మహాశివరాత్రి : శ్రీకాళహస్తిలో విస్తృత ఏర్పాట్లు - 1,156 మంది పోలీసులతో భారీ బందోబస్తు

AP Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 9:23 AM IST
|Updated : February 14, 2026 at 10:40 PM IST
14-02-2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు - నేడు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
LIVE FEED
మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో విస్తృత బందోబస్తు
- మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో విస్తృత బందోబస్తు
- మొత్తం 1,156 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు
- భక్తులకు సజావుగా దర్శనం జరిగేలా ప్రత్యేక చర్యలు
- కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పరిస్థితుల పర్యవేక్షణ
- డ్రోన్ కెమెరాలతో నిఘా.. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ
- ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎస్పీ సుబ్బారాయుడు
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసేలా బడ్జెట్ ఉంది: పవన్ కల్యాణ్
- రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసేలా బడ్జెట్ ఉంది: పవన్ కల్యాణ్
- రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర దిశగా చంద్రబాబు నడిపిస్తున్నారు: పవన్ కల్యాణ్
- బడ్జెట్‌లో విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక వసతులకు ప్రాధాన్యం: పవన్
- యువత, మహిళా సాధికారత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం: పవన్ కల్యాణ్
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.22,942 కోట్లు కేటాయించారు: పవన్
- పర్యావరణ, అటవీశాఖకు రూ.714 కోట్లు కేటాయించడం బాగుంది: పవన్
- హరిత ఆంధ్రప్రదేశ్ దిశగా చర్యలు చేపట్టేందుకు చేయూత ఇస్తుంది: పవన్
కడప జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం
- కడప జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు సమావేశం
- కడప జిల్లా సమస్యలు ఏకరువు పెట్టిన పార్టీ ఎమ్మెల్యేలు
- పులివెందుల సహా పెండింగ్ సమస్యలు ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు
- రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, డ్రెయిన్ల సమస్యలు పరిష్కరించాలన్న నేతలు
- తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యేలు
- పెండింగ్ బిల్లులు, అసంపూర్తి పనులు విని ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం
- సొంత జిల్లాకు, నియోజకవర్గానికి ఆనాటి సీఎం ఏంచేశారని ప్రశ్నించిన చంద్రబాబు
- సొంతజిల్లాలోనూ పనులు చేయకే అంతలా వ్యతిరేకత వచ్చిందన్న నేతలు
- కడప జిల్లాలో ఒక్కో సమస్యా పరిష్కరిద్దామన్న సీఎం చంద్రబాబు
కాకినాడ: అచ్చంపేట వద్ద ఏడీబీ రోడ్డుపై ప్రమాదం - ఇద్దరు మహిళలు మృతి
- కాకినాడ: అచ్చంపేట వద్ద ఏడీబీ రోడ్డుపై ప్రమాదం
- కారును ఢీకొన్న లారీ, ఇద్దరు మహిళలు మృతి
- విశాఖకు చెందిన సుంకర వెంకట పద్మావతి, కొల్లు దీప్తి మృతి
- కారులో విశాఖ నుంచి కాకినాడ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం
సేవా తీర్థ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి అభినందనలు: చంద్రబాబు
- సేవా తీర్థ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి అభినందనలు: చంద్రబాబు
- సేవా తీర్థ్.. దేశ పాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మైలురాయి: చంద్రబాబు
- ఆధునిక దేశం నిర్మాణ దిశగా తీసుకున్న దృఢమైన అడుగు ఇది: చంద్రబాబు
- వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహత్తర సంకల్పానికి బలమైన పునాది: చంద్రబాబు
ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా బాధ్యతాయుత నిర్వహణతో ముందుకెళ్తున్నాం: లోకేష్
- ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నా బాధ్యతాయుత నిర్వహణతో ముందుకెళ్తున్నాం: లోకేష్
- దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు కట్టుబడి ఉన్నాం: మంత్రి నారా లోకేష్
- పోలవరం, అమరావతి నుంచి రాయలసీమ హార్టికల్చర్ వరకు అడుగులు: లోకేష్
- మార్పు తెచ్చే మహత్తర కార్యక్రమాలు వేగంగా ముందుకెళ్తున్నాయి: లోకేష్
- ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాయి: మంత్రి లోకేష్
శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత
- శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత
- ఈ బడ్జెట్.. కేవలం జమా ఖర్చుల లెక్క కాదు: హోంమంత్రి అనిత
- ఐదు కోట్ల ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్: హోంమంత్రి అనిత
- రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది: అనిత
- అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధ హోదా ప్రక్రియ ప్రారంభమైంది: అనిత
- అమరావతికి అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు: అనిత
- అమరావతిలో రూ.57,868 కోట్ల పనులకు అనుమతులు జారీ: అనిత
విద్యార్థులను కరిచిన ఎలుకలు - సిబ్బందిపై చర్యలు తీసుకున్న కలెక్టర్
- ఎన్టీఆర్ జిల్లా: ఎ.కొండూరు కేజీబీవీలో జరిగిన ఘటనపై కలెక్టర్ లక్ష్మీశ చర్యలు
- ప్రిన్సిపల్ కమ్ వార్డెన్ సస్పెన్షన్, మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులు
- రెండ్రోజుల క్రితం 12 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు
- నిర్లక్ష్యం వల్లే వార్డెన్, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడి
ఎల్లుండి బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారు: సీఎం చంద్రబాబు
- ఎల్లుండి బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారు: సీఎం చంద్రబాబు
- బిల్ గేట్స్‌ను 3సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: సీఎం చంద్రబాబు
- తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారు: సీఎం
- ఇప్పుడు సంజీవిని పథకం కోసం వస్తున్నారు: సీఎం చంద్రబాబు
- సంజీవిని పథకానికి ఆర్టీజీఎస్‌లో కార్యక్రమం రూపొందించాం: చంద్రబాబు
- 1982లో హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ దాటితే అడవిలా ఉండేది: సీఎం
- నాలుగేళ్లలోనే అక్కడి పరిస్థితులన్నీ మారిపోయాయి: సీఎం చంద్రబాబు
- అమరావతి అభివృద్ధిలోనూ అలాంటి మార్పులే ఉంటాయి: సీఎం చంద్రబాబు
అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం చంద్రబాబు మాటామంతీ
- అసెంబ్లీ లాబీలో మీడియాతో సీఎం చంద్రబాబు మాటామంతీ
- ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టాం: సీఎం చంద్రబాబు
- వైఎస్సార్సీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుంది: సీఎం
- ఇబ్బందులు అధిగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నాం: చంద్రబాబు
- రాష్ట్రంలో సమస్యలైతే ఇంకా చాలా ఉన్నాయి: సీఎం చంద్రబాబు
- ఆదాయం తక్కువ - ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చింది: సీఎం
- కేంద్రం సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం: సీఎం చంద్రబాబు
- వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలి: సీఎం చంద్రబాబు
- సేవారంగంలోనూ ఆదాయం మరింత పెరగాలి: సీఎం చంద్రబాబు
- ఒంగోలు పాలకు.. అనంతపురం పండుకు.. ఎంతో డిమాండ్ ఉంది: సీఎం
- ఒంగోలు పాలు.. అనంతపురం పండు.. రుచి మరెక్కడా రాదు: చంద్రబాబు
- రెండు మూడేళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతాం: చంద్రబాబు
- అప్పటికి పూర్తిగా గాడిలో పడతాం: సీఎం చంద్రబాబు
- రెండు మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుంది: సీఎం చంద్రబాబు
- అమరావతి రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నాం: సీఎం
- అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమూ వస్తుంది: సీఎం చంద్రబాబు
- అమరావతిలో పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగింది: సీఎం చంద్రబాబు
- ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్ వల్ల యాక్సిస్ మరింత పెరుగుతుంది: సీఎం
- రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే: సీఎం చంద్రబాబు
- హార్టికల్చర్ హబ్‌కు రూ.30 వేల కోట్ల కేటాయించడం బాగుంది: చంద్రబాబు
- హార్టికల్చర్ హబ్‌కు కేటాయింపులపై ఎమ్మెల్యేలంతా సంతోషంగా ఉన్నారు: సీఎం
- రాయలసీమలో ఒక్కప్పుడు పశువులకు నీరు కూడా దొరికేది కాదు: చంద్రబాబు
- పశుగ్రాసం, నీళ్లను రైళ్లలో తరలించిన సందర్భాలు ఉన్నాయి: చంద్రబాబు
- 2014-19 మధ్య కూడా రైన్ గన్స్‌తో పంటలు కాపాడే పరిస్థితి ఉండేది: సీఎం
- అప్పుడే హంద్రీనీవాను సీరియస్‌గా తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
- దేశంలోనే నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయి: చంద్రబాబు
- రాయలసీమలో పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది: సీఎం చంద్రబాబు
- ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్‌లో ఇచ్చే నివేదిక వారి పనితీరుకు నిలువుటద్దం: సీఎం
- నేను గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగానే ఉంటా.. మారకపోతే వాళ్లకే నష్టం..: సీఎం
- మొత్తం 9 పేరా మీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నా: సీఎం
- వారికి తెలియని ఇంకొన్ని పేరా మీటర్లు కూడా నావద్ద ఉన్నాయి: చంద్రబాబు
- లోకేష్ తన పని తాను చేస్తున్నాడు.. నా పని నేను చేస్తున్నా..: సీఎం చంద్రబాబు
- నేతలతో మానవీయ సంబంధం, మోటివేషన్ భయం-భక్తిలా ఉండాలి: సీఎం
- మంగళగిరి చీరలకు లోకేష్ బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారు: చంద్రబాబు
- మహిళా సభ్యులు ఒకేరకమైన చీరలతో రావటం వారి ఐక్యతకు నిదర్శనం: సీఎం
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
- వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన గ్రూప్-1 నియామకాల్లో అక్రమాల దర్యాప్తునకు సిట్
- హైకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
- ఏడీజీ, ఆపై అధికారి నేతృత్వంలో సిట్ నియమించాలని హైకోర్టు ఆదేశాలు
- ఈ నెల 11న విచారించి ప్రత్యేక సిట్ నియామకానికి ఆదేశాలిచ్చిన హైకోర్టు
- సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- సిట్ సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తి నియామకం
- అవసరమైతే దర్యాప్తు కోసం ఏ అధికారినైనా తీసుకోవచ్చన్న ప్రభుత్వం
- మార్చి16లోగా సిట్ దర్యాప్తు తుది నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశం
- సహకారం అందించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి ప్రభుత్వం ఆదేశం
- సిట్‌కు సహకారం అందించాలని అన్ని విభాగాధిపతులకు ప్రభుత్వం ఆదేశం
- తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
- ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
ఏపీపీఎస్‌సీలో అక్రమాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుకు ఉత్తర్వులు
- ఏపీపీఎస్‌సీలో అక్రమాలపై దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుకు ఉత్తర్వులు
- 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో అక్రమాలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
- హైకోర్టులో ఈ ఏడాది ఫిబ్రవరి 11న రిట్ అప్పీల్, అనుబంధ పిటిషన్లు దాఖలు
- హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- సీఐడీ చీఫ్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
- సిట్‌లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తి నియామకం
- దర్యాప్తునకు సంబంధించి సిట్‌కు అన్ని అధికారాలు
- సోదాలు చేసేందుకు, ఆధారాల స్వాధీనానికి పూర్తి అధికారం
- దర్యాప్తు అవసరాలకు ఏ ప్రభుత్వ శాఖ నుంచైనా అధికారుల నియామకానికి వెసులుబాటు
- ఈ ఏడాది మార్చి 16లోగా సిట్ తన నివేదికను హైకోర్టుకు సమర్పించాలని సూచన
వ్యవసాయ బడ్జెట్
- వ్యవసాయ, అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెడుతున్న అచ్చెన్నాయుడు
- దేశానికి ఆహార భద్రత అందిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న రైతన్నకు హృదయపూర్వక నమస్కారాలు
- మూడోసారి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన చంద్రబాబుకు నా కృతజ్ఞతలు
- వ్యవసాయ లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది
- వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పం మాది
- యువత.. వ్యవసాయం వైపు మళ్లాలంటే.. వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారాలి
- రైతును రాజుగా చేయడానికి రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభించాం
- నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చాం
- ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించిన పది సూత్రాల్లో ఫార్మర్ అగ్రిటెక్ ముఖ్యమైనది
- డీప్ టెక్నాలజీ, ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్ వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాం
- డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగుచేసేలా చర్యలు తీసుకుంటున్నాం
- అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగుచేసే ప్రధాన లక్ష్యంతో ఉన్నాం
- సంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగువైపు ప్రోత్సాహం
- పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం ముఖ్యం
- చేతికి వచ్చే పంటను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయమందిస్తున్నాం
- స్థిరమైన సాగునీటి సౌకర్యాల కల్పనకు బిందుసేద్యంపై ప్రత్యేక దృష్టి సారించాం
- ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం
- వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతంగా నమోదైంది
- దేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఏపీ వాటా 10 శాతమని గర్వంగా చెబుతున్నాం
- స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో 15 శాతం వార్షిక వృద్ధి రేటు సాధనకు 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించాం
- ఏటా రైతు కుటుంబానికి రూ.20 వేలు చొప్పున అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద నిధులు అందిస్తున్నాం
- ధాన్యం సేకరణలో పాత బకాయిలను చెల్లించి రైతులను ఆదుకున్నాం
- రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతు సేవా కేంద్రం స్థాయిలో పంట ప్రణాళికలను తయారుచేసి అమలు చేస్తున్నాం
- భూసారం అంచనాకు 6 లక్షల భూసార పత్రాలు పంపిణీ చేశాం
- 1,250 మెట్రిక్ టన్నులు సూక్ష్మ పోషకాలను ఉచితంగా సరఫరా చేశాం
- పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 18 లక్షలమంది రైతులకు సేవలందించాం
- వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 50 శాతం రాయితీతో 136.62 కోట్ల విలువైన యంత్రాలను సరఫరా చేస్తున్నాం
- వ్యవసాయ యాంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన రైతులే స్వయంగా పొందే అవకాశం కల్పించాం
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ.139.65 కోట్లు ప్రతిపాదించాం
శాసనసభ సమావేశాలు ప్రారంభం - 2026-27కి రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్
- అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ - రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు
- మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు
- రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు
- ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు
కేటాయింపులు
- తల్లికి వందనం- రూ.9,668 కోట్లు
- ఉపకారవేతనాలు- రూ.3,836 కోట్లు
- సమగ్ర శిక్ష అభియాన్- రూ.2,946 కోట్లు
- ఉన్నత విద్య- రూ.2,566 కోట్లు
- మధ్యాహ్న భోజన పథకం- రూ.2,161 కోట్లు
- మన బడి మన భవిష్యత్తు- రూ.1,500 కోట్లు
- స్కిల్ డెవలప్‌మెంట్- రూ.1,232 కోట్లు
- ఎన్టీఆర్ భరోసా- రూ.27,719 కోట్లు
- దీపం 2.0- రూ.2,601 కోట్లు
- స్త్రీ శక్తి- రూ.1,420 కోట్లు
- నేతన్నలకు ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు
- ఆటో డ్రైవర్ల సేవ – రూ.450 కోట్లు
- విద్యుత్ రంగం- రూ.13,934 కోట్లు
- అమరావతి- రూ.6,000 కోట్లు
- పరిశ్రమలు- రూ.3,161 కోట్లు
- సర్దుబాటు నిధి- రూ.1,500
- వీబీ జీ రామ్ జీ- రూ.8,365 కోట్లు
- గృహనిర్మాణం- రూ.6,357 కోట్లు
- ఎన్టీఆర్ వైద్య సేవ- రూ.4,000 కోట్లు
- పీఎం ఆయుష్మాన్ భారత్- రూ.838 కోట్లు
- జల్ జీవన్ మిషన్- రూ.4,000 కోట్లు
- స్వచ్ఛ్ భారత్ మిషన్- రూ.1,037 కోట్లు
- జలవనరుల శాఖ- రూ.18,224 కోట్లు
- అన్నదాత సుఖీభవ- రూ.6,660 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధి- రూ.500 కోట్లు
- వ్యవసాయ, అనుబంధ రంగాలు- రూ.13,598 కోట్లు
- పాఠశాల విద్యాశాఖ- రూ.32,308 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖ- రూ.22,942 కోట్లు
- పర్యావరణ అటవీశాఖ- రూ.714 కోట్లు
- మున్సిపల్ శాఖ- రూ.14,539 కోట్లు
- ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
- హోంశాఖ- రూ.9,165 కోట్లు
- ఎక్సైజ్ శాఖ- రూ.500 కోట్లు
- మౌలిక సదుపాయాల, పెట్టుబడుల శాఖ- రూ.1,283 కోట్లు
- సమాచార సాంకేతిక శాఖ- రూ.536 కోట్లు
- పౌరసరఫరాల శాఖ- రూ.3,821 కోట్లు
- హాస్టళ్లు, గురుకులాలు- రూ.300 కోట్లు
- ఎస్సీ సంక్షేమం - రూ.20,644 కోట్లు
- ఎస్టీ సంక్షేమం- రూ.9,190 కోట్లు
- బీసీ సంక్షేమం- రూ.51,021 కోట్లు
- మైనారిటీ సంక్షేమం- రూ.6,090 కోట్లు
- మహిళాశిశు సంక్షేమం- రూ.4,582 కోట్లు
- వైద్యారోగ్యం, కుటుంబసంక్షేమశాఖ- రూ.19,306 కోట్లు
- కార్మిక శాఖ- రూ.735 కోట్లు
- రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ – రూ.9,856 కోట్లు
- యువజన, పర్యాటక శాఖ- రూ.439 కోట్లు
- విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్- రూ.28,000 కోట్లు
- విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ పరిధిలోకి 10 జిల్లాలు
- 9 జిల్లాలతో అమరావతి ఎకనమిక్ రీజియన్
- రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రూ.30,000 కోట్లు
పది ప్రాధాన్యత అంశాలను ప్రకటించిన పయ్యావుల
- ప్రాధాన్యతాంశాలు-1. రాయసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్
- ప్రాధాన్యతాంశాలు-2. నగర ఆర్థిక వ్యవస్థలు
- ప్రాధాన్యతాంశాలు-3. వీబీ జీ రామ్ జీ
ప్రాధాన్యతాంశాలు-4. రాష్ట్ర సంపద నిధి - ప్రాధాన్యతాంశాలు-5. నేతలన్నలకు ఉచిత విద్యుత్
- ప్రాధాన్యతాంశాలు-6. స్కూళ్లు, హాస్టళ్ల మౌలిక సదుపాయాలు
- ప్రాధాన్యతాంశాలు-7.టీఆర్‌ఈడీఎస్ అమలు
- ప్రాధాన్యతాంశాలు-8.క్వాంటమ్ కంప్యూటింగ్
- ప్రాధాన్యతాంశాలు-9.దివ్యాంగులకు ఉచిత బస్సు సర్వీస్
- ప్రాధాన్యతాంశాలు-10.3వేల కొత్త పోలీస్ వాహనాలు
రూపాయి రాక
- పన్నుల ద్వారా ఆదాయం – 38 శాతం
- పన్నేతర ఆదాయం – 3 శాతం
- బహిరంగ మార్కెట్ రుణాలు – 30 శాతం
- కేంద్ర పన్నుల్లో వాటా – 19 శాతం
- గ్రాంట్ ఇన్ ఎయిడ్ – 10 శాతం
రూపాయి పోక
- సంక్షేమం – 17 శాతం
- విద్య – 11 శాతం
- ఆర్ధికం – 8 శాతం
- పంచయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – 7 శాతం
- వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం – 6 శాతం
- జలవనరులు – 6 శాతం
- మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ – 4 శాతం
- విద్యుత్ రంగం – 4 శాతం
- వ్యవసాయం, అనుబంధ రంగాలు – 4 శాతం
- ఇతరాలు (హోం, ఆర్ అండ్ బీ, పరిశ్రమలు...) – 15 శాతం
- వడ్డీలు, రుణాల చెల్లింపులు – 18 శాతం
ఆత్మీయ పలకరింపు ప్రధాని మోదీ నుంచే నేర్చుకున్నా: లోకేశ్
- అసెంబ్లీలో మీడియాతో నారా లోకేష్ మాటామంతీ
- ఏఐ, క్వాంటమ్ ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలు కూడా అంతే ముఖ్యం: లోకేశ్
- పార్టీపరంగా నేతలంతా ఏబీసీ ఫార్ములా అనుసరించాలి: మంత్రి లోకేశ్
- ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలి: మంత్రి లోకేశ్
- ఈనెల 28న యలమంచిలిలో బ్లూజెట్ పరిశ్రమకు శంకుస్థాపన: లోకేశ్
- బ్లూజెట్ పరిశ్రమకు శంకుస్థాపన ద్వారా రూ.2,300 కోట్ల పెట్టుబడి రానుంది: లోకేశ్
- రాజకీయంగా సిద్ధాంతాలు ఎంత అవసరమో నేతలతో పలకరింపు అంతే అవసరం: లోకేశ్
- ఆత్మీయ పలకరింపు.. ప్రధాని మోదీ నుంచే నేర్చుకున్నా: లోకేశ్
- ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ చేసి వారి బాగోగులు ప్రధాని తెలుసుకుంటారని కొందరికే తెలుసు: లోకేశ్
- క్వాంటమ్, ఏఐ.. చంద్రబాబు చూసుకుంటారు, నేను మానవీయ సంబంధాలు చూసుకుంటా: లోకేశ్
- కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలు: లోకేశ్
- బడ్జెట్ సమావేశాలప్పుడైనా ఇలా నేతలందరితో ఏటా కలిసేలా ప్రణాళిక చేసుకున్నా: లోకేశ్
- బరువు మరీ ఎక్కువ తగ్గుతున్నానని అంతా అంటున్నారు: లోకేశ్
- ఇంకో 2 కిలోలు తగ్గితే నా లక్ష్యం పూర్తవుతుంది: మంత్రి లోకేశ్
- సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడం ప్రతిపక్షంలో అలవాటైంది: లోకేశ్
- పార్టీ నిర్ణయం తీసుకునే వరకూ ఎవరైనా అభిప్రాయాలు బలంగా వినిపించవచ్చు: లోకేశ్
- ఒకసారి పార్టీ నిర్ణయం జరిగాక ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందే: లోకేశ్
నెల్లూరు జిల్లా కోవూరు పీఎస్‌లో ఇవాళ్టి కాకాణి విచారణ వాయిదా
- నెల్లూరు జిల్లా కోవూరు పీఎస్‌లో ఇవాళ్టి కాకాణి విచారణ వాయిదా
- కొన్ని అనివార్య కారణాల వల్ల విచారణ వాయిదా వేశామన్న కోవూరు పోలీసులు
- కోవూరులో బాలిక మృతి ఘటనలో వివరాలు ప్రస్తావించిన కాకాణి
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రెట్టపల్లిలో వ్యక్తి హత్య
- నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం రెట్టపల్లిలో వ్యక్తి హత్య
- గేదెల మేతకు వెళ్లి నిన్న సాయంత్రం ఇంటికి రాని రమణారెడ్డి
- రమణారెడ్డి(75) చేతికి ఉన్న బంగారం ఉంగరం అపహరణ
- బంగారం కోసమా లేదా మరో కారణమా అన్న కోణంలో పోలీసుల విచారణ
సీఎం అధ్యక్షతన మంత్రివర్గం భేటీ - 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
- అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ
- బడ్జెట్ ప్రతులను సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కు అందజేసిన పయ్యావుల
- 2026-27 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
నేటితరం విద్యార్థులు రాజకీయాల పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది: స్పీకర్ అయ్యన్న
- అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో స్పీకర్ మాటామంతి
- ఇప్పటివరకూ 700 మందికి పైగా విద్యార్థులు అసెంబ్లీని వీక్షించారు: స్పీకర్
- రెండు రోజుల్లోనే 200కుపైగా పాఠశాలల నుంచి దరఖాస్తులు వచ్చాయి: స్పీకర్
- వీలైనంత ఎక్కువమంది విద్యార్థులకు అసెంబ్లీ చూసే అవకాశం కల్పిస్తున్నాం: స్పీకర్
- ఎమ్మెల్యేలు అవుతామనే ఆకాంక్షను కొంతమంది విద్యార్థులు వెళ్లబుచ్చుతున్నారు: స్పీకర్
- నేటితరం విద్యార్థులు రాజకీయాల పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది: స్పీకర్
- విద్యార్థులకు అసెంబ్లీ చూసే అవకాశం కల్పించిన లక్ష్యం నెరవేరుతున్నందుకు తృప్తిగా ఉంది: స్పీకర్
- పాఠశాలల్లోనూ మాక్ అసెంబ్లీ నిర్వహణలు పెరగడం శుభపరిణామం: స్పీకర్
- గత రాత్రి లోకేష్ వద్ద సమావేశం ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగింది: స్పీకర్
- అంతా ఒకే కుటుంబసభ్యుల్లా సరదాగా గడిపాo: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- పెళ్లిరోజు కావడంతో లోకేష్ సమావేశానికి విజయ్ రాలేకపోయారు: స్పీకర్
- చంద్రబాబు పాటించే డైట్ పాటిస్తే ఎవరైనా బరువు ఇట్టే తగ్గిపోతారు: స్పీకర్
- ఇప్పటికే బాగా తగ్గావ్, ఇంకా మరీ ఎక్కువ బరువు తగ్గొద్దని లోకేష్‌కు సూచించా: స్పీకర్
- అచ్చెన్నాయుడు కూడా మరీ ఎక్కువగా బరువు తగ్గారు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- మరీ తగ్గడం అంత మంచిది కాదని అచ్చెన్నను కూడా హెచ్చరించా: స్పీకర్
అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
- అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
- చట్ట సభలకు 2026-27వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
- వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడనున్న ఉభయసభలు
- రేపు, ఎల్లుండి చట్టసభలకు సెలవు
- ఈనెల 17న బడ్జెట్‌పై చర్చ అజెండాగా ప్రారంభం కానున్న ఉభయసభలు
కాసేపట్లో ప్రారంభం కానున్న శాసనసభ, మండలి - బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల
- ఉదయం 11.15 గంటలకు ప్రారంభం కానున్న శాసనసభ, మండలి
- సభ ప్రారంభం కాగానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
- వ్యవసాయ, అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అచ్చెన్నాయుడు
- శాసనమండలిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత
- మండలిలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అనగాని
- వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడనున్న ఉభయసభలు
విజయవాడలో ఆలిండియా ఇంటర్ వర్సిటీ ఉమెన్ నెట్ బాల్ పోటీలు
- విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో ఆలిండియా ఇంటర్ వర్సిటీ ఉమెన్ నెట్ బాల్ పోటీలు
- పోటీలను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా యూనివర్సిటీ అధికారులు
- దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి హాజరైన క్రీడాకారులు
లిక్కర్ స్కాంలో మరో కేసు నమోదు - దర్యాప్తు బాధ్యత సిట్‌కు అప్పగింత
- మద్యం కుంభకోణంలో మరో కేసు నమోదు చేసిన సీఐడీ
- దర్యాప్తు బాధ్యత సిట్‌కు అప్పగింత.. సూత్రధారుల నిగ్గు తేల్చాలని ఆదేశం
- మద్యం రవాణాలో మహా దోపిడీ జరిగిందని కేసు నమోదు
- ఒక్కో బాక్స్ రవాణా ఛార్జి రూ.13 నుంచి రూ.34కు పెంపు
- రూ.200 నుంచి రూ.400 కోట్లు కొల్లగొట్టినట్లు అభియోగం
- టెండర్ దక్కించుకున్న కెసిరెడ్డి బినామీ కంపెనీ
- ఈనెల 10న కేసు నమోదు చేసిన సీఐడీ
- ఐపీసీలోని 420, 409, 468, 471, 120(బి) సెక్షన్లతో కేసు నమోదు
- బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 111, 212, 217, 317 కింద పలువురిపై సీఐడీ కేసు
- సిట్‌కు విచారణ బాధ్యత అప్పగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు
బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయల్దేరిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
- బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయల్దేరిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
- వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కేశవ్ ప్రత్యేక పూజలు
పయ్యావుల కేశవ్‌కు బడ్జెట్ ప్రతులు అందజేసిన ఉన్నతాధికారులు
- ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌కు బడ్జెట్ ప్రతులు అందజేసిన ఉన్నతాధికారులు
- తాడేపల్లిలోని కేశవ్ క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ ప్రతులు అందజేసిన అధికారులు
- బడ్జెట్ పత్రాలను దేవుడి ముందు పెట్టి పూజలు నిర్వహించిన ఆర్థికమంత్రి
కర్నూలులో ఈనాడు 50-ఈటీవీ 30 వసంతాల వేడుకలు
- నేడు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ మైదానంలో ఈనాడు 50-ఈటీవీ 30 వసంతాల వేడుకలు
- పాస్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చే రిస్ట్ బ్యాండ్‌లను ధరించిన వారికి మాత్రమే ప్రవేశం
- వేడుకల్లో సినీ గీతాలు, డ్యాన్సులు.. వందేమాతరం శ్రీనివాస్‌తో పాటు ఇతర గాయనీ గాయకుల గానమాధుర్యం
- వేడుకల్లో ఈటీవీ డీ షో ఫేమ్ జాను, రాజు మాస్టర్, ఈటీవీ అమ్మోరు సీరియల్ నటీనటుల నృత్యాలు
- వేడుకలకు యాంకర్‌గా వ్యవహరించనున్న బుల్లితెర ప్రయోక్త, సినీనటుడు నందు
బడ్జెట్ ప్రతులను దుర్గమ్మ పాదాల వద్ద ఉంచిన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు
- బడ్జెట్ ప్రతులను దుర్గమ్మ పాదాల వద్ద ఉంచిన ఆర్థికశాఖ ఉన్నతాధికారులు
- ఆర్థికశాఖ అధికారులకు సాదర స్వాగతం పలికిన ఆలయ ఈవో శీనానాయక్, పండితులు
- దుర్గమ్మ సేవలో ఆర్థిక శాఖ అధికారులు పీయూష్, రోనాల్డ్ రోస్, సూరాజ్ అన్వారియా, గౌతమ్ అల్లాడ
శ్రీశైలం మహాక్షేత్రంలో 7వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- శ్రీశైలం మహాక్షేత్రంలో 7వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- శ్రీశైలం: రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లకు గజ వాహనసేవ
- శ్రీశైలం: గజ వాహనంపై స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం
తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 64,222 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 24,882 మంది భక్తులు
ఆటోలో రూ.1.50 లక్షలు మర్చిపోయిన ప్రయాణికుడు - పోలీసులకు అప్పగించిన డ్రైవర్
- విజయవాడలో ఆటో డ్రైవర్ సన్నపురెడ్డి తిమ్మారెడ్డి నిజాయతీ
- ప్రయాణికుడు మరచిపోయిన రూ.1.50 లక్షలను పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్
- బాధితుడికి ఆటో డ్రైవర్ ద్వారా డబ్బులు ఇప్పించిన గవర్నర్‌పేట పోలీసులు
సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోల మార్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై కేసు
- విజయవాడ: సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోల మార్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై కేసు
- సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని కేసు నమోదు
- రాజశేఖర్‌రావు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ - బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
- ఇవాళ ఉదయం 10.30 గం.కు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
- వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న రాష్ట్ర మంత్రివర్గం
- ఇవాళ ఉదయం 11.15 గం.కు ప్రారంభం కానున్న శాసనసభ, మండలి
- సభ ప్రారంభం కాగానే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
- వ్యవసాయ, అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అచ్చెన్నాయుడు
- మండలిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత
- మండలిలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అనగాని
- వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడనున్న ఉభయ సభలు
అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
- నేడు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
- చట్ట సభలకు 2026-27వార్షిక బడ్జెట్ సమర్పించనున్న ప్రభుత్వం
- రూ.3.45 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్ రూపకల్పన?
- సూపర్ సిక్స్ పథకాలు, అమరావతి, పోలవరానికి ప్రాధాన్యం
- కేంద్ర సహకారంతో ప్రగతి దిశగా అడుగులు వేసే వ్యూహం
- ఎన్నికల మ్యానిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు
- మూడు ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యానహబ్ లాంటి అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం
- వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక వాయిదా పడనున్న ఉభయ సభలు
- రేపు, ఎల్లుండి చట్టసభలకు సెలవు
- ఈనెల 17న బడ్జెట్‌పై చర్చ అజెండాగా ప్రారంభం కానున్న ఉభయ సభలు
ప్రకాశం జిల్లాలో నేటి నుంచి బీచ్ ఫెస్టివల్
- ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం పాకాలలో నేటి నుంచి బీచ్ ఫెస్టివల్
- పాకాల బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి డీబీవీ స్వామి
Last Updated : February 14, 2026 at 10:40 PM IST

