ETV Bharat / state

22-02-2026: రాజమహేంద్రవరంలో పలువురికి అస్వస్థత - ఇద్దరు మహిళలు మృతి

AP Live News Updates
AP Live News Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 22, 2026 at 7:15 AM IST

|

Updated : February 22, 2026 at 10:51 PM IST

Choose ETV Bharat

22-02-2026 Andhra Pradesh News Live - రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

LIVE FEED

10:50 PM, 22 Feb 2026 (IST)

బిస్కట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం - భారీగా ఆస్తి నష్టం

  • నంద్యాల: మహానంది మం. గాజులపల్లెలోని బిస్కట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
  • మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, భారీగా ఆస్తి నష్టం
  • నంద్యాల: బిస్కట్ ఫ్యాక్టరీ కార్మికులు అందరూ సురక్షితం

9:32 PM, 22 Feb 2026 (IST)

యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగులు

  • కడప: కాశినాయన మండలం గంగనపల్లిలో దారుణం
  • దిలీప్ అనే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగులు
  • మంటలార్పి యువకుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన వృద్ధుడు
  • దిలీప్‌ను పోరుమామిళ్ల ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు
  • కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

9:31 PM, 22 Feb 2026 (IST)

కిడ్నీ సంబంధిత సమస్యతో మరో వృద్ధురాలు మృతి

  • రాజమహేంద్రవరం: కిడ్నీ సంబంధిత సమస్యతో మరో వృద్ధురాలు మృతి
  • కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాడి కృష్ణవేణి మృతి
  • తాడి కృష్ణవేణి స్వస్థలం రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరినగర్‌
  • కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న 14 మంది బాధితులు
  • కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురైన చౌడేశ్వరినగర్, స్వరూప్‌నగర్ వాసులు
    ఘటనపై ఇంటింటా సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులు
  • కిడ్నీ సంబంధిత సమస్యతో రెండ్రోజుల క్రితం బాసెట్టి కనకరత్నం (76) మృతి

8:07 PM, 22 Feb 2026 (IST)

కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో చర్చ

  • కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో చర్చకు ప్రభుత్వం ఆలోచన
  • శ్రీవారి లడ్డూ అంశాన్ని సభలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం యోచన
  • గత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పాలనుకుంటున్న ప్రభుత్వం
  • ముందు శాసనసభలో చర్చించి తర్వాత మండలిలోనూ చర్చించే యోచన
  • వచ్చే వారంలో ఒకరోజు కల్తీ నెయ్యి అంశంపై చర్చించే అవకాశం

8:06 PM, 22 Feb 2026 (IST)

5 లక్షల గ్రామాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్

  • గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా సహకార ఒప్పందం
  • 5 లక్షల గ్రామాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్ లక్ష్యంతో భారత్ నెట్ ప్రాజెక్ట్‌ అమలు
  • ఏపీలో ఏబీపీ అమలుకు రూ.2,432 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకారం
  • ఏబీపీ కోసం ఏపీబీఐఎల్‌ పేరుతో ఎస్‌పీవీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • డిజిటల్ భారత్ నిధి-ఏపీ అంగీకారంతో నిధులిచ్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు
  • గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్‌ఫ్రా బలోపేతం దిశగా సహకార ఒప్పందం
  • పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేలా సహకార ఒప్పందం
  • రైట్ ఆఫ్ వే, వసతులు, క్షేత్రస్థాయి సమన్వయానికి సహకారం అందించనున్న ఏపీ
  • ఏపీలోని 13,426 పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు
  • ఏపీలో తొలిదశలో 1,692 పంచాయతీల్లో నెట్‌వర్క్ అప్‌గ్రేడ్
  • ఏపీలో రెండోదశలో 11,254 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ పూర్తి
  • కొత్తగా ఏర్పడిన 480 పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు
  • 3,942 గ్రామాల్లో డిమాండ్ ఆధారంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుపై ఫోకస్
  • డిజిటల్ గవర్నెన్స్, ఆన్‌లైన్ విద్య, టెలీ మెడిసిన్‌పై ఏపీ ప్రణాళికలు
  • డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ సేవల బలోపేతం దిశగా ఏపీ ప్రణాళికలు

6:48 PM, 22 Feb 2026 (IST)

భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

  • భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
  • సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సమక్షంలో ఒప్పందం
  • కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
  • ఎంవోయూపై సంతకాలు చేసిన భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
  • భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం
  • గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్‌నెట్‌ లక్ష్యంగా ఒప్పందం
  • డిజిటల్ సేవల విస్తరణకు సహకారం అందించనున్న భారత్ నెట్

6:47 PM, 22 Feb 2026 (IST)

గ్రామీణ డాక్ సేవక్‌ల గౌరవం పెంచేందుకు సింధియా పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు

  • గ్రామీణ డాక్ సేవక్‌ల గౌరవం పెంచేందుకు సింధియా పనిచేస్తున్నారు: సీఎం
  • మరో ఏడాదిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతాం: సీఎం
  • వికసిత్ భారత్‌ సాధనలో గ్రామీణ డాక్ సేవక్‌లు ముందుండాలి: సీఎం
  • తపాలాశాఖలో చేరిన యువతకు అభినందనలు: సీఎం చంద్రబాబు
  • ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్నన్స్ ద్వారా అందిస్తున్నాం: చంద్రబాబు
  • పార్సిల్స్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవక్‌లను వినియోగించుకుంటాం: సీఎం
  • సరైన దారి చూపిస్తే గ్రామీణ డాక్ సేవక్‌లు అద్భుతాలు చేస్తారు: సీఎం

6:47 PM, 22 Feb 2026 (IST)

మేం చదువుకునేటప్పుడు తపాలాశాఖ అందించిన సేవలు మరిచిపోలేం: సీఎం చంద్రబాబు

  • మేం చదువుకునేటప్పుడు తపాలాశాఖ అందించిన సేవలు మరిచిపోలేం: సీఎం
  • మా చిన్నప్పుడు అన్నింటికీ పోస్ట్‌మ్యాన్‌పైనే ఆధారపడే వాళ్లం: సీఎం
  • జ్యోతిరాదిత్య సింధియా.. హార్వర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌లో చదువుకున్నారు: సీఎం
  • వాజ్‌పేయీ హయాంలో గ్వాలియర్‌ రాజమాతతో కలిసి పనిచేశాం: సీఎం
  • మాధవరావు సింధియాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది: సీఎం
  • గాజువాకలో ఒక ప్రాంతానికి సింధియా పేరు ఉంది: సీఎం చంద్రబాబు
  • ఆనాడు వేసిన పునాది వల్లే హైదరాబాద్ గొప్ప నగరంగా మారింది: సీఎం
  • నేనెప్పుడూ టెక్నాలజీని ప్రమోట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు
  • ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తపాలాశాఖ ద్వారానే జరిగేవి: సీఎం
  • కాలక్రమంలో టెలికాం రంగంలో అనేక సంస్కరణలు వచ్చాయి: సీఎం
  • ఎంత సాంకేతికత వచ్చినా గ్రామీణ డాక్‌ సేవక్‌ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: సీఎం
  • దేశంలో 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవక్‌లు ఉన్నారు: సీఎం
  • సూపర్‌సిక్స్‌ పథకాల అమల్లో గ్రామీణ డాక్ సేవక్‌ల సేవలు గొప్పవి: సీఎం

6:45 PM, 22 Feb 2026 (IST)

రాజమహేంద్రవరం లాలాచెరువులో కొందరికి తీవ్ర అనారోగ్యం

  • రాజమహేంద్రవరం: లాలాచెరువులో కొందరికి తీవ్ర అనారోగ్యం
  • చౌడేశ్వరినగర్, స్వరూప్‌నగర్‌ వాసులకు తీవ్ర అనారోగ్యం
  • కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆస్పత్రిలో చేరిన స్థానికులు
  • కోరుకొండకు చెందిన వ్యక్తి పోసిన పాలు తాగటం వల్లే అనారోగ్యం పాలైనట్లు ఆవేదన
  • కలెక్టర్ ఆదేశంతో సర్వే నిర్వహిస్తున్న వైద్యశాఖ, నగరపాలక అధికారులు
  • ృపాలు పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

4:58 PM, 22 Feb 2026 (IST)

ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం జీడీఎస్‌లో ఉంది: పెమ్మసాని

  • ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం జీడీఎస్‌లో ఉంది: పెమ్మసాని
  • మార్పును అందిపుచ్చుకోలేని ఏ సంస్థా మనుగడ సాధించలేదు: పెమ్మసాని
  • పార్సిల్, ఈ కామర్స్‌ విభాగంలో తపాలాశాఖ పోటీపడాలి: పెమ్మసాని
  • పోస్టల్‌ శాఖలో ఏపీని అగ్రస్థానంలో నిలిపినందుకు ధన్యవాదాలు: పెమ్మసాని
  • తపాలా వ్యవస్థ మూలాలు మన మట్టిలోనే ఉన్నాయి: పెమ్మసాని
  • బ్రిటిషర్లు రాకముందే మనకు వివిధ రూపాల్లో తపాలా వ్యవస్థ ఉంది: పెమ్మసాని
  • గ్రామీణ డాక్ సేవక్‌లు వందల ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు: పెమ్మసాని
  • ఆధునిక సాంకేతికత ద్వారా తపాలా సేవలు తగ్గిపోయాయి: పెమ్మసాని
  • ప్రస్తుతం తపాలాశాఖ ఖర్చు రూ.35 వేల కోట్లు.. ఆదాయం రూ.13 వేల కోట్లు: పెమ్మసాని
  • రైల్వే తర్వాత ఎక్కువమంది ఉద్యోగులన్న సంస్థ.. తపాలాశాఖ: పెమ్మసాని
  • తపాలాశాఖకు ఎయిరిండియా పరిస్థితి రాకూడదు: పెమ్మసాని
  • లోటును లాభంగా మార్చాలి.. ఆదాయం ఎలా పెంచాలో ఆలోచించాలి: పెమ్మసాని
  • పోస్టల్ శాఖ పనితీరు మారాలి.. కాలానికి అనుగుణంగా పనిచేయాలి..: పెమ్మసాని
  • సుకన్య సమృద్ధి యోజనలో ప్రతి ఒక్కరూ ఉండాలి: పెమ్మసాని

4:58 PM, 22 Feb 2026 (IST)

పెళ్లి పేరుతో మోసం

  • గుంటూరు: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పెళ్లి పేరుతో మోసం
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.12.2 లక్షలు కాజేసిన యువకుడు
  • నిందితుడు వంశీపై ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబసభ్యులు
  • నిందితుడు వంశీని అరెస్టు చేసిన తెనాలి మూడో పట్టణ పోలీసులు

4:57 PM, 22 Feb 2026 (IST)

ఆధ్యాత్మిక సిటీలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం

  • గుంటూరు: సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం
  • పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య, పెమ్మసాని
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోస్టల్ సదస్సు
  • ఉత్తమ గ్రామీణ డాక్ సేవక్‌లకు అవార్డులు ప్రదానం చేయనున్న అతిథులు

4:57 PM, 22 Feb 2026 (IST)

పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన

  • ప.గో.: పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన నిమ్మల
  • రసాయనాల మిశ్రమంతో లడ్డూలు తయారు చేశారు: మంత్రి నిమ్మల
  • శ్రీవారి మహాత్య్మాన్ని తగ్గించేందుకు జగన్ కుట్ర పన్నారు: మంత్రి నిమ్మల
  • శ్రీవారి పటాలను ప్లకార్డుల రూపంలో మండలిలో ప్రదర్శించారు: నిమ్మల
  • ప్రసాదాల్లో కుంభకోణానికి పాల్పడిన వైసీపీకి తిరుమలపై మాట్లాడే అర్హత లేదు: నిమ్మల
  • ఇండపూర్‌ డెయిరీకి హెరిటేజ్ కొనుగోలుదారే గానీ సరఫరాదారు కాదు: నిమ్మల
  • ఆలయాలకు, ప్రభుత్వానికి నెయ్యి సరఫరా చేయకూడదనేది హెరిటేజ్ నిర్ణయం: నిమ్మల
  • ప్రజల దృష్టి మరల్చేందుకే హెరిటేజ్‌పై నిరాధార ఆరోపణలు: మంత్రి నిమ్మల
  • సెల్ఫ్ డిక్లరేషన్‌ ఇవ్వడం ఇష్టంలేక స్వామివారి దర్శనం వద్దనుకున్నారు: నిమ్మల
  • పండుగరోజు ఇంటివద్ద గుడి సెట్టింగ్ వేసి ప్రజలను మాయ చేశారు: నిమ్మల

4:57 PM, 22 Feb 2026 (IST)

కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యకు ఘనస్వాగతం

  • కాజ టోల్‌గేట్‌ వద్ద కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యకు ఘనస్వాగతం
  • జ్యోతిరాదిత్యను గజమాలతో సత్కరించిన పెమ్మసాని చంద్రశేఖర్‌
  • పోస్టల్ సదస్సులో పాల్గొననున్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
  • ప్రతిభ కనబరిచిన గ్రామీణ డాక్ సేవక్‌లకు అవార్డులు ప్రదానం

4:56 PM, 22 Feb 2026 (IST)

లాలాచెరువు ప్రాంతంలో పలువురికి అనారోగ్యం

  • రాజమహేంద్రవరం: లాలాచెరువు ప్రాంతంలో పలువురికి అనారోగ్యం
  • అనారోగ్యంతో 4 రోజుల క్రితం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన బాధితులు
  • పాలు తాగడం వల్లే అనారోగ్య సమస్యలు వచ్చాయని బాధితుల అనుమానం
  • రాజమహేంద్రవరం: అనారోగ్యానికి కారణాలు, వివరాలు సేకరిస్తున్న వైద్యశాఖ

2:15 PM, 22 Feb 2026 (IST)

జగన్‌కు ప్రజలు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: మంత్రి జనార్దన్‌రెడ్డి

  • నంద్యాల: జగన్‌కు ప్రజలు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: మంత్రి జనార్దన్‌రెడ్డి
  • మండలిలో వైసీపీ నేతల తీరు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు: జనార్దన్‌రెడ్డి
  • మండలిలోకి దేవుడి ఫొటోతో చెప్పులతో వచ్చి మహాపరాధానికి పాల్పడ్డారు: జనార్దన్‌రెడ్డి
  • మండలిలో రాజకీయ ఉనికి కోసం వెంకటేశ్వరస్వామిని తీసుకొచ్చారు: జనార్దన్‌రెడ్డి
  • అన్ని సంప్రదాయాలను గౌరవించే బాధ్యత ఒక పార్టీగా జగన్‌పై ఉంది: జనార్దన్‌రెడ్డి
  • మండలిలో చర్చ జరగకుండా వైసీపీ సభ్యులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: జనార్దన్‌రెడ్డి
  • తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్ర ప్రజలు జగన్‌ను నమ్మరు: జనార్దన్‌రెడ్డి
  • ప్రజా సమస్యలపై చర్చించని వైసీపీ నేతలకు పదవులు ఎందుకు?: జనార్దన్‌రెడ్డి
  • ఏ అంశంపైనైనా చర్చించేందుకు అసెంబ్లీ, కౌన్సిల్‌లో సిద్ధం: జనార్దన్‌రెడ్డి
  • అసెంబ్లీలో చర్చకు సిద్ధమని జగన్‌కు సవాల్ విసురుతున్నాం: జనార్దన్‌రెడ్డి

2:14 PM, 22 Feb 2026 (IST)

ప్రొద్దుటూరు తిమ్మయ్య కాలనీలో చోరీ

  • కడప: ప్రొద్దుటూరు తిమ్మయ్య కాలనీలో చోరీ
  • తాళం వేసిన ఇంట్లో 35 తులాల బంగారం, 40 తులాల వెండి చోరీ
  • ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

2:14 PM, 22 Feb 2026 (IST)

వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి, భయం లేదు: పల్లా శ్రీనివాసరావు

  • విశాఖ: జగన్‌, వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి, భయం లేదు: పల్లా శ్రీనివాసరావు
  • హిందువుల మనోభావాలంటే వైసీపీ నేతలకు లెక్కేలేదు: పల్లా శ్రీనివాసరావు
  • దేవదేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి దిగజారారు: పల్లా శ్రీనివాసరావు
  • జగన్‌ మార్గదర్శకత్వంలో శ్రీవారి ఫొటోలతో రాజకీయం చేసే నీచానికి దిగారు: పల్లా
  • దేవుడి ప్రసాదాన్ని జంతు కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేశారు: పల్లా శ్రీనివాసరావు
  • శ్రీవారి పరకామణి కేసు నిందితుడు రవికుమార్‌తో రాజీ చేసుకున్నారు: పల్లా శ్రీనివాసరావు
  • టీటీడీ నిధులు దారి మళ్లించి తిరుపతి నగరపాలక సంస్థ పేరిట కోట్లు దోచారు: పల్లా

2:14 PM, 22 Feb 2026 (IST)

వైభవంగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర

  • విజయనగరం: రాజాంలో వైభవంగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర
  • ఈనెల 24 వరకు ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహణ
  • పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం
  • ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

2:13 PM, 22 Feb 2026 (IST)

ఇందిరాగాంధీ స్టేడియంలో ఆర్గానిక్ రైతు ఉత్సవం

  • విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రెండో రోజు ఆర్గానిక్ రైతు ఉత్సవం
  • కృష్ణారావుపాలెంలోని మామిడి తోటలో మొదటి రోజు మేళా నిర్వహణ
  • ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • 'సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ' సంయుక్తంగా కార్యక్రమం నిర్వహణ
  • చిరుధాన్యాలు, వివిధ రకాల బియ్యం, పప్పుధాన్యాలు, బెల్లం ఉత్పత్తులతో స్టాళ్లు
  • వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లు, ఆధునిక యంత్రాల ప్రదర్శన
  • జీవామృతం, దేశీ విత్తనాలు, ఆవు ఆధారిత ఉత్పత్తులపై రైతులకు అవగాహన
  • జిల్లాలో ప్రకృతి సాగును లక్ష ఎకరాలకు పెంచడమే లక్ష్యమన్న కలెక్టర్
  • కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ప్రజాప్రతినిధులు

2:13 PM, 22 Feb 2026 (IST)

ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో అశోక్‌ గజపతిరాజు భేటీ

  • విజయనగరం: నాలుగు ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో అశోక్‌ గజపతిరాజు భేటీ
  • విజయనగరం కోటలోని మాన్సాస్ కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో భేటీ
  • పైడితల్లి, మందపల్లి మందేశ్వరస్వామి ఆలయాల ట్రస్ట్‌ బోర్డు సభ్యులతో భేటీ
  • సంతపేట జగన్నాథస్వామి, శ్రీకూర్మనాథస్వామి ఆలయ పాలక మండళ్లతో భేటీ
  • ఆలయాల అభివృద్ధి పనులపై ఈవోలు, పాలకమండలి సభ్యులతో చర్చ
  • విజయనగరం జగన్నాథస్వామి ఆలయ నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం

2:13 PM, 22 Feb 2026 (IST)

రైస్ పుల్లింగ్ పేరిట మోసగించిన వైసీపీ నాయకుడు

  • కదిరి: రైస్ పుల్లింగ్ పేరిట మోసగించిన వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి అరెస్టు
  • రూ.10 లక్షలు తీసుకుని మోసగించిన కృష్ణారెడ్డి అలియాస్‌ డిక్కీ బాబు
  • సత్యసాయి జిల్లా: డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించిన కృష్ణారెడ్డి
  • బాధితుడి ఫిర్యాదుతో నిందితుడు అరెస్టు, రూ.1.04 లక్షలు, కారు స్వాధీనం

12:03 PM, 22 Feb 2026 (IST)

ఓఎన్‌జీసీ సైట్ వద్ద గ్రామస్థుల మహాధర్నా

  • కోనసీమ జిల్లా: ఓఎన్‌జీసీ సైట్ వద్ద గ్రామస్థుల మహాధర్నా
  • అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెంలో గ్రామస్థుల మహాధర్నా
  • వీరవెల్లిపాలెంలో ఓఎన్‌జీసీ పనులు వెంటనే ఆపాలని గ్రామస్థుల నిరసన
  • కోనసీమ జిల్లా: ఓఎన్‌జీసీ సైట్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • ఓఎన్‌జీసీ పనులతో తాగునీరు కలుషితమవుతోందన్న గ్రామస్థులు
  • లంక గ్రామాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్న గ్రామస్థులు

12:03 PM, 22 Feb 2026 (IST)

ఐపీఎస్ పీవీ.సునీల్ కుమార్ సస్పెన్షన్‌ పొడిగింపు

  • ఐపీఎస్ పీవీ.సునీల్ కుమార్ సస్పెన్షన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
  • ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1969లోని రూల్ 3 (3) ప్రకారం నిర్ణయం
  • క్రిమినల్ కేసు పూర్తి లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్‌
  • నగరంపాలెంలో కేసు సర్వీస్ హోదాతో సంబంధం దృష్ట్యా సస్పెన్షన్‌ పొడిగింపు

11:04 AM, 22 Feb 2026 (IST)

మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీ లొంగుబాటు

  • మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
  • మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్‌జీ లొంగుబాటు
  • కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దేవ్‌జీ
  • దేవ్‌జీతో పాటు లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు
  • ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయిన దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి
  • నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్‌జీ సారథ్యం

11:03 AM, 22 Feb 2026 (IST)

శ్రీశైలం మల్లన్న సేవలో మంత్రి సంధ్యారాణి

  • శ్రీశైలం మల్లన్న సేవలో మంత్రి సంధ్యారాణి
  • కుటుంబసమేతంగా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి
  • మంత్రి సంధ్యారాణి దంపతులకు అర్చకుల వేద ఆశీర్వచనం
  • మంత్రి సంధ్యారాణికి స్వామిఅమ్మవార్ల జ్ఞాపిక అందజేసిన ఆలయ అధికారులు

9:19 AM, 22 Feb 2026 (IST)

నేడు భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

  • నేడు భారత్ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
  • సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం
  • సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఒప్పందం
  • భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై ఒప్పందం
  • గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ లక్ష్యం
  • రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణకు సహకారం

9:19 AM, 22 Feb 2026 (IST)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
  • శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌
  • శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్న, ప్రభుత్వ విప్ శ్రీనివాస్

9:18 AM, 22 Feb 2026 (IST)

జగన్ ట్వీట్‌కు మంత్రి లోకేశ్ కౌంటర్

  • ఏఐ సదస్సులో కాంగ్రెస్ నిరసన పట్ల జగన్ ట్వీట్‌కు లోకేశ్ కౌంటర్
  • పెట్టుబడులకు నష్టం చేసిన వ్యక్తే దేశం కోసం చింతిస్తున్నట్లు నటించడం విడ్డూరం: లోకేశ్
  • 2017లో పెట్టుబడుల సదస్సుకు భంగం కలిగేలా జగన్ ధర్నా చేశారు: లోకేశ్
  • 2020లో సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి పెట్టుబడులు రద్దు చేశారు: లోకేశ్
  • 2025లో ప్రభుత్వ నిధుల సమీకరణను అడ్డుకోవాలంటూ ఆర్బీఐకి లేఖ రాశారు: లోకేశ్
  • 2026లో అకస్మాత్తుగా 'ఏఐ సమ్మిట్‌పై ఆందోళన' అంటూ నటిస్తున్నారు: లోకేశ్
  • జగన్‌ ద్వంద్వ వైఖరి పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది: లోకేశ్

7:37 AM, 22 Feb 2026 (IST)

శ్రీశైలం దేవస్థానంలో అగ్నిప్రమాదం - అదుపుచేసిన ఫైర్ సిబ్బంది

  • శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం, భక్తులకు తప్పిన ప్రమాదం
  • అర్ధరాత్రి శ్రీశైలం ఆలయ అబ్బూరు వీఐపీ కాటేజీలో చెలరేగిన మంటలు
  • వీఐపీ కాటేజీ మొదటి అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ పేలి చెలరేగిన మంటలు
  • మంటలు చెలరేగడంతో బయటకు పరుగులు తీసిన 12 మంది భక్తులు
  • ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేసిన ఫైర్ సిబ్బంది

7:35 AM, 22 Feb 2026 (IST)

అద్దంకిలో నిర్బంధ తనిఖీలు

  • ప్రకాశం జిల్లా అద్దంకిలో గరటయ్య కాలనీలో నిర్బంధ తనిఖీలు
  • సరైన పత్రాలు లేని 38 బైకులు, 6 ఆటోలు సీజ్‌ చేసిన పోలీసులు
  • డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
  • 'డ్రగ్స్‌ వద్దు బ్రో - జీవితం ముద్దు' పేరిట అవగాహన కార్యక్రమం

7:10 AM, 22 Feb 2026 (IST)

తిరుమలలో భక్తుల సర్వదర్శనానికి 16 గంటల సమయం

  • తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 16 గంటలు
  • శ్రీవారి సర్వదర్శనం కోసం నిండిన అన్ని కంపార్టుమెంట్లు
  • అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,043 మంది భక్తులు
  • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 32,299 మంది భక్తులు

6:59 AM, 22 Feb 2026 (IST)

యూత్ కాంగ్రెస్ నిరసనపై జగన్ చేసిన ట్వీట్​కు నారా లోకేశ్ కౌంటర్

  • ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసన పట్ల జగన్ చేసిన ట్వీట్ కు నారా లోకేశ్ కౌంటర్
  • దేశ ఆర్థిక ప్రతిష్ఠను బలహీనపరిచిన నిర్ణయాల చరిత్ర ఉన్నవారు, ఇప్పుడు గ్లోబల్ వేదికల గురించి చింతిస్తున్నట్టు నటిస్తున్నారని వ్యాఖ్య
  • 2017లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను భంగం కలిగించేందుకు ఎయిర్‌పోర్ట్ వద్ద జగన్ ధర్నా చేశారని ఎద్దేవా
  • 2019లో గ్లోబల్ పెట్టుబడిదారులతో కుదిరిన పవర్ ఒప్పందాల రద్దు చేశారన్న లోకేశ్
  • 2020లో సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి పెట్టుబడుల రద్దు చేశారన్న మంత్రి
  • 2025లో ప్రభుత్వ నిధుల సమీకరణను అడ్డుకోవాలంటూ ఆర్బీఐకి లేఖ రాసినట్లు వివరణ
  • ఇప్పుడు 2026లో అకస్మాత్తుగా “ఏఐ సమ్మిట్‌పై ఆందోళన” చేయడం హాస్యాస్పదం
  • ఈ రాజకీయ కపటత్వం ఆశ్చర్యం కలిగిస్తోందన్న మంత్రి లోకేశ్

6:56 AM, 22 Feb 2026 (IST)

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
  • ఏపీవ్యాప్తంగా 1,537 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
  • ఇంటర్ పరీక్షలు రాయనున్న 10,57,312 మంది విద్యార్థులు
  • లోపాలకు తావివ్వ కుండా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్న అధికారులు
  • ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న పరీక్ష
  • ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్న అధికారులు
  • విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచన
  • అత్యవసర సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18004251531 ఏర్పాటు

6:54 AM, 22 Feb 2026 (IST)

గుంటూరులో నేడు సీఎం పర్యటన

  • కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి గుంటూరులో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
  • మధ్యాహ్నం గుంటూరు నగరశివారు బొమ్మిడాలనగర్ చేరుకోనున్న సీఎం
  • భారట్‌ నెట్‌కు సంబంధించి ఒప్పంద పత్రాలపై సింధియాతో సంతకం చేయనున్న సీఎం
  • గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళ నంలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం
Last Updated : February 22, 2026 at 10:51 PM IST