ETV Bharat / state

1 March 2026 Andhra Pradesh News Today Live Updates : అమరావతిలో ఉండేవారు 20 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారు: సీఎం చంద్రబాబు

1 March 2026 Andhra Pradesh News Today Live Updates
1 March 2026 Andhra Pradesh News Today Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 1, 2026 at 7:35 AM IST

|

Updated : March 1, 2026 at 10:52 PM IST

Choose ETV Bharat

1 March 2026 Andhra Pradesh News Today Live Updates: నిబంధనల ఉల్లంఘన వల్లే ప్రమాదం - కాకినాడ పేలుడు ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం

LIVE FEED

9:57 PM, 1 Mar 2026 (IST)

ఆస్పత్రిలో ఉన్న ఎవరికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదు: కలెక్టర్‌

  • రోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: నెల్లూరు కలెక్టర్‌
  • నెల్లూరు జీజీహెచ్‌లో త్వరలోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం: కలెక్టర్‌
  • ఆస్పత్రిలో ఉన్న ఎవరికీ, ఎలాంటి ప్రమాదం జరగలేదు: కలెక్టర్‌

9:01 PM, 1 Mar 2026 (IST)

నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం

  • నెల్లూరు జీజీహెచ్ ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం
  • ఐసీయూ ఏసీలో షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం
  • నెల్లూరు: ప్రసూతి, చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు
  • విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంగా వార్డులు
  • భయంతో పరుగులు తీసిన గర్భిణులు, బాలింతలు, సిబ్బంది
  • వెంటనే స్పందించి మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

7:46 PM, 1 Mar 2026 (IST)

భయంతో పరుగులు తీసిన గర్భిణులు, బాలింతలు, ఆస్పత్రి సిబ్బంది

  • నెల్లూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం, పిల్లల వార్డులో మంటలు
  • భయంతో పరుగులు తీసిన గర్భిణులు, బాలింతలు, ఆస్పత్రి సిబ్బంది
  • దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరి బిక్కిరి
  • నెల్లూరు జీజీహెచ్‌లో నిలిచిన విద్యుత్ సరఫరా

7:32 PM, 1 Mar 2026 (IST)

అమరావతిని 'బ్లూ-గ్రీన్' సిటీగా నిర్మాణం చేస్తాం: సీఎం చంద్రబాబు

  • అమరావతిలో జస్టిస్ సిటీ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తాం: సీఎం
  • విజయవంతమైన మధ్యవర్తిత్వానికి గౌరవ వేతనం ఇస్తాం: సీఎం
  • అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, ఇంటర్నేషనల్ లా కౌన్సిల్‌కు సహకరిస్తాం: సీఎం
  • అమరావతిలో మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తాం: సీఎం
  • రాజధానికి 33 వేల ఎకరాలు ఇవ్వడమే మధ్యవర్తిత్వం విజయానికి ఉదాహరణ: సీఎం
  • అమరావతిని 'బ్లూ-గ్రీన్' సిటీగా నిర్మాణం చేస్తాం: సీఎం చంద్రబాబు
    మా నాన్న మధ్యవర్తిగా ఉండి అనేక సమస్యలు పరిష్కరించేవారు: సీఎం
  • వివాదాలు వచ్చినప్పుడు రాజీ మార్గానికి ఉన్న శక్తి నాకు తెలుసు: సీఎం
    న్యాయం త్వరగా లభిస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుంది: సీఎం

7:30 PM, 1 Mar 2026 (IST)

కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి: సీజేఐ

  • న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర: సీజేఐ
  • మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయి: సీజేఐ
  • ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదు: సీజేఐ
  • కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి: సీజేఐ
  • మధ్యవర్తిత్వం వల్ల న్యాయం జరుగుతుందని ఇరుపక్షాలకు నమ్మకం ఉండాలి: సీజేఐ
  • న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకంతోనే ప్రజలు కోర్టులకు వస్తున్నారు: సీజేఐ
  • కొన్ని కేసుల్లో కోర్టులు కూడా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి: సీజేఐ
  • మధ్యవర్తిత్వం అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది: సీజేఐ
  • మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోజనాలను అనేక దేశాల్లో చూశా: సీజేఐ
  • మలేషియాలోని లీగల్‌ బార్‌ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది: సీజేఐ
  • మనదేశంలోనూ ప్రతి స్థాయిలో మధ్యవర్తిత్వం రావాలి: సీజేఐ
  • మనదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది: సీజేఐ
  • మన దేశంలో పరిశ్రమలు, స్టార్టప్స్‌ పెరుగుతున్నాయి: సీజేఐ
  • వ్యాపారం, వాణిజ్య పరంగా అనేక వివాదాలు రావడం సహజం: సీజేఐ
  • అనేక రాష్ట్రాల్లో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుంది: సీజేఐ
  • మధ్యవర్తిత్వం వహించే వారికి శిక్షణ ఇవ్వడం చాలా కీలకం: సీజేఐ

7:29 PM, 1 Mar 2026 (IST)

మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు: సీఎం చంద్రబాబు

  • 2047 నాటికి భారత్‌ నెంబర్‌వన్‌ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది: చంద్రబాబు
  • మన దేశానికి యువత, టెక్నాలజీ పెద్ద బలం: చంద్రబాబు
  • మా చిన్నప్పుడు విద్యుత్ లేక అనేక ఇబ్బందులు పడేవాళ్లం: చంద్రబాబు
  • ఇప్పుడు ప్రతి భవనంపై విద్యుత్ తయారుచేసే స్థాయికి చేరాం: చంద్రబాబు
  • ఏపీలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ నిర్మించడం మన అదృష్టం: చంద్రబాబు
  • మన రాష్ట్రానికి ఇవాళ చరిత్రాత్మకమైన రోజు: సీఎం చంద్రబాబు
  • రాజధాని అమరావతి గురించి సీజేఐకు వివరించాం: సీఎం చంద్రబాబు
  • అమరావతి.. ప్రజా రాజధాని: సీఎం చంద్రబాబు
  • మన పురాణాల్లో అమరావతి అనేది దేవతల రాజధాని: సీఎం చంద్రబాబు
  • సీజేఐ ఇవాళ మొత్తం అమరావతిలో ఉన్నారు.. చాలా సంతోషం..: సీఎం
  • సీజేఐ.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఇక్కడకు వచ్చారు: సీఎం
  • రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారు: సీఎం
  • అమరావతిని గొప్ప నగరంగా నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
    కాలుష్యం లేని నగరంగా అమరావతిని తయారుచేస్తాం: సీఎం చంద్రబాబు
  • అమరావతిలో ఉండేవారు 20 ఏళ్లు ఎక్కువగా జీవిస్తారు: సీఎం చంద్రబాబు
  • కోర్టు కేసుల్లో మధ్యవర్తిత్వానిది కీలక పాత్ర: సీఎం చంద్రబాబు
  • మధ్యవర్తిత్వం విషయంలో చిన్నప్పటి అనుభవాలు పంచుకున్న చంద్రబాబు

6:00 PM, 1 Mar 2026 (IST)

పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

  • కడప జిల్లా: వల్లూరు మం. పుష్పగిరి వద్ద విషాదం
  • పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
  • కడప: ఈతకు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు మృతి
  • మృతులు పోలు శ్రీనాథ్‌(23), చైతన్య (25)గా గుర్తింపు
  • ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు

5:33 PM, 1 Mar 2026 (IST)

అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు

  • అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు
  • పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన
  • జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
  • రూ.165 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ నిర్మాణం
  • పాల్గొన్న సీఎం చంద్రబాబు పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు
  • మొత్తం 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకాడమీ నిర్మాణం
  • ఒకేసారి 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చేలా రూపకల్పన
  • అకాడమీలో 500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆడిటోరియం
  • జీ ప్లస్‌ 8 అంతస్తులతో భారీ హాస్టల్ బ్లాక్ నిర్మాణం
  • అమరావతిలో హైకోర్టు జడ్జిల అతిథిగృహానికి శంకుస్థాపన చేసిన సీజేఐ
  • రూ.69.4 కోట్ల వ్యయంతో 50 వేల చదరపు అడుగుల్లో నిర్మాణం

5:09 PM, 1 Mar 2026 (IST)

కారు, ఆర్టీసీ బస్సు ఢీ - ముగ్గురు మృతి

  • అనంతపురం: కల్యాణదుర్గం మండలం గూబనపల్లిలో రోడ్డు ప్రమాదం
  • కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని కారులో ఉన్న ముగ్గురు మృతి
  • మృతులను కర్ణాటక వాసులుగా గుర్తించిన పోలీసులు

3:32 PM, 1 Mar 2026 (IST)

అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహాలకు శంకుస్థాపన

  • అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహాలకు శంకుస్థాపన
  • హైకోర్టు న్యాయమూర్తుల రెసిడెన్షియల్ ఎన్‌క్లేవ్ ప్రారంభోత్సవం
  • కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు

3:32 PM, 1 Mar 2026 (IST)

కల్తీ నెయ్యి కేసులో ఉచ్చు బిగుస్తున్నందునే నాపై దుష్ప్రచారం: బీ.ఆర్‌ నాయుడు

  • వైసీపీవి దిగజారుడు రాజకీయాలు: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌నాయుడు
  • కల్తీ నెయ్యి కేసులో ఉచ్చు బిగుస్తున్నందునే నాపై దుష్ప్రచారం: బీఆర్‌నాయుడు
  • ఏకసభ్య కమిటీ వస్తుండటంతో నాపై దాడి ప్రారంభించారు: బీఆర్‌నాయుడు
  • నా రాజీనామా కోరేందుకు భూమన ఎవరు?: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌నాయుడు
  • భూమన అక్రమాలు బయటపెట్టాననే నాపై బురద వేస్తున్నారు: బీఆర్‌నాయుడు
  • ఫేక్‌ వీడియోలు సృష్టించి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు: బీఆర్‌నాయుడు
  • నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై న్యాయపోరాటం చేస్తా: బీఆర్‌నాయుడు

3:31 PM, 1 Mar 2026 (IST)

పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత - 9 మంది మృతి

  • పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత, 9 మంది మృతి
  • కరాచీ: 18 మంది నిరసనకారులకు గాయాలు
  • కరాచీ: యూఎస్ కాన్సులేట్ వద్ద హింసాత్మకంగా మారిన నిరసనలు
  • ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో నిరసనలు
    కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై నిరసనకారుల దాడి
  • కరాచీ: నిరసనకారులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం
  • నిరసనల కారణంగా కరాచీలో పలు రహదారులు మూసివేత

3:31 PM, 1 Mar 2026 (IST)

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు
  • టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు, నగర నడిబొడ్డును లక్ష్యంగా చేసుకున్నామన్న ఇజ్రాయెల్
  • ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు
  • ఉగ్రవాద పాలన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
  • గత 24 గంటలుగా ఇజ్రాయెల్ వైమానిక దళం భారీ ఎత్తున దాడులు చేసింది: ఐడీఎఫ్‌
  • తాజా పేలుళ్ల కారణంగా టెహ్రాన్ ఆకాశంలోకి భారీ ఎత్తున ఎగసిపడిన దట్టమైన పొగలు
  • గల్ఫ్ ప్రాంతాలపై దాడులు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ తాజా దాడులు

2:25 PM, 1 Mar 2026 (IST)

9 కోర్కెలు పరిష్కరించాం

  • మన్యం జిల్లా టీడీపీ కార్యాలయంలో మంత్రి సంధ్యారాణి మీడియా సమావేశం
  • అంగన్వాడీ సిబ్బంది పది డిమాండ్లలో 9 కోర్కెలు పరిష్కరించాం: సంధ్యారాణి
  • అంగన్వాడీ డిమాండ్లపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేస్తుంది: మంత్రి సంధ్యారాణి
  • గతంలో మీరు 40 రోజులు ధర్నా చేస్తే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు: సంధ్యారాణి
  • చంద్రబాబు నాయకత్వంలో మీ సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి సంధ్యారాణి
  • మూడుసార్లు జీతాలు పెంచి మీకు భరోసా ఇచ్చిన ఘనత చంద్రబాబుదే: మంత్రి
  • అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సంధ్యారాణి

2:25 PM, 1 Mar 2026 (IST)

రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి

  • కర్నూలులో మెగా ఈ.ఎస్.ఎం. ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
  • సరిహద్దులో సైనికుల కృషి వల్లే దేశం ప్రశాంతంగా ఉంది: మంత్రి టీజీ భరత్‌
  • ప్రజలకు రక్షణ కల్పిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనివి: మంత్రి టీజీ భరత్‌
  • సైనికులు, వారి కుటుంబాలకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం: టీజీ భరత్‌
  • విశ్రాంత ఉద్యోగుల పిల్లలకు ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో ఉద్యోగ అవకాశాలు: మంత్రి
  • ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నా: టీజీ భరత్‌
  • అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్‌ను రిలయన్స్ సంస్థ ఓర్వకల్లులో ఏర్పాటు చేసింది: మంత్రి
    త్వరలో అంబానీ వచ్చి అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్‌ ప్రారంభిస్తారు: మంత్రి టీజీ భరత్‌
  • రిలయన్స్ సంస్థ ద్వారా 4 వేలమందికి ఉద్యోగ అవకాశాలు: మంత్రి టీజీ భరత్‌
  • కర్నూలులో టీజీవీ సంస్థల తరుపున సేవా కార్యక్రమాలు చేస్తున్నాం: టీజీ భరత్‌

2:24 PM, 1 Mar 2026 (IST)

అద్దంకిలో మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పర్యటన

  • వేమ‌వ‌రం ప్రభుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
  • త‌ల్లిదండ్రుల‌కు పిల్లల చ‌దువులు భారం కాకూడ‌ద‌నే ఉచితంగా సైకిళ్ల పంపిణీ: గొట్టిపాటి
  • ప్రభుత్వ పాఠ‌శాలలు, ఇంట‌ర్, పాలిటెక్నిక్ చ‌దివే పేద విద్యార్థుల‌కు సైకిళ్లు: మంత్రి గొట్టిపాటి
  • దాతల సహాయంతో 8 వేలకుపైగా సైకిళ్లను ఉచితంగానే అందించాం: మంత్రి గొట్టిపాటి
  • దాత‌ల స‌హాయంతో త్వర‌లోనే పాఠశాలల్లో సుర‌క్షిత తాగునీటి ప్లాంట్లు: మంత్రి గొట్టిపాటి

2:24 PM, 1 Mar 2026 (IST)

తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్న స్పీకర్ అయ్యన్న

  • బహ్రెయిన్‌లోని ప్రవాస తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్న స్పీకర్ అయ్యన్న
  • ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి: స్పీకర్‌
  • ఏపీకి చెందిన సుమారు 50 వేలమంది అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు: స్పీకర్‌
  • ముఖ్యంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందినవారు అనేకమంది ఉన్నారు: స్పీకర్‌
  • ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌లో స్థిరపడినవారు ఉన్నారు: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు
  • ఎన్నారై శెట్టి సతీష్‌కు ఫోన్ చేసి తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్నా: స్పీకర్‌
  • బహ్రెయిన్‌లో ఉన్న తెలుగువారంతా అప్రమత్తంగా ఉండాలి: స్పీకర్‌
  • ఏపీఎన్ఆర్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం: స్పీకర్‌
  • అవసరమైతే స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటాం: స్పీకర్‌
  • కేంద్రమంత్రి రామ్మోహన్‌తో మాట్లాడి సహాయచర్యలు చేపడతాం: స్పీకర్‌
  • స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎన్నారైలు

2:21 PM, 1 Mar 2026 (IST)

అసత్య ప్రచారాలకు నేనేమీ బెదరను

  • ఐదు భాషల్లో భగవద్గీత అని కోటి పుస్తకాలు ప్రచురించి.. రూ.50 కోట్లు ఖర్చుపెట్టారు
  • ప్రచురించిన పుస్తకాల్లో భగవద్గీత పూర్తి సారం లేదు.. అసమగ్రంగా ఉంది
  • స్కామ్‌లలో ఇరుక్కున్నవాళ్లు నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు
  • నాకు ఈ పదవేమీ బతుకుదెరువు కాదు... ప్రక్షాళన చేద్దామనే వచ్చా
  • అసత్య ప్రచారాలకు నేనేమీ బెదరను.. నా పని నేను చేసుకుంటూ వెళ్తా
  • అసలు ఆ వీడియోల్లో తప్పు ఏముంది?.. అసభ్యత ఏముంది?
  • ఆ వీడియోల్లో ఉన్నవారు నా కుటుంబ స్నేహితులు
  • 30 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న కుటుంబ స్నేహితులు
  • కుటుంబ స్నేహితులతో గడిపితే తప్పేముంది?
  • సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే నన్ను నియమించారు.. దానికి న్యాయం చేస్తున్నా

2:20 PM, 1 Mar 2026 (IST)

శ్రమదానం

  • ప.గో. జిల్లా: పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) శ్రమదానం
  • శ్మశానవాటిక అభివృద్ధి పనుల్లో గ్రామస్థులతో కలిసి శ్రమదానం చేసిన నిమ్మల
  • శ్మశాన వాటికలో పిల్లర్ల ఏర్పాటుకు బోర్లు తవ్వి, ఐరన్ పనిచేసిన నిమ్మల
  • కార్మికులతో కలిసి పిల్లర్స్ నిర్మాణంలో ఇసుక, కంకర, సిమెంట్ మోసిన నిమ్మల
  • పాలకొల్లు నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా తీర్చిదిద్దాలి: నిమ్మల
  • మనిషి పుట్టుకతో పాటు మరణం కూడా అంతే ముఖ్యం: మంత్రి నిమ్మల
  • యువతను చెడు వ్యసనాలకు దూరం చేయాలి: మంత్రి నిమ్మల రామానాయుడు
  • గ్రామ అభివృద్ధి పనుల్లో యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యం: నిమ్మల

10:48 AM, 1 Mar 2026 (IST)

భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్

  • జమ్ముకశ్మీర్: ఎల్‌ఓసీ దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్
  • కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ దాటి వచ్చిన పాక్ డ్రోన్
  • పాక్ డ్రోన్‌ను కూల్చేందుకు కాల్పులు జరిపిన సైనిక దళాలు
  • దిగ్వార్ ప్రాంతంలో కొద్దిసేపు తిరిగి పీవోకేలోకి వెళ్లిపోయిన పాక్ డ్రోన్

10:47 AM, 1 Mar 2026 (IST)

కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన

  • తిరుపతిలో కోర్టు భవనాల సముదాయానికి శంకుస్థాపన శుభసూచికం: సీజేఐ
  • న్యాయవ్యవస్థ మరింత బలోపేతమవుతోంది: సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
  • నూతనంగా వచ్చే న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు: సీజేఐ
  • ప్రజలు తమకు న్యాయం జరగాలని కోర్టు మెట్లు ఎక్కుతారు: సీజేఐ
  • న్యాయవాదులు సరిగ్గా ఆలోచిస్తేనే వారికి సరైన న్యాయం జరుగుతుంది: సీజేఐ
  • అనారోగ్య సమస్య రాగానే నయమవుతుందన్న నమ్మకంతో ఆస్పత్రికి వెళ్తారు: సీజేఐ
  • వైద్యులు ఇచ్చిన భరోసాతో తమకు స్వస్థత చేకూరుతుందని నమ్ముతారు: సీజేఐ
  • కోర్టుకు వచ్చామంటే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం రావాలి: సీజేఐ
  • న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలి: సీజేఐ
  • తిరుపతిలో కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసుకున్నాం: సీజేఐ
  • వెంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుపతికి చాలామంది వస్తారు: సీజేఐ
  • తిరుపతిలోని నూతన భవనం ప్రజలకు మరో ఆలయం మాదిరిగా ఉంటుందని నమ్మతున్నా: సీజేఐ
  • న్యాయం కోసం వచ్చిన వారికి పూర్తి నమ్మకం కలిగినప్పుడే సంతృప్తి ఉంటుంది: సీజేఐ
  • అన్ని మౌలిక వసతులతో నూతన భవనాల ఏర్పాటు జరుగుతోంది: హైకోర్టు సీజే
  • త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి: హైకోర్టు సీజే
  • అధునాతన సాంకేతిక సౌకర్యాలు కల్పించే దిశగా ప్రణాళికలు: హైకోర్టు సీజే
  • ఒకసారి జమ్ముకశ్మీర్‌లో వరదలు వచ్చినప్పుడు కోర్టు భవనంలోకి నీళ్లు వచ్చాయి: హైకోర్టు సీజే
  • సిబ్బంది మొత్తం తాత్కాలికంగా శిబిరం ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహించారు: హైకోర్టు సీజే

9:54 AM, 1 Mar 2026 (IST)

పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో పేలుడు

  • మహారాష్ట్ర: నాగ్‌పుర్‌లో భారీ పేలుడు (Blast in Nagpur), 15 మంది మృతి
  • మహారాష్ట్ర: కటోల్‌లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ఘటన
  • పేలుడు ఘటనలో 15 మంది మృతిచెందినట్లు పోలీసుల వెల్లడి

9:54 AM, 1 Mar 2026 (IST)

నీతీశ్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు

  • బిహార్ సీఎం నీతీశ్‌కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొంటూ మరింత ప్రజా సేవచేయాలని ఆకాంక్ష

8:43 AM, 1 Mar 2026 (IST)

మరొకరు మృతి

7:32 AM, 1 Mar 2026 (IST)

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పర్యటన

  • నేడు తిరుపతి, అమరావతిలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Suryakant) పర్యటన
  • తిరుపతి, అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీజేఐ
  • నేడు శ్రీవారి సేవలో పాల్గొననున్న సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌
  • అనంతరం తిరుపతి కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్న సీజేఐ
  • మధ్యాహ్నం అమరావతి చేరుకోనున్న జస్టిస్ సూర్యకాంత్‌
  • సీఎంతో కలిసి న్యాయమూర్తుల గెస్ట్ హౌస్, క్లబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీజేఐ
  • కొత్తగా నిర్మించిన న్యాయమూర్తుల రెసిడెన్సియల్ ఎన్‌క్లేవ్‌ను ప్రారంభించనున్న సీజేఐ
  • విజయవాడలో మధ్యవర్తిత్వంపై రాష్ట్రస్థాయి చర్చలో పాల్గొననున్న సీజేఐ

7:32 AM, 1 Mar 2026 (IST)

క్షతగాత్రులను పరామర్శించిన పవన్‌కల్యాణ్‌

  • కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
  • వేట్లపాలెం బాణాసంచా ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన పవన్‌కల్యాణ్‌
  • పవన్‌ వెంట వెళ్లిన హోంమంత్రి అనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.నారాయణ
  • పవన్‌ వెంట మంత్రి దుర్గేష్, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్‌బాబు
  • అధికారులతో మాట్లాడి ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న పవన్‌
  • ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్న పవన్‌

7:32 AM, 1 Mar 2026 (IST)

రోడ్డుప్రమాదం

  • ప్రకాశం: రాత్రి అద్దంకిలోని మధురానగర్ సమీపంలో రోడ్డుప్రమాదం
  • అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బైక్‌, ఇద్దరు యువకులు మృతి
  • అద్దంకి మం. కొంగపాడుకు చెందిన వినోద్‌ (32), చిన్న (25) మృతి
  • మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Last Updated : March 1, 2026 at 10:52 PM IST