ETV Bharat / state

25 February 2026 Andhra Pradesh News Today Live Updates: రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు

AP Live News Updates
AP Live News Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 7:10 AM IST

|

Updated : February 25, 2026 at 10:30 PM IST

Choose ETV Bharat

25 February 2026 Andhra Pradesh News Today Live Updates: నేడు పదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు - ఏపీ మెట్రో రైల్ సంస్థ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ

LIVE FEED

10:29 PM, 25 Feb 2026 (IST)

శ్రీకాకుళంలో ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష

  • శ్రీకాకుళంలో ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
  • డయేరియా వ్యాప్తికి కారణాలు, తీసుకున్న చర్యలపై చర్చ
  • డయేరియాపై జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది: నారాయణ
  • శ్రీకాకుళంలో 102 డయేరియా కేసులు నమోదయ్యాయి: నారాయణ
  • కోలుకున్న పలువురిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు: మంత్రి నారాయణ
  • ఇంకా ఆస్పత్రుల్లో 85 మంది చికిత్స పొందుతున్నారు: నారాయణ
  • ఇద్దరు కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు: నారాయణ
  • 50 బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టాం: మంత్రి నారాయణ

10:28 PM, 25 Feb 2026 (IST)

రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు

  • రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు
  • పలు జిల్లాల్లో 150 పాల నమూనాలు సేకరణ
  • పాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్స్‌కు పంపిన అధికారులు
  • హైదరాబాద్‌, చెన్నై, కాకినాడలోని ల్యాబ్స్‌కు పంపిన అధికారులు
  • పలుచోట్ల నిల్వ ఉంచిన పాలు, పాల పదార్థాలను పారబోసిన అధికారులు
  • అనంతపురం, మచిలీపట్నం, కాకినాడలో పలుచోట్ల తనిఖీలు
  • మరో వారంపాటు తనిఖీలు ఉంటాయన్న అధికారులు

10:01 PM, 25 Feb 2026 (IST)

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడాపోటీల్లో అపశ్రుతి

  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడాపోటీల్లో అపశ్రుతి
  • క్రీడా పోటీల్లో గాయపడిన ఉపసభాపతి రఘురామ
  • కుడిభుజం ఎముక విరగడంతో మణిపాల్ ఆస్పత్రిలో చేరిన రఘురామ
  • రఘురామకృష్ణరాజు భుజానికి కట్టు కట్టిన వైద్యులు

10:00 PM, 25 Feb 2026 (IST)

చిన్నారి పునర్వికా చికిత్స బాధ్యత నాది: మంత్రి లోకేశ్

  • అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్వికా చికిత్స బాధ్యత నాది: లోకేశ్
  • పునర్వికా ప్రాణాలు కాపాడే ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు: లోకేశ్
  • దాతలు ముందుకొచ్చి రూ.10 కోట్లు సమీకరించడం హర్షణీయం: లోకేశ్
  • చిన్నారికి సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు: లోకేశ్
  • మిగతా రూ.6 కోట్లు సమకూర్చి చికిత్స అందేలా చేయడం నా బాధ్యత: లోకేశ్
  • చిన్నారికి అందరూ తమవంతు సాయం అందించాలని కోరుతున్నా: లోకేశ్
  • ఎస్ఎంఏ టైప్-1 అనే అరుదైన, ప్రమాదకరమైన జన్యు వ్యాధి: లోకేశ్
  • కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికా ధైర్యంతో పోరాడుతోంది: లోకేశ్

7:13 PM, 25 Feb 2026 (IST)

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన

  • శ్రీకాకుళం: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన
  • డయేరియాతో మరణించిన సురేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన నారాయణ
  • డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించిన నారాయణ
  • ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉన్నవారిని పరామర్శించిన మంత్రి నారాయణ
  • ప్రస్తుత పరిస్థితులపై ఎమ్మెల్యే శంకర్, కలెక్టర్ స్వప్నల్‌ను అడిగి తెలుసుకున్న మంత్రి

7:12 PM, 25 Feb 2026 (IST)

రాష్ట్రంలో 26 మంది ఆర్డీవోలు బదిలీ

  • రాష్ట్రంలో 26 మంది ఆర్డీవోలు బదిలీ
  • ఆర్డీవోల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ విజయానంద్
  • హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పు మేరకు బదిలీ నిర్ణయం
  • తదుపరి పోస్టింగ్‌ల కోసం జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు

7:12 PM, 25 Feb 2026 (IST)

టీడీపీ నేతపై వైసీపీ వర్గీయుల దాడి

  • పల్నాడు: గురజాల మండలం తేలుకుట్ల టీడీపీ నేతపై వైసీపీ వర్గీయుల దాడి
  • పులిపాడు వద్ద బత్తుల కొండలుపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన వైసీపీ నేతలు
  • బత్తుల కొండలుకు గాయాలు, గురజాల ఆస్పత్రికి తరలింపు

7:12 PM, 25 Feb 2026 (IST)

కాపుల్లో కుంపటి రాజేసి జగన్ రాజకీయం చేస్తున్నారు: కిరణ్ రాయల్‌

  • కాపులపై జగన్‌కు ప్రేమ ఉంటే అంబటిని వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించాలి: కిరణ్ రాయల్‌
  • లేదంటే అంబటిని వైసీపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి: జనసేన నేత కిరణ్ రాయల్‌
  • అంబటిని అలా ప్రకటించే ధైర్యం జగన్‌కు ఉందా..?: జనసేన నేత కిరణ్ రాయల్‌
  • కాపుల్లో కుంపటి రాజేసి జగన్ రాజకీయం చేస్తున్నారు: జనసేన నేత కిరణ్ రాయల్‌
  • కల్తీ నెయ్యి ఘటనలో అసెంబ్లీలో పవన్ స్పష్టంగా మాట్లాడారు: కిరణ్ రాయల్‌
  • పవన్ మనోవేదనను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు: కిరణ్ రాయల్‌
  • రేపట్నుంచి జనసేన సభ్యత్వం పండుగలా కొనసాగుతుంది: కిరణ్ రాయల్‌

7:11 PM, 25 Feb 2026 (IST)

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రభుత్వం యుద్ధం

  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రభుత్వం యుద్ధం
  • 3.45 లక్షలమంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 1,683 ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకాల పంపిణీ
  • బాలికలకు వ్యాక్సిన్ వేసేందుకు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి
  • రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న క్యాన్సర్ కేసుల గుర్తింపు సర్వే
  • ఈ నెల 28న టీకాల పంపిణీని సీఎం ప్రారంభిస్తారు: మంత్రి సత్యకుమార్

5:05 PM, 25 Feb 2026 (IST)

మార్కాపురం ప్రజావేదిక సభకు హాజరైన సీఎం

  • మార్కాపురం ప్రజావేదిక సభకు హాజరైన సీఎం చంద్రబాబు
  • జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం
  • సీఎంకు ఘన స్వాగతం పలికిన మంత్రులు గొట్టిపాటి, డోలా, నిమ్మల
  • వేదిక నుంచి మార్కాపురం జిల్లా ప్రజలకు అభివాదం చేసిన చంద్రబాబు
  • కొత్త జిల్లా ఏర్పాటు చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన జిల్లా ప్రజలు
  • మార్కాపురం జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు: చంద్రబాబు
  • రాష్ట్రానికి మేలు చేసేందుకే పవన్‌ కల్యాణ్‌, నేను కలిశాం: చంద్రబాబు
  • అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు మనదే హవా: చంద్రబాబు
  • వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురం జిల్లాల్లో నూరుశాతం స్ట్రైక్‌రేట్ కావాలి: సీఎం
  • మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా..: చంద్రబాబు
  • మదనపల్లెకు కూడా న్యాయం చేస్తానని చెప్పా.. చేశా..: చంద్రబాబు
  • మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఇచ్చాం..: చంద్రబాబు
  • మూడు వరాలు ఇచ్చేందుకు మార్కాపురం వచ్చా: చంద్రబాబు
  • 1995లోనే మార్కాపురం ప్రజల కష్టాలు చూశా: చంద్రబాబు
  • ఇక్కడి రైతులు సాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారు: చంద్రబాబు
  • వెలిగొండ ప్రాజెక్టు వల్ల మార్కాపురం జిల్లాకు అనేక లాభాలు: చంద్రబాబు

5:03 PM, 25 Feb 2026 (IST)

మండలి ఛైర్మన్ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ జయమంగళ

  • మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీజయమంగళ వెంకటరమణ
  • వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జయమంగళ వెంకటరమణ
  • ఏడాది క్రితం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ
  • రాజీనామా ఆమోదించాలని పలుసార్లు మండలి ఛైర్మన్‌ను కోరిన వెంకటరమణ
  • తన రాజీనామా ఆమోదించాలని మరోసారి కోరిన జయమంగళ వెంకటరమణ

5:02 PM, 25 Feb 2026 (IST)

చైన్ స్నాచింగ్ కేసులో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు వద్ద చైన్ స్నాచింగ్ కేసులో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు

నిందితుడు విజయవాడలో అసిస్టెంట్ లైన్‌మేన్‌గా పనిచేస్తున్న నంద సుభాష్‌

ఇటీవల తిరువూరు మం. చిక్కుళ్లగూడెంలో గొలుసు చోరీ చేసిన సుభాష్‌

నిందితుడి నుంచి 40 గ్రా. బంగారు గొలుసు, బైకు స్వాధీనం చేసుకున్న పోలీసులు

చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు

3:13 PM, 25 Feb 2026 (IST)

యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు

  • హైదరాబాద్‌: యూట్యూబర్ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ
  • అన్వేష్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన పంజాగుట్ట పోలీసులు
  • గతేడాది పంజాగుట్టలో నమోదైన కేసులో లుకౌట్ నోటీసులు జారీ
  • కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో అన్వేష్‌పై నోటీసులు జారీ

3:13 PM, 25 Feb 2026 (IST)

వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం

  • మార్కాపురం: దోర్నాల గంటావానిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన
  • వెలిగొండ ఫీడర్ కాలువ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
  • రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు
  • అరటి, బొప్పాయి సాగుకు ఈ ప్రాంతం అనుకూలమని చెప్పిన రైతులు
  • 11,580 క్యూసెక్కులు ప్రవహించేలా ఫీడర్ కాలువ చేపట్టామన్న అధికారులు
  • మే చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని సీఎంకు తెలిపిన అధికారులు
  • 45 రోజుల్లో 45 టీఎంసీలు డ్రా చేసి నల్లమలసాగర్ నింపుతామని వెల్లడి
  • కంభం చెరువు కూడా నింపేలా కాలువను అనుసంధానించామన్న అధికారులు
  • స్థానిక చెరువులు నింపేందుకు స్ట్రక్చర్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశం
  • రూ.400 కోట్లతో పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచన
  • పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
  • ఏరియల్ వ్యూ ద్వారా నల్లమలసాగర్ ఫీడర్ కెనాల్‌ తిలకించిన చంద్రబాబు
  • మొదటి టన్నెల్‌లో 361 మీ. బెంచింగ్ పనులు పెండింగ్ ఉన్నాయన్న అధికారులు
  • 2.8 కి.మీ. టన్నెల్ కాంక్రీట్ లైనింగ్ వేయాల్సి ఉందన్న అధికారులు
  • 18.8 కి.మీ. రెండో సొరంగంలో 1.1 కి.మీ. పనులు చేపట్టాల్సి ఉందని వివరణ
  • వెలిగొండ పనుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు చెప్పాలని సీఎం ఆదేశం

2:20 PM, 25 Feb 2026 (IST)

హైకోర్టుకు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్

  • గ్రూప్-1 పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులను నాన్ ఫోకల్ పోస్టులలోకి మార్చాలని కోర్టు ఆదేశాలు
  • కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని భావిస్తున్నామన్న ధర్మాసనం
  • ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులపై వివరణ కోరుతూ పిటిషన్ ఫైల్ చేశామన్నఅడ్వకేట్ జనరల్
  • చట్టంలో ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులనే వివరణ లేదని చెప్పిన అడ్వకేట్ జనరల్
  • డిక్షనరీ నిర్వచనం ప్రకారం చేయాలని ఆదేశించిన హైకోర్టు
  • కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా లేదా చెప్పాలని సీఎస్‌ను ప్రశ్నించిన హైకోర్టు
  • ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలన్న హైకోర్టు
  • రీజనబుల్ టైమ్‍లో అమలు చేస్తామన్న సీఎస్ విజయానంద్
  • ఆదేశాల అమలుకు 15 రోజులు సమయం అడిగిన ప్రభుత్వం
  • రెండు రోజుల సమయం కూడా ఇవ్వలేమని చెప్పిన ధర్మాసనం
  • రేపటిలోగా అమలు చేసి కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చిన హైకోర్టు
  • రేపటిలోగా అమలు చేస్తే కోర్టుకు రావాల్సిన అవసరం లేదని చెప్పిన ధర్మాసనం
  • అమలు చేయకపోతే కోర్టుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసిన హైకోర్టు

2:19 PM, 25 Feb 2026 (IST)

జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి?: లోకేష్‌

  • మీడియా ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ చిట్‌చాట్‌
  • బాబాయ్‌ను చంపి కత్తి మా చేతిలో పెట్టారు: మంత్రి లోకేష్‌
  • ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్‌పై వైసీపీ ఆరోపణలు కూడా అలాంటివే: లోకేష్‌
  • హెరిటేజ్‌కు వీఎస్ఆర్ ఏవియేషన్‌కు ఎలాంటి సంబంధం లేదు: మంత్రి లోకేష్‌
  • హెరిటేజ్ ఫిన్ లీస్ అనేది 1996లో స్థాపించిన సంస్థ: మంత్రి లోకేష్‌
  • 2022లో హెరిటేజ్ ఫిన్ లీస్ వద్ద వీఎస్ఆర్ ఏవియేషన్ ఫైనాన్స్ తీసుకుంది: లోకేష్‌
  • అనేక ఇతర సంస్థల మాదిరిగానే వీఎస్ఆర్ కూడా ఫైనాన్స్ తీసుకుంది: లోకేష్‌
  • ఆరోజు మేము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని కలగన్నామా?: లోకేష్‌
  • అజిత్ పవార్ వీఎస్‌ఆర్‌ ఫ్లైట్ ఎక్కుతారని.. అది ప్రమాదానికి గురవుతుందని కలగన్నామా?: లోకేష్‌
  • జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి?: లోకేష్‌
  • క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రతి ప్రశ్నకు దీటైన సమాధానం చెబుతాం: లోకేష్‌
  • వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు అందిస్తా: మంత్రి లోకేష్‌
  • చిల్లర దొంగలను పట్టుకొని గజ దొంగలను వదిలేస్తున్నారన్న బొత్స వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్‌
  • జగన్ గజదొంగ అని బొత్స చెబుతున్నారా? జగన్‌ను పట్టుకోమని బొత్స చెబుతున్నారా?: లోకేష్‌
  • సిట్ విచారణలో తేలింది అంతా అదే కదా: మంత్రి నారా లోకేష్‌
  • మాపై 6కు పైగా కేసులు పెట్టారు: మంత్రి నారా లోకేష్‌
  • ఛార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలి: లోకేష్‌
  • మంత్రులకు అయితే గవర్నర్, ఎమ్మెల్యేలైతే స్పీకర్‌ వద్ద అనుమతి తీసుకోవాలి: లోకేష్‌
  • గవర్నర్‌కు ఆధారాలు ఎందుకు చూపలేదు: మంత్రి నారా లోకేష్‌
  • ఒక్క ఆధారమైన చూపారా?.. వాళ్లు పెట్టినవన్నీ తప్పుడు కేసులు: లోకేష్‌
  • ఎమ్మెల్యేలకు ఒక యూనివర్సిటీ పెట్టాం.. రెసిడెన్షియల్ క్లాసులు పెడతాం: లోకేష్‌
  • రెండు రోజులపాటు వారంతా పార్టీ కార్యాలయంలోనే ఓరియెంటేషన్ క్లాస్‌లో ఉండాలి: లోకేష్‌
  • ఓరియెంటేషన్‌ క్లాస్‌కు ప్రిన్సిపల్‌ సీఎం చంద్రబాబు.. మేమంతా విద్యార్థులమే: లోకేష్‌
  • ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగే మీటింగ్‌లు.. రాజకీయాలకు అతీతం: లోకేష్‌
  • ఫ్యామిలీ కాన్సెప్ట్‌లోనే జరుగుతుంది.. రాజకీయ ప్రస్తావన లేదు: లోకేష్‌

1:40 PM, 25 Feb 2026 (IST)

విధుల్లో నిర్లక్ష్యం

  • శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌ కూర్మారావు సస్పెన్షన్
  • విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతిసార ప్రబలడానికి కారణమయ్యారని చర్యలు
  • ఉన్నతాధికారుల నివేదిక తర్వాత కమిషనర్ కూర్మారావు సస్పెన్షన్‌
  • ఉత్తర్వులు జారీచేసిన మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్

1:27 PM, 25 Feb 2026 (IST)

మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే

  • గుంటూరు జిల్లా కాటూరి మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం
  • వైద్యవిద్య పూర్తిచేసిన 150 మందికి డిగ్రీ పట్టాలు అందించిన గవర్నర్ జస్టిస్‌ నజీర్‌
  • ఆస్పత్రిలో నూతన క్యాథలాబ్‌ను ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
  • నోబెల్ ప్రొఫెషన్ ఆఫ్ మెడిసిన్‌గా వైద్య వృత్తికి ప్రాముఖ్యత ఉంది: గవర్నర్‌
  • ఆరోగ్య సూత్రాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలి: గవర్నర్‌ జస్టిస్‌ నజీర్‌
  • గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు యువ వైద్యులు కృషిచేయాలి: గవర్నర్‌
  • పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం వైద్యుల కర్తవ్యంగా భావించాలి: గవర్నర్‌
  • సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వైద్యులు కూడా అప్‌డేట్ కావాలి: గవర్నర్‌
  • క్రిటికల్ కేర్ వైద్య సేవలందించేలా యువ వైద్యులు నైపుణ్యం పెంపొందించుకోవాలి: గవర్నర్‌
  • మానవత్వంతో వైద్యం అందిస్తే వైద్యులను రోగులు దైవంతో సమానంగా చూస్తారు: గవర్నర్‌

1:27 PM, 25 Feb 2026 (IST)

పాల కేంద్రాల్లో తనిఖీలు

  • మచిలీపట్నంలోని పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
  • పశుసంవర్ధక శాఖాధికారులతో కలిసి అధికారుల తనిఖీలు
  • రెండు పాల కేంద్రాల్లో నమూనాలు సేకరించిన అధికారులు
  • రంగు మారిన బాదంపాలు, పన్నీరు నిల్వలు గుర్తింపు
  • రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనతో తనిఖీల నిర్వహణ

1:27 PM, 25 Feb 2026 (IST)

బంగారం ధర రూ.1,57,600

  • ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,57,600
  • ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,45,180
  • ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ. 2,76,800

1:26 PM, 25 Feb 2026 (IST)

ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

  • బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య
  • బాసర ట్రిపుల్‌ఐటీ బాలికల హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
  • విద్యార్థిని మృతదేహాన్ని భైంసా ఆసుపత్రికి తరలింపు

11:50 AM, 25 Feb 2026 (IST)

తనిఖీలు

  • విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
  • బాంబు స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు
  • కోర్టు ఆవరణలో వాహనాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్న తనిఖీ బృందం

11:50 AM, 25 Feb 2026 (IST)

అమరావతిలో ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన

  • రాజధాని అమరావతిలో ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన
  • ఉండవల్లి పంప్ హౌస్‌ను పరిశీలించిన ఏడీబీ బృందం
  • స్టీల్ బ్రిడ్జి, ప్రధాన రహదారులను పరిశీలించిన ఏడీబీ అధికారులు
  • అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిని వివరించిన సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు

11:47 AM, 25 Feb 2026 (IST)

వెలుగొండ పూర్తిచేసే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు

  • పూర్తికాని వెలుగొండను.. జాతికి అంకితమంటూ జగన్ ప్రజలను మోసగించారు: మంత్రి గొట్టిపాటి
  • గుండ్లకమ్మ గేట్లు విరగ్గొట్టి గత పాలకులు ఇసుక దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి గొట్టిపాటి
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఏం చేసినా చంద్రబాబే చేశారు: మంత్రి గొట్టిపాటి
  • గుండ్లకమ్మ గేట్ల మరమ్మతులతో పాటు కూటమి ప్రభుత్వం గేట్లు బిగించింది: గొట్టిపాటి
  • రైతులకు సకాలంలో నీరు అందించి పంటలను కాపాడాం: మంత్రి గొట్టిపాటి
  • 20 లక్షల చేపపిల్లలను వదిలి మత్స్యకారులకు జీవనోపాధి చూపించాం: గొట్టిపాటి
  • వెలుగొండ పూర్తిచేసే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు చేసి ముందుకెళ్తున్నాం: మంత్రి
  • ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేశాం: మంత్రి గొట్టిపాటి
  • అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపాం: మంత్రి గొట్టిపాటి

11:46 AM, 25 Feb 2026 (IST)

డిసెంబర్ 26 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి

  • భోగాపురం విమానాశ్రయంపై మండలిలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం
  • విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం హైజాక్ చేసిందన్న వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు
  • భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు తీసుకొచ్చింది టీడీపీనే: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
  • ఓర్వకల్లు విమానాశ్రయాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్మిస్తే వైసీపీ హైజాక్ చేసింది: మంత్రి జనార్దన్‌రెడ్డి
  • ఏ సంబంధం లేని వైఎస్‌ విగ్రహాన్ని తీసుకొచ్చి విమానాశ్రయం వద్ద పెట్టారు: బీసీ జనార్దన్‌రెడ్డి
  • వెలుగొండ ప్రాజెక్టును మేము నిర్మిస్తే వైసీపీ వారు హైజాక్ చేశారు: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
  • ఎవరు నిర్మించిన ప్రాజెక్టులను ఎవరు హైజాక్ చేశారో ప్రజలకు తెలుసు: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
  • రూ.2,300 కోట్లతో పీపీపీ విధానంలో విమానాశ్రయం నిర్మిస్తున్నాం: జనార్దన్‌రెడ్డి
  • కూటమి ప్రభుత్వంలో 96 శాతం పనులు పూర్తయ్యాయి: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
    ఈ ఏడాది డిసెంబర్ 26 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
  • ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా విమానాశ్రయం నిర్మాణం: జనార్దన్‌రెడ్డి

11:46 AM, 25 Feb 2026 (IST)

రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలు పెంచేందుకు చర్యలు

  • డయాలసిస్ అంశంపై శాసనమండలిలో మంత్రి సత్యకుమార్‌ సమాధానం
  • ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు: మంత్రి సత్యకుమార్‌
  • రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలు పెంచేందుకు చర్యలు: మంత్రి సత్యకుమార్‌
  • 20 నెలల్లో 14 డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశాం: మంత్రి సత్యకుమార్‌
  • కిడ్నీ మార్పిడి చేసిన రోగులకు పింఛన్లు ఇచ్చే అంశం పరిశీలిస్తున్నాం: మంత్రి
  • కిడ్నీ రోగిపై సగటున రూ.86 వేలు చొప్పున 20 నెలల్లో రూ.224 కోట్లు ఖర్చు పెట్టాం: మంత్రి
  • అతిసార వ్యాధికి నీటి కలుషితమే ప్రధాన కారణం: మంత్రి సత్యకుమార్‌
  • అతిసార వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు: సత్యకుమార్‌
  • ఓవర్ హెడ్ ట్యాంకులను నిరంతరం క్లీనింగ్ చేస్తున్నాం: మంత్రి సత్యకుమార్‌
  • జల్ జీవన్ ద్వారా సురక్షిత నీరు అందించేందుకు చర్యలు: మంత్రి సత్యకుమార్‌

10:19 AM, 25 Feb 2026 (IST)

కల్తీపాల ఘటనలపై సీఎం సమీక్ష

  • శ్రీకాకుళం డయేరియా, రాజమహేంద్రవరం కల్తీపాల ఘటనలపై సీఎం సమీక్ష
  • వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
  • వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా
  • శ్రీకాకుళంలో చికిత్స పొందుతున్న ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా
  • ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని సీఎంకు వివరించిన అధికారులు
  • చికిత్స పొందుతున్న మరొకరికి డయాలసిస్ అందిస్తున్నామన్న అధికారులు
  • వీరిద్దరి వైద్య చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశం
  • క్షేత్రస్థాయిలో ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా అని అడిగి తెలుసుకున్న సీఎం
  • శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరణ
  • ఇద్దరు మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించిన అధికారులు
  • పైపులైన్‌ ద్వారా నీటి సరఫరాను ఆపేశామని సీఎంకు తెలిపిన అధికారులు
  • ప్రత్యామ్నాయాల ద్వారా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నామన్న అధికారులు
  • బాధితులు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపిన అధికారులు
  • పాల నమూనాలను ఇప్పటికే ల్యాబ్‌కు పంపామని చెప్పిన అధికారులు
  • శాఖపరంగా ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించిన అధికారులు
  • ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. నిర్లక్ష్యం వహించొద్దని సీఎం ఆదేశం
  • ఇలాంటివి పునరావృతం కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్న సీఎం

10:18 AM, 25 Feb 2026 (IST)

చికిత్స పొందుతూ మనోహర్‌ మృతి

  • విశాఖ కేజీహెచ్‌లో మృతిచెందిన చిన్నారికి కాసేపట్లో పోస్టుమార్టం
  • విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ నిన్న మనోహర్‌ మృతి
  • రాజమహేంద్రవరం పాల కల్తీ బాధితుడు మనోహర్‌ మృతి
  • కాకినాడ జీజీహెచ్‌ వైద్యుల సిఫారసు మేరకు కేజీహెచ్‌లో వైద్యం
  • ఈనెల 18 నుంచి మనోహర్‌కు అందించిన కేజీహెచ్‌ వైద్యులు
  • కిడ్నీ, రక్తహీనతతో ఆరోగ్యం విషమించి నిన్న మృతిచెందిన మనోహర్‌

10:18 AM, 25 Feb 2026 (IST)

పాల కేంద్రాలపై విస్తృత తనిఖీలు

  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పాల కేంద్రాలపై అధికారుల విస్తృత తనిఖీలు
  • రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
  • మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్‌లో తనిఖీలు చేసిన అధికారులు
  • పాల కేంద్రాల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపిన అధికారులు
  • ఎమ్మార్పీ, తయారీ తేదీ లేని, చాలాకాలం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన బాదంపాల ప్యాకెట్లు గుర్తింపు

9:45 AM, 25 Feb 2026 (IST)

తల్లి, ఆమె ప్రియుడే హతమార్చినట్లు పోలీసుల గుర్తింపు

  • తిరుపతిలో చిన్నారి దుర్గ అదృశ్యం కేసును ఛేదించిన పోలీసులు
  • చిన్నారి దుర్గను తల్లి, ఆమె ప్రియుడే హతమార్చినట్లు పోలీసుల గుర్తింపు
  • రెండు రోజుల క్రితం తిరుపతి బ్లిస్ కూడలి సమీపంలో అదృశ్యమైనట్లు కేసు నమోదు
  • కుమార్తె అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన దుర్గ తల్లి ఆశాలత
  • అనుమానంతో చిన్నారి తల్లి, ఆమె ప్రియుడిని విచారించిన పోలీసులు
  • కుమార్తె దుర్గను ప్రియుడు రెడ్డికుమార్‌తో కలిసి ఆశాలత హతమార్చినట్లు గుర్తింపు
  • తల్లి ఆశాలత, ఆమె ప్రియుడు రెడ్డికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • చిన్నారి మృతదేహాన్ని పాపానాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టినట్లు గుర్తింపు
  • స్వర్ణముఖి నది నుంచి దుర్గ మృతదేహం వెలికితీత, పోస్టుమార్టం నిర్వహణ

9:44 AM, 25 Feb 2026 (IST)

ప్రభుత్వం చర్యలు

  • రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ తొలగింపు
  • గత కొన్ని నెలలుగా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో వివాదాలతో ప్రభుత్వం చర్యలు
  • కొత్త సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాజశేఖర్ కెనడిని నియమించిన ప్రభుత్వం

9:44 AM, 25 Feb 2026 (IST)

కొనసాగుతున్న నమూనాల సేకరణ

  • రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో కొనసాగుతున్న నమూనాల సేకరణ
  • రాజమహేంద్రవరం: బాధితుల రక్త నమూనాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది
  • ప్రైవేట్ ఆస్పత్రుల్లో 15 మందికి చికిత్స, 8 మంది పరిస్థితి ఆందోళనకరం
  • విశాఖకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ పర్యవేక్షణలో వైద్యుల చికిత్స
  • కల్తీ పాలు తాగిన బాధిత ప్రాంతాల్లో కొనసాగుతున్న అధికారుల సర్వే
  • కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో మరోసారి వివరాలు సేకరణ
  • రాజమహేంద్రవరం చౌడేశ్వరినగర్‌లో కొనసాగుతున్న వైద్యశిబిరం

8:57 AM, 25 Feb 2026 (IST)

పాల నమూనాలు సేకరణ

  • అనంతపురంలో పలుచోట్ల విజిలెన్స్ ఆహార తనిఖీ విభాగం అధికారులు
  • మూడు బృందాలుగా విడిపోయి అనంతపురంలో అధికారుల తనిఖీలు
  • అనంతపురం శ్రీకంఠం కూడలి కల్యాణదుర్గం బైపాస్ రామ్‌నగర్‌లో తనిఖీలు
  • ప్రైవేటు వ్యాపారుల నుంచి పాల నమూనాలు సేకరిస్తున్న ఆహార తనిఖీ అధికారులు

8:56 AM, 25 Feb 2026 (IST)

మార్కాపురం జిల్లా పర్యటనకు సీఎం

  • నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
  • కొత్త జిల్లా ప్రకటించాక తొలిసారి మార్కాపురం జిల్లా పర్యటనకు సీఎం
  • వెలుగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
  • రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్‌ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
  • మార్కాపురంలో ప్రజావేదిక సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

7:08 AM, 25 Feb 2026 (IST)

డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

  • శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు రెండుసార్లు ఆరా
  • జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న సీఎం చంద్రబాబు
  • రోడ్ రిపేర్ పనుల వల్ల డయేరియా వ్యాపించిందని సీఎంకు తెలిపిన అధికారులు
  • మొత్తం 65 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరగా 8మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రకటన
  • మరో 55 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపిన అధికారులు
  • బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశం
  • ముఖ్యంగా వెంటిలేటర్‌పై ఉన్న ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశం
  • తాగునీరు కలుషితంకాకుండా క్లోరినేషన్ వేగవంతం చేయాలన్న సీఎం
  • మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించిన సీఎం
  • శ్రీకాకుళం నగరపాలకసంస్థ పరిధిలో తగ్గుముఖం పట్టిన డయేరియా కేసులు
  • దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, గుడివీధిలో ఇంటింటా కొనసాగుతున్న సర్వే
  • మెరుగైన పారిశుధ్యం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కార్పొరేషన్ సిబ్బంది
  • పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరా నిలుపుదల చేసిన అధికారులు
  • నాలుగు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్న అధికారులు
  • డయేరియాతో నిన్న మంగువారితోటకు చెందిన సురేష్(43) మృతి
  • మృతుని కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గొండు శంకర్
  • అసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే గొండు శంకర్
  • ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన కలెక్టర్

7:05 AM, 25 Feb 2026 (IST)

తగ్గుముఖం పట్టిన డయేరియా కేసులు

  • శ్రీకాకుళం నగరపాలకసంస్థ పరిధిలో తగ్గుముఖం పట్టిన డయేరియా కేసులు
  • దమ్మలవీధి, మంగువారితోట, కాకివీధి, గుడివీధిలో ఇంటింటా కొనసాగుతున్న సర్వే
  • మెరుగైన పరిశుద్ధం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన కార్పొరేషన్ సిబ్బంది
  • పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరా నిలుపుదల చేసిన అధికారులు
  • నాలుగు ట్యాంక్‌ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్న అధికారులు
  • డయేరియాతో నిన్న మంగువారితోటకు చెందిన సురేష్ (43) మృతి
  • మృతుని కుటుంబానికి రూ.10 లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గొండు శంకర్
  • ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే గొండు శంకర్
  • ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన కలెక్టర్

7:01 AM, 25 Feb 2026 (IST)

మార్కాపురం జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

  • నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
  • కొత్త జిల్లా ప్రకటించాక తొలిసారి పర్యటనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
  • వెలుగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
  • రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్‌ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన
  • అనంతరం మార్కాపురంలోని ప్రజావేదిక సభలో పాల్గొననున్న సీఎం

6:54 AM, 25 Feb 2026 (IST)

నేడు పదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • నేడు పదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • ఏపీ మెట్రో రైల్ సంస్థ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ
  • తిరుపతి పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ వార్షిక నివేదిక సభలో పెట్టనున్న నారాయణ
  • అసెంబ్లీలో శాఖల వారీగా బడ్జెట్‌ పద్దులపై చర్చ
  • ఆర్‌అండ్‌బీ, రవాణా, దేవాదాయ శాఖల పద్దులపై చర్చ
  • సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ
  • చర్చలో పాల్గొననున్న మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, మండిపల్లి చర్చల్లో పాల్గొననున్న ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్
Last Updated : February 25, 2026 at 10:30 PM IST