ETV Bharat / state

17-02-2026 : మదనపల్లెలో చిన్నారి హత్య - స్పందించిన మహిళా మంత్రులు

ETV Bharat Andhra Pradesh live updates
ETV Bharat Andhra Pradesh live updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2026 at 7:00 AM IST

|

Updated : February 17, 2026 at 9:51 PM IST

Choose ETV Bharat

17-02-2026 ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వార్తలు - ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

LIVE FEED

9:47 PM, 17 Feb 2026 (IST)

కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్‌కు రైల్వేశాఖ ఆమోదం

  • చిత్తూరు: కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపేజ్‌కు రైల్వేశాఖ ఆమోదం
  • వాస్కోడగామా-వేలంకణి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు స్టాపేజ్‌కు ఆమోదం
  • దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైలు కుప్పం రైల్వేస్టేషన్‌లో నిలుపుదలకు ఆమోదం
  • దిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు
  • రైళ్ల స్టాపేజ్‌కు అంగీకారం తెలిపిన రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

9:47 PM, 17 Feb 2026 (IST)

నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడికు బెయిల్‌

  • విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడు సుదర్శన్‌కు బెయిల్‌
  • నిందితుడు సుదర్శన్‌కు బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టు
  • విజయవాడ: సుదర్శన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
  • విజయవాడ: రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశం

9:47 PM, 17 Feb 2026 (IST)

మదనపల్లె ఘటన - చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడిన హోంమంత్రి

  • మదనపల్లె ఘటనలో చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడిన హోంమంత్రి అనిత
  • ఫోన్‌లో బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత
  • నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చిన హోంమంత్రి అనిత
  • కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేసిన హోంమంత్రి
  • మదనపల్లె ఘటనపై జిల్లా ఎస్పీతోనూ మాట్లాడిన హోంమంత్రి అనిత
  • నిందితులకు కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని ఎస్పీకి హోంమంత్రి అనిత ఆదేశం

9:47 PM, 17 Feb 2026 (IST)

మదనపల్లెలో బాలిక హత్య సాధారణ నేరం కాదు: మంత్రి సంధ్యారాణి

  • మదనపల్లె ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం
  • మదనపల్లెలో బాలిక హత్య సాధారణ నేరం కాదు: మంత్రి సంధ్యారాణి
  • చిన్నారిపై జరిగిన దాడి.. సమాజ గౌరవంపై జరిగిన దాడే: సంధ్యారాణి
  • దోషులు ఎంతటివారైనా కఠినమైన శిక్ష తప్పదు: మంత్రి సంధ్యారాణి
  • మహిళలు, బాలికల భద్రతపై ప్రభుత్వం రాజీ పడదు: సంధ్యారాణి
  • చిన్నారి హత్య కేసులో సమాజానికి గట్టి సందేశం ఇచ్చేలా చర్యలు ఉంటాయి: సంధ్యారాణి
  • బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: సంధ్యారాణి

7:52 PM, 17 Feb 2026 (IST)

మద్యం అమ్మిన హోంగార్డు

  • పల్నాడు జిల్లా: కోటప్పకొండ తిరునాళ్లలో మద్యం అమ్మిన హోంగార్డుపై చర్యలు
  • కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు కోటేశ్వరరావు సస్పెన్షన్‌
  • హోంగార్డు కోటేశ్వరరావు సస్పెండ్‌ చేసిన ఎస్పీ కృష్ణారావు

7:52 PM, 17 Feb 2026 (IST)

3 ఏళ్ల జైలు శిక్ష

  • బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి 3 ఏళ్ల జైలు శిక్ష
  • నిందితుడు అశోక్ చక్రవర్తికి 3ఏళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా
  • నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించిన పోక్సో కోర్టు న్యాయమార్తి
  • నున్న పీఎస్‌లో 2014 లో నిందితుడిపై కేసు నమోదు

7:51 PM, 17 Feb 2026 (IST)

యువతుల పేరుతో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రేమికులు

  • మచిలీపట్నం: ప్రియురాలి కోసం ట్రావెల్స్‌ బస్సు సిబ్బందిపై యువకుడి దాడి
  • యువతుల పేరుతో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రేమికులు
  • యువతుల పేరుతో బుక్‌ చేసుకోవడంతో సీటులోకి యువకుడిని అనుమతించని డ్రైవర్
  • ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని డ్రైవర్‌తో యువకుడి వాగ్వాదం
  • డ్రైవర్‌ను వదలొద్దని యువతి చెప్పడంతో ఆయనపై దాడి చేసిన యువకుడు
  • యువకుడి దాడిలో డ్రైవర్‌కు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
  • డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు

7:51 PM, 17 Feb 2026 (IST)

  • మదనపల్లి: చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
  • తీవ్ర ఉద్రిక్తతల మధ్య చిన్నారి మృతదేహం ఆస్పత్రికి
  • చిన్నారి కుటుంబసభ్యులతో చర్చించిన కడప జిల్లా ఎస్పీ, మదనపల్లి సబ్ కలెక్టర్

7:50 PM, 17 Feb 2026 (IST)

మద్యం కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌కు సిట్‌ పిటిషన్‌

  • విజయవాడ: మద్యం కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌కు సిట్‌ పిటిషన్‌
  • రాజ్‌ కెసిరెడ్డి, మరికొందరి ఆస్తుల అటాచ్‌కు ఏసీబీ కోర్టులో సిట్‌ పిటిషన్‌
  • సిట్‌ పిటిషన్‌పై అభ్యంతరాలు దాఖలు చేయాలని రాజ్ కెసిరెడ్డికి ఆదేశం
  • తదుపరి విచారణను ఈనెల 20 కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

6:34 PM, 17 Feb 2026 (IST)

స్విమ్మింగ్‌ పూల్‌లో పడి వైద్య విద్యార్థి మృతి

  • అనంతపురం: గార్లదిన్నెలోని స్విమ్మింగ్‌ పూల్‌లో పడి వైద్య విద్యార్థి మృతి
  • ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌ పూల్‌లో పడి వైద్య విద్యార్థి మోహన్ (20) మృతి
  • అనంతపురం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మోహన్
  • ఐదుగురు మిత్రులతో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో ఈతకు వెళ్లిన మోహన్
  • మృతుడు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన యువకుడిగా గుర్తింపు

6:34 PM, 17 Feb 2026 (IST)

మంగళగిరి ఎయిమ్స్‌లో రెండో స్నాతకోత్సవ కార్యక్రమం

  • ఎయిమ్స్ ద్వారా ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుతోంది: మంత్రి లోకేష్
  • వైద్యులపై రోగులు నమ్మకంతో ఎయిమ్స్‌కు వస్తున్నారు: మంత్రి లోకేష్
  • గిరిజన ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలపై ఎయిమ్స్ దృష్టి సారించాలి: లోకేష్
  • కృత్రిమ మేధస్సు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది: లోకేష్
  • మంగళగిరి ఎయిమ్స్‌లో రెండో స్నాతకోత్సవ కార్యక్రమం
  • స్నాతకోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి అనుప్రియ పాటిల్, మంత్రి లోకేష్
  • పాల్గొన్న ఎయిమ్స్ డైరెక్టర్ అహంతం శాంటా సింగ్, ఛైర్మన్ తపన్ కుమార్
  • గౌతం సాయి, విజయలక్ష్మికి బంగారు పతకాలు అందజేత

5:10 PM, 17 Feb 2026 (IST)

బాలిక హత్యకు నిరసనగా స్థానికుల ఆందోళన

  • మదనపల్లెలో కొనసాగుతున్న స్థానికుల ఆందోళనలు
  • మదనపల్లెలో బాలిక హత్యకు నిరసనగా స్థానికుల ఆందోళన
  • మదనపల్లె: నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికుల నిరసన
  • మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
  • ఎదురుగా ఉన్న ఇంట్లోనే బాలిక మృతదేహం గుర్తింపు
  • బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు
  • మదనపల్లె: నిందితుడు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గతంలోనూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికుల వెల్లడి
  • ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్న ఒకటో పట్టణ పోలీసులు
  • నిందితుడిని అప్పగించాలని పోలీసులతో స్థానికుల వాగ్వాదం
  • నిందితుడిని అప్పగించే వరకు మృతదేహం తీసుకెళ్లకూడదని పోలీసులతో వాగ్వాదం
  • మృతదేహాన్ని రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచిన నిందితుడు

5:10 PM, 17 Feb 2026 (IST)

విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

4:42 PM, 17 Feb 2026 (IST)

జగన్ మీడియా విషప్రచారం

  • బిల్ గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విషప్రచారం చేస్తోంది: మంత్రి అనగాని
  • రాష్ట్ర ప్రగతికి బిల్ గేట్స్ అందిస్తున్న తోడ్పాటుకు జగన్‌ ఓర్వలేకపోతున్నారు: అనగాని
  • రాష్ట్రానికి బిల్ గేట్స్ రాకను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు: మంత్రి అనగాని

4:41 PM, 17 Feb 2026 (IST)

  • అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం
  • షాపింగ్‌ మాల్‌ వద్ద భారీగా ఎగిసిపడుతున్న మంటలు
  • మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

4:40 PM, 17 Feb 2026 (IST)

ప్రమోషన్లు

  • విశాఖ: మంత్రి డీఎస్‌బీవీ స్వామిని కలిసిన అంబేడ్కర్‌ గురుకులాల పీజీటీలు
  • ఇటీవల 250 మంది టీజీటీలకు పీజీటీలుగా ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం
  • మంత్రి డీఎస్‌బీవీ స్వామిని కలిసి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పీజీటీలు
  • విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి
  • విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: డీఎస్‌బీవీ స్వామి

3:29 PM, 17 Feb 2026 (IST)

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ - పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

  • విశాఖ చేరుకున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌
  • సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతం పలకనున్న పవవ్‌కల్యాణ్‌
  • ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

3:29 PM, 17 Feb 2026 (IST)

పిఠాపురంలో ఇరు వర్గాల ఘర్షణ

  • కాకినాడ జిల్లా: పిఠాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
  • కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
  • ఇరువర్గాల దాడిలో ఐదుగురికి గాయాలు, ఆస్పత్రి తరలింపు
  • శివరాత్రి ఉత్సవాల్లో రాత్రి రెండు వర్గాల మధ్య తీవ్రవాగ్వాదం
  • ఇవాళ పరస్పరం కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు

2:22 PM, 17 Feb 2026 (IST)

మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈఏపీసెట్

  • మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈఏపీసెట్
  • మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు
  • మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు
  • ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరగనున్న పరీక్షలు
  • ఉదయం 9 నుంచి మ.12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సా.6 వరకు పరీక్షలు
  • ఏప్రిల్ 4 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసే అవకాశం
  • ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
  • ఏప్రిల్ 23 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం

2:21 PM, 17 Feb 2026 (IST)

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరో అందరికీ తెలుసు: మంత్రి అచ్చెన్న

  • హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరో అందరికీ తెలుసు: మంత్రి అచ్చెన్న
  • తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లి జగన్‌ డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వట్లేదు: మంత్రి అచ్చెన్న
  • హిందూ సంప్రదాయాలపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్​సీపీకి లేదు: మంత్రి అచ్చెన్న
  • తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డే ఒప్పుకొన్నారు: మంత్రి అచ్చెన్న
  • ఏమాత్రం సంబంధం లేని హెరిటేజ్‌ను ఇందులోకి లాగడమెందుకని వైఎస్సార్​సీపీని ప్రశ్నిస్తున్నా: మంత్రి అచ్చెన్న
  • హెరిటేజ్‌కు, తిరుమల లడ్డూకు సంబంధమేంటి?: మంత్రి అచ్చెన్న
  • కల్తీపై ప్రజల దృష్టి మళ్లించడానికే సంబంధం లేనివాటిని తీసుకొస్తున్నారు: మంత్రి అచ్చెన్న
  • హిందువులపై వైఎస్సార్​సీపీ నేతలు పగబట్టారు: మంత్రి అచ్చెన్నాయుడు

2:21 PM, 17 Feb 2026 (IST)

ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,54,000

  • ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,54,000
  • ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,41,680
  • ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,43,800

1:31 PM, 17 Feb 2026 (IST)

అల్పపీడనం

  • హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య అల్పపీడనం
  • అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం
  • పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం సమీపంలో బలపడే అవకాశం
  • 72 గంటల్లో కోస్తాంధ్రలో కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం: విశాఖ వాతావరణ కేంద్రం

12:43 PM, 17 Feb 2026 (IST)

అసెంబ్లీ లాబీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిట్‌చాట్

  • అసెంబ్లీ లాబీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిట్‌చాట్
  • విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్‌ చేయాలి: అయ్యన్నపాత్రుడు
  • శాసనసభకు రావటం ఎమ్మెల్యేల విధి: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు
  • కొందరు అసలు సభకే రాకుండా జీతభత్యాలు తీసుకోవటం తగదు: అయ్యన్నపాత్రుడు
  • ఉద్యోగులకు జీతాలు కట్ చేసే నిబంధన ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించకూడదు?: అయ్యన్న
  • అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ బాగా పనిచేస్తోంది: అయ్యన్నపాత్రుడు
  • ఎవరు ఎంత సేపు సభలో ఉన్నారనేది కూడా రికార్డు అవుతోంది: అయ్యన్నపాత్రుడు

12:43 PM, 17 Feb 2026 (IST)

విజయనగరం: బొండపల్లి మం. గొట్లాం వద్ద రోడ్డుప్రమాదం

  • విజయనగరం: బొండపల్లి మం. గొట్లాం వద్ద రోడ్డుప్రమాదం
  • ఆర్టీసీ బస్సు-టాటా ఐఏఎస్‌ వాహనం ఢీకొని ఆరుగురికి గాయాలు
  • ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు

12:43 PM, 17 Feb 2026 (IST)

అసెంబ్లీ: జగన్‌ అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైంది: మంత్రి పార్థసారథి

  • అసెంబ్లీ: జగన్‌ అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైంది: మంత్రి పార్థసారథి
  • బిల్‌గేట్స్ పర్యటనపై జగన్‌ విషం కక్కుతున్నారు: మంత్రి పార్థసారథి
  • కూటమి పాలన కన్‌స్ట్రక్షన్‌కు నిదర్శనం: మంత్రి పార్థసారథి అమరావతి నిర్మాణం జరుగుతుంటే జగన్ ఓర్చుకోలేకపోతున్నారు: పార్థసారథి

12:22 PM, 17 Feb 2026 (IST)

అసెంబ్లీ: ఆక్వా రైతులకు ఒకేరకమైన విద్యుత్ సబ్సిడీపై సోమిరెడ్డి ప్రశ్నకు గొట్టిపాటి సమాధానం

  • అసెంబ్లీ: ఆక్వా రైతులకు ఒకేరకమైన విద్యుత్ సబ్సిడీపై సోమిరెడ్డి ప్రశ్నకు గొట్టిపాటి సమాధానం
  • ఆక్వాకల్చర్‌కు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలో జోన్‌ - నాన్‌జోన్‌ విధానం అమలు చేస్తున్నాం: గొట్టిపాటి
  • జోన్ – నాన్ జోన్ కింద లబ్ధిదారులును గుర్తించే ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవు: గొట్టిపాటి
  • అక్వా రైతులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్‌దే: గొట్టిపాటి రవికుమార్‌
  • గతంలో కంటే కొత్తగా 50 వేల ఆక్వాకల్చర్ కనెక్షన్లు అదనంగా మంజూరు చేశాం: గొట్టిపాటి
  • 5 లక్షల 21 వేలమంది ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం: మంత్రి గొట్టిపాటి

12:21 PM, 17 Feb 2026 (IST)

శాసనసభలో బడ్జెట్ 2026-27పై చర్చ ప్రారంభం

11:41 AM, 17 Feb 2026 (IST)

ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు

  • ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు
  • డిశ్చార్జి పిటిషన్‌ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సుప్రీంకోర్టు సమర్థన
  • తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
  • గాలి జనార్ధన్‌రెడ్డికి గనుల కేటాయింపు వ్యవహారంలో శ్రీలక్ష్మి నిందితురాలు
  • క్యాప్టివ్‌ మైనింగ్‌ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారన్న సీబీఐ
  • అక్రమ కేటాయింపుల్లో కీలకంగా వ్యవహరించారన్న సీబీఐ
  • పదవిలో ఉన్నంతకాలం శ్రీలక్ష్మి మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న సీబీఐ
  • సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
  • డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు
  • వేరే కేసుగా భావించి ఈ కేసులో తొలుత స్టే ఇచ్చామన్న జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ ధర్మాసనం
  • ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామన్న సుప్రీంకోర్టు
  • పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్‌ చేశారన్న సుప్రీంకోర్టు
  • ట్రయల్‌ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
  • జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
  • రెండు కేసుల్లో తన పేరు తొలగించాలని కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు
  • శ్రీలక్ష్మి పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె.సింగ్ ధర్మాసనం
  • డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
  • ఓఎంసీ కేసులో నిబంధనలకు అనుగుణంగా వెళ్లినట్లు సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్
  • గనులశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి ఉల్లంఘనలకు పాల్పడినట్లు పేర్కొన్న సీబీఐ
  • ఆ సమయంలో శ్రీలక్ష్మి మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారన్న సీబీఐ
  • శ్రీలక్ష్మి లంచం అడిగినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్న సీబీఐ
  • శ్రీలక్ష్మి అక్రమాలన్నీ విచారణలోనే బయటపడతాయన్న సీబీఐ
  • సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
  • శ్రీలక్ష్మి పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం
  • తొలుత మరో పిటిషన్‌గా భావించి పొరపాటున స్టే ఇచ్చామన్న జడ్జిలు

11:41 AM, 17 Feb 2026 (IST)

సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
  • నిందితుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • సిద్ధార్థరెడ్డికి 4 వారాల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు
  • తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు
  • 2004లో ప్రత్యూష మృతిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు
  • ఆత్మహత్యకు ప్రేరేపించేలా సిద్ధార్థరెడ్డి వ్యవహరించారని తేల్చిన ట్రయల్ కోర్టు
  • ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు
  • ట్రయల్ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాలు చేసిన సిద్ధార్థరెడ్డి
  • సిద్ధార్థరెడ్డి పిటిషన్‌పై 2011లో తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
  • ఐదేళ్ల జైలు శిక్షను రెండేళ్లకు కుదించి, రూ.50 వేలు జరిమానా విధించిన హైకోర్టు
  • తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన సిద్ధార్థరెడ్డి
  • తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
  • ప్రత్యూష కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
  • పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం

11:40 AM, 17 Feb 2026 (IST)

కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

  • కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు (Chandrababu Birthday Wishes to KCR) తెలిపిన చంద్రబాబు
  • ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని

10:52 AM, 17 Feb 2026 (IST)

సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
  • నిందితుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
  • సిద్ధార్థరెడ్డికి 4 వారాల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు
  • హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు
  • రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు
  • తెలంగాణ హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్‌ చేస్తూ సుప్రీంలో సిద్ధార్థరెడ్డి పిటిషన్‌
  • ఇంటర్‌ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి
  • ఇంటర్‌ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్లిన ప్రత్యూష, ఇంజినీరింగ్‌లో చేరిన సిద్ధార్థరెడ్డి
  • 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతూ 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి
  • చికిత్స అనంతరం మార్చి 9న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సిద్ధార్థరెడ్డి
  • కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తింపు
  • నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు
  • శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి
  • తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు సిద్ధార్థరెడ్డి
  • జైలుశిక్ష రెండేళ్లకు తగ్గిస్తూ 2011 డిసెంబర్‌ 28న తీర్పు వెల్లడి
  • 2012లో సుప్రీంలో అప్పీళ్లు దాఖలు చేసిన సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి

10:51 AM, 17 Feb 2026 (IST)

పొన్నూరు: చింతలపూడిలోని ఎమ్మెల్యే నరేంద్రకుమార్ తల్లి ఇంట్లో చోరీ

  • పొన్నూరు: చింతలపూడిలోని ఎమ్మెల్యే నరేంద్రకుమార్ (MLA Dhulipalla Narendra Kumar) తల్లి ఇంట్లో చోరీ
  • పొన్నూరు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన దొంగలు
  • ఇంట్లో ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు, ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌
  • గుంటూరు: చింతలపూడిలోని ధూళిపాళ్ల నరేంద్ర తల్లి నివాసంలో చోరీ
  • ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేసిన దుండగులు
  • ఇవాళ ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన పని మనుషులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి
  • 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొన్నూరు గ్రామీణ పోలీసులు

10:42 AM, 17 Feb 2026 (IST)

కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్‌కల్యాణ్‌

  • కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్‌కల్యాణ్‌
  • కేసీఆర్‌.. సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో ఉన్న నాయకుడు: పవన్‌కల్యాణ్
  • కేసీఆర్‌కు మరింత సేవచేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా: పవన్‌
  • నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా: పవన్‌కల్యాణ్

10:31 AM, 17 Feb 2026 (IST)

గంట ఆలస్యంగా ప్రారంభంకానున్న మండలి సమావేశాలు

  • గంట ఆలస్యంగా ప్రారంభంకానున్న ఇవాళ్టి మండలి సమావేశాలు
  • సాంకేతిక సమస్యల కారణంగా గంట వాయిదా వేసిన కౌన్సిల్ ఛైర్మన్
  • ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న శాసనమండలి సమావేశాలు

10:20 AM, 17 Feb 2026 (IST)

అల్లూరి జిల్లా పాడేరు మండలం వంతాలగుమ్మి వద్ద ప్రమాదం, ముగ్గురు మృతి

  • అల్లూరి జిల్లా పాడేరు మండలం వంతాలగుమ్మి వద్ద ప్రమాదం, ముగ్గురు మృతి
  • అల్లూరి జిల్లా: అర్ధరాత్రి అదుపుతప్పి ఇంటి గోడను ఢీకొన్న ద్విచక్రవాహనం
  • ఘటనాస్థలిలో ఇద్దరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి

10:19 AM, 17 Feb 2026 (IST)

గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన పనులు పూర్తిచేయాల్సి ఉంది: లోకేష్‌

  • గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన పనులు పూర్తిచేయాల్సి ఉంది: లోకేష్‌
  • అవసరమైన చోట ముందుగా పనులు పూర్తిచేస్తాం: మంత్రి లోకేష్‌
  • అదనంగా తరగతి గదులు అవసరమైన చోట పనులు వేగంగా పూర్తిచేస్తాం: లోకేష్‌

10:06 AM, 17 Feb 2026 (IST)

శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణ స్థలం పరిశీలించిన రామ్మోహన్

  • శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణ స్థలం పరిశీలించిన రామ్మోహన్
  • కాశీబుగ్గ ఆర్వోబీ పనులు పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • ఆర్వోబీ పనులు ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని అధికారులకు రామ్మోహన్‌ ఆదేశం
  • కేంద్రమంత్రితో పాటు పర్యటనలో టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి

10:06 AM, 17 Feb 2026 (IST)

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వరుసలవంకపల్లె వద్ద వ్యక్తి హత్య

  • అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వరుసలవంకపల్లె వద్ద వ్యక్తి హత్య
  • మామిడితోటలో కృష్ణారెడ్డి(65) గొంతు కోసి చంపి దుండగులు పరారైనట్లు పోలీసుల వెల్లడి

10:06 AM, 17 Feb 2026 (IST)

గంట ఆలస్యంగా ప్రారంభం కానున్న ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు

  • గంట ఆలస్యంగా ప్రారంభం కానున్న ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు
  • సాంకేతిక కారణాలతో సభ వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ రఘురామ ప్రకటన
  • ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

9:20 AM, 17 Feb 2026 (IST)

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీ20 అమెరికా క్రికెట్ జట్టు

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీ20 అమెరికా క్రికెట్ జట్టు
  • శ్రీవారి సేవలో అమెరికా క్రికెట్‌ జట్టులోని భారత సంతతి ప్లేయర్లు
  • స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది: కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌
  • ఆలయ ప్రాంగణం, పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి: కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌
  • ఐసీసీ, బీసీసీఐ, ఏపీ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు: కెప్టెన్‌ మోనాంక్‌ పటేల్‌

9:03 AM, 17 Feb 2026 (IST)

మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య

  • మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
  • ఎదురుగా ఉన్న ఇంట్లోనే బాలిక మృతదేహం గుర్తింపు
  • బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు
  • మదనపల్లె: నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • గతంలోనూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికుల వెల్లడి
  • ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్న ఒకటో పట్టణ పోలీసులు
  • నిందితుడిని అప్పగించాలని పోలీసులతో స్థానికుల వాగ్వాదం
  • నిందితుడిని అప్పగించే వరకు మృతదేహం తీసుకెళ్లకూడదని పోలీసులతో వాగ్వాదం
  • మృతదేహాన్ని రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచిన నిందితుడు

9:03 AM, 17 Feb 2026 (IST)

అనంతపురం కోవూరు నగర్‌లో గౌసియా అనే మహిళ మృతి

  • అనంతపురం కోవూరు నగర్‌లో గౌసియా అనే మహిళ మృతి
  • కుమారుడిపై దాడిని అడ్డుకోబోయి మృతిచెందిన గౌసియా
  • మహిళతో చనువుగా ఉంటున్నాడని గౌసియా కుమారుడిపై దాడి
  • అడ్డుకోబోయిన గౌసియాపై దాడిచేసిన మహిళ తరఫు బంధువులు
  • దాడిలో స్పృహ కోల్పోయి కిందపడిన గౌసియా, ఆస్పత్రికి తరలించేలోగా మృతి

9:02 AM, 17 Feb 2026 (IST)

శ్రీశైలంలో పదో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

  • శ్రీశైలంలో పదో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
  • ఉదయం ఆలయ యాగశాలలో పూర్ణాహుతి, కలశోద్వాసన క్రతువు
  • ఆలయ పుష్కరిణి వద్ద చండీశ్వరునికి అవభృద స్నానం, త్రిశూల స్నానం, వసంతోత్సవం

8:24 AM, 17 Feb 2026 (IST)

అమరావతి పర్యటనపై ఎక్స్‌లో బిల్ గేట్స్ పోస్ట్

  • అమరావతి పర్యటనపై ఎక్స్‌లో బిల్ గేట్స్ పోస్ట్
  • ఏపీలో అభివృద్ధి వేగవంతం చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం: బిల్‌ గేట్స్‌
  • ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో కృత్రిమ మేధతో అభివృద్ధి స్ఫూర్తిదాయకం: బిల్‌ గేట్స్‌
  • సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర దూరదృష్టి ప్రశంసనీయం: బిల్‌ గేట్స్‌
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు: బిల్‌ గేట్స్‌

8:24 AM, 17 Feb 2026 (IST)

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గుండుతాండ సమీపంలో ప్రమాదం

  • కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గుండుతాండ సమీపంలో ప్రమాదం
  • కర్నూలు జిల్లా: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడి 8 మందికి గాయాలు
  • కర్నూలు జిల్లా: గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమం
  • కొత్తపల్లికి వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఘటన
  • ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 32 మంది కూలీలు

8:23 AM, 17 Feb 2026 (IST)

తిరుమలలో భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం - 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

  • తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం
  • శ్రీవారి సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,776 మంది భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 23,291 మంది భక్తులు

8:23 AM, 17 Feb 2026 (IST)

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో మహిళ ఆత్మహత్య

  • ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో మహిళ ఆత్మహత్య
  • కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరేసుకున్న ఒడిశాకు చెందిన బెబిన మహమాత్ర

6:57 AM, 17 Feb 2026 (IST)

నేటి సాయంత్రం 4.40 గం.కు విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు రాష్ట్రపతి

  • నేడు, రేపు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
  • సా.4.40 గం.కు విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు రాష్ట్రపతి
  • రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్, ఉపముఖ్యమంత్రి
  • రేపు ఉ.10 గం.కు ఐఎఫ్ఆర్‌లో పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము
  • రేపు మధ్యాహ్నం విశాఖ నుంచి దిల్లీ తిరుగుపయనం

6:56 AM, 17 Feb 2026 (IST)

జేఈఈ మెయిన్స్‌లో ఏపీ విద్యార్థులు- మంత్రి లోకేశ్​ అభినందనలు

  • జాతీయస్థాయిలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
  • జేఈఈ మెయిన్స్‌లో ఏపీ విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటడం గర్వకారణం: లోకేశ్​
  • నరేంద్రబాబుగారి మహిత్, పసల మోహిత్ అత్యున్నత ప్రతిభ కనబరచారు: లోకేశ్​
  • జాతీయస్థాయిలో రాష్ట్ర కీర్తిని చాటిన విద్యార్థులకు అభినందనలు: లోకేశ్​

6:48 AM, 17 Feb 2026 (IST)

ఉభయసభల్లో బడ్జెట్​పై చర్చ

  • నేటి నుంచి శాసనసభ, మండలిలో వార్షిక బడ్జెట్‌పై చర్చ
  • శాసనసభలో నేడు 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • పురపాలక చట్టానికి 2 సవరణ బిల్లులను సభ ముందు ఉంచనున్న మంత్రి నారాయణ
  • విద్యుత్ సుంకం సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్

6:46 AM, 17 Feb 2026 (IST)

ఏపీలో రాష్ట్రపతి పర్యటన

  • నేడు, రేపు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
  • సా.4.40 గం.కు విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు రాష్ట్రపతి
  • రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్, ఉపముఖ్యమంత్రి
  • రేపు ఉ.10 గం.కు ఐఎఫ్ఆర్‌లో పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము
  • రేపు మధ్యాహ్నం విశాఖ నుంచి దిల్లీ తిరుగుపయనం

6:46 AM, 17 Feb 2026 (IST)

ఆటో డ్రైవర్​ లవ్​ డ్రామా- తప్పించుకున్న పదో తరగతి విద్యార్థిని

  • ధర్మవరంలో పదో తరగతి విద్యార్థినిని నిర్బంధించిన ఆటో డ్రైవర్
  • ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ యోగి
  • ఇంట్లో నిర్బంధించి అత్యాచారయత్నం చేసిన ఆటో డ్రైవర్ యోగి
  • ఆటో డ్రైవర్‌ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక
  • గతంలోనూ ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఇంట్లో తెలిపిన బాలిక
  • ధర్మవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లి ఫిర్యాదు
  • ఆటో డ్రైవర్ యోగిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

6:44 AM, 17 Feb 2026 (IST)

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన

  • రేపు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
  • ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతితో పాటు పాల్గొననున్న సీఎం
  • రేపు మ.1.20 గం.కు ఉండవల్లి నివాసానికి సీఎం తిరుగు పయనం

6:43 AM, 17 Feb 2026 (IST)

తిరుగు ప్రయాణంలో ఒరిగిన ప్రభ

  • నరసరావుపేటలోని కాకుమాను వీధిలో రాత్రి ఒరిగిన ప్రభ
  • పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభంపై ప్రభ పడటంతో విరిగిన స్తంభం
  • ప్రభను తిలకించేందుకు వచ్చిన ముగ్గురు చిన్నారులకు గాయాలు
  • ప్రభ కింద పడిన చిన్నారులను కాపాడిన నరసరావుపేట రెండో పట్టణ సీఐ ప్రభాకర్

6:36 AM, 17 Feb 2026 (IST)

విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల పరేడ్​

  • విశాఖ సాగర తీరంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
  • 71 నౌకలు ఆరు వరుసలలో పరేడ్ నిర్వహణ
  • ఇప్పటికే విశాఖ తీరానికి చేరుకున్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌తో పాటు 45 యుద్ధ నౌకలు
  • ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనేందుకు విశా ఖ చేరుకున్న 19 విదేశీ యుద్ధ నౌకలు
  • యుద్ధ నౌకల సమీక్షకు హాజరై గౌరవ వందనం స్వీకరించనున్న రాష్ట్రపతి
  • సాయంత్రం విశాఖ చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  • ఇప్పటికే విశాఖ చేరుకున్న దాదాపు 70 దేశాల నౌకాదళ బృందాలు, ప్రతినిధులు
Last Updated : February 17, 2026 at 9:51 PM IST