టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 8వ సారి భారత్ గెలుపు
ANDHRA PRADESH LIVE UPDATES (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 9:59 AM IST
|Updated : February 15, 2026 at 11:04 PM IST
15-02-2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు - మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
LIVE FEED
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం
- టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 8వ సారి భారత్ గెలుపు
- టీ20 ప్రపంచకప్‌లో 9 సార్లు తలపడిన భారత్-పాకిస్థాన్
- ప్రపంచకప్‌లో 8 సార్లు భారత్, ఒక మ్యాచ్‌లో పాక్ విజయం
- టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘనవిజయం
- టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ను మరోసారి చిత్తు చేసిన భారత్
- కొలంబో: పాక్‌పై 61 పరుగుల తేడాతో భారత్ గెలుపు
- 176 పరుగుల ఛేదనలో 114 పరుగులకే ఆలౌట్ అయిన పాక్
- టీ20 ప్రపంచకప్ స్కోర్లు: భారత్-175/7, పాక్-114 ఆలౌట్(18 ఓవర్లు)
- భారత్ బౌలింగ్: బుమ్రా, పాండ్యా, అక్షర్, వరుణ్ చక్రవర్తి తలో 2 వికెట్లు
టీ20 ప్రపంచకప్: నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
- భారత్ బౌలింగ్: కుల్దీప్‌యాదవ్, తిలక్‌వర్మ చెరో వికెట్
- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్- ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77 పరుగులు)
- టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు హ్యాట్రిక్ విజయం
- టీ20 ప్రపంచకప్: గ్రూప్-ఏ నుంచి సూపర్-8 కు చేరుకున్న భారత్
కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రత్తిపాటి పుల్లారావు
- కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రత్తిపాటి పుల్లారావు
- కోటప్పకొండలో అన్నదాన శిబిరాలు, విద్యుత్ ప్రభలు ప్రారంభించిన ప్రత్తిపాటి
- ప్రధాన ఆలయాలను టెంపుల్ టూరిజం కేంద్రాలుగా మార్చాలని సీఎం ఆలోచన: ప్రత్తిపాటి
- చంద్రబాబు అనుభవం, ఆలోచనలే రాష్ట్రానికి గొప్ప ఆర్థిక వనరులు: ప్రత్తిపాటి
- విద్యాశాఖలో సంస్కరణలు యువతకు అద్భుత ఫలితాలు ఇస్తాయి: ప్రత్తిపాటి
రాష్ట్రంలోని అన్ని శివాలయాల్లో భక్తుల రద్దీ
- రాష్ట్రంలోని అన్ని శివాలయాల్లో భక్తుల రద్దీ
- శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తిలో భక్తుల ప్రత్యేక పూజలు
- పల్నాడు జిల్లా కోటప్పకొండలో వైభవంగా శివరాత్రి వేడుకలు
- పంచారామ క్షేత్రాల్లో దేవదేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు
- శివాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, భక్తుల ఉపవాసాలు
రుషికొండ సమీపంలో సముద్రంలో స్నానానికి దిగి విద్యార్థి మృతి
- విశాఖ: రుషికొండ సమీపంలో సముద్రంలో స్నానానికి దిగి విద్యార్థి మృతి
- సముద్రంలో స్నానానికి దిగి మరణించిన బీటెక్ విద్యార్థి అరవింద్ (21)
'వికసిత్ ఏపీ' ద్వారా 'వికసిత భారత్' నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తోంది: మాధవ్
- బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో మాధవ్ ఆడియో కాన్ఫరెన్స్
- భవిష్యత్ కార్యాచరణపై అధికార ప్రతినిధులకు పి.వి.ఎన్. మాధవ్ దిశానిర్దేశం
- రాష్ట్ర బడ్జెట్ ప్రగతిశీల బడ్జెట్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
- కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లను సమ్మిళితం చేస్తూ ప్రజలకు వివరించాలి: మాధవ్
- రాష్ట్రాభివృద్ధికి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్: మాధవ్
- సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా బడ్జెట్ రూపొందించారు: మాధవ్
- రూ.3.32 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించడం సాహసోపేతమైన చర్య: మాధవ్
- రెవెన్యూ లోటు 1.86 శాతానికి పరిమితం చేయడం ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం: మాధవ్
- 'వికసిత్ ఏపీ' ద్వారా 'వికసిత భారత్' నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తోంది: మాధవ్
మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతిపట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
- మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మృతిపట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
- బీసీ వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధనకు వెంకయ్య నిరంతరం పనిచేశారు: సీఎం
- ఐలాపురం వెంకయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: సీఎం
- ఐలాపురం వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: సీఎం
తెలుగు రాష్ట్రాల్లోని భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు: మంత్రి ఆనం
- నెల్లూరు: శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి ఆనం
- తెలుగు రాష్ట్రాల్లోని భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు: మంత్రి ఆనం
- కూటమి ప్రభుత్వ హయాంలో వైభవోపేతంగా మహాశివరాత్రి ఏర్పాట్లు చేశాం: ఆనం
- రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభతో ఆలయాలు కళకళలాడుతున్నాయి: ఆనం
కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలతో పల్లా శ్రీనివాసరావు టెలీకాన్ఫరెన్స్
- కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలతో పల్లా శ్రీనివాసరావు టెలీకాన్ఫరెన్స్
- బడ్జెట్‌ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు పల్లా శ్రీనివాసరావు సూచన
- గాడితప్పిన వ్యవస్థను పురోగతి దిశగా నడిపించే బడ్జెట్ అంటూ పల్లా వ్యాఖ్య
- విజన్-2047 సాధించేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న పల్లా శ్రీనివాసరావు
- టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
అల్లూరి జిల్లాలో 1000 కిలోల గంజాయి స్వాధీనం
- అల్లూరి జిల్లా: జి.మాడుగుల మం. మత్స్యపురం వద్ద గంజాయి స్వాధీనం
- బొలెరో వాహనంలో తరలిస్తున్న వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
- గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కర్నూలుకు చెందిన వలీ అనే చిరు వ్యాపారిని త్వరలో కలుస్తా: మంత్రి లోకేశ్
- కర్నూలుకు చెందిన వలీ అనే చిరు వ్యాపారిని త్వరలో కలుస్తా: మంత్రి లోకేశ్
- వలీ చేసిన కోవా బన్ రుచి చూసేందుకు ఆసక్తితో ఉన్నా: లోకేశ్
- ఫుడ్‌జిహాదీ అంటూ వలీపై ఆరోపణలు చేయటం కలచివేసింది: లోకేశ్
- సామాజిక ఐక్యతను దెబ్బతీసే ప్రవర్తనకు సమాజంలో స్థానం లేదు: లోకేశ్
తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై నిలిచిన వాహనాలు
- మంగళగిరి: తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై నిలిచిన వాహనాలు
- మంగళగిరి: డీజిల్ ట్యాంకర్ కింద పడటంతో ట్రాఫిక్‌జామ్
- మంగళగిరి: 2 కి.మీ. మేర నిలిచిన వాహనాలు
- డీజిల్ ట్యాంకర్‌ను తొలగించేందుకు ప్రయత్నాలు
సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఐదో తరగతి విద్యార్థి మృతి
- ప్రకాశం: సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఐదో తరగతి విద్యార్థి మృతి
- విద్యార్థి తౌషిత్ అనుమానాస్పదస్థితిలో మరణించడంతో స్కూల్‌పై దాడి
- ప్రకాశం జిల్లా: పాఠశాలపై దాడికి దిగిన విద్యార్థి తౌషిత్ బంధువులు
పాలకొల్లు నియోజకవర్గంలో రూ.1.25 కోట్లతో శ్మశాన వాటికల అభివృద్ధి
- పాలకొల్లు నియోజకవర్గంలో రూ.1.25 కోట్లతో శ్మశాన వాటికల అభివృద్ధి
- శ్మశాన వాటికల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల
- తన స్వగ్రామం ఆగర్తిపాలెంలోని శ్మశానవాటికలో మంత్రి నిమ్మల శ్రమదానం
ఉత్సాహంగా సాగుతున్న పాకల బీచ్ ఫెస్ట్
- ప్రకాశం: రెండో రోజు ఉత్సాహంగా సాగుతున్న పాకల బీచ్ ఫెస్ట్
- ప్రకాశం: స్పీడ్ బోట్, పారాచూట్, హెలీ రైడ్లకు పోటెత్తిన పర్యాటకులు
ఉత్సాహంగా సాగుతున్న పాకల బీచ్ ఫెస్ట్
- యాగంటి ఉమామహేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి జనార్దన్‌రెడ్డి
- ప్రభుత్వం తరఫున ఉమామహేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన జనార్దన్‌రెడ్డి
- ఆలయంలో నిర్వహించిన అభిషేకం, పూజల్లో పాల్గొన్న మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి
- మంత్రి జనార్దన్‌రెడ్డికి తీర్థప్రసాదాలు అందజేసి.. వేదాశీర్వచనం చేసిన పండితులు
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్ - రూ.2 కోట్లు విరాళం
- మంగళగిరి: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన పవన్
- జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల
- సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్ల విరాళం అందించిన పవన్ కల్యాణ్
- జనసేనకు విరాళం అందించి తొలి సభ్యత్వాన్ని తీసుకున్న పవన్ కల్యాణ్
- జనసేన తరఫున పనిచేసేందుకు సభ్యత్వం తీసుకున్నవారిని 'ఉద్యమి'గా పిలుస్తాం: పవన్
- పార్టీ సిద్ధాంతాలకు ఇతరులను ఆకర్షితులను చేసేవారిని 'సాధక్‌గా' పిలుస్తాం: పవన్
- జనసేన పోరాటానికి పరోక్షంగా సాయం చేస్తున్నవారిని 'ప్రదాత'గా పిలుస్తాం: పవన్
- 150 మందితో పార్టీని ప్రారంభించాం: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్
- 2021లో 90 వేల క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేశాం: పవన్
- ఎన్నికల ముందునాటికి జనసేన క్రియాశీల సభ్యత్వాలు 6 లక్షలు: పవన్
- ఎన్నికల తర్వాత జనసేన క్రియాశీల సభ్యత్వాలు 12.98 లక్షలు: పవన్
బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ విమర్శలకు యనమల రామకృష్ణుడు కౌంటర్
- బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ విమర్శలకు యనమల రామకృష్ణుడు కౌంటర్
- గత ప్రభుత్వంలో ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది: యనమల
- గతంలో రెవెన్యూ లోటు, వడ్డీభారం, అప్పులు అధికంగా ఉండేవి: యనమల
- ఈ బడ్జెట్‌తో లోటు తగ్గింపులో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది: యనమల
- 2026-27 బడ్జెట్ ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణకు ప్రారంభం: యనమల
- ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: యనమల
కోటప్పకొండలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
- కోటప్పకొండలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి గొట్టిపాటి
- పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, జీవీ
- వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని వేడుకున్నా: గొట్టిపాటి
- ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించాం: హోంమంత్రి అనిత
మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
- మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
- భోళా శంకరుడు లింగోద్భవం చెందిన పవిత్రమైన రోజు మహా శివరాత్రి: లోకేశ్
- ఉపవాసం, జాగరణతో నీలకంఠుడి కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నా: లోకేశ్
పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలోని అగ్నిప్రమాదం
- పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడలిలో అగ్నిప్రమాదం
- పచారీ దుకాణంలో మంటలు చెలరేగడంతో దట్టంగా అలుముకున్న పొగ
- షార్ట్‌సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం
- పల్నాడు: నీటి ట్యాంకర్ల ద్వారా మంటలు అదుపు చేస్తున్న స్థానికులు
ఎన్టీఆర్ ట్రస్ట్ 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సీఎం శుభాకాంక్షలు
- ఎన్టీఆర్ ట్రస్ట్ 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సీఎం శుభాకాంక్షలు
- ఎన్టీఆర్ ఆశయాలు, సేవలు కొనసాగించేలా ట్రస్ట్ ప్రస్థానం సాగుతోంది: సీఎం
- విద్య, వైద్యం, రక్తదానం కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ తిరుగులేని ముద్ర వేసింది: సీఎం
- తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అసామాన్యం: సీఎం
- మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలందిస్తోంది: సీఎం
- ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న నారా భువనేశ్వరి, వారి బృందానికి అభినందనలు: సీఎం
- ట్రస్ట్ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు: సీఎం
- ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలి: సీఎం
వైఎస్సార్సీపీ, జగన్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం: మంత్రి కొల్లు రవీంద్ర
- వైఎస్సార్సీపీ, జగన్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోయారు: మంత్రి కొల్లు రవీంద్ర
- అసెంబ్లీకి రాకుండా వైసీపీ పారిపోవడం దుర్మార్గం: మంత్రి కొల్లు రవీంద్ర
- కృష్ణా జిల్లాకు చెందిన అన్ని అంశాలపైనా చర్చిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
డయాలసిస్ యంత్రాలు లేవని ఎక్స్‌లో ఓ వ్యక్తి పోస్ట్ - స్పందించిన మంత్రి నారా లోకేశ్
- ఇచ్ఛాపురంలో సరిపడా డయాలసిస్ యంత్రాలు లేవని ఎక్స్‌లో ఓ వ్యక్తి పోస్ట్
- 40 కి.మీ. వెళ్లి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాల్సి వస్తుందన్న ప్రవీణ్
- బాధితుడు ప్రవీణ్ పెట్టిన పోస్టుకు స్పందించిన మంత్రి నారా లోకేశ్
- కొత్త డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయాలని సత్యకుమార్‌కు లోకేశ్ విజ్ఞప్తి
- సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్‌ను కోరిన లోకేశ్
- లోకేశ్ విజ్ఞప్తిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ హామీ
రేపు సచివాలయానికి బిల్‌గేట్స్ - చంద్రబాబు, పవన్‌తో భేటీ
- రేపు ఉదయం 10 గం.కు రాష్ట్ర సచివాలయానికి బిల్‌గేట్స్
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌తో భేటీకానున్న బిల్‌గేట్స్
- గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చ
- గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రాజెక్టులు
- ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలించనున్న బిల్‌గేట్స్
- ఆర్టీజీఎస్ విధానాలు, ఫలితాలను బిల్‌గేట్స్‌కు వివరించనున్న సీఎం చంద్రబాబు
- గేట్స్ బృందంతో భేటీ కానున్న సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు
- స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం చంద్రబాబు
- ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య సహా తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ప్రజెంటేషన్
- మెడ్‌టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సంజీవని ప్రాజెక్టుల గురించి వివరించనున్న సీఎం
- గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని గురించి వివరించనున్న ప్రభుత్వం
- అమరావతిలో ఉండవల్లి వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్న బిల్‌గేట్స్
- వ్యవసాయలో డ్రోన్లు, ఏఐతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించనున్న బిల్ గేట్స్
తెలంగాణ ఎన్నికల్లో జనసేన కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలు గెలవడంపై పవన్ హర్షం
- తెలంగాణ ఎన్నికల్లో జనసేన కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలు గెలవడంపై పవన్ హర్షం
- జనసేన ఉద్భవించిన తెలంగాణ గడ్డపై తొలి అడుగుపడింది: పవన్‌కల్యాణ్
- మున్సిపల్ ఎన్నికల్లో 2,998 స్థానాలకు జనసేన 332 చోట్ల పోటీ చేసింది: పవన్
- 332 చోట్ల పోటీ చేసి కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలు దక్కించుకున్నాం: పవన్
- కౌన్సిలర్‌గా విజయలక్ష్మి, కార్పొరేటర్‌గా అగ్గు సాగర్ గెలిచారు: పవన్
- ఆరూరి విజయలక్ష్మి, అగ్గు సాగర్‌కు అభినందనలు: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
- మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే నేల పొరలను చీల్చుకొని మొలకెత్తుతుంది: పవన్
- తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైంది: పవన్
ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి శోభ
- విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి శోభ
- తెల్లవారుజాము నుంచే స్వామి వారికి విశేష అర్చనలు, అభిషేకాలు
- వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరిన భక్తజనం
- కృష్ణానదిలో స్నానాలు ఆచరించి పరమశివుడిని దర్శించుకుంటున్న భక్తులు
- రాత్రి లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహా రుద్రాభిషేకం
- మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయం వద్ద సాయంత్రం జ్వాలాతోరణం
- రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం
పంచారామ క్షేత్రాల్లో శివరాత్రి శోభ
- పాలకొల్లు, భీమవరంలోని ప్రముఖ పంచారామ క్షేత్రాల్లో శివరాత్రి శోభ
- క్షీరరామలింగేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయాల్లో మహాశివుడికి పూజలు
- ప.గో.: స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
మహా శివరాత్రి సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
- మహా శివరాత్రి సందర్భంగా ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
- శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రం కొలువై ఉన్న పవిత్రభూమి మన ఏపీ: సీఎం
- శివుడు ఇవాళే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది: సీఎం
- శివారాధనతో మహాశివుని అనుగ్రహం కలిగి అందరికీ మంచి జరగాలి: సీఎం
- శివార్చన, జాగరణలతో మహా శివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం: సీఎం
- పరమశివుని అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు
- రాజమహేంద్రవరం వద్ద తెల్లవారుజాము నుంచే గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు
- మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
- పుష్కర్‌ఘాట్, కోటిలింగాలరేవు, తదితర స్నాన ఘట్టాల వద్ద భక్తుల రద్దీ
- గోదావరిలో కుటుంబసమేతంగా పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు విడిచిపెడుతున్న భక్తులు
- శివయ్యను కీర్తిస్తూ శంఖనాదాలు చేస్తున్న జంగమదేవరలు
- కాతేరు నుంచి ధవళేశ్వరం వరకు 11 స్నాన ఘట్టాలు ఏర్పాటు
అల్లూరి జిల్లాలోని బొర్రా గుహల్లోకి ఉచిత ప్రవేశం
- అల్లూరి జిల్లాలోని బొర్రా గుహల్లోకి ఇవాళ ఉచిత ప్రవేశం
- శివరాత్రి సందర్భంగా బొర్రా గుహల్లోకి ఉచిత ప్రవేశం
భీమేశ్వరస్వామి, బాలత్రిపురసుందరి అమ్మవారికి అభిషేకాలు, పూజలు
- కాకినాడ జిల్లాలోని సామర్లకోటలోని భీమేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు
- భీమేశ్వరస్వామి, బాలత్రిపురసుందరి అమ్మవారికి అభిషేకాలు, పూజలు
- ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు
అమరేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు
- అమరావతి అమరేశ్వరాలయంలో భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు
- శివనామస్మరణతో మార్మోగిన అమరేశ్వరాలయం
- స్వామివారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి పోటెత్తిన భక్తులు
- తెల్లవారుజామున మూడు గంటలకు బిందె తీర్థంతో తొలి పూజ మహోత్సవం
- పంచామృతాలతో అభిషేకాలు.. విశేషాలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనం
- కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమరేశ్వరుని దర్శనానికి బారులు తీరిన భక్తులు
కోటప్పకొండలో వైభవంగా శివరాత్రి వేడుకలు
- పల్నాడు: కోటప్పకొండలో వైభవంగా శివరాత్రి వేడుకలు
- అర్ధరాత్రి 12 గంటల తర్వాత త్రికోటేశ్వరస్వామికి తొలి పూజలు
- బిందె తీర్థంతో స్వామివారికి అభిషేకం చేసిన ఆలయ పండితులు, పూజారులు
- పూజలో పాల్గొన్న ఆలయ ధర్మకర్త, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎమ్మెల్యే అరవింద బాబు
- కోటప్పకొండలో పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్న భక్తులు
- భక్త జనంతో కిటకిటలాడుతున్న కోటప్పకొండ పరిసరాలు
ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి పండుగ శోభ
- కోనసీమ జిల్లాలో ఘనంగా మహా శివరాత్రి పర్వదినం
- ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి పండుగ శోభ
- తెల్లవారుజాము నుంచే భీమేశ్వరస్వామి ఆలయంలో అర్చనలు, అభిషేకాలు
- స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
- 12వ శక్తిపీఠం మాణిక్యాంబ అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకుంటున్న భక్తులు
- ప్రకాశం: భీమలింగేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
- మహాశివరాత్రి పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు
- రాత్రికి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం
- మహా శివరాత్రిని పురస్కరించుకుని రాత్రికి ఆలయం వద్ద జ్వాలాతోరణం
విశాఖలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు
- విశాఖలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు
- నక్కవానిపాలెం ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు
- శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన నీలకంఠేశ్వరస్వామి ఆలయం
- తెల్లవారుజాము నుంచే నీలకంఠేశ్వరస్వామిని దర్శించుకుంటున్న భక్తులు
శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు
- శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు
- మహా శివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం
- శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తజనం
- తెల్లవారుజాము నుంచే స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్న భక్తులు
- సాయంత్రం 5 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం
- రాత్రి 7 గం.కు మల్లికార్జునస్వామికి అభిషేకం చేయనున్న జగద్గురు పీఠాధిపతి
- ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ
- రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు మల్లన్న ఆలయానికి పాగాలంకరణ
- పాగాలంకరణ చేయనున్న హస్తినాపురంకి చెందిన పృధ్వీ సుబ్బారావు సోదరులు
- పాగాలంకరణ సమయంలో మల్లికార్జునస్వామికి విశేష అభిషేకం
- స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించనున్న ఆలయ అర్చకులు
- రాత్రి 12 గంటలకు స్వామిఅమ్మవార్లకు వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం
మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
- మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
- తిరుపతి జిల్లా: వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు
- రాహు కేతు సర్ప దోష నివారణ పూజలతో సహా ఆర్జిత సేవలన్నీ రద్దు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో విస్తృత బందోబస్తు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో విస్తృత బందోబస్తు
మొత్తం 1,156 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు
భక్తులకు సజావుగా దర్శనం జరిగేలా ప్రత్యేక చర్యలు
కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పరిస్థితుల పర్యవేక్షణ
డ్రోన్ కెమెరాలతో నిఘా.. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
మహా శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
- బాపట్ల జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
- చీరాల, వేటపాలెం, చినగంజాంలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
- పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
- బాపట్ల: సోపిరాలలోని బాలకొటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం
- కొత్తపాలెంలోని కోటేశ్వరస్వామి దేవాలయాల్లో గరళకంఠునికి రుద్రాభిషేకాలు
- శివయ్య దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు
- బాపట్ల: భ్రమరాంబమల్లీశ్వరస్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు
- పేరాలలోని పునుగురామలింగేశ్వరస్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తులు
పార్వతీపురం మన్యం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా - తప్పిన ప్రమాదం
- పార్వతీపురం: సాలూరు బైపాస్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా, తప్పిన ప్రమాదం
- ఒడిశాలోని నవరంగ్‌పూర్ నుంచి విజయవాడ వస్తుండగా ఆర్టీసీ బస్సు బోల్తా
- బస్సు బోల్తా ఘటనలో ఏడుగురికి గాయాలు, సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
రేపు రాష్ట్రంలో బిల్ గేట్స్, ఫౌండేషన్ ప్రతినిధి బృందం పర్యటన
- రేపు రాష్ట్రంలో బిల్ గేట్స్, ఫౌండేషన్ ప్రతినిధి బృందం పర్యటన
- చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌తో సమావేశంకానున్న బిల్ గేట్స్
- రేపు ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్న బిల్ గేట్స్
- ఆర్‌టీజీఎస్‌లో సాంకేతికత వినియోగాన్ని పరిశీలించనున్న బిల్ గేట్స్
Last Updated : February 15, 2026 at 11:04 PM IST

