ETV Bharat / state

28 February 2026 Andhra Pradesh News Today Live Updates: నిబంధనల ఉల్లంఘన వల్లే ప్రమాదం - పేలుడు ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం

Blast in Kakinda District
Blast in Kakinda District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 28, 2026 at 7:02 AM IST

|

Updated : February 28, 2026 at 10:45 PM IST

Choose ETV Bharat

28 February 2026 Andhra Pradesh News Today Live Updates: కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 21 మంది మృతి - బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - పేలుడు ధాటికి పంటపొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు - వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య పంటపొలాల్లో ప్రమాదం

LIVE FEED

9:41 PM, 28 Feb 2026 (IST)

తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

  • తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
  • రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
  • అనంతరం తిరుపతి కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్న సీజేఐ

9:41 PM, 28 Feb 2026 (IST)

వేట్లపాలెం పేలుడు ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం

  • వేట్లపాలెం పేలుడు ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం
  • నిబంధనల ఉల్లంఘన వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించిన ప్రభుత్వం
  • నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు
  • ఆర్డీవో, డీఎస్పీ, డీఎల్‌వో, ఫైర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం

9:02 PM, 28 Feb 2026 (IST)

అనుమతి లేకుండా బాణసంచా తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు: సీఎం

  • పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు: చంద్రబాబు
  • ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు
  • బాధ్యులైన వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేస్తాం: సీఎం చంద్రబాబు
  • కొందరు వ్యక్తులు పదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు'
  • అనుమతి లేకుండా బాణసంచా తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు: సీఎం
  • ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తాం: సీఎం

9:01 PM, 28 Feb 2026 (IST)

బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రబాబు

  • పేలుడు ఘటన బాధాకరం.. చాలా దురదృష్టకరం: చంద్రబాబు
  • ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు: చంద్రబాబు
  • క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది: చంద్రబాబు
  • బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నాం: చంద్రబాబు
  • విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు
  • బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: చంద్రబాబు
  • మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం: చంద్రబాబు
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం: సీఎం చంద్రబాబు
  • బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రబాబు

7:03 PM, 28 Feb 2026 (IST)

మృతుల కుటుంబసభ్యులకు పరామర్శ

  • సామర్లకోట ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు
  • మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు
  • సామర్లకోట ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించిన సీఎం

6:35 PM, 28 Feb 2026 (IST)

వేట్లపాలెం ప్రమాద స్థలంలో సీఎం చంద్రబాబు

  • వేట్లపాలెం ప్రమాద స్థలంలో సీఎం చంద్రబాబు
  • పేలుడు జరిగిన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
  • ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
  • ఘటనాస్థలంలో చేపట్టిన సహాయ చర్యల గురించి వివరించిన అధికారులు
  • ఘటన గురించి సీఎంకు వివరించిన ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు
  • బాణసంచా తయారీ పరిశ్రమ గురించి ఆరా తీసిన సీఎం చంద్రబాబు
  • క్షతగాత్రుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

6:18 PM, 28 Feb 2026 (IST)

కాకినాడ జిల్లాలో పేలుడు ఘటన చాలా బాధాకరం

  • కాకినాడ జిల్లాలో పేలుడు ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ
  • మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోదీ
  • గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ప్రధాని మోదీ
  • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం..: మోదీ

6:10 PM, 28 Feb 2026 (IST)

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్

  • సీఎస్‌గా పదవీ విరమణ చేసిన విజయానంద్‌కు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అవకాశం
  • సీఎం పేషీలో రవిచంద్ర నిర్వర్తించిన బాధ్యతలు చేపట్టనున్న విజయానంద్
  • విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ ఉండనున్న విజయానంద్
  • ట్రాన్స్ కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వర్తించనున్న విజయానంద్

6:09 PM, 28 Feb 2026 (IST)

బాధ్యతల స్వీకరణ

  • సీఎస్‌ సాయిప్రసాద్‌కు జలవనరుల శాఖ స్పెషల్ ఛీప్‌ సెక్రటరీగా బాధ్యతలు
  • రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సీఎస్‌ సాయిప్రసాద్‌కు పూర్తి అదనపు బాద్యతలు

6:00 PM, 28 Feb 2026 (IST)

ఘటనాస్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

  • వేట్లపాలెం ప్రమాదంలో 21 మంది చనిపోయారు: హోంమంత్రి అనిత
  • అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారు: అనిత
  • ఘటనాస్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత
  • ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ బృందాలు విచారణ ప్రారంభించాయి: హోంమంత్రి
  • శవపరీక్షలు త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశాం: హోంమంత్రి అనిత

5:39 PM, 28 Feb 2026 (IST)

ఘటనాస్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత

  • వేట్లపాలెం ప్రమాదంలో 21 మంది చనిపోయారు: హోంమంత్రి అనిత
  • ఆస్పత్రిలో ఉన్నవారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: అనిత
  • అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారు: అనిత
  • ఘటనాస్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత

5:38 PM, 28 Feb 2026 (IST)

ప్రమాద సమయంలో పరిశ్రమలో 34 మంది కూలీలు

  • ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 34 మంది కూలీలు
  • బాణసంచా పేలుడు ధాటికి ఘటనాస్థలంలో 21 మంది మృతి
  • ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు
  • మధ్యాహ్నం 2 గంటల సమయంలో పేలుడు జరిగినట్లు గుర్తింపు

4:59 PM, 28 Feb 2026 (IST)

పరిశ్రమలో మొత్తం 34 మంది కూలీలు

  • పేలుడు ఘటనాస్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు
  • విజయనగరం జిల్లా నుంచి కాకినాడ బయలుదేరిన సీఎం చంద్రబాబు
  • ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 34 మంది కూలీలు
  • బాణసంచా పేలుడు ధాటికి ఘటనాస్థలంలో 21 మంది మృతి
  • ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు
  • మధ్యాహ్నం 2 గంటల సమయంలో పేలుడు జరిగినట్లు గుర్తింపు

4:18 PM, 28 Feb 2026 (IST)

భారీ పేలుడు

  • కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 21 మంది మృతి
  • వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
  • పేలుడు ధాటికి పక్కనున్న పొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు, శరీర భాగాలు
  • ప్రమాదంలో మరో 15 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • ఇంకా పలువురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
  • అనుమతులు, భద్రతలో లోపాలుంటే చర్యలు ఉంటాయి
  • ఘటనపై దర్యాప్తు చేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి..
  • నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్‌ ఉంది: ఆర్‌డీవో
  • బాణసంచా పరిశ్రమ యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో
  • ఆస్పత్రుల్లో ఉన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉంది: ఆర్‌డీవో
  • కాకినాడ జీజీహెచ్‌లో ఉన్న మోర్తా శ్రీను, సత్యవేణి పరిస్థితి విషమం
  • కాకినాడలో చికిత్స పొందుతున్న కె.శ్రీను, చిటికెల లక్ష్మి, డి.రాజు, లోవరాజు

4:05 PM, 28 Feb 2026 (IST)

11 మంది మృతులు గుర్తింపు

  • మృతుల్లో ఇప్పటివరకు 11 మందిని గుర్తించిన పోలీసులు
  • మృతులు: అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్‌, గొడతా రాము, గొడతా నాని

3:33 PM, 28 Feb 2026 (IST)

కాకినాడ జిల్లాలో పేలుడు

  • కాకినాడ జిల్లాలో పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు
  • తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం
  • ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితకు ఆదేశించిన సీఎం
  • ఘటనాస్థలానికి బయలుదేరిన హోంమంత్రి వంగలపూడి అనిత
  • ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు
  • బాణసంచా కేంద్రంలో పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి
  • ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: సీఎం
  • పేలుడు ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడా: సీఎం చంద్రబాబు
  • బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలి: సీఎం చంద్రబాబు
  • ఘటనాస్థలంలో అధికారులు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు: సీఎం
  • పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

2:39 PM, 28 Feb 2026 (IST)

భారీ పేలుడు

  • కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 18 మంది మృతి
  • బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
  • పేలుడు ధాటికి పంటపొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు
  • వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య పంటపొలాల్లో ప్రమాదం
  • ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • బాణసంచా పరిశ్రమలో ఇంకా కొనసాగుతున్న పేలుళ్లు
  • పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాల్లో అలముకున్న దట్టమైన పొగ
  • పేలుడు శబ్దాలు విని భయాందోళనకు గురైన స్థానికులు
  • బాణసంచా పరిశ్రమ నిర్వహిస్తున్న అడపా నాని కుటుంబసభ్యులు
  • పెదపూడి రోడ్డులోని పొలాల్లో బాణసంచా తయారీ కేంద్రం
  • పొలాల్లో 6 షెడ్లు వేసి బాణసంచా తయారు చేస్తున్నట్లు గుర్తింపు
  • పేలుడుకు ముందు భోజనం కోసం బయటకు వెళ్లిన కొందరు కార్మికులు
  • భోజనానికి బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్న కొందరు కార్మికులు

2:28 PM, 28 Feb 2026 (IST)

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం

  • టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం
  • వార్షిక బడ్జెట్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపిన బోర్డు
  • రూ.5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం
  • ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తయిన జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు రూ.20.17 కోట్లతో పనులకు ఆమోదం
  • తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం
  • ఒంటిమిట్ట కోదండరామ కల్యాణానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీకి ఆమోదం

2:20 PM, 28 Feb 2026 (IST)

తిరుపతి జిల్లాలో కారు ప్రమాదం; ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

  • తిరుపతి జిల్లా పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ప్రమాదం, ఇద్దరు మృతి
  • హైవేపై వెళ్తున్న కారును వెనుకనుంచి ఢీకొట్టిన మరో కారు
  • ముందు వెళ్తున్న కారు పల్టీలు కొట్టి అవతలి రోడ్డుపై పడిపోయిన వైనం
  • కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో దంపతులు మృతి
  • మృతులు హైదరాబాద్‌ వాసులు అశోక్, చంద్రకళగా గుర్తింపు
  • అరుణాచలం దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా ఘటన
  • తీవ్రంగా గాయపడిన మరో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స

2:20 PM, 28 Feb 2026 (IST)

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్

  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్
  • సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో పదవీ బాధ్యతలు స్వీకరణ
  • విజయానంద్ నుంచి బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్

2:19 PM, 28 Feb 2026 (IST)

హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభించడం గొప్ప నిర్ణయం: సీఎం

  • హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభించడం గొప్ప నిర్ణయం
  • ఒక డోస్‌ తీసుకుంటే క్యాన్సర్‌ నుంచి విముక్తి లభిస్తుంది
  • ఏ సమయంలో అయినా సరే బాలికలు టీకా తీసుకోవచ్చు
  • హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి సైడ్‌ ఎఫెక్స్ట్‌ ఉండవు
  • క్యాన్సర్‌ రాకుండా ఉండేందుకు అనేక చర్యలకు శ్రీకారం చుట్టాం
  • ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తుంది.. ఆదాయం కూడా పెంచుకోగలిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి
  • రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకున్నాం
  • ఆరోగ్య సమస్య వస్తే రూ.2.50 లక్షల వరకు ఉచితంగా వైద్యం

2:19 PM, 28 Feb 2026 (IST)

24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,58,700

  • ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,58,700
  • ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,46,000
  • ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ. 2,77,000

12:17 PM, 28 Feb 2026 (IST)

చీపురుపల్లి సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం

  • విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి సీఎం
  • చీపురుపల్లి సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
  • హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • గర్భాశయ క్యాన్సర్ రాకుండా బాలికలు ఈ వ్యాక్సిన్‌ వేసుకోవాలి: సీఎం
  • ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే జీవితాంతం రక్షణ: సీఎం చంద్రబాబు
  • బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్న సీఎం
  • చీపురుపల్లి సీహెచ్‌సీ పరిశుభ్రంగా ఉందని అభినందించిన సీఎం చంద్రబాబు
  • రాజస్థాన్‌లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
  • బాలికల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం
  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణే లక్ష్యంగా హెచ్‌పీవీ టీకాలు
  • 14, 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు ఇస్తున్న కేంద్ర ఆరోగ్యశాఖ
  • దేశంలో 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు ఇవ్వనున్న కేంద్ర ఆరోగ్యశాఖ

12:07 PM, 28 Feb 2026 (IST)

రాజమహేంద్రవరం: కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం

  • రాజమహేంద్రవరం: కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం
  • రాజమహేంద్రవరం: వెంటిలేటర్‌పై 11 మందికి డయాలసిస్ అందిస్తున్న వైద్యులు
  • కల్తీ పాల ఘటన బాధితులకు మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శ
  • ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా ఉత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు: నిమ్మల
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం: నిమ్మల
  • బాధితుల కుటుంబసభ్యులు కూడా వైద్యంపై సంతృప్తిగా ఉన్నారు: మంత్రి నిమ్మల
  • మానవత్వం ఉన్న ప్రభుత్వం మాది... ఖర్చుకు వెనుకాడేది లేదు: నిమ్మల
  • కూలెంట్‌ లీక్‌ అయిన బాక్స్‌ను సీజ్‌ చేసి పరీక్షలకు పంపాం: మంత్రి నిమ్మల
  • పాల వ్యాపారి ఇథలిన్‌ గ్లైకాన్‌ తక్కువ రేటుకు వస్తుందని కూలెంట్‌కు వాడారు: మంత్రి నిమ్మల
  • ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టులు కూడా ఇవాళ రావచ్చని అనుకుంటున్నాం: మంత్రి నిమ్మల
  • నిపుణులైన వైద్యులను తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నాం: మంత్రి నిమ్మల
  • వైద్యం జరుగుతున్న తీరును బాధితులను అడిగి తెలుసుకున్నాం: మంత్రి నిమ్మల
  • ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అన్నిరకాల పరీక్షలు చేయించాం: మంత్రి నిమ్మల
  • రక్త నమూనాలు తీసుకెళ్లారు.. పరీక్షలు జరుగుతున్నాయి... నివేదికలు ఇవాళ వస్తాయి: నిమ్మల

12:06 PM, 28 Feb 2026 (IST)

ఏపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారే కాదు.. డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌: లోకేష్‌

  • ఏపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారే కాదు.. డబుల్‌ ఇంజిన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కార్‌: లోకేష్‌
  • నమో అంటే నరేంద్రమోదీ అని అందరికీ తెలుసు: మంత్రి లోకేష్‌
  • ఏపీలో నమో అంటే నాయుడు, మోదీ అని అంటారు: మంత్రి లోకేష్‌
  • కేంద్రంలో మోదీ.. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది: లోకేష్‌
  • ఆంధ్రప్రదేశ్‌కు బ్లూజెట్‌ సంస్థ రావడం శుభసూచికం: మంత్రి లోకేష్‌
  • బ్లూజెట్‌ హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు శంకుస్థాపన చేసుకున్నాం: లోకేష్‌
  • రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు కొదవలేదు: మంత్రి లోకేష్‌
  • పెట్టుబడులకు వచ్చిన వారికి అన్ని వసతులు సమయానుకూలంగా అందిస్తున్నాం: లోకేష్‌
  • చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలేలా అభివృద్ధి కార్యక్రమాలు: లోకేష్‌

12:06 PM, 28 Feb 2026 (IST)

రాష్ట్రంలో శరవేగంగా సాగుతోన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

  • రాష్ట్రంలో శరవేగంగా సాగుతోన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
  • ఉదయం 11 గంటలకే 82 శాతం మేర పింఛన్లు అందజేత
  • 62.76 లక్షల మందికి ఇప్పటివరకు 51.86 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
  • 62.76 లక్షల మందికి ఇప్పటివరకు రూ.2,725 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
  • లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్న స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ సిబ్బంది
  • కాసేపట్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలసకు సీఎం
  • లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారితో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం

12:05 PM, 28 Feb 2026 (IST)

సీఎస్​గా సాయి ప్రసాద్​ బాధ్యతల స్వీకరణ

  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ బాధ్యతలు
  • 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన ఎంటెక్‌ పట్టభద్రులు సాయిప్రసాద్
  • 1991 సెప్టెంబర్‌ 15న ఐఏఎస్‌కు ఎంపికైన సాయిప్రసాద్
  • 1992 జూన్ నుంచి 1993 మే వరకు వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా చేసిన సాయిప్రసాద్‌
  • 1993 సెప్టెంబర్‌ నుంచి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా చేసిన సాయిప్రసాద్‌
  • 1995 ఆగస్టు నుంచి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సేవలు
  • 1997 మే నుంచి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలెక్టర్‌గా చేసిన సాయిప్రసాద్‌
  • 2000 జూలై నుంచి 2003 జూన్ వరకూ కర్నూలు కలెక్టర్‌గా చేసిన సాయిప్రసాద్‌
  • 2003 జూన్ నుంచి 2003 అక్టోబర్‌ వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా చేసిన సాయిప్రసాద్‌
  • 2003 అక్టోబర్‌ నుంచి 2004 ఆగస్టు వరకు ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా చేసిన సాయిప్రసాద్‌
  • 2004 ఆగస్టు నుంచి 2006 మే వరకు ఈపీడీపీసీఎల్ సీఎండీగా చేసిన సాయిప్రసాద్‌
  • 2006 మే నుంచి 2010 ఫిబ్రవరి వరకు ఏపీ సీపీడీసీఎల్ సీఎండీగా చేసిన సాయిప్రసాద్‌
  • 2010 ఫిబ్రవరి నుంచి 2011 అక్టోబర్‌ వరకు ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా చేసిన సాయిప్రసాద్‌
  • 2011 అక్టోబర్‌ నుంచి 2014 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా సాయిప్రసాద్‌
  • 2014 జూన్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు సీఎం కార్యదర్శిగా చేసిన సాయిప్రసాద్‌
  • 2016 ఫిబ్రవరి నుంచి 2019 మే వరకు సీఎం ముఖ్య కార్యదర్శిగా చేసిన సాయిప్రసాద్‌
  • 2020 జనవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెట్‌కు సీఎండీ
  • 2022 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకు సీసీఎల్ఏగా చేసిన సాయిప్రసాద్‌
  • 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌
  • 2025 జనవరి నుంచి అదే హోదాలో పనిచేస్తూ సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌

12:05 PM, 28 Feb 2026 (IST)

కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం

  • రాజమహేంద్రవరం: కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం
  • రాజమహేంద్రవరం: వెంటిలేటర్‌పై 11 మందికి డయాలసిస్ అందిస్తున్న వైద్యులు
  • కల్తీ పాల ఘటన బాధితులకు మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శ
  • బాధితులను పరామర్శించిన బుచ్చయ్యచౌదరి, బలరామకృష్ణ, సోము వీర్రాజు

10:50 AM, 28 Feb 2026 (IST)

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

  • తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
  • బి.ఆర్‌.నాయుడు అధ్యక్షతన సమావేశం; హాజరైన ఈవో, అదనపు ఈవో, బోర్డు సభ్యులు
  • 87 అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్న ధర్మకర్తల మండలి
  • అధునాతన హంగులతో నూతన అదనపు అన్నదాన భవనం ఏర్పాటు
  • నూతన అన్నదాన భవనం ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్ సంస్థ
  • ఒంటిమిట్ట కోదండరామ కల్యాణానికి వచ్చే భక్తులకు లడ్డూల పంపిణీకి ఆమోదం తెలపనున్న మండలి
  • టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం రూ.116 కోట్లు వెచ్చించనున్న టీటీడీ
  • టీటీడీ వార్షిక బడ్జెట్‌కు రూ.5,400 కోట్లు ప్రతిపాదనపై చర్చ
  • తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమంపై చర్చ
  • 51 మంది అర్చకుల పదోన్నతిపై ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చ
  • ఆధునిక సాంకేతికతో కానుకల సమర్పణ కోసం శ్రీవారి ముడుపుల పత్రంపై చర్చ

10:49 AM, 28 Feb 2026 (IST)

సాలూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి

  • సాలూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి
  • పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సంధ్యారాణి
  • పేదల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలి: మంత్రి సంధ్యారాణి
  • ప్రతి అర్హుడి తలుపు వద్దకే సంక్షేమం చేరేలా పనిచేస్తున్నాం: మంత్రి సంధ్యారాణి

10:49 AM, 28 Feb 2026 (IST)

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి స్వామి

  • ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి స్వామి
  • దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: మంత్రి స్వామి
  • కల్తీ నెయ్యిపై శాసనమండలిలో చర్చకు రాకుండా వైసీపీ పారిపోతోంది: మంత్రి స్వామి
  • చర్చ జరగకుండా సభ నుంచి తప్పించుకున్నా... దేవుడి నుంచి తప్పించుకోలేరు: మంత్రి స్వామి
  • జగన్‌కు హిందూ ధర్మం పట్ల ఏమాత్రం విశ్వాసం లేదు: మంత్రి డీఎస్‌బీవీ స్వామి
  • కడప జిల్లాలో విగ్రహ ప్రతిష్టకు వెళ్లిన జగన్.. తీర్థం ఇస్తే కింద పడేశారు: మంత్రి స్వామి
  • తీర్థం స్వీకరణకు ఇష్టపడని జగన్.. విగ్రహ ప్రతిష్టకు వెళ్లడం దేనికి?: మంత్రి స్వామి

10:49 AM, 28 Feb 2026 (IST)

ప్రపంచ తెలుగు మహాసభలు

  • అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
  • జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
  • ప్రముఖ ప్రవచనకర్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు హాజరు
  • మహాసభలకు హాజరైన ప్రముఖ సినీ రచయిత తనికెళ్ల భరణి, ఎమ్మెల్యే ఆనందరావు
  • దివంగత నందమూరి తారక రామారావు ప్రాంగణంగా నామకరణం

10:31 AM, 28 Feb 2026 (IST)

అనకాపల్లి జిల్లాలో లోకేష్‌ పర్యటన

  • అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో లోకేష్‌ పర్యటన
  • బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
  • రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్‌కేర్ అభివృద్ధి పనులు
  • రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్‌ ఏర్పాటు
  • 2028-29 ఆర్థిక ఏడాదిలో ప్రారంభంకానున్న బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ కార్యకలాపాలు
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేలమందికి ఉపాధి అవకాశాలు
  • బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 102.48 ఎకరాలు కేటాయింపు

10:31 AM, 28 Feb 2026 (IST)

బనగానపల్లె బీసీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

  • బనగానపల్లె బీసీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
  • లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
  • నిరుపేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

10:30 AM, 28 Feb 2026 (IST)

ప్రకాశం జిల్లా ఏల్చూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

  • ప్రకాశం జిల్లా ఏల్చూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్‌
  • 454 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసిన కలెక్టర్, మంత్రి గొట్టిపాటి
  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నాం: మంత్రి గొట్టిపాటి
  • బడి మానకూడదన్న ఉద్దేశంతో దాతల సహకారంతో సైకిళ్ల పంపిణీ: గొట్టిపాటి
  • లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు వచ్చాయి: గొట్టిపాటి

10:30 AM, 28 Feb 2026 (IST)

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • అమ్మవారి తీర్థ, ప్రసాదాలు మంత్రికి అందజేసి ఆశీర్వదించిన వేదపండితులు
  • అమ్మవారి జ్ఞాపిక, శాలువాతో మంత్రిని సత్కరించిన ఆలయ అధికారులు

10:30 AM, 28 Feb 2026 (IST)

కిడ్నీ బాధితులకు నీరందించే పనులు పూర్తయ్యాయి: ఎంపీ శివనాథ్‌

  • ఏ.కొండూరు మండలం కిడ్నీ బాధితులకు నీరందించే పనులు పూర్తయ్యాయి: ఎంపీ శివనాథ్‌
  • ఎన్టీఆర్‌ జిల్లా: జల్‌జీవన్‌ మిషన్‌ కింద నీరందించే పనులు పూర్తయ్యాయి: ఎంపీ శివనాథ్‌
  • కృష్ణా నది నుంచి నీటిని అందించేందుకు పైప్‌లైన్లు ఏర్పాటు చేశాం: ఎంపీ శివనాథ్‌
  • ట్యాంకుల నిర్మాణం పూర్తయింది.. 38 ప్రభావిత ప్రాంతాలకూ ఒకేసారి నీరందిస్తాం: శివనాథ్‌
  • మార్చిలోనే సీఎం లేదా డిప్యూటీ సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు: ఎంపీ శివనాథ్‌
  • దశాబ్దాల సమస్యకు అనతికాలంలోనే కూటమి ప్రభుత్వం పరిష్కారం: ఎంపీ శివనాథ్‌

10:29 AM, 28 Feb 2026 (IST)

అన్నమయ్య జిల్లా అరవవాండ్లపల్లెలో మృతదేహం

  • అన్నమయ్య జిల్లా అరవవాండ్లపల్లె పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతదేహం
  • హంద్రీనీవా కాల్వకు సమీపంలో గుంతలో పూడ్చిపెట్టిన మృతదేహం
  • రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహం వెలికితీతకు ఏర్పాట్లు
  • జనవరి 4 నుంచి కనిపించకుండాపోయిన దివాకర్(31)గా అనుమానాలు
  • దివాకర్‌ను చంపి పాతి పెట్టారని తల్లి లక్ష్మీదేవి, సోదరుల ఆరోపణ
  • దివాకర్ అదృశ్యమైన రోజు అతనితో ఐదుగురు ఉన్నట్లు చెబుతున్న కుటుంబసభ్యులు

10:29 AM, 28 Feb 2026 (IST)

సోషల్‌ మీడియా దుర్వినియోగం-భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై సదస్సు

  • సోషల్‌ మీడియా దుర్వినియోగం-భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై సదస్సు
  • విజయవాడలో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
  • సదస్సుకు ముఖ్యఅతిధిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి

10:29 AM, 28 Feb 2026 (IST)

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కార్యాలయంలోకి వ్యక్తి చొరబాటు ఘటనపై చర్యలు

  • ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కార్యాలయంలోకి వ్యక్తి చొరబాటు ఘటనపై చర్యలు
  • భద్రతా విభాగం నుంచి ఐదుగురిని మాతృశాఖకు పంపిన ఉన్నతాధికారులు
  • రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌ బి.పెంటారావును మాతృవిభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
  • నలుగురు కానిస్టేబుళ్లను మాతృవిభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
  • ప్రాథమిక విచారణలో భద్రతా వైఫల్యాలు రుజువుకావటంతో చర్యలు

9:01 AM, 28 Feb 2026 (IST)

కల్తీ పాల కేసు

  • రాజమహేంద్రవరం: కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం
  • రాజమహేంద్రవరం: వెంటిలేటర్‌పై 11 మందికి డయాలసిస్ అందిస్తున్న వైద్యులు
  • నేడు కిడ్నీ బాధితులను పరిశీలించనున్న హైదరాబాద్ వైద్య నిపుణుల బృందం
  • ఇప్పటికే కిడ్నీ బాధితులను పరిశీలించిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజు
  • ముంబయి నుంచి తెచ్చిన ఔషధం పదిమంది బాధితులకు అందించిన వైద్యులు
  • పాలలో కలిసిన రసాయనం నిగ్గు తేల్చేందుకు నివేదికల కోసం చూస్తున్న అధికారులు
  • బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ల్యాబ్ నివేదికల కోసం ఎదురుచూపులు
  • లాలాచెరువు ప్రాంతంలో ఇంటింటి సర్వే చేసి స్థానికుల రక్తనమూనాలు సేకరణ

9:00 AM, 28 Feb 2026 (IST)

తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం

  • తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
  • శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో నిండిన అన్ని కంపార్టుమెంట్లు
  • కంపార్టుమెంట్లన్నీ నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,952 మంది భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 27,414 మంది భక్తులు

7:01 AM, 28 Feb 2026 (IST)

మన్యంలో పెద్దపులి సంచారం

  • పోలవరం జిల్లా: రంపచోడవరం మన్యంలో పెద్దపులి సంచారం
  • రంపచోడవరం మండలం తాళ్లపాలెంలో పెద్దపులి సంచారం
  • రాత్రి పశువులపాకలో దూడపై దాడి చేసి చంపేసిన పెద్దపులి
  • 20 రోజుల క్రితం తూ.గో. జిల్లాలో సంచరించిన ఇదే పెద్దపులి
  • ఈనెల 6న కూర్మాపురంలో పులిని బంధించిన అటవీశాఖ సిబ్బంది
  • కొన్ని రోజులు విశాఖ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఉంచిన అధికారులు
  • పులికి రేడియో కాలర్ అమర్చి పాపికొండల అడవిలో వదిలేసిన అధికారులు
  • పాపికొండల్లో వదిలేసిన పెద్దపులి రంపచోడవరం ప్రాంతంలోకి వచ్చినట్లు గుర్తింపు
  • పెద్దపులి సంచారంతో భయాందోళనకు గురవుతున్న గిరిజనులు

6:58 AM, 28 Feb 2026 (IST)

ప్రపంచ తెలుగు మహాసభలు

  • నేటి నుంచి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
  • కోనసీమ జిల్లా అమలాపురంలో రెండ్రోజుల పాటు నిర్వహణ
  • నేడు, రేపు కిమ్స్‌ వైద్య కళాశాల ప్రాంగణంలో కార్యక్రమం ఏర్పాటు
  • తొలిరోజు కార్యక్రమానికి హాజరుకానున్న ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు
  • కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్రమంత్రులు రామ్మెహన్‌, శ్రీనివాసవర్మ
  • హాజరుకానున్న ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు

6:58 AM, 28 Feb 2026 (IST)

నేడు విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటన

  • నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • రావివలస గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం
  • రావివలసలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బాలికలతో మాట్లాడనున్న సీఎం
  • ప్రధాని మోదీ దిల్లీ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న సీఎం
  • సాయంత్రం టీడీపీ కార్యకర్తలతో సమావేశంకానున్న సీఎం చంద్రబాబు
  • రాత్రికి తిరిగి అమరావతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు

6:58 AM, 28 Feb 2026 (IST)

బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ యూనిట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన

  • నేడు అనకాపల్లిలో బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ యూనిట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన
  • రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్‌ ఏర్పాటు
  • బ్లూజెట్ హెల్త్‌కేర్ లిమిటెడ్ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్న లోకేష్
  • రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్‌కేర్ అభివృద్ధి పనులు
  • 2028-29 ఆర్థిక ఏడాదిలో ప్రారంభంకానున్న బ్లూజెట్‌ హెల్త్‌కేర్‌ కార్యకలాపాలు
  • ఈ సంస్థ ఏర్పాటుతో 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన

6:57 AM, 28 Feb 2026 (IST)

జనసేన కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిపై కేసు నమోదు

  • పవన్ కార్యాలయంలోకి చొరబాటు, వాహనాలపై దాడి ఘటనపై కేసు
  • పవన్ ముఖ్య భద్రతాధికారి పెంటారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు
  • నిందితుడు నీలాద్రిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు
  • దాడికి పాల్పడిన నీలాద్రిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్న మంగళగిరి పోలీసులు

6:57 AM, 28 Feb 2026 (IST)

జీజీహెచ్​లో ఆకస్మిక తనిఖీలు

  • గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీలు
  • జీజీహెచ్‌లోని ఎమర్జెన్సీ వార్డుతో పాటు అన్ని వార్డులను పరిశీలించిన కలెక్టర్‌
  • రాత్రి విధుల్లో ఉండే వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్
Last Updated : February 28, 2026 at 10:45 PM IST