3 March 2026 Andhra Pradesh News Today Live Updates: ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి
Live News Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 6:53 AM IST
|Updated : March 3, 2026 at 10:22 PM IST
3 March 2026 Andhra Pradesh News Today Live Updates: గన్నవరం మండలం చిక్కవరంలో విషాదం - ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి
LIVE FEED
చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి
- కృష్ణా జిల్లా: ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి
- కృష్ణా జిల్లా: గన్నవరం మండలం చిక్కవరంలో విషాదం
- హోలీ ఆడి చేతులు కడుగు కునేందుకు చెరువు వద్దకు వెళ్లిన విద్యార్థులు
- ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి
- మృతులు వినయ్‌కుమార్(11), సాయి(16), వెంకటజోసఫ్(16)గా గుర్తింపు
- కృష్ణా జిల్లా: సాయి మృతదేహం కోసం పోలీసుల గాలింపు
వాసుదేవరెడ్డికి 2 రోజుల కస్టడీ
- మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డికి 2 రోజుల కస్టడీ
- వాసుదేవరెడ్డిని కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు
- ఈనెల 5, 6 తేదీల్లో కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్న సిట్
గుంటూరులో అగ్నిప్రమాదం
- గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అగ్నిప్రమాదం
- పూల మార్కెట్ వద్ద వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం
- ఘటనాస్థలికి వచ్చి మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది, తప్పిన ముప్పు
రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు భేటీ
- దిల్లీ: రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు భేటీ
- విశాఖలో సౌత్‌కోస్ట్ రైల్వేజోన్ కార్యకలాపాల ప్రారంభంపై చర్చించిన రామ్మోహన్
- శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతంపై చర్చ
- శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు నడపడంపై చర్చ
- ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయం పురోగతిపై చర్చించినట్లు వెల్లడి
డిప్యూటి సీఎం ఆఫీసులో దాడి కేసులో నిందితుడికి రిమాండ్
- మంగళగిరిలోని డిప్యూటి సీఎం ఆఫీసులో దాడి కేసులో నిందితుడికి రిమాండ్
- నిందితుడు నీలాద్రికి 14 రోజులు రిమాండ్ విధించిన మంగళగిరి న్యాయస్థానం
- ఫిబ్రవరి 28న పవన్‌కల్యాణ్ కార్యాలయంపై దాడికి పాల్పడిన నారద నీలాద్రి
- దాడి ఘటనపై కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు
తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు
- తిరుమల: తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు
- మహాద్వారంతో పాటు గర్భాలయం తలుపులను తెరిచిన అర్చకులు
- ఆలయం శుద్ధి పుణ్యాహవచనం తర్వాత దర్శనాలు ప్రారంభం
సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
- సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తున్న సీఎంకు ధన్యవాదాలు: పవన్
- గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం ప్రాధాన్యం ఇచ్చారు: పవన్
- పంచాయతీ వ్యవస్థను బలోపేతానికి సీఎం నిధులు కేటాయించారు: పవన్
- ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా గ్రామాలకు నిధులు సమకూరుస్తున్నారు: పవన్
- ఈరోజు సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ సమావేశం జరిగింది: పవన్
- జల్ జీవన్ మిషన్, గ్రామీణ రోడ్ల నిర్మాణంపై విలువైన సూచనలు సీఎం ఇచ్చారు: పవన్
- సీఎం సూచనలు అనుసరిస్తూ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతాం: పవన్
క్రికెట్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అరెస్టు
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌ను ఛేదించిన నెల్లూరు సిటీ పోలీసులు
- R777 అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అరెస్టు
- ఇద్దరు బుకీలు మహేష్‌బాబు, హరికృష్ణను అరెస్టు చేసిన బాలాజీ నగర్ పోలీసులు
- పరారీలో ఉన్న మరో ఇద్దరు బుకీలు మహేష్‌కుమార్, మణికుమార్
- నిందితుల నుంచి 4 ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం
- మాయమాటలు చెప్పి రూ.53 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారని ఫిర్యాదు
- నిందితుల బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.1.64 కోట్లు సీజ్ చేసిన పోలీసులు
- గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన పొడపాటి మహేష్‌బాబు
- సులభంగా డబ్బులు సంపాదించాలని బెట్టింగ్‌ను ఎంచుకున్నట్లు పోలీసుల వెల్లడి
- శ్రీలంక, దుబాయ్ తిరిగి బెట్టింగ్ యాప్ నిర్వహణపై శిక్షణ పొందిన మహేశ్
- R777 యాప్‌ను 30 శాతం షేర్ వచ్చేలా దుబాయ్ నుంచి తీసుకున్న మహేశ్
- మణి, వేణు, మహేశ్‌కుమార్‌కు 15 శాతం షేర్ ఇస్తూ వారితో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ
వివాహిత, యువకుడు ఆత్మహత్య
- నెల్లూరు: రాపూరు ఘాట్‌రోడ్డు వద్ద అడవిలో వివాహిత, యువకుడు ఆత్మహత్య
- పురుగుల మందు తాగి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య
- నెల్లూరు: మృతులు ప్రసన్నకుమార్(25), వివాహిత (24)గా గుర్తింపు
- సోషల్ మీడియాలో పరిచయం ప్రేమగా మారినట్లు తెలిపిన స్థానికులు
- కలిసి జీవించే అవకాశం లేదని ఆత్మహత్య చేసుకున్న వివాహిత, యువకుడు
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
- కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
- మారుమూల ప్రాంతాలలో తయారు చేస్తున్న నాటు సారా
- నిడమర్రు పరిధిలోని మడ అడవుల్లో నాటు సారా తయారీని గుర్తించిన పోలీసులు
- రహదారి మార్గం లేని మడ అడవుల్లోకి పడవలో వెళ్లిన పోలీసులు
- పోలీసుల రాకను గమనించి పారిపోయిన సారా తయారీదారులు
- 40 లీటర్ల నాటు సారా, తయారీకి ఉపయోగించే వస్తువులు, ప్లాస్టిక్ డ్రమ్ములు సీజ్
- వెయ్యి లీటర్లకు పైగా బెల్లపు ఊటను ధ్వంసం చేసిన పోలీసులు
- నాటు సారాను తయారు చేయాలని చూస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్
- టీటీడీ ఛైర్మన్ వ్యవహారంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్
- ఛైర్మన్‌పై నాదెండ్ల భాస్కరరావు ట్వీట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం
- ఆ పోస్టుకు నాదెండ్ల భాస్కరరావుకు సంబంధం లేదన్న మంత్రి మనోహర్ అనుచరులు
- తెనాలి వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన జనసేన నేత వి.నారాయణరావు
- భాస్కరరావుకు ట్విట్టర్ అకౌంట్ లేదని ఫిర్యాదులో పేర్కొన్న నారాయణరావు
- కేసు నమోదు చేసిన తెనాలి వన్‌టౌన్ పోలీసులు
గూడ్స్ రైలు నుంచి గ్యాస్ లీక్
- శ్రీకాకుళం జిల్లా తిలారు రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ నుంచి గ్యాస్ లీక్
- విశాఖ వైపు నుంచి పలాస వైపు వెళ్తున్న గ్యాస్ ట్యాంకర్ల గూడ్స్
- గ్యాస్ లీక్ కావడంతో గూడ్స్ బోగీలను వేరు చేసిన అధికారులు
బాలాజీ నగర్‌లోని కూలర్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం
- కర్నూలు: బాలాజీ నగర్‌లోని కూలర్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం
- కర్నూలు: ప్లాస్టిక్ సామాగ్రి కావడంతో వేగంగా విస్తరిస్తున్న మంటలు
- కర్నూలు: వంటకు తెచ్చుకున్న రెండు సిలిండర్లు పేలుడు
- కర్నూలు: భారీగా అలుముకున్న పొగ, భయభ్రాంతులకు గురైన స్థానికులు
- కర్నూలు: మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వేమగిరి లోవరాజు మృతి
- కాకినాడ: వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో 23కు చేరిన మృతులు
- కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వేమగిరి లోవరాజు(38) మృతి
- గత నెల 28న వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
- పేలుడు ఘటనలో అక్కడికక్కడే 20 మంది సజీవ దహనం
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య
- రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చౌడేశ్వరి నగర్‌కు చెందిన జి.సూర్యారావు(81) మృతి
- ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న మరో 13 మంది కల్తీ పాల బాధితులు
వాగులోకి దిగి విద్యార్థి మృతి
- ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మం. మాగళ్లు వద్ద కూచి వాగులోకి దిగి విద్యార్థి మృతి
- మృతుడు కొండూరుకు చెందిన బెల్లంకొండ దినకరన్(14)గా గుర్తింపు
- హోలీ సందర్భంగా పిల్లలంతా కలిసి సరదాగా ఆడుకునే క్రమంలో విషాదం
రూ.5.80 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపన
- ప.గో. జిల్లా: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన
- రూ.5.80 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల
- అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి నిమ్మల
- అంగన్వాడీల 9 డిమాండ్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది: మంత్రి నిమ్మల
- అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుది: మంత్రి నిమ్మల
- వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు రూ. వెయ్యి మాత్రమే పెంచి మోసం చేసింది: నిమ్మల
- వేసవిలో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు 15 రోజులు సెలవులు: మంత్రి నిమ్మల
అవయవ దానంలో రాష్ట్రానికి ఆరో స్థానం
- అవయవ దానంలో రాష్ట్రానికి ఆరో స్థానం: మంత్రి సత్యకుమార్
- రాష్ట్రంలో గడిచిన 2 నెలల్లో 64 మందికి కొత్త జీవితం: మంత్రి సత్యకుమార్
- అవయవ దానాల్లో 50 ఏళ్లలోపు వారే అత్యధికం: మంత్రి సత్యకుమార్
- ప్రభుత్వాస్పత్రుల్లో అవయవాల మార్పిడి శస్త్ర చికిత్సలు పెరగాలి: సత్యకుమార్
- జీవన్ ధాన్ కార్యకలాపాలపై సమీక్షించిన మంత్రి సత్యకుమార్
గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్, ధైర్యం చెప్పిన మంత్రి సుభాష్
- గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రులతో వీడియో కాల్ మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి సుభాష్
- ఏపీ ఎన్ఆర్‌టీసీ హెల్ప్‌లైన్ ద్వారా పూర్తి సహాయం అందిస్తామని భరోసా
- క్షేమంగా రాష్ట్రానికి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్న మంత్రి సుభాష్
- రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ వెంటే ఉంటుందని కార్మికులకు మంత్రి సుభాష్ భరోసా
- హెల్ప్‌లైన్ నంబర్ 8500027678కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచన
- గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని మంత్రి సుభాష్ సూచన
సీఎం చంద్రబాబును కలిసిన దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్
- అమరావతి: సీఎం చంద్రబాబును కలిసిన దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్
- దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి సీఎంకు ఆహ్వానం
- ఈ నెల 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక మహోత్సవం
- మహోత్సవానికి మంత్రి నారా లోకేష్‌నూ ఆహ్వానించిన పాలకమండలి
కల్తీనెయ్యి ఘటనపై విచారణ ప్రారంభించనున్న ఏక సభ్య కమిషన్
- కల్తీనెయ్యి ఘటనపై విచారణ ప్రారంభించనున్న ఏక సభ్య కమిషన్
- తిరుపతి పద్మావతి అతిథి గృహంలో విచారణ చేపట్టనున్న కమిషన్
- ఏకసభ్య కమిషన్ అధిపతి దినేష్‌కుమార్‌కు సహాయకులుగా ఐదుగురు సిబ్బందిని కేటాయించిన టీటీడీ
- పద్మావతి అతిథిగృహంలోని అనెక్సర్ భవనం మొదటి అంతస్తులో కమిషన్ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు అవకాశం
పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
- పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
- బనగానపల్లె నియోజకవర్గం జ్వాలాపురంలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ
- రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేసిన మంత్రి
వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమేసిన కంపెనీలు మళ్లీ వస్తున్నాయి: మంత్రి డోలా
- వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమేసిన కంపెనీలు మళ్లీ వస్తున్నాయి: మంత్రి డోలా
- చంద్రబాబుపై నమ్మకంతోనే ఆయా కంపెనీలు తిరిగి వస్తున్నాయి: డోలా
- విశాఖకు ప్రముఖ ఐటీ కంపెనీ ఐబీఎం రావడం శుభ పరిణామం: మంత్రి డోలా
- ఐబీఎం మూడేళ్లలో రూ.322 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనుంది: డోలా
- ఐబీఎం కంపెనీ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి: డోలా
జల్‌జీవన్ మిషన్ పనుల పురోగతిపై చంద్రబాబు, పవన్ సమీక్ష
- జల్‌జీవన్ మిషన్ పనుల పురోగతిపై చంద్రబాబు, పవన్ సమీక్ష
- జల్‌జీవన్ మిషన్ కింద ఈ ఆర్థిక సంవత్సరం రూ.4 వేల కోట్లు కేటాయింపు
- జల్‌జీవన్ మిషన్‌ను పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం
- జల్‌జీవన్ మిషన్‌ను మళ్లీ గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం
- రోజుకు 55 లీటర్ల తలసరి నీటి వినియోగంతో జల్‌జీవన్ మిషన్
- జల్‌జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాల్లో సురక్షితనీరు అందించేలా ప్రణాళిక
చింతపల్లి మండలం లోతుగడ్డ వంతెన వద్ద గంజాయి పట్టివేత
- అల్లూరి జిల్లా: చింతపల్లి మం. లోతుగడ్డ వంతెన వద్ద గంజాయి పట్టివేత
- రూ.కోటీ 40 లక్షల విలువైన 11.3 కిలోల ద్రవరూప గంజాయి పట్టివేత
- గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్టు; వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం
చంద్రగ్రహణం కారణంగా దుర్గగుడి మూసివేత
- విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా దుర్గగుడి మూసివేత
- రేపు ఉదయం 8 గంటల తర్వాత దర్శనాలు ప్రారంభం
- ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం
- మహా కుంభాభిషేకం వల్ల ఈ నెల 9 వరకు అంతరాలయ దర్శనం నిలిపివేత
సీఎం చంద్రబాబును కలిసిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- సీఎం చంద్రబాబును కలిసిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- హనుమాన్ కార్యక్రమం ముగియగానే నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లిన పవన్
- నామినేటెడ్ పదవులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం
- స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం
- ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు, పవన్ భేటీ
- గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ
- జల్‌జీవన్ మిషన్, డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణపై చర్చ
రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగు: పవన్ కల్యాణ్
- రాష్ట్ర అటవీశాఖ చరిత్రలో ఇదో కీలక అడుగు: పవన్ కల్యాణ్
- పర్యావరణ, జంతు ప్రేమికులకు శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్
- వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకే ఈ ప్రాజెక్టు: పవన్
- వన్యప్రాణుల నుంచి మనుషులను రక్షించేందుకు చర్యలు: పవన్ కల్యాణ్
- ఏనుగుల వల్ల పంటలకు నష్టం జరగకుండా చర్యలు: పవన్ కల్యాణ్
- ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య పరిష్కరించాం: పవన్
- అటవీ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేశాం: పవన్
- వన్యప్రాణులకు అండగా ఉన్న స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు: పవన్
- వన్యప్రాణుల వల్ల పంటనష్టం, ప్రాణనష్టం జరగకుండా చూస్తాం: పవన్
- ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపడతారు: పవన్
- బాధితులకు పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ చూస్తుంది: పవన్
- హనుమాన్ ప్రాజెక్టు ద్వారా అటవీశాఖకు 100 వాహనాలు అందించాం: పవన్
- రాష్ట్రంలో 19 అత్యవసర సహాయ బృందాలు సిద్ధం చేశాం: పవన్
- ఏడుచోట్ల అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలు ఏర్పాటు: పవన్
- వన్యప్రాణుల దాడుల బాధితులకు రూ.4 కోట్ల పరిహారం చెల్లించాం: పవన్
- మార్కెట్ విలువ ఆధారంగా పంటనష్ట పరిహారం ఇస్తున్నాం: పవన్
- కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెచ్చి అడవి ఏనుగులను కట్టడి చేశాం: పవన్
- రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ బాధ్యతగా చేపట్టాం: పవన్ కల్యాణ్
- హనుమాన్ ప్రాజెక్టులో స్వచ్ఛంద సంస్థలనూ భాగస్వాములు చేస్తాం: పవన్
- వన్యప్రాణుల వల్ల పంటనష్టం, ప్రాణనష్టం జరగకుండా చూస్తాం: పవన్
- ఘటన జరిగిన వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపడతారు: పవన్
- బాధితులకు పరిహారం అందించడం హనుమాన్ ఫౌండేషన్ చూస్తుంది: పవన్
- హనుమాన్ ప్రాజెక్టు ద్వారా అటవీశాఖకు 100 వాహనాలు అందించాం: పవన్
- రాష్ట్రంలో 19 అత్యవసర సహాయ బృందాలు సిద్ధం చేశాం: పవన్
- ఏడుచోట్ల అత్యవసర చికిత్స, పునరావాస కేంద్రాలు ఏర్పాటు: పవన్
- వన్యప్రాణుల దాడుల బాధితులకు రూ.4 కోట్ల పరిహారం చెల్లించాం: పవన్
- మార్కెట్ విలువ ఆధారంగా పంటనష్ట పరిహారం ఇస్తున్నాం: పవన్ కల్యాణ్
- కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తెచ్చి అడవి ఏనుగులను కట్టడి చేశాం: పవన్
- రాష్ట్రంలో వన్యప్రాణి సంరక్షణ బాధ్యతగా చేపట్టాం: పవన్ కల్యాణ్
- హనుమాన్ ప్రాజెక్టులో స్వచ్ఛంద సంస్థలనూ భాగస్వాములు చేస్తాం: పవన్
పవన్ కల్యాణ్ సూచనల మేరకు ప్రాజెక్టు రూపొందించాం: అటవీశాఖ అధికారి
- పవన్ కల్యాణ్ సూచనల మేరకు ప్రాజెక్టు రూపొందించాం: అటవీశాఖ అధికారి
- హనుమాన్ ప్రాజెక్టు కోసం ప్రత్యేకమైన యాప్ తయారుచేశాం: అటవీశాఖ
- జంతు సంరక్షణ, పునరావాసం కోసం ప్రత్యేక వాహనాలు ఇస్తున్నాం: అటవీశాఖ
- వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా హనుమాన్ కార్యక్రమం: అటవీశాఖ
- ఏనుగుల వల్ల పంటనష్టం జరిగితే ఇచ్చే పరిహారం భారీగా పెంచాం: అటవీశాఖ
- పంటనష్టం జరిగిన 24 గంటల్లో పరిహారం అందేలా చర్యలు: అటవీశాఖ
- పవన్ సూచన మేరకు గజ ప్రజ, సర్ప మిత్ర కార్యక్రమాలు చేపట్టాం: అటవీశాఖ
- అడవుల్లో రక్షణ చర్యలకు ప్రత్యేక వాహనాలు ప్రారంభిస్తాం: అటవీశాఖ
- ఏఐ సాయంతో వన్యప్రాణులను అడవుల్లోకి పంపించే చర్యలు: అటవీశాఖ
- వన్యప్రాణులు, మనుషుల మధ్య పరస్పర సంఘర్షణ నివారణకే ప్రాజెక్టు
మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
- మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
- కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
- అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించిన పవన్ కల్యాణ్
- వన్యప్రాణులను కాపాడేందుకు హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు ప్రారంభం
- అటవీశాఖకు వాహనాలు, అంబులెన్సులు అందించిన హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు
చంద్రగ్రహణం - ఆలయాల మూసివేత
- తిరుమల: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
- తిరుమల: గర్భాలయం, మహాద్వారం తలుపులు మూసిన టీటీడీ
- తిరుమల: తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రాన్ని మూసిన టీటీడీ
- తిరుమల: భక్తులకు 40 వేల పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసిన టీటీడీ
- చంద్రగ్రహణం కారణంగా సింహాచలం ఆలయం మూసివేత
- సింహాచలంలో రేపు ఉదయం 4 తర్వాత తిరిగి దర్శనాలు
- చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం ఆలయం మూసివేత
- రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి తర్వాత కాణిపాకంలో దర్శనాలు
లక్ష్మీనరసింహస్వామి కల్యాణంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంపతులు
- అమరావతి: వైభవంగా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
- లక్ష్మీనరసింహస్వామి కల్యాణంలో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంపతులు
- స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి లోకేశ్, బ్రాహ్మణి
భార్యను, అత్తను కత్తితో నరికి చంపిన భర్త
- తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలం బొబ్బిలంకలో ఘాతుకం
- భార్యను, అత్తను కత్తితో నరికి చంపిన భర్త
- భార్య లత, అత్త గుమ్మడి లక్ష్మిని కత్తితో నరికి చంపిన ఉన్మాది
- భార్యపై అనుమానంతోనే దాడి చేసినట్లు భావిస్తున్న పోలీసులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏకసభ్య కమిషన్
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్
- వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న మాజీ సీఎస్ ఐఏఎస్ దినేశ్ కుమార్
- స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు
- ఆలయంలో శ్రీవారికి మ్రొక్కులు చెల్లించిన ఐఏఎస్ దినేశ్ కుమార్
- దర్శనం అనంతరం తీర్థప్రసాదాలను అందజేసిన పండితులు
తిరుమల సమాచారం
- తిరుమల: నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
- ఉదయం 9 గం.కు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేత
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,174 మంది భక్తులు
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు
- శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 17,734 మంది భక్తులు
చంద్రగ్రహణం కారణంగా నేడు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత
- చంద్రగ్రహణం కారణంగా నేడు మల్లన్న ఆలయం మూసివేత
- ఉదయం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేత
- రాత్రి 7.30 గంటల నుంచి ఆలయ ద్వారాలు తెరవనున్న అర్చకులు
- నేడు ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ కార్యక్రమాలు
- రాత్రి 9 గం.కు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు
- రాత్రి 9 నుండి రాత్రి 10.30 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనం
నేడు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ
- తిరుమల: నేడు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ
- చంద్రగ్రహణం కారణంగా సుమారు 10.30 గంటల పాటు ఆలయం మూసివేత
- ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్న అర్చకులు
- మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు
- ఉదయం 9 గంటలకు అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేత
- సాయంత్రం గ్రహణం వీడాక శుద్ధి, పుణ్యాహవచనంతో దర్శనాలు ప్రారంభం
- నేటి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు బ్రేక్ లేఖల స్వీకరణ అనుమతి నిరాకరణ
- ఇవాళ శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు
- ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
- రేపు శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ పునఃప్రారంభం
- నేడు శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు నిలిపివేత
- విమానాశ్రయంలో 200, రోజువారీ ఆన్‌లైన్ టికెట్ల జారీ నిలిపివేసిన టీటీడీ
నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
- నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
- ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లి చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నట్లు సమాచారం
- తాజా రాజకీయ పరిణామాలతో పాటు పెండింగ్ నామినేటెడ్ పదవులపై చర్చ
ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తున్న అంగన్వాడీలు అరెస్టు
- విజయవాడ: ధర్నాచౌక్‌లో నిన్నటి నుంచి ధర్నా చేస్తున్న అంగన్వాడీలు అరెస్టు
- ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తున్న అంగన్వాడీలను అరెస్టు చేసిన పోలీసులు
- ఆందోళన విరమించాలని నిరసనకారులని కోరిన పోలీసులు
- తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్న అంగన్వాడీలు
- ఆందోళన విరమించకపోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
Last Updated : March 3, 2026 at 10:22 PM IST

