసన మండలి
- జగన్ క్రిష్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు ఆందోళన
- పోడియం చుట్టు ముట్టి నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తోన్న వైసీపీ సభ్యులు
బంగారం ధరలు
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,61,900
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,47,660
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,76,500
పంచాయతీ కార్యదర్శిని అడ్డుకున్న సర్పంచ్
- గుంటూరు జిల్లా పాండ్రపాడులో పంచాయతీ కార్యదర్శిని అడ్డుకున్న సర్పంచ్
- బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోలీసులకు చెప్పిన కార్యదర్శి అమరేశ్వరరావు
- బిల్లులకు సంబంధించిన బుక్స్‌పై కార్యదర్శి సంతకం చేయట్లేదని సర్పంచ్ ఆరోపణ
- కార్యదర్శిని పోలీసు వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులు
- పోలీసు వాహనాన్ని అడ్డుకుని బైఠాయించిన సర్పంచ్, వార్డు సభ్యులు
మంత్రి ఆనంపైకి దూసుకొచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు
- కల్తీ నెయ్యి అంశంపై మంత్రి ఆనం ప్రకటన సమయంలో వైసీపీ సభ్యుల దురుసు ప్రవర్తన
- మంత్రి ఆనంపైకి దూసుకొచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు
- మాధవరావుకు మద్దతుగా కదిలిన ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు
- కోపంతో ఊగిపోయిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- తేల్చుకుందామంటూ ఎమ్మెల్సీ మాధవరావుకు ఎదురెళ్లిన ఆనం
- బృందాలుగా ఎదురెదురుగా దూసుకెళ్లిన ఎమ్మెల్సీలు
- జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పిన మంత్రులు
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై మండలి ఛైర్మన్ అభ్యంతరం
- శాసనమండలి 5 నిమిషాలపాటు వాయిదా
- మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన మండలి ఛైర్మన్
- నా కులంపై మాట్లాడడం మీకు తగదన్న మండలి ఛైర్మన్ మోషేను రాజు
- నేను క్రిస్టియన్ కాదు.. హిందువునని చెప్పిన మండలి ఛైర్మన్
- క్రిస్టియన్ అనడం నా వ్యక్తిత్వాన్ని కించపరచడమేనన్న మండలి ఛైర్మన్
- నన్ను క్రిస్టియన్ అనుకొని మంత్రి సంభాషించినట్లు సమాధానమిచ్చారు: మండలి ఛైర్మన్
- హిందువు అని తెలుసుకున్నా.. నా మాటలను వెనక్కి తీసుకుంటానని మంత్రి చెప్పారు: ఛైర్మన్
- మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యుల నినాదాలు
- చర్చను కొనసాగిద్దామని సభ్యులకు చెప్పిన మండలి ఛైర్మన్
- ఛైర్మన్ చెప్పినా నినాదాలు కొనసాగించిన వైసీపీ సభ్యులు, సభ వాయిదా
ఎవరి మత విశ్వాసాలు వారివి.. మేము కాదనం
- వెంకటేశ్వరస్వామిపై జగన్‌కు ఏమాత్రం నమ్మకం లేదు: మంత్రి అచ్చెన్న
- వెంకటేశ్వరస్వామిపై ఇంత కక్ష ఎందుకో వాళ్లే చెప్పాలి: మంత్రి అచ్చెన్న
- ఎవరి మత విశ్వాసాలు వారివి.. మేము కాదనం: మంత్రి అచ్చెన్నాయుడు
- నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి: మంత్రి అచ్చెన్నాయుడు
దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది
- ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో రావాలి: మంత్రి లోకేష్
- మా అబ్బాయి పుట్టినరోజున అన్నదానం చేస్తున్నాం: మంత్రి లోకేష్
- దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది: మంత్రి లోకేష్
- వాళ్లు చేసినట్లు మేము కూడా కల్తీ చేసిన నెయ్యి వాడాలా?: మంత్రి లోకేష్
చిన్నారి ఊపిరి తీసిన బెలూన్
- గుంటూరు: నాలుగేళ్ల చిన్నారి ఊపిరి తీసిన ఆడుకునే గాలి బెలూన్
- బెలూన్ గొంతుకు అడ్డుపడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పెదకాకాని చిన్నారి
- శిరీషను హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చిన కుటుంబసభ్యులు
- ఆస్పత్రిలో చికిత్స చేసే సమయానికే చిన్నారి ప్రాణాలు విడిచినట్లు వైద్యుల వెల్లడి
- చిన్నారి గొంతులోని బెలూన్ బయటకు తీసి కృత్రిమ శ్వాస అందించినా దక్కని ఫలితం
- చిన్నారి చనిపోవడంతో తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు
తిరుమల శ్రీవారిపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టింది
- తిరుమల శ్రీవారిపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టింది: పంచుమర్తి అనురాధ
- 300 ఏళ్ల నుంచి వస్తున్న లడ్డూ ప్రసాదంపై జగన్ విషం చిమ్మారు: పంచుమర్తి అనురాధ
- 68 లక్షల కిలోల లడ్డూలను ప్రపంచమంతా పాకించారు: పంచుమర్తి అనురాధ
చారిత్రక తప్పిదానికి అవకాశం ఇవ్వొద్దు
- లడ్డూ అంశంపై మండలిలో చర్చపై మంత్రులు, ఛైర్మన్ మధ్య వాగ్వాదం
- స్వల్పకాలిక చర్చ గతంలోనే ముగిసిందన్న మంత్రి పయ్యావుల కేశవ్
- మిగిలిన అంశాలపై మరుసటిరోజు చర్చ నడిచింది: మంత్రి పయ్యావుల
- సభలో చారిత్రక తప్పిదానికి అవకాశం ఇవ్వొద్దు: మంత్రి పయ్యావుల
- గతంలో వాయిదా వేసిన స్వల్పకాలిక చర్చను తిరిగి చేపట్టామన్న ఛైర్మన్
- స్వల్పకాలిక చర్చపై సభ్యుల నుంచి నోటీసు ఉందా అని ప్రశ్నించిన మంత్రులు
- తిరుపతి లడ్డూపై మండలిలో చర్చకు ఆదేశించిన మండలి ఛైర్మన్
- సున్నిత అంశమైనందున చర్చను సజావుగా ముగించాలని ఆదేశించిన ఛైర్మన్
- వైసీపీకి 30, టీడీపీకి 20 నిమిషాలు, మంత్రి సమాధానానికి 10 నిమిషాలు సమయమిచ్చిన ఛైర్మన్
- చర్చ పూర్తయ్యేవరకు వైసీపీ సభ్యులు సభలో ఉండేలా చూడాలన్న మంత్రి అచ్చెన్న
- లడ్డూపై చర్చను ప్రారంభించిన వైసీపీ సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
24కు పెరిగిన మృతుల సంఖ్య
- వేట్లపాలెం బాణాసంచా పేలుళ్ల ఘటనలో 24కు పెరిగిన మృతుల సంఖ్య
- కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ పల్లిపాటి వీరశ్రీను (39) మృతి
- పేలుళ్ల ఘటనలో సామర్లకోట కుమ్మరి వీధికి చెందిన వీరశ్రీను మృతి
మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం
- వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం
- ప్రభుత్వం చెప్పే సమాధానం వాకౌట్ చేయకుండా వైసీపీ సభ్యులు వినాలి: పయ్యావుల
- లడ్డూ అంశంపై చర్చకు వైసీపీకి 30 నిమిషాలు, టీడీపీకి 20 నిమిషాలు, మంత్రి సమాధానానికి 10 నిమిషాలు సమయం కేటాయించాం: ఛైర్మన్
- పార్టీలకు నిర్దేశిత సమయం ఉంటుంది, ప్రభుత్వ సమాధానానికి సమయం నిబంధన వర్తించదు: పయ్యావుల
- తాము మాట్లాడిన తర్వాత వాకౌట్ చేయడం వైసీపీ సభ్యులకు అలవాటుగా మారింది: మంత్రి అచ్చెన్న
- సభలో అన్ని పార్టీలకు సమయం ఇవ్వండి: మంత్రి అచ్చెన్న
- వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోకుండా ఛైర్మన్ చర్యలు తీసుకోవాలి: మంత్రి అచ్చెన్న
- లడ్డూ కల్తీ గురించి చంద్రబాబు సొంతంగా చెప్పలేదు.. ఎన్‌డీడీబీ రిపోర్టును చదివారు: మంత్రి అచ్చెన్న
తిరుమల లడ్డూ కల్తీపై ప్రకటనను సభ్యులకు పంపిణీ చేసిన ప్రభుత్వం
- తిరుమల లడ్డూ కల్తీపై మండలిలో ప్రకటనను సభ్యులకు పంపిణీ చేసిన ప్రభుత్వం
- లడ్డూ కల్తీపై సమగ్ర వివరాలతో 20పేజీల ప్రకటన పంపిణీ చేసిన ప్రభుత్వం
- లడ్డూ చారిత్రక నేపథ్యం, ప్రామాణిక పదార్థాలు, పోటు-మిరాసీ వ్యవస్థ అంశాలను ప్రకటనలో వివరించిన ప్రభుత్వం
- తిరుమల లడ్డూ అంశంపై శాసనమండలిలో కొనసాగుతున్న గందరగోళం
- ఒకే అంశంపై రెండు తీర్మానాలు ఇవ్వడం సరికాదంటున్న మంత్రి నాదెండ్ల
- కొత్త సంప్రదాయాలకు ఛైర్మన్ ఆస్కారం కల్పించకూడదు: మంత్రి నాదెండ్ల
- సభలో చర్చ జరిగిన తర్వాతే మేము బయటకు వెళ్తాం: మంత్రి పయ్యావుల
- సభలో ఎంతసేపైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం: మంత్రి పయ్యావుల
- సభకు సమాధానం చెప్పిన తర్వాతే బయటకు వెళ్తాం: మంత్రి పయ్యావుల
- చారిత్రాత్మక తప్పిదం మండలిలో జరగకూడదనేదే మా ఉద్దేశం: మంత్రి పయ్యావుల
- దోషులను ప్రజల ముందు నిలబెట్టిన తర్వాతే మేం బయటికి వెళ్తాం: పయ్యావుల
- అందరిని మాట్లాడనివ్వండి.. ప్రజలకు వాస్తవాలు తెలియాలి
- వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం
- ప్రభుత్వం చెప్పే సమాధానం వాకౌట్ చేయకుండా వైసీపీ సభ్యులు వినాలి: పయ్యావుల
అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం
- అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం
- సభలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఎందుకు ఉండరని నిలదీసిన అనగాని
- ఇదే విషయం సభలో ఛైర్మన్ కూడా ప్రస్తావించారన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
- ఇప్పటికే అధికారులందరికీ సీఎస్ ఆదేశాలు పంపారన్న మంత్రి పయ్యావుల కేశవ్
- ప్రశ్నోత్తరాలు, బిల్లుల సమయంలో అందుబాటులో ఉండాలన్న ఆదేశాలు ఉన్నాయన్న కేశవ్
- ఇటీవల అజయ్ జైన్ అందుబాటులో లేకపోతే ఛైర్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేసిన అచ్చెన్న
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీపై మండలిలో ప్రశ్నోత్తరాలు
- విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీపై మండలిలో ప్రశ్నోత్తరాలు
- ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి నారా లోకేష్
- అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తాం: లోకేష్
- రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి: లోకేష్
- కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి ఖాళీల భర్తీకి చర్యలు: లోకేష్
- ఖాళీల భర్తీకి 2018, 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు: మంత్రి లోకేష్
- వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ పాటించకపోవడంతో ప్రక్రియ నిలిచింది: లోకేష్
- ఇప్పటికే ఏఏజీతో మూడుసార్లు సమావేశమై పూర్తిస్థాయిలో చర్చించాం: లోకేష్
- నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది: మంత్రి లోకేష్
- యుద్ధప్రాతిపదికన పెండింగ్ పోస్టులను వచ్చే 3 నెలల్లో భర్తీకి నిర్ణయం: లోకేష్
అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను ఆమోదించిన శాసనమండలి
- అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను ఆమోదించిన శాసనమండలి
- ఏపీ అసైన్డ్ భూముల సవరణ బిల్లు-2026ను ఆమోదించిన మండలి
- అసైన్డ్ భూములను గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజుకు ఇచ్చేందుకు అనుమతిస్తూ సవరణ
- చట్టసవరణతో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజు ద్వారా అసైన్డ్ భూముల కేటాయింపు
- ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం వరకు పెంచేలా చట్టసవరణ
- ఏపీ గ్రామ, వార్డు సచివాలయాలు సవరణ బిల్లు-2026కు మండలి ఆమోదం
- స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డులుగా మార్చుతూ సవరించిన బిల్లుకు మండలి ఆమోదం
చిత్తూరు రోడ్డు ప్రమాదం అప్డేట్
- చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
- సిమెంట్ లారీని వెనుకవైపు నుంచి ఢీకొన్న కారు
- చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద ఘటన
- బెంగళూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా ప్రమాదం
- ఘటనాస్థలిలోనే ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి
- మృతులు బెంగళూరు రాజాజీ నగర్‌కు చెందినవారుగా గుర్తింపు
- మృతులు మోహన్ దాస్(71 ), నాగరాజరావు(61)గా గుర్తింపు
- మృతులు కుసుమ(61), జయంతి(59), పూజ(33)గా గుర్తింపు
జనవిశ్వాస్ నిబంధన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి ఫరూఖ్
- జనవిశ్వాస్ నిబంధన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి ఫరూఖ్
- చిన్నచిన్న తప్పులు చేసినా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది: మంత్రి ఫరూఖ్
- ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ దిశగా సవరణ చేశాయి: మంత్రి ఫరూఖ్
- కోర్టులపై నమ్మకం పెంచటానికి కేంద్రం జనవిశ్వాస్ చట్టం తెచ్చింది: మంత్రి ఫరూఖ్
- నిందితులకు రిమాండ్ కాకుండా జరిమానా విధించటంపై చట్టసవరణ: మంత్రి ఫరూఖ్
- వ్యాపారాల్లో చేసే తప్పులకు కారాగార శిక్ష కాకుండా భారీ జరిమానాకు చర్యలు: మంత్రి ఫరూఖ్
- పురపాలకచట్టం, లేఔట్లు, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల్లో ఉల్లంఘనలపై చర్యలు: మంత్రి
- జనవిశ్వాస్ నిబంధన సవరణ బిల్లును ఆమోదించిన శాసనసభ
మార్చి 2027 వరకు ఎన్‌ఓసీ ఉంది: హోంమంత్రి అనిత
- మార్చి 2027 వరకు ఎన్‌ఓసీ ఉంది: హోంమంత్రి అనిత
- అనుమతి లేని పరికరాలు ఎక్కువగా ఉన్నాయి: హోంమంత్రి అనిత
- మోతాదుకు మించి కూలీలు పనిచేస్తున్నారు: హోంమంత్రి అనిత
- అనుభవం లేని.. రోజువారీ కూలీలను తీసుకొచ్చి పనిచేయిస్తున్నారు: హోంమంత్రి అనిత
రెవెన్యూ శాఖలో కోర్టు కేసులపై అసెంబ్లీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ప్రశ్న
- రెవెన్యూ శాఖలో కోర్టు కేసులపై అసెంబ్లీలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ప్రశ్న
- మొత్తం 32 వేల కేసులు రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్నాయి: మంత్రి అనగాని
- పెండింగ్ కేసుల పర్యవేక్షణకు లీగల్ సెల్ ఏర్పాటు చేశాం: మంత్రి అనగాని
- కేసుల పరిష్కారానికి తహసీల్దార్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చాం: మంత్రి అనగాని
- కేసులు తేల్చేందుకు హైకోర్టు స్థాయిలో కూడా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాం: మంత్రి అనగాని
- సీసీఎల్‌ఏ.. ఈ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు: మంత్రి అనగాని
- కోర్టు ధిక్కరణకు రాకుండా ప్రత్యేక చర్యలు: మంత్రి అనగాని సత్యప్రసాద్
- కేసుల తక్షణ పరిష్కారంపై కిందిస్థాయి అధికారులకు అవగాహన కల్పిస్తున్నాం: మంత్రి
- రెవెన్యూ కేసుల్లో హైకోర్టు స్థాయిలో ఓడిపోతున్నాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- సక్రమంగా ఉన్న కేసులు కూడా ఓడిపోవడంపై ఆలోచించాలి: స్పీకర్ అయ్యన్న
ప్రవాసాంధ్రుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం: మంత్రి మండిపల్లి
- ప్రవాసాంధ్రుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం: మంత్రి మండిపల్లి
- గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా అన్నమయ్య జిల్లా నుంచి ఉన్నారు: మంత్రి మండిపల్లి
- గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందవద్దు: మంత్రి
- ఏపీఎన్నార్టీల ద్వారా తాత్కాలిక వసతి, భద్రత, తక్షణ న్యాయ సహాయం అందిస్తాం: మండిపల్లి
- దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు: మంత్రి మండిపల్లి
- ఏపీలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంది: మంత్రి మండిపల్లి
- సమస్యలు ఎదురైతే హెల్ప్‌లైన్ 0863-2340678ను సంప్రదించవచ్చు: మండిపల్లి
- సమస్యలు ఎదురైతే వాట్సాప్ +91 85000 27678ను సంప్రదించవచ్చు: మండిపల్లి
- ఈ-మెయిల్ helpline@apnrts.comను సంప్రదించాలి: మంత్రి మండిపల్లి
ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల బిల్లు సవరణకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన లోకేష్
- ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల బిల్లు సవరణకు అసెంబ్లీలో బిల్లు పెట్టిన లోకేష్
- 2025 సెప్టెంబర్ 27న అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మండలికి పంపించాం: మంత్రి లోకేష్
- వంద రోజులు దాటడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకి వచ్చింది: మంత్రి లోకేష్
- 1996లో చంద్రబాబు సీఎం అయ్యాక ఫ్యాక్షన్ రాజకీయాలపై యుద్ధం ప్రకటించారు: లోకేష్
- 2004 తర్వాత వైఎస్ హయాంలో 164 మంది తెదేపా కార్యకర్తలను చంపేశారు: లోకేష్
- కార్యకర్తలను పరామర్శించి వెళ్లేలోపే మరో హత్య జరిగిన పరిస్థితి ఉంది: లోకేష్
- హత్యకు గురైన వారి పిల్లలను చదివించేందుకు ఎన్టీఆర్ స్కూల్లో ఏర్పాట్లు చేశాం: లోకేష్
- పిల్లలు ఫ్యాక్షన్‌లోకి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ఉండేలా మేం చర్యలు తీసుకున్నాం: లోకేష్
- ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది: మంత్రి లోకేష్
- 2019-24 మధ్యలో కూడా ఇలాంటి హత్యలు జరిగాయి: మంత్రి లోకేష్
- బీసీ వర్గానికి చెందిన తోట చంద్రయ్యను 2022 జనవరి 12న హత్య చేశారు: లోకేష్
- జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పినా చంద్రయ్య భయపడలేదు: లోకేష్
- చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి పార్టీలు సమ్మతించాయి: మంత్రి లోకేష్
- గతంలో అసెంబ్లీలో ఈ బిల్లుకు ఆమోదం లభించినా.. మండలి దాన్ని పక్కన పెట్టింది: లోకేష్
- బిల్లును తిరస్కరించినా.. మనం అసెంబ్లీలో ఆమోదించుకునేవాళ్లం: లోకేష్
- చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బిల్లును ఆమోదించాలని అసెంబ్లీని కోరుతున్నా: లోకేష్
- ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి.. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నా: లోకేష్
ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటుపై మండలిలో ప్రశ్నోత్తరాలు
- ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటుపై మండలిలో ప్రశ్నోత్తరాలు
- ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
- విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాలు అమర్చే ప్రతిపాదన ఉంది: మంత్రి గొట్టిపాటి
- దశలవారీగా సోలార్ ఫలకాలు అమర్చేందుకు టెండర్లు ఆహ్వానించాం: మంత్రి గొట్టిపాటి
గుంటూరు జిల్లా పెదకాకాని రైల్వేస్టేషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
- గుంటూరు జిల్లా పెదకాకాని రైల్వేస్టేషన్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
- గొంతు వద్ద గాయం ఉండటంతో హత్యగా అనుమానిస్తున్న పోలీసులు
- రైల్వే ప్రయాణికుడా లేదా ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా అనే కోణంలో దర్యాప్తు
- గుంటూరు జిల్లా: ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్
గత ప్రభుత్వంలో ధర్నా చేసిన ఉద్యోగులపై కేసులు పెట్టారు: హోంమంత్రి
- గత ప్రభుత్వంలో ఉద్యోగులపై పెట్టిన కేసులపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు
- ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన హోంమంత్రి వంగలపూడి అనిత
- గత ప్రభుత్వంలో ధర్నా చేసిన ఉద్యోగులపై గత ప్రభుత్వం కేసులు పెట్టింది: హోంమంత్రి
- రాజధాని రైతులపై కూడా గత ప్రభుత్వం కేసులు నమోదు చేసింది: హోంమంత్రి
- విచారణలో 11 కేసులు, పెండింగ్ 39, ముగింపు దశలో 170 కేసులు ఉన్నాయి: హోంమంత్రి
- తప్పుడు కేసులు అని తేలితే వెంటనే కేసులు కొట్టివేస్తున్నాం: హోంమంత్రి అనిత
- కొన్ని కేసులు కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు ఆదేశాల మేరకు క్లోజ్ చేస్తున్నాం: హోంమంత్రి
ప్రకాశం జిల్లా బూదవాడ వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ, ఒకరు మృతి
- ప్రకాశం జిల్లా బూదవాడ వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుల మధ్య ఘర్షణ
- ప్రకాశం జిల్లా: ఘర్షణలో రాజస్థాన్‌కు చెందిన కార్మికుడు మృతి
- చీమకుర్తి మండలం బూదవాడ సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో ఘటన
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి
- చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి
- సిమెంట్ లారీని వెనుకవైపు నుంచి ఢీకొన్న కారు
- గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద ఘటన
- బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు
- చిత్తూరు జిల్లా: ఘటనాస్థలిలోనే ఐదుగురు మృతి
- మృతుల్లో ముగ్గురు మహిళలు
మండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
- మండలి ఛైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
- ఐదుగురు సభ్యులు రాజీనామా చేసినా.. ఇంతవరకూ ఆమోదించని మండలి ఛైర్మన్
- ఛైర్మన్ తీరుకు నిరసనగా అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్న 8 మంది ఎమ్మెల్సీలు
- అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగా ఎమ్మెల్సీల ఆలోచన
- ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ
- రాజీనామా చేసిన బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ
చిరుత దాడిలో జింక మృతి
- తిరుపతి: అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచారం
- అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత దాడి, జింక మృతి
- తిరుపతి: భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది
శ్రీసత్యసాయి జిల్లాలో చోరీకి వచ్చి దొంగ మృతి
- శ్రీసత్యసాయి జిల్లాలో చోరీకి వచ్చి దొంగ మృతి
- ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో చోరీకి వచ్చిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు
- కాలనీవాసులు వెంటాడటంతో పరిగెత్తుతూ రైల్వే ట్రాక్‌ను తగిలి కిందపడిన దొంగ
- రైల్వే ట్రాక్‌పై పడటంతో చోరీకి వచ్చిన నారాయణస్వామి తలకు తీవ్రగాయం
- స్థానికులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున దొంగ మృతి
- శ్రీసత్యసాయి జిల్లా: పరారైన మరో ఇద్దరు దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు
- చోరీకి వచ్చిన దొంగలు బళ్లారి ప్రాంత వాసులుగా గుర్తించిన పోలీసులు
- శ్రీసత్యసాయి జిల్లా: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ధర్మవరం పోలీసులు
తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం
- తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,300 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 9,985 మంది భక్తులు
నేటి నుంచి పునఃప్రారంభం
- నాలుగు రోజుల విరామం తరువాత నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- బడ్జెట్ సమావేశాలు పదమూడో రోజులో భాగంగా నేడు అసెంబ్లీలో 3 బిల్లులు
- ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్
- అగ్నిమాపక సేవా సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న హోం మంత్రి అనిత
- జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ఎన్ఎండీ ఫరూఖ్
- శాఖల వారీగా పద్దులపై జరగనున్న చర్చ - ఆమోదం
- పరిశ్రమలు, పర్యాటకం, అబ్కారీ, రవాణా, కార్మిక, విద్య, ఆరోగ్యం శాఖలపై చర్చను ప్రారంభించనున్న మంత్రులు
- విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖల వార్షిక నివేదికలు ప్రవేశపెట్టనున్న మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, బీసీ జనార్దన్ రెడ్డి
వేట్లపాలెంలోని సూర్య ఫైర్ వర్స్క్‌లో పేలుడుపై విచారణకు కమిటీ ఏర్పాటు
- కాకినాడ: వేట్లపాలెంలోని సూర్య ఫైర్ వర్స్క్‌లో పేలుడుపై విచారణకు కమిటీ ఏర్పాటు
- మున్సిపల్ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్, ఈగల్ అధిపతి రవికృష్ణ నేతృత్వంలో కమిటీ
- వేట్లపాలెం పేలుడుకు కారణాలేంటి.. బాధ్యులెవరు అనే అంశాలు తేల్చాలన్న సర్కార్
- నెలరోజుల్లోగా నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించిన ప్రభుత్వం
హైదరాబాద్ బాచుపల్లిలో నిన్నరాత్రి భారీ అగ్నిప్రమాదం
- హైదరాబాద్ బాచుపల్లిలో నిన్నరాత్రి భారీ అగ్నిప్రమాదం
- నిజాంపేట్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ నుంచి చెలరేగి ఫర్నీచర్ షాప్‌కు అంటుకున్న మంటలు
- అనంతరం పక్కనే ఉన్న మరిన్ని దుకాణాలకు వేగంగా వ్యాపించిన మంటలు
- మంటల ధాటికి కాలిబూడిదైన 20 నుంచి 30 వరకూ ఫర్నీచర్ దుకాణాలు
- మంటల్లో కాలిపోయిన బైక్‌లు, సామగ్రి, డబ్బు, బంగారు ఆభరణాలు
- ఒక్కో ఫర్నీచర్ షాప్‌లో రూ.30 లక్షల వరకు సామగ్రి ఉంటుందన్న నిర్వాహకులు
- కళ్ల ముందే కాలిపోతున్న ఆస్తిని కాపాడుకోలేక బోరున విలపించిన నిర్వాహకులు
- ఘటనాస్థలికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలు అదుపు చేసిన సిబ్బంది
ఇంద్రకీలాద్రిపై ఉదయం 8 గంటల తర్వాత దర్శనాలు ప్రారంభం
- విజయవాడ: ఉదయం 8 గంటల తర్వాత దర్శనాలు ప్రారంభం
- నిన్న చంద్రగ్రహణం కారణంగా విజయవాడ దుర్గగుడి మూసివేత
- ఈనెల 6, 7, 8 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం
- మహా కుంభాభిషేకం వల్ల ఈనెల 9 వరకు అంతరాలయ దర్శనం నిలిపివేత
Last Updated : March 4, 2026 at 10:22 PM IST

