LIVE UPDATES : ముగిసిన శాసనసభ సమావేశాలు - అసెంబ్లీ రేపటికి వాయిదా

Published : January 5, 2026 at 10:06 AM IST
|Updated : January 5, 2026 at 4:56 PM IST
Telangana Assembly Live Updates : నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉభయసభల ముందుకు సాధారణ పరిపాలన గెజిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి తీసుకురానున్నారు. తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ వార్షిక నివేదికలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉభయ సభల్లో పెడతారు. తెలంగాణ యూనివర్శిటీ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లులను సీఎం శాసన సభలో ప్రవేశపెడతారని అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి తెలిపారు. శాసనసభలో ఆమోదం పొందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండలిలో ప్రవేశ పెడతారు. శాసన సభలో ఆమోదం పొందిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఇవాళ మంత్రి సీతక్క మండలిలో ప్రవేశ పెడతారు.
LIVE FEED
అసెంబ్లీ రేపటికి వాయిదా
- అసెంబ్లీ రేపటికి వాయిదా
సీఎం రేవంత్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- సీఎం రేవంత్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- సీఎం రేవంత్‌రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన కింద బీఆర్ఎస్ ఫిర్యాదు
- నదీజలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఫిర్యాదు
- అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినిట్స్‌పై సీఎం తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు
- రాయలసీమ ఎత్తిపోతల పనుల నిలిపివేతపై తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు
- కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందంపై తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఫిర్యాదు
- సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని సభాపతిని కోరిన బీఆర్ఎస్
- స్పీకర్ సూచన మేరకు శాసనసభ కార్యదర్శికి నోటీసు ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
నాకు హోంశాఖ ఇస్తే బాగుంటుంది: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
- ప్రభుత్వంలో చేరడానికి నాకు అభ్యంతరం లేదు: కూనంనేని సాంబశివరావు
- నాకు హోంశాఖ ఇస్తే బాగుంటుంది: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
జీఎస్టీ సవరణ బిల్లుపై స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు
- శాసనసభలో స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపిన బీజేపీ ఎమ్మెల్యేలు
- జీఎస్టీ సవరణ బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ ఆరోపణ
- ఫ్లోర్ లీడర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్
పోలవరం-నల్లమలసాగర్ అంతర్రాష్ట్ర నిబంధనలకు వ్యతిరేకం: ఉత్తమ్
- పోలవరం- నల్లమలసాగర్‌ను అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నాం: ఉత్తమ్
- పోలవరం-నల్లమలసాగర్ అంతర్రాష్ట్ర నిబంధనలకు వ్యతిరేకం: ఉత్తమ్
- నల్లమలసాగర్‌ను వ్యతిరేకిస్తూ జీఆర్ఎంబీకి లేఖ రాశాం: మంత్రి ఉత్తమ్
- మా అభిప్రాయాన్ని గోదావరి బోర్డు కూడా సమర్ధించింది
- పోలవరం- నల్లమలసాగర్‌ను మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకించాయి: ఉత్తమ్
- రిట్ పిటిషన్ కాదు.. సూట్ పిటిషన్‌తో రావాలని సుప్రీం సూచించింది: ఉత్తమ్
- ఈ కేసులో స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును వచ్చేవారం కోరుతాం
- సుప్రీంకోర్టు తదుపరి విచారణకు స్వయంగా హాజరవుతా: మంత్రి ఉత్తమ్
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల ఆగింది
- గతంలో ఆగి ఉంటే బీఆర్ఎస్ ఎందుకు చెప్పలేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఇటీవల జీఎస్టీ స్లాబుల్లో చేసిన సవరణ వల్ల రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం జరిగింది
- జీఎస్టీని అమలు చేస్తున్నది కేంద్రప్రభుత్వం: మంత్రి జూపల్లి
- ఇటీవల జీఎస్టీ స్లాబుల్లో చేసిన సవరణ వల్ల రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం జరిగింది
- ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, వే బిల్స్ అంశాలు కేంద్రం పరిధిలోనే ఉన్నాయి
- ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్, జీఎస్టీ అమలులో రాష్ట్రం పనితీరు మెరుగ్గా ఉంది
- జీఎస్టీ స్లాబులను తగ్గించామని కేంద్రం, బీజేపీ నేతలు పదేపదే చెప్తున్నారు
- జీఎస్టీ స్లాబుల తగ్గింపు.. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉంది
- పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తున్నది ఎక్కువ.. మనకు రాష్ట్రం ఇస్తున్నది తక్కువ: మంత్రి జూపల్లి
శాసనమండలి రేపటికి వాయిదా
శాసనమండలి రేపటికి వాయిదా
జీఎస్టీ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోంది: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
- జీఎస్టీ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోంది: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
- జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు ఇస్తోంది: ఎమ్మెల్యే అక్బరుద్దీన్
- జనాభా ప్రాతిపదికన వల్ల నిధులు రాష్ట్రానికి తక్కువగా వస్తున్నాయి: అక్బరుద్దీన్
- వన్ నేషన్- వన్ ట్యాక్స్ పేరిట రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు: అక్బరుద్దీన్
- జీఎస్టీ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
- రాష్ట్రానికి నిధులు రావడం లేదు, నీళ్లు రావడం లేదు: అక్బరుద్దీన్ ఓవైసీ
- డిలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో లోక్‌సభ సీట్లు తగ్గుతాయి: అక్బరుద్దీన్
తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది: కవిత
కవిత అప్‌డేట్
- ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది: కవిత
- నాది ఆత్మగౌరవ పంచాయితీ, ఆస్తుల పంచాయితీ కాదు: కవిత
- రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ వేదిక రాబోతోంది: కవిత
- విద్యార్థులు, నిరుద్యోగులు.. అన్నివర్గాల కోసం పనిచేస్తా: కవిత
- అవమానభారంతో అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నా: కవిత
- పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నా: కవిత
- అన్ని బంధనాలు తెంచుకుని మీకోసం వస్తున్నా.. ఆశీర్వదించండి: కవిత
- తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది: కవిత
- వచ్చే ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుంది: కవిత
- కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతా: కవిత
- వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా.. రాజకీయ శక్తిగా తిరిగివస్తా: కవిత
భావోద్వేగంతో రాజీనామా చేయడం సరికాదు: సుఖేందర్‌రెడ్డి
కవిత రాజీనామా
- కవిత ఆవేదనను అర్థం చేసుకున్నాం: మండలి ఛైర్మన్ గుత్తా
- కవిత భావోద్వేగంతో రాజీనామా చేశారు: మండలి ఛైర్మన్ గుత్తా
- భావోద్వేగంతో రాజీనామా చేయడం సరికాదు: సుఖేందర్‌రెడ్డి
- కవిత రాజీనామాపై పునరాలోచన చేయాలి: గుత్తా సుఖేందర్‌రెడ్డి
- రాజీనామా చేసి 4 నెలలైంది.. దయచేసి ఆమోదించండి: కవిత
- రాజీనామాపై పునరాలోచన లేదు.. ఆమోదించండి: కవిత
రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ వేదిక రాబోతోంది: కవిత
- ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది: కవిత
- నాది ఆత్మగౌరవ పంచాయితీ, ఆస్తుల పంచాయితీ కాదు: కవిత
- రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ వేదిక రాబోతోంది: కవిత
- విద్యార్థులు, నిరుద్యోగులు.. అన్నివర్గాల కోసం పనిచేస్తా: కవిత
- అవమానభారంతో అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నా: కవిత
- పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని వస్తున్నా: కవిత
- అన్ని బంధనాలు తెంచుకుని మీకోసం వస్తున్నా.. ఆశీర్వదించండి: కవిత
- తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది: కవిత
- వచ్చే ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుంది: కవిత
- కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతా: కవిత
- వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా.. రాజకీయ శక్తిగా తిరిగివస్తా: కవిత
మండలిలో ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టిన కవిత
- శాసనమండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం
- మండలిలో ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టిన కవిత
- పార్టీ నన్ను ఘోరంగా అవమానించింది: కవిత
- ఈడీ, సీబీఐతో పోరాడేటప్పుడు పార్టీ నాకు అండగా నిలవలేదు: కవిత
- కేసీఆర్‌పై కక్షతో బీజేపీ నన్ను జైలులో పెట్టించింది: కవిత
- కేసీఆర్‌పై విమర్శలు వచ్చినా బీఆర్‌ఎస్ నేతలు స్పందించలేదు: కవిత
- బీఆర్‌ఎస్ ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేశా: కవిత
- రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయి: కవిత
- బాధతో.. ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నా: కవిత
- పార్టీలో ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు: కవిత
- పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ఎలా ఉంటుంది: కవిత
- నన్ను కక్ష గట్టి పార్టీ నుంచి బయటకు పంపారు: కవిత
- ఎనిమిదేళ్లు స్వతంత్ర సంస్థ నడిపించాను: కవిత
- పార్టీలో.. ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించా: కవిత
- అమరుల స్థూపం మొదలుకుని కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతే: కవిత
- ఒక్క వానకే సిద్దిపేటలో కలెక్టరేట్ కొట్టుకుపోయింది: కవిత
- తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని పార్టీలో కోరాను: కవిత
- అమరవీరులను బీఆర్‌ఎస్ ఎప్పుడూ గుర్తించలేదు: కవిత
- నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు: కవిత
- బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నోసార్లు అడిగాను: కవిత
- బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేకపోవడం నాకు అవమానకరం: కవిత
- కేసీఆర్‌ను అడిగే ధైర్యం నాకే ఉందని ఎన్నో విషయాలు అడిగా: కవిత
- బీఆర్‌ఎస్‌గా పేరు మార్పును నేను ఒప్పుకోలేదు: కవిత
- తెలంగాణలో ఎన్నో చేయాల్సి ఉన్నా వదిలేసి దిల్లీకి గురిపెట్టారు: కవిత
- కొన్ని సంస్థలకే రూ.వేల కోట్ల టెండర్లు వెళ్లాయి: కవిత
పలు సందర్భాల్లో కూడా రాజీనామా ఆమోదించాలని కోరాను
- గతేడాది సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా
- ఛైర్మన్ ఫార్మాట్‌లోనే ఎమ్మెల్సీ పదవి రాజీనామా పంపాను
- ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు
- పలు సందర్భాల్లో కూడా రాజీనామా ఆమోదించాలని కోరాను
- రాజీనామాపై 4 నెలల సమయంలోనూ నిర్ణయం తీసుకోలేదు
- ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బీఆర్‌ఎస్, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు
కేంద్రంలో బలహీనవర్గాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి: పొన్నం
- బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం.. కేటాయించిన నిధులు ఖర్చు చేస్తాం: పొన్నం
- రాష్ట్రవ్యాప్తంగా బీసీ మహిళల ఉపాధికి కుట్టు మిషన్లు అందిస్తాం: పొన్నం
- పైలట్ ప్రాజెక్టుగా మధిరలో బీసీ మహిళలకు పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి: పొన్నం
- పాడి పరిశ్రమ అభివృద్ధికి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పథకం అమలు: పొన్నం
- సీఎం, డిప్యూటీ సీఎంను ఆహ్వానించి బీసీ నాయకులతో భేటీ నిర్వహిస్తాం: పొన్నం
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: పొన్నం
- కేంద్రంలో బలహీనవర్గాల మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి: పొన్నం
- బలహీనవర్గాల కార్యక్రమాలపై ఏకగ్రీవంగా మద్దతు తెలిపేలా కార్యాచరణ: పొన్నం
అనివార్య కారణాలతో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయలేదు: పొన్నం
- మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం
- బలహీనవర్గాలకు కేటాయించిన రూ.11 వేల కోట్లతో రూ.2400 కోట్లు ఖర్చు: పొన్నం
- విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు 300 నుంచి 700కు పెంచాం: పొన్నం
- విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే వారికి ప్రభుత్వ సహకారం: పొన్నం
- వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: పొన్నం
- యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.200 కోట్లు ఖర్చు: పొన్నం
- బలహీనవర్గాలకు సంబంధించి రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం: పొన్నం
- యువతకు ఉపాధి అవకాశాల కోసం రాజీవ్ యువ వికాసం పథకం తెచ్చాం: పొన్నం
- అనివార్య కారణాలతో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయలేదు: పొన్నం
- బలహీనవర్గాల కార్యక్రమాలపై త్వరలో ప్రజాప్రతినిధులతో భేటీ: పొన్నం
- బలహీనవర్గాల విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల కోసం కుల సర్వే చేశాం: పొన్నం
- కుల సర్వే నివేదిక ఆధారంగా అభివృద్ధి పనులు చేపడతాం: పొన్నం
- గురుకులాల హాస్టల్ అద్దెలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తున్నాం: పొన్నం
'పీఎం సూర్యఘర్ పథకం కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది'
భట్టి విక్రమార్క :
పీఎం సూర్యఘర్ పథకం కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది
ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రభుత్వం అమలు చేస్తోంది
ఉచిత విద్యుత్ వల్ల పీఎం సూర్యఘర్ పథకానికి ముందుకు రావట్లేదు
గ్రీన్ ఎనర్జీ, కాలుష్య రహితం కావున రాష్ట్రంలో అమలుకు నిర్ణయం
కొన్ని మండలాల్లో ప్రజలను ఒప్పించి పైలట్ ప్రాజెక్టు చేపట్టాం
కొడంగల్, బోనకల్లు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాం
పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలుకు నిర్ణయం
విద్యుత్ సమస్యలపై 24 గంటలపాటు 1912 టోల్‌ఫ్రీ నంబర్ : భట్టి విక్రమార్క
- విద్యుత్‌శాఖలో చాలా సంస్కరణలు చేపట్టాం : భట్టి విక్రమార్క
- విద్యుత్ సమస్యలపై 24 గంటలపాటు 1912 టోల్‌ఫ్రీ నంబర్ : భట్టి విక్రమార్క
- 108 మాదిరిగా ఎలక్ట్రికల్ అంబులెన్సులు ఏర్పాటు చేశాం : భట్టి విక్రమార్క
- ఎలక్ట్రికల్ అంబులెన్సులు ఆరు నెలలుగా అందుబాటులో ఉన్నాయి : భట్టి విక్రమార్క
- సమస్యలపై తెలపగానే ఎలక్ట్రికల్ అంబులెన్సు స్పందిస్తుంది : భట్టి విక్రమార్క
- ఎలక్ట్రికల్ అంబులెన్స్‌కు జీపీఎస్ ఏర్పాటు చేశాం : భట్టి విక్రమార్క
- ఎలక్ట్రికల్ అంబులెన్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్, ఇతర సామగ్రి సిద్ధంగా ఉంచుతున్నాం : భట్టి విక్రమార్క
- మల్టీ పర్పస్ వాహనంలో ఇంజినీర్, ఓ అండ్ ఎం సిబ్బంది ఉంటారు : భట్టి విక్రమార్క
- అవసరమైన మేరకు ట్రాన్స్‌ఫార్మర్లు అందజేస్తున్నాం : భట్టి విక్రమార్క
- ప్రజాబాట కార్యక్రమం కింద విద్యుత్ సమస్యలపై వెంటనే స్పందన : భట్టి విక్రమార్క
- వారంలో 3 రోజులపాటు ఏఈలు, డీఈలు పొలంబాట పడుతున్నారు : భట్టి విక్రమార్క
- విద్యుత్ సమస్యలు ఉంటే 24 గంటల్లో పరిష్కరిస్తారు : భట్టి విక్రమార్క
- విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం మేరకు అందిస్తున్నాం : భట్టి విక్రమార్క
- లోడ్ అవసరాల మేరకు ట్రాన్స్‌ఫార్మర్లు అందజేస్తున్నారు : భట్టి విక్రమార్క
- విద్యుత్ సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి : భట్టి విక్రమార్క
- విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య వెంటనే పరిష్కరిస్తాం : భట్టి విక్రమార్క
అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అరెస్టు
అరెస్టు :
- అసెంబ్లీ ముట్టడికి వచ్చిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అరెస్టు
- పింఛన్‌దారులకు పాత బకాయిలు చెల్లించట్లేదంటూ ఆందోళన
- పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని విశ్రాంత ఉద్యోగుల డిమాండ్
- బక్క జడ్సన్ సహా విశ్రాంత ఉద్యోగులను అరెస్టు చేసిన పోలీసులు
'మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించడంపైనే దృష్టి పెడుతున్నారు'
పాయల్ శంకర్
- మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించడంపైనే దృష్టి పెడుతున్నారు
- ప్రభుత్వ పథకాల కింద చేపట్టే ఇళ్లకు రూ.30 వేల కోట్ల సామగ్రి అవసరం
- గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రిని మహిళా సంఘాల ద్వారా సరఫరా చేయాలి
- మహిళా సంఘాలకు రూ.8 వేల కోట్ల మేర లబ్ధి కలుగుతుంది
- గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలు చెల్లించాలి
- మహిళా సంఘాల ద్వారా హాస్టళ్లకు సరకులు సరఫరా చేయాలి
యాదగిరిగుట్ట వద్ద మహిళా సంఘాలు షాపుల ఏర్పాటుకు చర్యలు : సీతక్క
సీతక్క
- యాదగిరిగుట్ట వద్ద మహిళా సంఘాలు షాపుల ఏర్పాటుకు చర్యలు
- ఏటా మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్లు చెల్లిస్తున్నాం
- మహిళా సంఘాలకు చీరలు ఇవ్వాలని తొలుత భావించాం
- మొదటి దశలో వచ్చిన చీరలు గ్రామాల్లో పంపిణీ చేశాం
- మార్చి 1 నుంచి పట్టణాల్లో కూడా చీరలు పంపిణీ చేస్తాం
- కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేస్తాం
- దరఖాస్తు చేసుకున్న వారికి క్యాంటీన్లు, షాపుల ఏర్పాటుకు చర్యలు
'కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం సంకల్పం'
సీతక్క
- రాష్ట్రంలో ఇప్పటివరకు 250 క్యాంటీన్లు ఏర్పాటు
- క్యాంటీన్ల నిర్వహణ, షెఫ్ శిక్షణకు రూ.22,300 చొప్పున వ్యయం
- ఎస్‌హెచ్‌జీ సభ్యులకు 10 రోజుల పాటు హైదరాబాద్‌లో శిక్షణ
- అత్యవసర సదుపాయాలు, ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా స్థలం కల్పిస్తున్నాం
- నిర్వహణ, పెట్టుబడి కోసం ఎస్‌హెచ్‌జీ సభ్యులకు వడ్డీ లేని రుణాలు
- పట్టణ ప్రాంతాల్లో 130 ఐఎంఎస్ క్యాంటీన్ల ఏర్పాటు
- దశలవారీగా మరిన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం యోచన
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం సంకల్పం
- సచివాలయంలో క్యాంటీన్ల నిర్వహణ మహిళలకు ఇచ్చాం
- మేడారంలో బొంగు చికెన్ స్టాల్ ఏర్పాటు మహిళలకు ఇచ్చాం
- మేడారంలో 500 షాపుల కోసం మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఆర్థికసాయం
- 60 ఏళ్లు దాటిన వారికీ మహిళా సంఘాల్లో అవకాశం కల్పించాం
- 15 ఏళ్లు దాటిన బాలికలకు మహిళా సంఘాల్లో చోటు కల్పిస్తున్నాం
- దివ్యాంగులకు సంఘాలు ఏర్పాటు చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం
- ఇందిరా మహిళా సంఘాలకు 20 రకాల వ్యాపారాలు అప్పగింత
- ప్రతి మండల సమాఖ్యకు బస్సులు అందిస్తాం
- ఇప్పటికే 200కు పైగా మండల సమాఖ్యలకు బస్సులు అందించాం
- మండల సమాఖ్యలకు ప్రతి నెలా రూ.70 వేల ఆదాయం సమకూరుతుంది
శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం
- శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం
- ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు తగ్గడంపై చర్చించాలని వాయిదా తీర్మానం
- ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం
ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం
- శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం
- ఉభయసభల్లో యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం
- హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ
- ఉభయసభల ముందుకు సాధారణ పరిపాలన గెజిట్ నోటిఫికేషన్
- ఉభయసభల ముందుకు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వార్షిక నివేదిక
- తెలంగాణ వర్సిటీ, జీఎస్టీ సవరణ బిల్లులను శాసనసభలో ప్రవేశ పెట్టనున్న సీఎం
- పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లును మండలిలో పెట్టనున్న భట్టి విక్రమార్క
- పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి సీతక్క

